వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వాషింగ్టన్‌లో భారత్, అమెరికా అధికారుల భేటీ.. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చల్లో సానుకూల పురోగతి

Posted On: 29 APR 2025 3:11PM by PIB Hyderabad

భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న చర్చల్లో భాగంగా.. భారత వాణిజ్య శాఖ, అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయ ప్రతినిధులు ఏప్రిల్ 23 - 25 తేదీల్లో వాషింగ్టన్ డీసీలో సమావేశమయ్యారు. అంతకుముందు మార్చిలో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు.

వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన సమావేశం సందర్భంగా.. టారిఫ్, నాన్ టారిఫ్ విషయాలు సహా వివిధ అంశాలపై ఈ బృందం ఫలవంతంగా చర్చించింది. ఇరుపక్షాలకూ ముందస్తుగా లాభం చేకూర్చే అవకాశాలు సహా.. 2025 ముగిసే నాటికి- పరస్పర ప్రయోజనకరమైన, వివిధ రంగాలతో కూడిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి విడతను ముగించడానికి అవకాశాలను ఈ బృందం చర్చించింది. ఉత్పాదక రంగ సంబంధిత నిపుణుల స్థాయి సమావేశం వర్చువల్ విధానంలో జరగగా.. రంగాల వారీగా వ్యక్తిగత సమావేశాలను మే నెలాఖరు నుంచి నిర్వహించాలని భావిస్తున్నారు.

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ద్వారా భారత్ - అమెరికా ఆర్థిక సంబంధాలు, సరఫరా వ్యవస్థ ఏకీకరణను పెంపొందించి, విస్తరించే దిశగా.. ఫిబ్రవరిలో చేసిన ప్రకటనకు అనుగుణంగా ద్వైపాక్షిక చర్యల్లో భాగంగా నిర్వహించిన ఈ చర్చలు ఫలప్రదమయ్యాయి.  

 

***

 

(Release ID: 2125305) Visitor Counter : 5