రక్షణ మంత్రిత్వ శాఖ
భాగస్వామ్య పద్ధతిలో కొత్త సైనిక్ స్కూళ్ల నాలుగో దశ నమోదులకు ఆన్‌లైన్ పోర్టల్ ప్రారంభం
Posted On:
15 MAY 2025 6:34PM by PIB Hyderabad
రక్షణ శాఖ ఆన్‌లైన్ మాధ్యమంలో ఒక వెబ్ పోర్టల్‌ను మొదలుపెట్టింది. అదే...https://sainikschoolsociety.in . అర్హత కలిగిన, ఆసక్తి ఉన్న దరఖాస్తులు పెట్టదలచిన పాఠశాలల నమోదుకు ఈ పోర్టల్‌ను ఉద్దేశించారు. ఈ పోర్టల్‌ను ఈ సంవత్సరం మే 15 నుంచి జూన్ 14 వరకు తెరిచి ఉంచుతారు. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్‌జీఓలు, ప్రయివేటు రగం.. వీటి భాగస్వామ్యంతో 100 సైనిక్ స్కూళ్లను నూతనంగా ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ కార్యక్రమంలో ఓ భాగం. ఆసక్తి కలిగిన పాఠశాలలు, ట్రస్టులు, ఎన్‌జీఓలు మొదలైనవి ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ పేర్లు నమోదు చేసుకోవడానికి వెబ్ పోర్టల్‌ను ఆశ్రయించవచ్చు.
విద్యార్థులకు జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా నాణ్యత కలిగిన విద్యను అందించడం ఒక్కటే కాకుండా, సాయుధ దళాల్లో చేరడం సహా మెరుగైన కెరియర్ అవకాశాల్ని వారికి అందించడం కూడా వంద సైనిక్ స్కూళ్లను కొత్తగా ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ దార్శనికతలో భాగం. దేశాన్ని మరింతగా ముందుకు తీసుకుపోవడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వాలకు, ఎన్‌జీవోలకు, ప్రయివేటు రంగానికి కల్పించాలన్నది కూడా కేంద్ర దార్శనికతలో మరో భాగం. ఈ దిశగా ప్రయివేటు, ఎన్‌జీవోలు, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు ఎనభై ఆరింటికి (86) కొత్త సైనిక్ స్కూళ్లుగా ఏర్పడేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చింది.
ఈ కొత్త సైనిక్ స్కూళ్లు, సంబంధిత విద్యా మండళ్లకు అనుబంధితం కావడంతోపాటు, సైనిక్ స్కూళ్ల సొసైటీ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. సొసైటీ నిర్ధారించిన భాగస్వామ్య పద్ధతిలో కొత్త సైనిక్ స్కూళ్లకు విధించిన నియమ నిబంధనలను ఇవి పాటిస్తాయి. దీనికి తోడు, ఇవి వాటి ప్రామాణిక బోర్డు పాఠ్యక్రమానికి (కరిక్యులమ్) అదనంగా సైనిక్ స్కూల్ నమూనాను అనుసరిస్తూ విద్యార్థులకు విద్యతో పాటు పాఠ్యక్రమ ఆధారిత విద్య (అకాడమిక్-ప్లస్ కరిక్యులమ్)ను కూడా బోధిస్తాయి.
***
(Release ID: 2129055)