భారత్‌లో ఎ బర్డ్స్ ఐ వ్యూ ఛాలెంజ్ నిర్వహణ, మేనేజింగ్ బాధ్యతలను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని మినీ రత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) కు అప్పగించారు.
ఈ పోటీల్లో పాల్గొనేవారు ఆకర్షణీయమైన డ్రోన్ సినిమాటోగ్రఫీ ద్వారా భారతదేశ సౌందర్యం, వివిధ ప్రదేశాలు, వారసత్వం, సంస్కృతి, ఆవిష్కరణలు, పురోగతి, పరివర్తనను ప్రధానంగా ప్రదర్శిస్తూ 2-3 నిమిషాల వీడియోలను సమర్పించాల్సి ఉంటుంది. సమ్మిళిత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, ఈ ఛాలెంజ్‌లో కింది రెండు కేటగిరీలను చేర్చారు:
1) ఓపెన్ కేటగిరీ: చిత్రనిర్మాతలు, విద్యార్థులు, అభిరుచి గలవారు, వృత్తి నిపుణులు, డ్రోన్ ఔత్సాహికులు సహా భారతీయ పౌరులందరూ పాల్గొనడానికి అవకాశం ఉంటుంది.
2) డ్రోన్ దీదీ కేటగిరీ: డ్రోన్ నిర్వహణలో శిక్షణ ద్వారా గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో మహిళలకు సాధికారత కల్పించే లక్ష్యంతో ప్రారంభించిన నమో డ్రోన్ దీదీ పథకం వంటి కార్యక్రమాల ద్వారా శిక్షణ పొందిన మహిళలకు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంటుంది.
విస్తృత అవగాహనను కల్పించడానికి, భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, సాంప్రదాయిక, డిజిటల్ అవుట్‌రీచ్ పద్ధతుల సమ్మేళనంతో బీఈసిఐఎల్ ఒక సమగ్ర జాతీయ మీడియా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఈ ప్రచారంలో భాగంగా భారతదేశంలోని అన్ని డ్రోన్ అకాడమీలు, మీడియా సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో సంస్థాగత సందర్శనలు, సెమినార్లు నిర్వహించడంతో పాటు, ప్రాథమిక స్థాయి నుంచి అందరి భాగస్వామ్యం ఉండేలా విద్యార్థులు, డ్రోన్ శిక్షణ తీసుకుంటున్న వారితో ప్రత్యక్ష సంభాషణలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్, వీడియో సమర్పణను సులభతరం చేయడానికి ఒక ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్ ప్రారంభించారు. అంతేగాకుండా, ప్రచార డిజిటల్ ప్రయత్నాలను విస్తరిస్తూ మీడియా పాఠశాలలు, డ్రోన్ శిక్షణా కేంద్రాలు, పౌర సమాజ నెట్‌వర్క్‌లు లక్ష్యంగా వ్యూహాత్మక ఇమెయిల్ ప్రచారాలను నిర్వహించారు. ఈ పోటీల పట్ల నిరంతరం ఆసక్తిని పెంపొందించేలా అనుకూలీకరించిన కంటెంట్‌తో ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, లింక్డ్‌ఇన్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను విస్తృతంగా ఉపయోగించారు. డిజిటల్ ప్రయత్నాలకు అనుబంధంగా, పోస్టర్లు, కరపత్రాలు సహా ముద్రిత సామగ్రిని పంపిణీ చేశారు.
