సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
                
                
                
                
                
                    
                    
                        ఉగ్రవాదంపై ఐక్యపోరాటం  ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న అఖిలపక్షం [2025, మే 25 నుంచి 27 వరకు] 
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                26 MAY 2025 5:45PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అనుసరిస్తున్న స్పష్టమైన వైఖరిని తెలియజేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన పార్లమెంటరీ అఖిలపక్ష బృందం 2025 మే 25-27 వరకు ఫ్రాన్స్‌లో పర్యటిస్తుంది. ఈ బృందానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ రవి శంకర్ ప్రసాద్ నేతృత్వం వహిస్తున్నారు. మాజీ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, మాజీ రాయబారి ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఈ ప్రతినిధి బృందం ఈ రోజు సాయంత్రం ప్యారిస్ చేరుకుంది.
ప్రతినిధులు బృందంలోని సభ్యులు
1. శ్రీ రవి శంకర్ ప్రసాద్
గౌరవ పార్లమెంట్ సభ్యులు (లోక్సభ), కేంద్ర చట్టం, న్యాయం, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మాజీ మంత్రి
2. డాక్టర్. దగ్గుబాటి పురందేశ్వరి
గౌరవ పార్లమెంట్ సభ్యురాలు (లోక్ సభ), వాణిజ్యం, పరిశ్రమలు, మానవ వనరుల అభివృద్ధి శాఖల మాజీ సహాయ మంత్రి
3. శ్రీమతి ప్రియాంక చతుర్వేది
గౌరవ పార్లమెంట్ సభ్యురాలు (రాజ్యసభ), కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ కమిటీ సభ్యురాలు
4. శ్రీ గులామ్ అలీ ఖటానా
గౌరవ పార్లమెంట్ సభ్యులు (రాజ్యసభ), జాతీయ ఉర్దూ భాష ప్రోత్సాహక మండలి సభ్యుడు
5. డాక్టర్. అమర్ సింగ్
గౌరవ పార్లమెంట్ సభ్యులు (లోక్సభ)
6. శ్రీ సమిక్ భట్టాచార్య
గౌరవ పార్లమెంట్ సభ్యులు (రాజ్యసభ), హోం వ్యవహరాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు
7. డాక్టర్ ఎం. తంబిదురై
గౌరవ పార్లమెంట్ సభ్యులు (రాజ్యసభ) కేంద్ర చట్టం, న్యాయం, కంపెనీ వ్యవహారాల మాజీ మంత్రి
8. శ్రీ ఎంజే అక్బర్
గౌరవ విదేవీ వ్యవహారాల మాజీ సహాయ మంత్రి
9. రాయబారి పంకజ్ శరణ్
మాజీ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు, బంగ్లాదేశ్ , రష్యాలో భారత మాజీ రాయబారి,
ఫ్రాన్స్ పర్యటనలో ప్రతినిధి బృందం సెనెట్, జాతీయ అసెంబ్లీ, మేధావులు, మీడియాతో పాటు ఆ దేశంలో నివసిస్తున్న భారతీయులతో సమావేశం అవుతారు.
 
***
                
                
                
                
                
                (Release ID: 2131602)
                Visitor Counter : 5