ప్రధాన మంత్రి కార్యాలయం
మావోవాదమనే భూతాన్ని అంతమొందించడానికి బలగాలు చేస్తున్న ప్రయత్నాలు హర్షణీయం: ప్రధాని
Posted On:
21 MAY 2025 5:07PM by PIB Hyderabad
మావోవాదమనే భూతాన్ని అంతమొందించడంతో పాటు మన దేశ ప్రజలకు శాంతియుత జీవనాన్నీ, పురోగతినీ అందించాలన్న ప్రభుత్వ నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఈ దిశగా బలగాలు చేస్తున్న ప్రయత్నాలను ఆయన హర్షించారు.
కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా ఎక్స్‌లో పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ:
‘‘ఈ అసాధారణ విజయాన్ని సాధించిన మన బలగాలను చూస్తే గర్వంగా ఉంది. మావోవాదమనే భూతాన్ని అంతం చేయడానికి, మన దేశ ప్రజలకు శాంతియుత జీవనం, ప్రగతి.. ఈ రెంటినీ అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 2130391)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam