సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
పేదరిక నిర్మూలనలో భారత్ విజయం
పదేళ్లలో 17.1 కోట్ల మంది తీవ్ర పేదరికం నుంచి బయటపడ్డారు: ప్రపంచ బ్యాంకు
Posted On:
26 APR 2025 4:40PM by PIB Hyderabad
పరిచయం
గత దశాబ్దంలో భారతదేశం సాధించిన అత్యద్భుత విజయాలలో ఇది ఒకటి — 171 మిలియన్ మంది ప్రజలను తీవ్ర పేదరికం నుంచి బయటకు తెచ్చింది. ప్రపంచ బ్యాంక్, 2025 వసంతకాలంలో విడుదల చేసిన పేదరికం, సమానత్వ నివేదిక (పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్స్ - పీఈబీ) లో భారతదేశం పేదరికంపై సాగించిన సంకల్పభరిత పోరాటాన్ని ప్రశంసించింది. ఆ నివేదిక ప్రకారం, రోజు ఒక్కొక్కరికి 2.15 అమెరికన్ డాలర్ల కన్నా తక్కువ ఆదాయంతో జీవించే ప్రజల శాతం, 2011-12లో 16.2 శాతం ఉండగా, 2022-23లో కేవలం 2.3 శాతానికి తగ్గింది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాలపై సమాన దృష్టితో సమగ్ర అభివృద్ధి పట్ల భారత ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఈ విజయం సాక్ష్యంగా నిలుస్తోంది. నిర్దేశిత లక్ష్యాలతో సంక్షేమ పథకాలు, ఆర్థిక సంస్కరణలు, అవసరమైన సేవల అందుబాటును పెంచడం ద్వారా, భారతదేశం పేదరికాన్ని తగ్గించడంలో గొప్ప పురోగతి సాధించింది. ప్రపంచ బ్యాంక్ 2025 వసంతకాలపు “పోవర్టీ అండ్ ఇక్విటీ బ్రీఫ్”లో, ఈ ప్రయత్నాలు మిలియన్ల మంది జీవితాల్లో ఎలా కీలకమైన మార్పును తీసుకువచ్చాయో, దేశవ్యాప్తంగా పేదరికపు అంతరాన్ని ఎలా తగ్గించాయో వివరంగా చూపించింది.
పేదరికం, సమానతలపై ప్రపంచ బ్యాంకు నివేదిక అవలోకనం (పీఈబీలు)
ప్రపంచ బ్యాంక్ వెలువరించే పేదరికం, సమానత్వ నివేదిక (పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్స్ - పీఈబీ) 100కు పైగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో పేదరికం, సమష్టి సమృద్ధి, అసమానతల ధోరణులను ప్రముఖంగా వివరిస్తాయి. ప్రతి సంవత్సరం వసంత కాల సమావేశాలు, వార్షిక సమావేశాల సందర్భంగా ప్రపంచ బ్యాంక్ గ్రూప్ అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) కోసం రెండు సార్లు ఈ బ్రీఫ్స్ ను ప్రచురిస్తారు. ఇవి ప్రతి దేశంలో పేదరికం, అసమానతల స్థితిగతులను సంక్షిప్తంగా పరిచయం చేస్తూ, పేదరిక నిర్మూలనను ప్రపంచ ప్రాధాన్యతగా కొనసాగించేందుకు దోహదపడతాయి.
ఈ సూచికలు పేదరికానికి సంబంధించిన వివిధ పార్శ్వాలను కవర్ చేస్తాయి, ఇందులో పేదరిక రేట్లు, మొత్తం పేద ప్రజల సంఖ్యను జాతీయ పేదరిక రేఖలు, అంతర్జాతీయ ప్రమాణాలను ఆధారంగా తీసుకుని (తీవ్ర పేదరికానికి రోజుకు $2.15, దిగువ మధ్య తరగతి దేశాలకు $3.65, ఎగువ మధ్య తరగతి దేశాలకు $6.85) అంచనా వేస్తారు. ఈ బ్రీఫ్స్ కాలక్రమంలో దేశాల మధ్య పేదరికం, అసమానతల తేడాలను పోలుస్తూ, ధోరణులను అందిస్తాయి. అలాగే, విద్య, ప్రాథమిక సేవల వంటి ఆర్థికేతర లోటులను పరిగణనలోకి తీసుకునే బహుముఖ పేదరిక కొలమానం, జినీ సూచిక ఆధారంగా అసమానత కొలతలను కూడా చేర్చాయి.
గ్రామీణ, పట్టణ పేదరికం నిర్మూలన
భారతదేశంపై ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన పేదరికం, సమానత్వ నివేదిక ప్రకారం, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో సమానంగా తీవ్ర పేదరికం గణనీయంగా తగ్గింది.
ప్రధాన నిర్ధారణలు:
V.గ్రామీణ ప్రాంతాల్లో 2011-12లో 18.4 శాతంగా ఉన్న పేదరికం 2022-23 నాటికి 2.8 శాతానికి తగ్గింది.
V.పట్టణ కేంద్రాల్లో పేదరికం 10.7 శాతం నుంచి 1.1 శాతానికి తగ్గింది.
V.2011-12 నుంచి 2022-23 మధ్య కాలంలో గ్రామీణ, పట్టణ పేదరికం మధ్య వ్యత్యాసం 7.7 శాతం నుంచి 1.7 శాతానికి తగ్గింది.
దిగువ-మధ్య-ఆదాయ దారిద్య్ర రేఖ వద్ద బలమైన పురోగతి
***
(Release ID: 2124775)
Visitor Counter : 13