సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్ ‘క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్’ కింద ‘రెసొనేట్: ది ‘ఈడీఎం’ ఛాలెంజ్’కి 10 మంది కళాకారుల తుది ఎంపిక
‘వేవ్స్ సమ్మిట్’ వేదికపై ఈ ఎలక్ట్రానిక్ సంగీత-నృత్య ఔత్సాహికుల ప్రత్యక్ష ప్రదర్శనకు అవకాశం
Posted On:
12 APR 2025 4:07PM
|
Location:
PIB Hyderabad
వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్-2025 (వేవ్స్)లో భాగంగా ‘క్రియేట్ ఇన్ ఇండియా’ ఛాలెంజ్ కింద ఎలక్ట్రానిక్ సంగీత-నృత్య రంగంలో ప్రపంచవ్యాప్త ప్రతిభను వెలికి తీసేందుకు ‘రెసొనేట్: ది ‘ఈడీఎం’ ఛాలెంజ్” పేరిట పోటీ నిర్వహించారు. కళాకారుల ప్రత్యక్ష ప్రదర్శన నైపుణ్యం, సంగీతం కూర్పులో ఆవిష్కరణ, సృజనాత్మకత, సంయుక్త కృషిని ఒకే వేదికపైకి తెచ్చి తగిన గుర్తింపునివ్వడం ఈ పోటీ లక్ష్యం.
ఇందులో పాల్గొన్న పోటీదారుల నుంచి అగ్రస్థానంలో నిలిచిన 10 మంది కళాకారులను తుది దశకు ఎంపిక చేయగా, సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ (ఐ అండ్ బి) భారత సంగీత పరిశ్రమ (ఐఎంఐ) సంయుక్తంగా వారి పేర్లను ఇవాళ ప్రకటించాయి.
ఈ పోటీకి వందలాది ఆకర్షణీయ నమూనాలతో అభ్యర్థనలు రాగా, కఠిన ఎంపిక ప్రక్రియ ద్వారా తుది దశకు పదిమంది కళాకారులు ఎంపికయ్యారు. ముంబయి నగరంలో మే 1 నుంచి 4 వరకూ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ‘వేవ్స్ సమ్మిట్-2025’ వేదికపై తుది పోటీలో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చే వీరి వివరాలు ఇలా ఉన్నాయి:
· శ్రీకాంత్ వేముల, ముంబయి, మహారాష్ట్ర
· మాయాంక్ హరీష్ విధాని, ముంబయి, మహారాష్ట్ర
· క్షితిజ్ నాగేష్ ఖోడ్వే, పుణె, మహారాష్ట్ర
· ఆదిత్య దిల్‌బాఘి, ముంబయి, మహారాష్ట్ర
· ఆదిత్య ఉపాధ్యాయ, కుమారికత, అస్సాం.
· దేవాన్ష్ రస్తోగి, న్యూఢిల్లీ
· సుమిత్ బిల్తు చక్రవర్తి, ముంబయి, మహారాష్ట్ర
· మార్క్ ర్యాన్ సియెమ్లిహ్, ముంబయి, మహారాష్ట్ర
· దివ్యజిత్ రే, బొంగైగావ్, అస్సాం.
