ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహారాష్ట్రలోని షోలాపూర్‌లో అగ్ని ప్రమాదం.. ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి సంతాపం


* పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం

Posted On: 18 MAY 2025 9:27PM by PIB Hyderabad

మహారాష్ట్రలోని షోలాపూర్‌లో అగ్ని ప్రమాదం సంభవించి ప్రాణనష్టానికి దారితీసిన ఘటన పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.


ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి ( పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారాన్ని ప్రధాని ప్రకటించారు.


సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:


‘‘మహారాష్ట్రలోని షోలాపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం కలచివేసింది. ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.


మృతుల కుటుంబికులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల పరిహారాన్ని అందిస్తాం. గాయపడిన వారికి రూ. 50,000 అందిస్తాం: ప్రధానమంత్రి’’ @narendramodi

 

 

"महाराष्ट्रात सोलापूर इथे आग लागून झालेल्या दुर्घटनेतील जीवितहानीमुळे तीव्र दु:ख झाले. आपले प्रियजन गमावलेल्या कुटुंबांप्रति माझ्या सहवेदना. जखमी झालेले लवकर बरे होवोत ही प्रार्थना. पंतप्रधान राष्ट्रीय मदत निधीमधून (PMNRF) प्रत्येक मृतांच्या वारसाला 2 लाख रुपयांची मदत दिली जाईल. जखमींना 50,000 रुपये दिले जातील : पंतप्रधान" @narendramodi

 

 

***

MJPS/VJ/SKS


(Release ID: 2129541)