ఈ పోటీలకు డ్రోన్ దీదీ అభ్యర్థుల నుంచి వచ్చిన 382 ఎంట్రీలు సహా అత్యధికంగా మొత్తం 1,324 రిజిస్ట్రేషన్లు వచ్చాయి, కథ చెప్పే మాధ్యమంగా డ్రోన్ వీడియోగ్రఫీ పట్ల పెరుగుతున్న మక్కువను ఇది ప్రతిబింబిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని హిమాలయ లోయల నుంచి ఉత్తరప్రదేశ్‌లోని సాంస్కృతిక కారిడార్లు, బీహార్ మైదానాలు, గుజరాత్, కర్ణాటకలోని ఆవిష్కరణ కేంద్రాలు, తమిళనాడు తీరప్రాంతాల వరకు భారతదేశ నలుమూలల నుంచి ఎంట్రీలు వెల్లువెత్తాయి – తద్వారా ఈ పోటీలు భారతదేశ స్థాయి సృజనాత్మక, పురోగతి వేడుకలుగా మారాయి.
అన్ని ఎంట్రీలను కింది వారితో కూడిన ప్రముఖ జ్యూరీ ప్యానెల్ నిశితంగా పరిశీలించింది:
శ్రీ. పియూష్ షా - సినిమాటోగ్రాఫర్, నిర్మాత, రచయిత, సౌండ్ డిజైనర్
శ్రీ ఆర్.వి. రమణి - జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రనిర్మాత & డాక్యుమెంటరీ సినిమాటోగ్రాఫర్
శ్రీ అరుణ్ వర్మ - భారతీయ సినిమాలో ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్
కచ్చితమైన మూల్యాంకన ప్రక్రియ తర్వాత, సామాజిక ప్రాతినిధ్యం కోసం ప్రత్యేక కేటగిరీ కింద నాలుగు ఎంట్రీలు సహా ప్రతి కేటగిరీ నుంచి ఐదుగురు ఫైనలిస్టులను ఎంపిక చేశారు:
ఈ విధంగా ఎంపిక చేసిన ఎంట్రీలను వేవ్స్ 2025లో ప్రదర్శించి, విజేతలుగా నిలిచిన వారి పేర్లను సమిట్‌లో వేడుకల్లో ప్రకటించి, వారిని సత్కరిస్తారు.
మరింత సమాచారం, అప్‌డేట్స్ కోసం, సందర్శించండి: www.becil.com
వేవ్స్ గురించి
మీడియా & వినోదం (ఎమ్ & ఈ) రంగం కోసం కీలకమైనది అయిన మొదటి వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమిట్ (వేవ్స్) భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో మే 1 నుంచి 4వ తేదీ వరకు మహారాష్ట్రలోని ముంబయిలో జరగనుంది.
పరిశ్రమ నిపుణులు, పెట్టుబడిదారులు, క్రియేటర్ లేదా ఆవిష్కర్తలను ఎమ్ & ఈ రంగానికి అనుసంధానించడానికి, సహకరించడానికి, ఆవిష్కరణలు చేయడానికి, తోడ్పాటునందించడానికి ఈ సమిట్ ఒక తిరుగులేని ప్రపంచస్థాయి వేదికను అందిస్తుంది.
భారత సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి, కంటెంట్ క్రియేషన్, మేధో సంపత్తి, సాంకేతిక ఆవిష్కరణల కేంద్రంగా భారత్ స్థానాన్ని విస్తృతం చేసే లక్ష్యంతో వేవ్స్ రూపుదిద్దుకుంది. బ్రాడ్‌కాస్టింగ్, ప్రింట్ మీడియా, టెలివిజన్, రేడియో, ఫిల్మ్స్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, సౌండ్ అండ్ మ్యూజిక్, అడ్వర్టైజింగ్, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, జనరేటివ్ ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (విఆర్), ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఎక్స్ఆర్) వంటి పరిశ్రమలు, రంగాలపై ఇది దృష్టి సారించింది.
ఏవైనా సందేహాలున్నాయా? సమాధానాలు here
పిఐబి టీమ్ వేవ్స్ నుంచి తాజా ప్రకటనలతో అప్‌డేట్‌గా ఉండండి.
రండి, మాతో కలిసి ముందుకుసాగండి! ఇప్పుడే ( now ) వేవ్స్ కోసం నమోదు చేసుకోండి (త్వరలో!).
***