· నవజ్యోతి బారువా, ముంబయి, మహారాష్ట్ర
భారత ఎలక్ట్రానిక్ సంగీత సమాజంలో శక్తిమంతమైన సమూహానికి ఈ 10 మంది అగ్రశ్రేణి కళాకారులు ప్రతీకగా నిలుస్తారు. ‘యాంబియంట్ నుంచి హై-ఎనర్జీ డ్యాన్స్ మ్యూజిక్’ వరకు ప్రత్యేక శబ్దసౌందర్యంతో ఎలక్ట్రానిక్ సంగీత కూర్పు, డీజేయింగ్‌లో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో వర్ధమాన ప్రతిభను అన్వేషించి మెరుగు దిద్దడం ఈ పోటీ ధ్యేయం. ఈ పోటీ విజయవంతమైన నేపథ్యంలో భారత సంగీత సమ్మేళనం, ఎలక్ట్రానిక్ సంగీతం, డీజేయింగ్ విభాగాల్లో కళాత్మకతకు ప్రపంచ కూడలిగా భారత్ స్థానం మరింత బలోపేతమైంది. ఈ పోటీల ద్వారా తుది దశకు ఎంపికైన కళాకారులు వేవ్స్ అంతర్జాతీయ వేదికపై తమ ప్రతిభాపాటవాలను ప్రత్యక్షంగా ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రాథమిక దశకు న్యాయనిర్ణేతల బృందం
పోటీ ప్రాథమిక దశలో దేశంలోని ప్రముఖ సంగీత-డీజే శిక్షణ సంస్థ, నాలెడ్జ్ భాగస్వామిగా వ్యవహరిస్తున్న “లాస్ట్ స్టోరీస్ అకాడమీ” సంగీత నిపుణులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ బృందంలో అమేయ్ జిచ్కర్, అన్షుమన్ ప్రజాపతి సభ్యులు కాగా, అమీ రికార్డింగ్-మిక్సింగ్‌లో దశాబ్దానికిపైగా అనుభవంతోపాటు ఆడియో ఇంజినీర్-సంగీత నిర్మాతగానూ అనుభవం ఉంది. బాలీవుడ్, అడ్వర్టైజింగ్ జింగిల్స్, ప్రధాన బ్రాండ్ల ప్రచార సారాంశ రూపకల్పనలో అమేయ్ విస్తృతంగా పనిచేశారు. ఆయన రూపొందించిన కీలక ప్రాజెక్టులలో “వీరే డి వెడ్డింగ్, లైలా మజ్ను, అక్టోబర్ వంటివి సహా ‘క్రెడ్, ఫ్లిప్‌కార్ట్, అప్‌స్టాక్స్’ వంటి సంస్థలకు వాణిజ్య ప్రకటనల రూపకల్పన కూడా ఉన్నాయి. ఇక అన్షుమన్ బీట్‌బాక్సింగ్‌లో 10 సంవత్సరాలకుపైగా అనుభవంతోపాటు మూడేళ్ల నుంచీ సంగీత నిర్మాతగా ఉన్నారు. “లోఫీ, హిప్-హాప్” సంగీతంలో ప్రత్యేక ప్రతిభావంతులు మాత్రమేగాక ఆయన ప్రయోగాత్మక ధ్వనిముద్రణ, ‘ఎ అండ్ ఆర్’ ప్రవృత్తిపరంగా లోతైన ప్రతిభగలవారుగా ప్రసిద్ధులు.

మీడియా-వినోద (ఎం అండ్ ఈ) రంగంలో కీలక ఘట్టంగా తొలి వరల్డ్ ఆడియో విజువల్-ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్)ను కేంద్ర ప్రభుత్వం మే 1 నుంచి 4 వరకూ మహారాష్ట్రలోని ముంబయి నగరంలో నిర్వహించనుంది. మీరు పరిశ్రమ నిపుణుడు, పెట్టుబడిదారు, సృష్టికర్త లేదా ఆవిష్కర్త అయితే ‘ఎం అండ్ ఈ’ రంగంతో అనుసంధానానికి, సంయుక్త కృషికి, ఆవిష్కరణలకు, సహకారానికి ఈ సమ్మిట్ అద్వితీయ అంతర్జాతీయ వేదికగా ఉపయోగపడుతుంది.
భారత సృజనాత్మక శక్తిని ఇనుమడింపజేయడానికి, సారాంశ సృష్టితోపాటు మేధా సంపత్తి, సాంకేతిక ఆవిష్కరణలకు కూడలిగా దేశం తన స్థానాన్ని విస్తృతం చేసుకోవడంలో తనవంతు పాత్ర పోషించడానికి ‘వేవ్స్’ సిద్ధమైంది. బ్రాడ్‌కాస్టింగ్, ప్రింట్ మీడియా, టెలివిజన్, రేడియో, ఫిల్మ్స్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, సౌండ్ అండ్ మ్యూజిక్, అడ్వర్టైజింగ్, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వేదికలు, జనరేటివ్ ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఎఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఎక్స్ ఆర్) వంటి పరిశ్రమలు, రంగాలపైనా ఇది దృష్టి సారించింది.
ఇంకా ఏవైనా సందేహాలున్నాయా? సమాధానాలు ఇక్కడ లభిస్తాయి.
పీఐబీ టీం వేవ్స్ నుంచి తాజా ప్రకటనలతో ఎప్పటికప్పుడు సమాచారం పొందండి.
రండి... ‘వేవ్స్’ కోసం ఇప్పుడే నమోదు చేసుకుని మాతో కలిసి సాగండి.
****
Release ID:
(Release ID: 2121703)
| Visitor Counter:
22
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam