సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
జాతీయ పురస్కారం- 2024 కోసం ఎంఎస్ఎంఈల నుంచి దరఖాస్తులను ఆహ్వానించిన సూక్ష్మ, చిన్న, మధ్యతహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ
प्रविष्टि तिथि:
15 MAY 2025 4:38PM by PIB Hyderabad
అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఔత్సాహిక ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తల కృషిని గుర్తించిన ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ.. జాతీయ స్థాయిలో పురస్కారాలను అందించడం ద్వారా వారిలో ప్రేరణ కలిగించి, ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం వివిధ విభాగాల్లో ఎంఎస్ఎంఈలకు 35 జాతీయ పురస్కారాలు అందిస్తున్నారు. మహిళలు, ఎస్సీ/ఎస్టీ, ఈశాన్య ప్రాంతానికి చెందిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నేతృత్వంలోని ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక పురస్కారాలు ఉంటాయి. ఈ పథకం కింద పురస్కారం పొందిన ఎంఎస్ఎంఈలకు ట్రోఫీ, ధ్రువీకరణ పత్రంతోపాటు నగదు బహుమతులను (మొదటి స్థానం- రూ. 3 లక్షలు, రెండో స్థానం- రూ. 2 లక్షలు, మూడో స్థానం- రూ. 1 లక్ష) అందిస్తారు.
2024 సంవత్సరానికి జాతీయ పురస్కారం కోసం వివిధ విభాగాల్లోని ఎంఎస్ఎంఈల నుంచి ఏప్రిల్ 4 నుంచి మే 20 వరకు జాతీయ అవార్డు పోర్టల్ (https://dashboard.msme.gov.in/na/Ent_NA_Admin/Ent_index.aspx) ద్వారా దరఖాస్తులను ఆహ్వానించారు. ఆసక్తిగల ఎంఎస్ఎంఈలు హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ (https://awards.gov.in/) ద్వారా కూడా దరఖాస్తులను సమర్పించవచ్చు. వివరాలు www.dcmsme.gov.in లో అందుబాటులో ఉన్నాయి. ఏదైనా వివరణ కోసం సమీపంలోని ఎంఎస్ఎంఈ – అభివృద్ధి, సహకార కార్యాలయం (ఎంఎస్ఎంఈ–డీఎఫ్వో)లో లేదా 011-23063342 నంబరుకు ఫోన్ చేసి సంప్రదించవచ్చు.
***
(रिलीज़ आईडी: 2128955)
आगंतुक पटल : 6