రక్షణ మంత్రిత్వ శాఖ
తూర్పు నౌకాదళ కేంద్రాన్ని సందర్శించిన రక్షణ శాఖ కార్యదర్శి
నాడు పోస్టు చేయడమైనది:
18 MAY 2025 2:20PM by PIB Hyderabad
రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ రాజేశ్ కుమార్ సింగ్ మే 16, 17 తేదీల్లో విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండును సందర్శించారు.
రక్షణ కార్యదర్శి తన పర్యటనలో భాగంగా, తూర్పు నౌకాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేశ్ పెంఢార్కర్‌తో సమావేశమయ్యారు.
కమాండ్ యుద్ధ నిర్వహణ సామర్థ్యాలను, కీలక కార్యకలాపాల గురించి ఈ సందర్భంగా రక్షణ కార్యదర్శికి వివరించారు. తూర్పు సముద్రతీర ప్రాంతంలో ప్రస్తుతం పనులు పురోగమిస్తూ ఉన్న మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులతో పాటు, త్వరలోనే చేపట్టవలసి ఉన్న ప్రాజెక్టులను గురించి కూడా విస్తృతంగా ఆయనకు తెలిపారు. ఈ ప్రాజెక్టులను నౌకాదళ యుద్ధ నిర్వహణ- వ్యూహాత్మక సామర్థ్యాలను పెంపొందించే ఉద్దేశంతో అమలు చేయాలని తలపెట్టారు.
***
(రిలీజ్ ఐడి: 2129555)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13