ఆయుష్
azadi ka amrit mahotsav

ప్రపంచవ్యాప్తంగా ఆయుష్‌‌కు ప్రాచుర్యం కల్పించే దిశగా డబ్ల్యూహెచ్‌వోతో సంప్రదాయ వైద్య చికిత్సలపై చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్న భారత్


ఆయుష్ విధానం శాస్త్రీయ పద్ధతిలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి చేరువయ్యేలా ఈ ఒప్పందం సహకరిస్తుంది: ప్రధానమంత్రి

Posted On: 25 MAY 2025 6:05PM by PIB Hyderabad

సంప్రదాయ వైద్య విధానాలను అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వోమధ్య 2025, మే 24న చరిత్రాత్మక ఒప్పందం కుదిరిందిఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ హెల్త్ ఇంట్రవెన్షన్స్ (ఐసీహెచ్ఐకింద ఒక ప్రత్యేక సంప్రదాయ వైద్య విధాన ఆరంభాన్ని ఈ ఒప్పందం సూచిస్తుంది.

మన్ కీ బాత్ 122వ ఎపిసోడ్‌లో ఈ ఒప్పందం ప్రాధాన్యం గురించి ప్రధానమంత్రి వివరించారు. ‘‘ఆయుర్వేద రంగంలో జరిగిన ఒక విషయాన్ని గురించి తెలుసుకుంటే మీరు చాలా సంతోషిస్తారునిన్ననే అంటే మే 24 డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్నా మిత్రుడు తులసి భాయ్ సమక్షంలో ఒక ఒప్పంద పత్రంపై సంతకాలు అయ్యాయిఈ ఒప్పందంతో అంతర్జాతీయ ఆరోగ్య వర్గీకరణ కింద ఒక ప్రత్యేక సంప్రదాయ వైద్య మాడ్యూల్‌పై పని ప్రారంభమైందిఈ చొరవతో ఆయుష్‌ను ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ పద్ధతిలో ఎక్కువ మందికి చేర్చడానికి సహకారం లభిస్తుంది’’ అని అన్నారు.

డబ్ల్యూ‌హెచ్‌ఓ నిర్దేశించిన ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆప్ డిసీజెస్ (ఐసీడీ-11)ను ఐసీహెచ్ఐ బలపరుస్తుందిఅలాగే చికిత్స కోసం వినియోగిస్తున్న విధానాలుఆరోగ్య పద్ధతులను డాక్యుమెంట్ చేస్తుందిసంప్రదాయ వైద్య విధానాన్ని కూడా వీటిలో చేర్చడంతో ఆయుర్వేదయోగసిద్ధయునాని విధానాలకు సంబంధించిన థెరపీలు – పంచకర్మయోగ థెరపీయునాని విధానాలుసిద్ధ పద్ధతులు ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రామాణీకరించిన పద్ధతుల్లో గుర్తింపు పొందుతాయి.

ఈ ఒప్పందం బహుళ ప్రయోజనాలను కలిగిస్తుంది:

  • ఆయుష్ సేవలకు పారదర్శంగా బిల్లింగ్సరసరమైన ధరలు.

  • ఆరోగ్య బీమా కవరేజీలో ఆయుష్ చికిత్సలను ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏకీకృతం చేయడం.

  • ఆసుపత్రుల నిర్వహణక్లినికల్ డాక్యుమెంటేషన్ఆరోగ్య పరిశోధన మెరుగుపరచడం.

  • అన్నింటికంటే ముఖ్యంగా ఆయుష్ చికిత్సా విధానాలకు అంతర్జాతీయంగా అందుబాటులోకి తీసుకురావడం

ఘనమైన సాంప్రదాయ విజ్ఞాన వారసత్వాన్ని అంతర్జాతీయంగా ప్రధాన ఆరోగ్య సేవల వ్యవస్థలోకి తీసుకురావాలనే లక్ష్యానికి అనుగుణంగా ఈ ఒప్పందం ఉందిఅలాగే దీనికి శాస్త్రీయ వర్గీకరణఅంతర్జాతీయ ప్రమాణాల మద్దతు ఉంది.

ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తూ.. డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డా.టెడ్రోస్ అధానం గీబ్రయేజస్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు:

‘‘సంప్రదాయ వైద్యంఅంతర్జాతీయంగా ఆరోగ్య విధానాల వర్గీకరణకు సంబంధించి భారత @moAyush సెక్రటరీ వైద్య రాజేశ్ కొటెచా @WHO మిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకం చేయడం ఆనందంగా ఉంది. #HealthForAll అందించాలనే  నిబద్ధతను మేం స్వాగతిస్తున్నాం.’’
ప్రపంచ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల్లో సమగ్రమైనసాక్ష్యం ఆధారితమైనవిధానపరంగా గుర్తింపు పొందిన వైద్య విధానంగా ఆయుష్‌ మారేలా ఐసీడీ-11 వ్యాధులువైద్య విధానాలపై ఐసీహెచ్ఐ కొత్త మాడ్యూల్ ప్రభావం చూపిస్తాయి.

ఇది కోడింగ్ అప్డేట్ కంటే ఎక్కువఇది భారతీయ సంప్రదాయ వైద్య వ్యవస్థల ద్వారా సరసమైనఅందరికీ అందుబాటులో ఉండేనమ్మకమైన ఆరోగ్య సేవలను అందించే దిశగా వేసిన పరివర్తనాత్మకమైన అడుగు.

 

***


(Release ID: 2131259)