WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

వేవ్స్‌-2025 క్రియేటోస్ఫియర్- ‘క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజెస్’ అద్భుతాల ఆవిష్కరణ


భారత్‌ సహా ప్రపంచవ్యాప్త సృజనాత్మక ప్రతిభాసామర్థ్యాల గుర్తింపు.. ప్రోత్సాహానికి ‘వేవ్స్‌ క్రియేటర్ అవార్డులు’ దోహదం

 Posted On: 30 APR 2025 7:28PM |   Location: PIB Hyderabad

వరల్డ్ ఆడియో విజువల్ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్-2025 (వేవ్స్‌)లో భాగంగా ప్రతిష్ఠాత్మక రీతిలో శ్రీకారం చుట్టుకున్న ‘క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్’ (సిఐసిసీజన్-1 అద్భుతమైన అంతిమదశ కార్యక్రమాలు రేపు జియో వరల్డ్ సెంటర్‌లో మొదలవుతున్నాయి. ‘సిఐసి-1’ ముఖ్యంగాలక్షకుపైగా అంటే... మొత్తం 1,01,349 రిజిస్ట్రేషన్లతో ఓ కొత్త రికార్డును సృష్టించిందిప్రపంచవ్యాప్తంగా 60కిపైగా దేశాల నుంచి ఔత్సాహకులను ఈ పోటీలు ఆకర్షించాయిదీన్నిబట్టిఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం అంతర్జాతీయ స్థాయిలో పోటీదారులను ఎంతగా ఆకట్టుకున్నదో స్పష్టమవుతోందిఅసాధారణ స్థాయిలో నమోదు చేసుకున్న ప్రతిభావంతుల సమూహం నుంచి 750 మంది తుది దశకు చేరారువీరందరికీ ‘వేవ్స్‌-2025’లో భాగమైన యానిమేషన్కామిక్స్ఏఐఎక్స్‌ఆర్‌గేమింగ్సంగీతం సహా మరిన్నిటిలో ఆవిష్కరణలసహిత ప్రత్యేక వేదిక ‘క్రియేటోస్ఫియర్‌’పై తమ సృజనాత్మక నైపుణ్యాలనుఆవిష్కరణల ప్రభావాన్ని ప్రదర్శించే అవకాశం పొందుతారు.

ఏమిటీ క్రియేటోస్ఫియర్‌...?

క్రియేటోస్ఫియర్‌’ అంటేఆవిష్కరణమేధస్సు కలగలసిన తాదాత్మ్యతా లోకం... ఆలోచనలను అనుభవాలుగా మార్చే అసలైన గమ్యంగా దీన్ని రూపొందించారుసృష్టికర్తలకు కీలక ప్రాధాన్యం లభించే వేదిక... వర్చువల్ రియాలిటీ నుంచి చలనచిత్రాల దాకా, ‘విఎఫ్‌ఎక్స్‌’ నుంచి కామిక్స్ వరకూయానిమేషన్ నుంచి గేమింగ్దాకాసంగీతం నుంచి ప్రసార-డిజిటల్ మీడియా వరకూ విస్తృత శ్రేణి మీడియావినోద రంగాల్లో భావనప్రయోగంకళాత్మక నైపుణ్యానికి ఇది సముచిత గుర్తింపునిస్తుందిప్రపంచం నలుమూలలాగల అగ్రశ్రేణి సృజనాత్మక మేధావులు, ‘క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజెస్’ కింద వివిధ పోటీల్లో అంతిమదశకు ఎంపికైన విజేతల మధ్య ఫలవంతమైన చర్చలతోపాటు మరిన్ని ఆవిష్కరణలకు ప్రేరణనిచ్చే వేదిక అవుతుందిఅంతేకాకుండా భాగస్వామ్యాల కూర్పులోనూ తనవంతు తోడ్పాటునిస్తుందిభారత సృజనాత్మక శక్తిసామర్థ్యాలను ప్రపంచ ప్రేక్షకులతో అనుసంధానిస్తూ వారి ప్రతిభా ప్రదర్శనకు వీలు కల్పిస్తుంది.

భారత్‌లో సృష్టించండి... ప్రపంచం కోసం సృష్టించండి” (క్రియేట్ ఇన్ ఇండియా-క్రియేట్ ఫర్ ది వరల్డ్అంటూ ప్రధానమంత్రి దృక్కోణం నుంచి ఉద్యమంలా రూపుదిద్దుకున్న భావనే ‘క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజెస్’ నిర్వహణకు మూలంఆ మేరకు “ఆవిష్కర్తల సంధానం... దేశాల అనుసంధానం” విధానంగా ఈ కార్యక్రమం ముందడుగు వేసింది. ‘వేవ్స్‌’లో కీలకమైన ఈ కార్యక్రమం భారత సృజనాత్మక ఆకాంక్షలకు శక్తిమంతమైన రూపంగా ఆవిష్కృతమైందితద్వారా ప్రపంచ మీడియా-వినోద పరిశ్రమలో దేశం అగ్రస్థానానికి చేరువ కావడాన్ని పునరుద్ఘాటిస్తూ ఈ రంగం భవిష్యత్తు ప్రణాళికను కూడా రచిస్తోంది. ‘వసుధైవ కుటుంబకం’... అంటేయావత్‌ ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా పరిగణించే ప్రాచీన భారతీయ తాత్త్విక స్ఫూర్తిని ఇది ప్రతిబింబిస్తుంది.

క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్’ సీజన్-1 స్థాయిప్రభావం అద్భుతంఈ కార్యక్రమం ప్రపంచ సృజనాత్మక ఉద్యమంగా మారిందిఈ మేరకు వివిధ దేశాల నుంచి 1,100 మందికిపైగా పోటీదారులు నమోదు చేసుకున్నారుదీంతో ఈ పోటీలు తొలి దశలోనే అంతర్జాతీయ ప్రాచుర్యం పొందాయిఅగ్రశ్రేణి న్యాయనిర్ణేతలువారి చురుకైన ఆలోచనలు-భావనలుబలమైన ఎంపిక ప్రమాణాలతో ‘క్రియేటోస్ఫియర్‌’ కోసం ఉత్తమ ప్రతిభాపాటవాలు గల వారిని అన్ని పోటీల ద్వారా ఎంపిక చేశారుఈ పోటీలలో దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు సహా 20 దేశాల నుంచి అభ్యర్థులు పాల్గొన్నారు. ‘క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్’క్రియేటోస్ఫియర్’ సాధించిన ఈ విజయాలు వైవిధ్యంశ్రేష్ఠతప్రపంచ ప్రతిస్పందనను ప్రస్ఫుటం చేశాయి.

ప్రతినిధులుసృష్టికర్తలుపోటీదారులతో రాబోయే నాలుగు పరిణామశీల రోజుల్లో సృజనాత్మకఅనుసరణీయభిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించగల శక్తిమంతమైన సమ్మేళనంతో వీక్షకులు తాదాత్మ్యం చెందుతారుప్రత్యేకంగా రూపొందించిన మాస్టర్‌క్లాస్‌లుబృంద చర్చలువర్క్‌షాపులుప్రెజెంటేషన్లుప్రదర్శనల ద్వారా ఒక వృత్తిపరమైన చట్రంలో అర్థవంతమైన సంభాషణలుభవిష్యత్‌ దార్శనిక భావనలను క్రియేటోస్ఫియర్ పెంపొందిస్తుంది. ‘ఎవిజిసి-ఎక్స్‌ఆర్‌’ ప్రసారంచలనచిత్రాలుసంగీతండిజిటల్సోషల్ మీడియా తదితర రంగాలను ఇది ఒకే వేదికపైకి తెస్తుందిఇందులో భాగంగా ఈ పోటీల్లో అగ్రస్థానంలో నిలిచిన అంశాలకు సంబంధించి “వర్చువల్ లోక్విఎఫ్‌ఎక్స్‌ వాల్ట్ఫిల్మ్ ఫియస్టాయానిమేషన్ అల్లేకామిక్ కోనామ్యూజిక్ మానియాఎయిర్‌వేవ్స్‌డిజిటల్ డొమైన్గేమ్ ఆన్” పేరిట ప్రత్యేక విభాగాల్లో ప్రదర్శనలుంటాయి.

భవిష్యత్‌ యువ సృష్టికర్తలకు ఒక వేదికనందించే లక్ష్యంతో ‘క్రియేటోస్ఫియర్‌’ కింద విశిష్ట ‘క్రియేటర్స్‌ అవార్డ్‌’ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారుఈ మేరకు ‘క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజెస్’ విజేతలకు ఘన సత్కారం లభిస్తుందిఈ ఆనందోత్సాహ సంబరాల్లో మీడియా-వినోద రంగాల ప్రసిద్ధ కళాకారులుప్రముఖులుపరిశ్రమ అగ్రగాముల సమక్షంలో సృజనాత్మక విజేతలకు అత్యున్నత గౌరవపురస్కార ప్రదానం ఉంటుందిసంగీత పోటీల విజేతలు తమ మంత్రముగ్ధ సంగీత ప్రతిభతో ప్రేక్షకులకు వీనులవిందు చేస్తారుఅంటే- ‘క్రియేటోస్ఫియర్’ ఆవిష్కరణల కూడలిగానే కాకుండా సాంస్కృతిక వేడుకగానూ ప్రపంచాన్ని అలరిస్తుందిభారత బహుముఖ సృజనాత్మక ప్రతిభాపాటవాల వైభవాన్ని ప్రదర్శిస్తుంది.

 

***


Release ID: (Release ID: 2125680)   |   Visitor Counter: 6