సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
సృజన, ఫ్యాన్ డం సంస్కృతికి అద్దం పట్టే వేవ్స్ కాస్ప్లే ఛాంపియన్షిప్ పోటీ ఫైనలిస్టుల ప్రకటన
Posted On:
16 APR 2025 2:01PM
|
Location:
PIB Hyderabad
గత శనివారం మైండ్ స్పేస్ లో ఏర్పాటైన వేవ్స్ (ప్రపంచ దృశ్య-శ్రవణ, వినోదరంగ సదస్సు) కాస్ప్లే ఛాంపియన్షిప్ కార్యక్రమంలో సృజనాత్మకత, ఫ్యాన్ డం ల విస్ఫోటనానికి హైదరాబాద్ నగరం సాక్షిగా నిలిచింది. ఎంఈఏఐ, ఇండియన్ కామిక్స్ అసోసియేషన్, క్రియేటర్స్ స్ట్రీట్ సంస్థల సంయుక్త ఆధ్వర్యం, ఎపికో-కాన్, కేంద్ర సమాచార, ప్రసార శాఖ, టీవీఏజీఏ, ఫర్బిడెన్ వర్స్ ల సంయుక్త సహకారంతో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి విశేషమైన స్పందన లభించింది. వారాంతంలో కాస్ప్లే, యానిమే సమూహాల్లో ఈ పోటీ ట్రెండింగ్ టాపిక్ గా మారింది.
దేశవ్యాప్తంగా విస్తృతంగా చేపట్టిన టాలెంట్ హంట్, హైదరాబాద్, ముంబయి నగరాల్లో వివిధ దఫాల్లో జరిగిన కార్యక్రమాలు ముగిశాక వేవ్స్ కాస్ప్లే తుది పోటీల్లో పాల్గొనే అర్హత గల 29 ప్రతిభావంతులను నిర్వాహకులు ఎన్నుకున్నారు. వేవ్స్-2025 క్రియేటోస్పియర్ వేదికపై వీరు తమ టాలెంట్ ను ప్రదర్శిస్తారు.
కాస్ప్లే ఈవెంట్ సహ నిర్వాహకుడు, ఫర్బిడెన్ వర్స్ వ్యవస్థాపకుడు అజయ్ కృష్ణ మాట్లాడుతూ, సాధారణంగా ఇటువంటి ఈవెంట్లలో కనిపించే ప్రసిద్ధ పాత్రల నుంచి భారతీయ పౌరాణిక పాత్రలు, పాప్ రంగం వైపు దృష్టి మళ్ళేలా పోటీలను తీర్చిదిద్దారని, అదే ఈ పోటీల ప్రత్యేకత అని అభిప్రాయపడ్డారు.
ముంబయి వేదికగా జరిగే తుది వేవ్స్ పోటీలకు ముందస్తు జరిగే ఆఖరి పోటీలు ఏప్రిల్ 19న ముంబయి వైల్డ్ కార్డ్ మీటప్ పేరిట జరుగుతాయి. ఈ కార్యక్రమంలో వైల్డ్ కార్డ్ ద్వారా పోటీల్లో ఇంతవరకూ వెలికిరాని ప్రతిభావంతులకు అవకాశం కల్పించి ఫైనలిస్టుల జాబితాలో చోటు కల్పిస్తారు. ఈ ప్రయత్నం కార్యక్రమ స్థాయిని మరింతగా పెంచగలదని భావిస్తున్నారు. ఇక ప్రపంచ స్థాయి కాస్ప్లే ప్రదర్శనలను చూసేందుకు, సంభ్రమాశ్చర్యాలు గొలిపి ఉక్కిరిబిక్కిరి చేసే అనుభూతి పొందేందుకు సిద్ధమవండి!
