ప్రధాన మంత్రి కార్యాలయం
నక్సల్ బాధిత ప్రాంతాల్లో శాంతిని పునరుద్ధరించడానికి మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం: ప్రధానమంత్రి
Posted On:
14 MAY 2025 10:09PM by PIB Hyderabad
నక్సలిజాన్ని వేళ్లతో సహా పెకలించే దిశగా మేం నడుపుతున్న ఉద్యమం సరి అయిన మార్గంలో ముందుకు సాగిపోతోందని భద్రత దళాలు సాధించిన విజయం చాటుతోంది అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘నక్సలైట్ల వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో శాంతిని పునరుద్ధరించడంతో పాటు ఆయా ప్రాంతాలను అభివృద్ధి సహిత ప్రధాన స్రవంతిలోకి చేర్చడానికి మేం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నాం’’ అని శ్రీ మోదీ అన్నారు.
కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా మాటలకు ప్రధాని స్పందిస్తూ, సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక సందేశాన్ని పొందుపరిచారు. ఆ సందేశంలో:
‘‘నక్సలిజాన్ని కూకటివేళ్లతో సహా నిర్మూలించే దిశలో మా ఉద్యమం సరి అయిన మార్గంలో ముందుకు సాగుతోందని భద్రతదళాలు సాధించిన ఈ విజయం చాటిచెబుతోంది. నక్సలిజం వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో శాంతిని పునరుద్ధరించి, ఆయా ప్రాంతాలను అభివృద్ధి సహిత ప్రధాన స్రవంతిలో కలపడానికి మేం పూర్తి స్థాయిలో నిబద్ధులమై ఉన్నాం’’ అని ప్రధాని పేర్కొన్నారు.
***
(Release ID: 2128797)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam