ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

చినాబ్ రైలు వంతెన నిర్మాణంలో పాలుపంచుకున్న వారితో ప్రధానమంత్రి సంభాషణ


• దేశం కోసం ఆధునిక మౌలిక సదుపాయాలను అందించడంలో తిరుగులేని నిబద్ధతకు ప్రశంసలు

నాడు పోస్టు చేయడమైనది: 06 JUN 2025 3:01PM by PIB Hyderabad

చినాబ్ రైలు వంతెన నిర్మాణంలో పాలుపంచుకున్న వారిలో కొందరితో ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు భేటీ అయ్యారుదేశ ప్రజలకు ఆధునిక మౌలిక సదుపాయాలను నిర్మించడంలో తిరుగులేని నిబద్ధతను కనబరిచారంటూ వారిపై శ్రీ మోదీ ప్రశంసలు కురిపించారు.

ప్రధానమంత్రి ఎక్స్‌లో ఒక సందేశాన్ని ఇలా పోస్టు చేశారు:

‘‘చినాబ్ రైలు వంతెన నిర్మాణంలో పాలుపంచుకున్న వారిలో కొందరిని ఈ రోజు కలుసుకొనివారితో మాట్లాడానువారు భారత్‌లో వివిధ ప్రాంతాలకు చెందినవారుతోటి భారతీయుల కోసం ఆధునిక మౌలిక సదుపాయాలను సమకూర్చడంతో తిరుగులేని తమ సంకల్ప బలాన్ని వారు చాటారుతమకు ఎదురైన అనుభూతులను వివరించారు.. ఎన్నో సవాళ్లను కూడా వారు ఎదుర్కొన్నారుపూర్తి చేసిన పనిని చూసి కుటుంబసభ్యులు ఎంతగా గర్వపడుతున్నదీ వారు నాతో పంచుకున్నారు.’’

 

***


(రిలీజ్ ఐడి: 2134713) సందర్శకుల సూచీ సంఖ్య : : 24