అధికారిక ఫైనలిస్టుల జాబితా:
1. కైజాద్ శేషబరదరన్ – ముంబయి
2. పునీత్ వీ – బెంగళూరు
3. షేక్ సమీర్ కలీమ్ – లాతూర్
4. తేజల్ సంజయ్ మలిక్ – ముంబయి
5. అనూప్ భాటియా – పూణే
6. నవదీప్ సింగ్ పన్ను – ముంబయి
7. ఆకాశీ గౌతం – లక్నో
8. ఆదిత్య కాలెబెరె – పూణే
9. స్వరాజ్ కాలెబెరె – పూణే
10. శ్రీ హర్ష్ నరవడే – పూణే
11. వివేక్ దిలీప్ మానే – పూణే
12. ఈషా జోషి – ముంబయి
13. కేదార్ పండిట్ – ముంబయి
14. ఆర్శీ దేవరి – గౌహతి
15. మార్శీ దేవరి – గౌహతి
16. మహమ్మద్ పియాల్ షేక్ – ముంబయి
17. ప్రణయ్ పన్పాటిల్ – ముంబయి
18. గౌరవ్ విశ్వకర్మ – పూణే
19. అఖిల్ – హైదరాబాద్
20. స్తాయా – హైదరాబాద్
21. నూపుర్ ముండా – హైదరాబాద్
22. నక్షత్ర – హైదరాబాద్
23. రుచిర కరోలిన్ – హైదరాబాద్
24. సొనాలి – హైదరాబాద్
25. నీరజ్ కుమార్ –హైదరాబాద్
26. శ్రావణి –హైదరాబాద్
27. అఖిల్ సీ హెచ్ – హైదరాబాద్
28. నయన సాయిశ్రీ –హైదరాబాద్
29. లీలాధర్ – హైదరాబాద్
ఎన్నుకున్న పాత్రకు సంపూర్ణ న్యాయం చేసే అంకితభావం, సృజనాత్మకత, నటనల పరంగా చూపిన అద్వితీయ ప్రతిభ ఆధారంగా ఫైనలిస్టులను ఎంపిక చేశారు.
మీడియా, వినోద రంగాల్లో మైలురాయి వంటి తొలి వేవ్స్ సదస్సు (ప్రపంచ ఆడియో విజువల్, ఎంటర్టైన్మెంట్ సమిట్) ను భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ఏడాది మే 1 నుంచి 4వ తేదీ వరకూ ముంబయిలో నిర్వహిస్తారు. మీరు పరిశ్రమలో సేవలందిస్తున్న నిపుణులైనా, సృజనకారులైనా, ఆవిష్కర్తలయినా, ప్రపంచ స్థాయి మీడియా, వినోద రంగాల్లో పని చేస్తున్న ఇతరులతో కలిసి పని చేసేందుకు, నిపుణులతో అనుసంధానమై మరింత తోడ్పాటును అందించే అవకాశాలని ఈ సదస్సు కల్పిస్తుంది. కంటెంట్ సృష్టి, మేధోపరమైన హక్కులు, సాంకేతిక సృజనలో అగ్రగామి దేశంగా భారత్ స్థానాన్ని సుస్థిరం చేసేందుకు వేవ్స్ సదస్సు దోహదపడుతుంది. ప్రసార విభాగాలు, ప్రింట్ మీడియా, టెలివిజన్, రేడియో, సినిమాలు, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, శబ్ద గ్రహణ, సంగీత రంగాలు, అడ్వర్టైజింగ్, డిజిటల్ మీడియా, సామాజిక మాధ్యమాలు, జెనరేటివ్ ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఎక్స్టెండెడ్ రియాలిటీ తదితర రంగాల్లోని పరిశ్రమలపై సదస్సు దృష్టి కేంద్రీకరిస్తుంది.
మీ సందేహాలు, ప్రశ్నలకు జవాబులు ఇక్కడ
పీఐబీ టీమ్ వేవ్స్ అందించే తాజా సమాచారంతో అప్డేట్ అవ్వండి.
మాతో ప్రయాణించేందుకు సన్నద్ధమవండి
ఇప్పుడే మీ పేర్లను నమోదు చేసుకోండి.
***
Release ID:
(Release ID: 2122151)
| Visitor Counter:
19
Read this release in:
Khasi
,
English
,
Gujarati
,
Urdu
,
Nepali
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam