WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

మీడియా-వినోద రంగ (ఎం అండ్ ఈ) అంకుర సంస్థల పెట్టుబడి అవకాశాలను ప్రముఖంగా చాటిచెప్పిన ‘వేవెక్స్ 2025’...


* ఎం అండ్ ఈ రంగానికి ప్రత్యేకించిన ఒక ఏంజెల్ నెట్‌వర్క్‌పై జరుగుతున్న కసరత్తు

* వేవ్స్‌లో ముఖాముఖి మాటామంతీకి 30 అంకుర సంస్థలకు దక్కిన ఛాన్సు

 प्रविष्टि तिथि: 04 MAY 2025 2:15PM |   Location: PIB Hyderabad

ముంబయిలో ప్రపంచ దృశ్య, శ్రవణ వినోద ప్రధాన శిఖరాగ్ర సదస్సు (వేవ్స్)‌లో భాగంగా నిర్వహించిన ప్రధాన అంకుర సంస్థల కార్యక్రమం ‘వేవెక్స్ 2025’ నవకల్పన, ఔత్సాహిక పారిశ్రామికత్వం, పెట్టబడులకొక ఆశాజనక సంగమస్థలిగా నిలిచింది.

సమాచార, ప్రసార శాఖ జాయింట్ డైరెక్టరు శ్రీ ఆశుతోష్ మోహ్‌లే వేవెక్స్ సంక్షిప్తంగా అవలోకనాన్ని సమర్పించారు. ప్రసార మాధ్యమాలు, వినోద (ఎం అండ్ ఈ) రంగంలో అంకుర సంస్థల్ని ప్రోత్సహించడంతోపాటు వాటి ఆలోచనల్ని ముందుకు తీసుకుపోవడానికి జాతీయ స్థాయిలో ఓ వేదికను అందించాలన్నదే వేవెక్స్ దృష్టికోణమని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమానికి సకారాత్మక ప్రతిస్పందన లభించినందుకు ఇండియా ఇంటర్‌నెట్-మొబైల్ అసోసియేషన్ (ఐఎంఏఐ) చీఫ్ గ్రోత్ ఆఫీసర్ శ్రీ సందీప్ ఝింగరన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, ‘‘మాకు ఒక వేయి కంటే ఎక్కువ దరఖాస్తులు అందాయి. వాటిలో ముప్ఫయ్ నేరుగా పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరపగా, వాటిలో నుంచి సగానికి పైగా ఇప్పటికే క్రియాశీల మాటామంతీలో తలమునకలుగా ఉన్నాయ’’ని తెలిపారు. ఎం అండ్ ఈ అంకుర సంస్థలపై దృష్టిని కేంద్రీకరించడానికి ఇలాంటి ప్రయత్నాలు ఎంతయినా అవసరమని ఆయన అన్నారు.  

పెట్టుబడిదారులు వెలిబుచ్చిన అభిప్రాయాలను గమనిస్తే అవి మార్పును తీసుకురావడానికి ఈ కార్యక్రమానికి ఉన్న సామర్ధ్యంతోపాటు రానున్న కాలంలో ఎలాంటి స్థితులు చోటుచేసుకొంటాయో తెలియజేశాయి.

ఈ రంగంలో పెట్టుబడి పెట్టడానికి మొదటి నుంచి అయిష్టత వ్యక్తమవుతూ వచ్చిందని కేబిల్ వ్యవస్థాపకుడు శ్రీ ముస్తఫా హర్‌నేస్‌వాలా అన్నారు. ‘‘ప్రసార మాధ్యమాలు, వినోద రంగంలో పెట్టుబడి పెట్టాలంటే చాలా మంది వెనుకాడతారు. ఈ మనస్తత్వాన్ని వేవ్స్ మారుస్తోంది. ఇప్పుడు మేం ప్రసార మాధ్యమాలు, వినోదం కోసమంటూ ఒక ప్రత్యేకమైన ఏంజెల్ నెట్‌వర్కును ఏర్పాటు చేసే పనిలోపడ్డాం. విదేశీ ప్రభుత్వాలతో కలిసి అడుగులో అడుగు వేస్తూ ప్రపంచ స్థాయి సంబంధాల్ని నెలకొల్పుకొనేందుకు గల అవకాశాల్ని కూడా అన్వేషిస్తున్నాం’’ అని ఆయన చెప్పారు.

మీడియా వేసిన ప్రశ్నలకు ప్యానల్ జవాబులిచ్చింది. దీంతో అంకుర సంస్థల రంగంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయో సుస్పష్టమైంది. సార్ధక కంటెంటు ఏదో పెట్టుబడిదారులు ఎలా గ్రహిస్తారు అని ప్రశ్నించగా శ్రీ రాజేశ్ బదులిస్తూ, ‘గిగల్’ పేరుతో వచ్చిన స్టార్టప్ యాప్‌ను ఒక ఉదాహరణగా చెప్పారు. ఈ స్టార్టప్ యాప్ సైబర్‌వేధింపులు, లైంగిక కంటెంటుల బారి నుంచి కాపాడుకోవడంలో తోడ్పడే ఒక వేదికను రూపొందిస్తోందని, బాధ్యత గల నవకల్పనకు ఇది ఒక ప్రమాణంగా నిలిచిందని ఆయన ప్రశంసించారు.

ఆడ, మగ ప్రాతినిధ్యం అంశంపై శ్రీ సందీప్ స్పందిస్తూ, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిమిత సంఖ్యలోనే ఉన్నారన్న విషయాన్ని అంగీకరించారు. ‘‘మరింత మెరుగైన స్థితిని ఆవిష్కరించడానికి మేం కట్టుబడి ఉన్నాం. రాబోయే సదస్సుల్లో మరింత ఎక్కువ మంది మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని మేం ఆశిస్తున్నాం’’ అని ఆయన అన్నారు.

కార్యక్రమాన్ని రూపొందించిన తీరును గురించి శ్రీ సందీప్ ఝింగరన్ మరికాస్త వివరంగా చెబుతూ, 2 రోజుల్లో 30 అంకుర సంస్థలకు ముఖాముఖి మాటామంతీకి అవకాశాలు కల్పించామన్నారు. కంటెంట్ క్రయేటర్లకు అవకాశాలను సద్వినియోగపరచుకొని ప్రయోజనాలను అందుకోవడానికి కొన్ని నిర్దిష్ట వ్యూహాలను అనుసరించాల్సిందిగా శ్రీ ముస్తఫా హర్‌నేస్‌వాలా సూచించారు. ఈ విషయంలో ఏవైనా లోటుపాట్లు ఎదురవుతూ ఉంటే వాటిని తీర్చడంలో వేవ్స్ తరహా కార్యక్రమం సాయపడుతుందని కూడా ఆయన భరోసా కల్పించారు.

ప్రసార మాధ్యమాలు, వినోద (ఎం అండ్ ఈ) రంగ అంకుర సంస్థల అనుబంధ విస్తారిత వ్యవస్థలో ఓ పెనుమార్పును తీసుకువచ్చే ఘట్టంగా వేవెక్స్ 2025 తనను తాను తీర్చిదిద్దుకోవడాన్ని ఇకమీదటా కొనసాగించనుంది. ఇది పాత పరిమితులను మరింత విస్తరిస్తుంది... భారత్ అంతటా ఇంతకు ముందు పెట్టుబడిదారులు ఎరుగని అవకాశాల్ని వారి ముందుకు తీసుకువచ్చి నిలుపుతుంది.

సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆధికారికంగా తెలుసుకోవడానికి, దయచేసి మమ్మల్ని ఫాలో కండి:

 

సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆధికారికంగా తెలుసుకోవడానికి మమ్మల్ని ఫాలో కండి

ఎక్స్‌లో 

https://x.com/WAVESummitIndia

https://x.com/MIB_India

https://x.com/PIB_India

https://x.com/PIBmumbai

ఇన్‌స్టాగ్రామ్‌లో 

https://www.instagram.com/wavesummitindia

https://www.instagram.com/mib_india

https://www.instagram.com/pibindia


https://www.instagram.com/pibindia

 

***


रिलीज़ आईडी: 2126875   |   Visitor Counter: 22

इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Malayalam , Urdu , Nepali , हिन्दी , Marathi , Assamese , Tamil , Kannada