ప్రధాన మంత్రి కార్యాలయం
శుభమ్ ద్వివేది కుటుంబ సభ్యులను కలిసిన ప్రధానమంత్రి
Posted On:
30 MAY 2025 9:39PM by PIB Hyderabad
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన శుభమ్ ద్వివేది కుటుంబ సభ్యులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు కాన్పూర్‌లో కలిశారు. "ఉగ్రవాదంపై ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా నిర్వహించిన మన వీర సైన్యానికి వారు కృతజ్ఞతలు తెలిపారు" అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
ప్రధానమంత్రి ఎక్స్ వేదికగా ఇలా పేర్కొన్నారు:
"ఈరోజు నేను మన కాన్పూర్ బిడ్డ శుభమ్ ద్వివేది కుటుంబ సభ్యులను కలిశాను. పహల్గామ్‌లో పిరికిపందలైన ఉగ్రవాదులు చేసిన దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదంపై ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా నిర్వహించిన మన శక్తిమంతమైన సైన్యానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. దేశం పట్ల వారికి గల ప్రేమ దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తుంది."
(Release ID: 2132931)
Read this release in:
Odia
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada