చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
పత్రికా ప్రకటన
Posted On:
30 APR 2025 11:12AM by PIB Hyderabad
భారత రాజ్యాంగం అందించిన అధికారాలను ఉపయోగిస్తూ, 2025, మే, 14 నుంచి అమల్లోకి వచ్చేలా సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్‌ను భారత ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి నియమించారు.
శ్రీ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, భారత ప్రధాన న్యాయమూర్తి (నియమితులు)

తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా శ్రీ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నియామకానికి సంబంధించిన లేఖపై గౌరవ రాష్ట్రపతి సంతకం చేశారు. దానికి అనుగుణంగా కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తిగా శ్రీ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ 2025, మే 14 న బాధ్యతలు స్వీకరిస్తారు.
|
|
|
తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా శ్రీ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నియామకానికి సంబంధించిన లేఖపై గౌరవ రాష్ట్రపతి సంతకం చేశారు. దానికి అనుగుణంగా కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తిగా శ్రీ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ 2025, మే 14 న బాధ్యతలు స్వీకరిస్తారు.
|
జస్టిస్ బీఆర్ గవాయ్ 1960, నవంబర్ 24న అమరావతిలో జన్మించారు. 1985, మార్చి 16న బార్‌లో చేరారు. మాజీ అడ్వకేట్ జనరల్, హైకోర్టు న్యాయమూర్తి అయిన దివంగత బారిష్టర్ శ్రీ రాజా ఎస్. భోంస్లేతో కలసి 1987 వరకు పనిచేశారు. బాంబే హైకోర్టులో 1987 నుంచి 1990 వరకు సొంతంగా ప్రాక్టీసు చేశారు. 1990 తర్వాత బాంబే హైకోర్టుకు చెందిన నాగపూర్ బెంచిలోనే ప్రధానంగా తన ప్రాక్టీసు కొనసాగించారు.
కాన్స్టిట్యూషనల్ లా, పరిపాలన చట్టాల్లో ప్రాక్టీసును కొనసాగించారు. నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్, అమరావతి మున్సిపల్ కార్పొరేషన్, అమరావతి విశ్వవిద్యాలయాలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. ఎస్ఐసీవోఎం, డీసీవీఎల్ తరహా స్వతంత్ర్య వ్యవస్థలు, కార్పొరేషన్లు, విదర్భ ప్రాంతంలో మున్సిపల్ కౌన్సిల్స్ తరఫున తన వాదనలు వినిపించేవారు.
బాంబే హైకోర్టు, నాగపూర్ బెంచ్‌లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరుగా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా 1992, ఆగస్టు నుంచి 1993, జులై వరకు పనిచేశారు. నాగపూర్ బెంచ్‌లో ప్రభుత్వ ప్లీడరు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా 2000, జనవరి 17 న నియమితులయ్యారు.
2003, నవంబర్ 14న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అలాగే 2005 నవంబర్ 12న బాంబే హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియామకం పొందారు. ముంబయిలోని హైకోర్టులో అన్ని రకాల విధులను నిర్వర్తించే బెంచులతో పాటు, నాగపూర్, ఔరంగాబాద్, పనాజీ బెంచులకు నేతృత్వం వహించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
గడచిన ఆరేళ్లలో.. రాజ్యాంగం, పరిపాలనా చట్టం, పౌర చట్టం, క్రిమినల్ చట్టం, వాణిజ్య వివాదాలు, మధ్యవర్తిత్వ చట్టం, విద్యుత్ చట్టం, విద్యా సంబంధమైన వ్యవహరాలు, పర్యావరణ చట్టంతో సహా వివిధ రకాల అంశాలను పరిష్కరించిన 700 బెంచుల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు.
చట్టబద్దమైన పాలనను సమర్థించడం, పౌరుల ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు, చట్ట పరమైన హక్కులను పరిరక్షించే వివిధ అంశాలపై రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన వాటితో సహా 300కు పైగా తీర్పులను ఆయన రాశారు.
ఉలాన్‌బాతర్ (మంగోలియా), న్యూయార్క్ (యూఎస్ఏ), కార్డిఫ్ (యూకే), నైరోబీ (కెన్యా)తో సహా వివిధ ప్రాంతాల్లో జరిగిన అంతర్జాతీయ సదస్సుల్లో ఆయన పాల్గొన్నారు.
కొలంబియా, హార్వర్డ్‌తో సహా వివిధ విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో రాజ్యాంగ, పర్యావరణ అంశాలపై ప్రసంగించారు.
2025, నవంబర్ 23న ఆయన పదవీ విరమణ చేస్తారు.
****
(Release ID: 2125440)
Visitor Counter : 18