హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నిన్నటి పహల్గాం ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి శ్రద్ధాంజలి ఘటించిన కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా


* ఉగ్రవాదానికి తలవంచే ప్రసక్తే లేదు, ఇంతటి ఘోరానికి బాధ్యులైన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించిన మంత్రి

* పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించిన మంత్రి

* ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారి స్మృతి ప్రతి భారతీయుడినీ కలిచి వేస్తోంది, ఈ వేదన మాటలకు అందనిది

* పహల్గాం ఉగ్రదాడి సంఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి ... ఘటన గురించిన వివరాలను తెలియజేసిన అధికారులు

*ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన శ్రీ షా... అన్ని రకాల సహాయం అందించగలమని హామీ

Posted On: 23 APR 2025 9:17PM by PIB Hyderabad

నిన్నటి పహల్గాం ఉగ్రవాద దాడిలో అసువులు బాసిన వారికి కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజు  శ్రద్ధాంజలి ఘటించారు. ఉగ్రవాదానికి తలవంచే ప్రసక్తే లేదని, ఇంతటి ఘోరానికి బాధ్యులైన వారిని వదిలిపెట్టబోమని మంత్రి హెచ్చరించారు.

పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. ఈ దాడిలో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాల బాధ ప్రతి భారతీయుడి హృదయాన్నీ కలిచి వేస్తోందని, ఈ వేదన మాటలకు అందనిదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. 

అనంతరం పహల్గాం ఉగ్రదాడి సంఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి, ఘటనకు సంబంధించిన అన్ని వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.  
దాడిలో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని  శ్రీ షా పరామర్శించారు.  ప్రభుత్వం వారికి అన్ని రకాల సహాయం అందించగలదని హామీ ఇచ్చారు.

 


(Release ID: 2124035) Visitor Counter : 6