ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మధ్యప్రదేశ్‌ ఝబువా ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రధాని సంతాపం పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం ప్రకటన

నాడు పోస్టు చేయడమైనది: 04 JUN 2025 4:55PM by PIB Hyderabad

మధ్యప్రదేశ్‌లోని ఝబువాలో జరిగిన ప్రమాదంలో పలువురి మృతిపట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.

పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

“మధ్యప్రదేశ్‌లోని ఝబువాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ఆత్మీయులను కోల్పోయిన వారికి నా సంతాపం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.

మృతిచెందినవారి కుటుంబ సభ్యులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున పరిహారాన్ని అందజేస్తాం. గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున అందిస్తాం: ప్రధానమంత్రి @narendramodi’’  


(రిలీజ్ ఐడి: 2133993) సందర్శకుల సూచీ సంఖ్య : : 22