సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
దిగ్గజాలు - విజయాలు: భారత ఆత్మను తీర్చిదిద్దిన కథలు - అనే అంశంపై చర్చతో ప్రారంభమైన వేవ్స్ 2025
వేవ్స్ భారత ప్రభుత్వం చేపట్టిన ఒక చక్కటి కార్యక్రమం. ఇందులో భాగమైనందుకు సంతోషంగా ఉంది: హేమమాలిని
కళాత్మక, వ్యాపార సినిమాల మధ్య తేడాను నేను చూడను – ప్రజల హృదయాలను కదిలించేలా కథ చెప్పడం ముఖ్యమని నేను భావిస్తాను: మోహన్‌లాల్
నటనంటే నాకు చిన్నతనం నుంచీ అమితమైన ప్రేమ: చిరంజీవి
Posted On:
01 MAY 2025 4:32PM
|
Location:
PIB Hyderabad
ముంబయిలోని ప్రఖ్యాత జియో వరల్డ్ సెంటర్ లో మొట్టమొదటి వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మిట్ (వేవ్స్) దిగ్గజాలు - విజయాలు- భారత ఆత్మను తీర్చిదిద్దిన కథలు - అనే అంశంపై చర్చతో ఘనంగా ప్రారంభమైంది. కథ చెప్పడం, సృజనాత్మకత, సాంస్కృతిక వారసత్వంపై ఆకట్టుకునే రీతిలో జరిగిన చర్చలో- ఈ సెషన్ భారతదేశ అత్యంత గౌరవ సినీ ప్రముఖులలో కొందరిని ఒకే వేదికపైకి తెచ్చింది.
ప్రారంభ ప్యానల్‌లో ప్రసిద్ధ నటీమణి హేమామాలిని, ప్రముఖ నటులు మోహన్‌లాల్, చిరంజీవి పాల్గొన్నారు. ఈ చర్చను సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా డ్రీమ్ గర్ల్ హేమమాలినీ మాట్లాడుతూ “ఇది భారత ప్రభుత్వం ప్రారంభించిన అందమైన ప్రారంభం. దీనిలో భాగమవ్వడం నాకు ఆనందంగా ఉంది. ప్రధానమంత్రి మోదీకి కృతజ్ఞతలు. ఆయన దృష్టికోణం, నాయకత్వమే WAVESను... సృష్టికర్తలు, ఆవిష్కర్తల కోసం ఒక విశిష్టమైన వేదికగా తీర్చిదిద్దాయి” అని అభినందించారు.
సినిమా రూపాంతరం చెందుతున్న తీరుపై ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. “కళాత్మక సినిమా, వినోదాత్మక సినిమా మధ్య గల రేఖ చాలా చిన్నది. ఎందుకంటే కళాత్మక సినిమాల్లో కూడా వినోదం ఉంటుంది. నేను కళాత్మక సినిమానా, లేక వాణిజ్య సినిమానా అన్న తేడా చూడను. మనుషులను కదిలించే కథ ముఖ్యం” అని పేర్కొన్నారు.
ప్రముఖ నటుడు చిరంజీవి తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. నటన పట్ల తన అపారమైన ఆసక్తి గురించి, నిష్కలంకమైన కృషి గురించి వివరించారు. చిన్నప్పటి ఆకాంక్షలను ప్రస్తావిస్తూ “చిన్నప్పటి నుంచే నేను నటనను ప్రేమించాను. నా లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకోవాలన్న తపన నన్ను ఎప్పుడూ నడిపించింది. గొప్ప నటుడిగా మారేందుకు నేను ఏవిధమైన ప్రత్యేకత కలిగి ఉండాలని నేను ఎప్పుడూ నాలో నేనే ప్రశ్నించుకుంటూ ఉండేవాడిని” అని అన్నారు.
నిజాయితీ పట్ల తన నిబద్ధతను ప్రముఖంగా చెబుతూ, స్థిరంగా, నమ్మకంగా ఉండాలనే ప్రగాఢమైన ఆకాంక్షను వ్యక్తం చేశారు. “ప్రేక్షకులు నన్ను పక్కింటి అబ్బాయిలా చూడాలనేది ఎప్పటికీ నా కోరిక. అందుకే నా నటనను ఎంత వరకు సాధ్యమవుతుందో అంతవరకు సహజంగానూ, నిజాయతీగానూ ఉంచే ప్రయత్నం చేస్తాను” అని ఆయన స్పష్టం చేశారు. తనను నటుడిగా తీర్చిదిద్దిన మహానుభావులకు కృతజ్ఞతలు తెలిపారు. వారు తనపై చూపిన గాఢమైన ప్రభావాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
వ్యక్తిగత అనుభవాలనూ, సాధించిన విజయాలనూ భారతీయ సినిమాలో ఉన్నతస్థాయికి చేరుకున్న వారు ఆహూతులతో పంచుకునే అరుదైన అవకాశం ఈ చర్చ అందించింది.
***
Release ID:
(Release ID: 2125999)
| Visitor Counter:
11
Read this release in:
Urdu
,
Assamese
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Nepali
,
Marathi
,
English
,
Hindi
,
Punjabi
,
Gujarati