ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం


ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటన

Posted On: 12 MAY 2025 5:46PM by PIB Hyderabad

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

   అలాగే మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50,000 వంతున పరిహారం ప్రకటించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం అత్యంత బాధాకరం. ఈ దుర్ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతున్నాను. అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను.

   మృతుల కుటుంబాలకు ‘పిఎంఎన్‌ఆర్‌ఎఫ్‌’ నుంచి రూ.2 లక్షల వంతున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ప్రధానమంత్రి PM @narendramodi మంజూరు చేసినట్లు తెలియజేసింది.”


(Release ID: 2128293) Visitor Counter : 2