ప్రధాన మంత్రి కార్యాలయం
                
                
                
                
                
                    
                    
                        కననాస్కిస్‌లో జరిగే జీ7 శిఖరాగ్ర సదస్సుకు భారత ప్రధానమంత్రిని ఆహ్వానించిన కెనడా ప్రధాని శ్రీ మార్క్ కార్నే
                    
                    
                        
భారత్-కెనడా ప్రజల మధ్య అన్ని రంగాల్లోనూ సుహృద్భావ సంబంధాలు కొనసాగించాలని ఆకాంక్షించిన ఇరువురు నేతలు
                    
                
                
                    Posted On:
                06 JUN 2025 7:12PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కెనడా ప్రధానమంత్రి శ్రీ మార్క్ కార్నే ఫోన్ చేసి మాట్లాడారు.
సంభాషణ సందర్భంగా, ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన కెనడా ప్రధానమంత్రి శ్రీ మార్క్ కార్నేని శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ నెలాఖరులో కననాస్కిస్‌లో జరిగే జీ7 శిఖరాగ్ర సదస్సుకు ఆహ్వానించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
భారత్ - కెనడా దేశాల ప్రజల మధ్య అన్ని రంగాల్లోనూ సుహృద్భావ సంబంధాలు కొనసాగించాలని ఉభయ నేతలు పేర్కొన్నారు. పరస్పర గౌరవం.. ఉమ్మడి ప్రయోజనాల మార్గనిర్దేశనంలో, నూతన శక్తితో కలిసి పనిచేయడం పట్ల వారి నిబద్ధతను పునరుద్ఘాటించారు.
శిఖరాగ్ర సదస్సులో వారితో సమావేశం కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.
‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
"కెనడా ప్రధానమంత్రి @MarkJCarney నుంచి కాల్ అందుకోవడం ఆనందంగా ఉంది. ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా వారికి అభినందనలు. ఈ నెలాఖరున కననాస్కిస్‌లో జరిగే జీ7 శిఖరాగ్ర సదస్సుకు ఆహ్వానించినందుకు వారికి నా ధన్యవాదాలు. ప్రజల మధ్య సుదీర్ఘ సంబంధాలతో ముడిపడి ఉన్న శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా, భారత్-కెనడా పరస్పర గౌరవం.. ఉమ్మడి ప్రయోజనాల మార్గనిర్దేశనంలో, పునరుద్ధరించిన శక్తితో కలిసి పనిచేస్తాయి. శిఖరాగ్ర సదస్సులో మన సమావేశం కోసం ఎదురు చూస్తున్నాను."
                
                
                
                
                
                (Release ID: 2134725)
                Visitor Counter : 8
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam