ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘ప్రాజెక్ట్ లయన్’లో భాగంగా చేపడుతున్న ప్రయత్నాల పట్ల ప్రధానమంత్రి హర్షం

నాడు పోస్టు చేయడమైనది: 21 MAY 2025 3:55PM by PIB Hyderabad

ప్రాజెక్ట్ లయన్’లో భాగంగా చేపడుతున్న ప్రయత్నాల పట్ల ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారుఈ ప్రయత్నాలు గుజరాత్‌లో సింహాలకు అనుకూల పరిసరాలను సమకూర్చడంతో పాటు వాటి సంరక్షణకు కూడా పూచీపడుతున్నాయి.

గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ ఎక్స్‌లో పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ:

‘‘చాలా ఉత్సాహాన్నిచ్చే సమాచారమిది. ‘ప్రాజెక్ట్ లయన్’లో భాగంగా చేపడుతున్న ప్రయత్నాలతోగుజరాత్‌లో సింహాలకు అనుకూలమైన వాతావరణం నెలకొనడంతోపాటు వాటి సంరక్షణకు అన్ని జాగ్రత్తచర్యలను తీసుకొంటుండడాన్ని చూస్తే ఎంతో సంతోషం కలుగుతోంది’’ అని పేర్కొన్నారు.‌

 

***


(రిలీజ్ ఐడి: 2130388) సందర్శకుల సూచీ సంఖ్య : : 15