ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎలాన్ మస్క్‌తో చర్చల సందర్భంగా ద్వైపాక్షిక సాంకేతిక సహకారంలో అవకాశాలను పేర్కొన్న ప్రధాని

Posted On: 18 APR 2025 1:07PM by PIB Hyderabad

ఉమ్మడి ప్రయోజనాలున్న అనేక అంశాలపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు శ్రీ ఎలాన్ మస్క్‌తో నిర్మాణాత్మకంగా చర్చించారు. ఈ ఏడాది మొదట్లో వాషింగ్టన్ డీసీలో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను ఈ సందర్భంగా మళ్లీ పరిశీలించారు. సాంకేతిక పురోగతి దిశగా ఉమ్మడి లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి సారించారు.

సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో భారత్, అమెరికా మధ్య సహకారానికి అపారమైన అవకాశాలున్నాయని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ రంగాలలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడనికి భారత్ కట్టుబడి ఉందని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:

 

“@elonmusk తో మాట్లాడాను. ఈ ఏడాది ప్రారంభంలో వాషింగ్టన్ డీసీలో జరిగిన మా సమావేశంలో చర్చించిన అంశాలు సహా వివిధ అంశాలు మా మధ్య చర్చకు వచ్చాయి. సాంకేతికత, ఆవిష్కరణల రంగాలలో సహకారం కోసం ఉన్న అపారమైన అవకాశాలపై మేం చర్చించాం. ఈ రంగాలలో అమెరికాతో భాగస్వామ్యాలను బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉంది.”  


(Release ID: 2122812) Visitor Counter : 40