ప్రధాన మంత్రి కార్యాలయం
సౌదీ అరేబియా పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని ప్రకటన
Posted On:
22 APR 2025 8:30AM by PIB Hyderabad
యువరాజు, ప్రధాన మంత్రి ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు సౌదీ బయలుదేరి వెళుతున్నాను.
సౌదీ అరేబియాతో దీర్ఘకాలంగా ఉన్న చారిత్రక సంబంధాలను చాలా విలువైనవిగా భారత్ పరిగణిస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో ఇవి వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. రెండు దేశాల మధ్య రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, ప్రజల మధ్య సంబంధాలతో పాటు ఇతర అంశాల్లో పరస్పరం ప్రయోజనం కలిగించే కీలకమైన భాగస్వామ్యాన్ని కలసి అభివృద్ధి చేశాం. ఉమ్మడి సహకారంతో ప్రాంతీయంగా శాంతి, సంక్షేమం, భద్రత, స్థిరత్వం సాధించేందుకు ఆసక్తితో, అంకితభావంతో ఉన్నాం.
దశాబ్ద కాలంలో సౌదీ అరేబియాకు ఇది నా మూడో పర్యటన. చారిత్రక నగరమైన జెడ్డాను మొదటిసారి సందర్శిస్తున్నాను. నా సోదరుడు, యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ 2023లో విజయవంతంగా చేపట్టిన భారత్ పర్యటన అనంతరం నిర్వహిస్తున్న వ్యూహాత్మక భాగస్వామ్య మండలి రెండో సమావేశంలో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నాను.
అదేవిధంగా సౌదీ అరేబియాలో నివసిస్తూ.. రెండు దేశాల మధ్య వారధిలా పనిచేస్తూ, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న భారతీయులతో ముచ్చటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
(Release ID: 2123390)
Visitor Counter : 64
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam