సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వెలుగు జిలుగుల హారం... కాశీ నగరం

Posted On: 13 APR 2025 6:58PM by PIB Hyderabad

‘‘భారత్ ఇవాళ అభివృద్ధినివారసత్వాన్ని.. ఈ రెండింటినీ ముందుకు తీసుకుపోతోంది... ఈ విషయంలో మన కాశీయే అత్యుత్తమ నమూనాగా నిలుస్తోంది.’’

~ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

కాశీ ఒక్క నగరం మాత్రమే కాదు... ఇది ఒక నిత్య చైతన్య భరిత ఆత్మఇది గంగానది అలలను ఉఛ్చ్వాసగానూనగర ప్రజల శాంత శక్తిని నిశ్వాసగానూ తీసుకు జీవిస్తోందిఇక్కడి ప్రాచీన శిలలు గత కాలపు కథలను వినిపిస్తాయి... ఇక ముందుభాగంలో అద్దాలతో నిర్మించిన భవనాలు రేపటి వాగ్దానాల్ని ప్రతిబింబిస్తుంటాయిఈ నగరంలో మణికర్ణిక ఘాట్‌ జీవన్మరణాల సంగమ స్థలంగా భాసిస్తూ ఉంటేప్రస్తుతం విశాలమైన రహదారులకుస్మార్ట్ లైటింగుకుఆధునిక నడవాల (కారిడార్లుకు ఈ నగరం స్వాగతం పలుకుతోందిఇదే కాశీ యాత్ర... ఇక్కడ పవిత్రతస్మార్ట్ విధానాలు చెట్టపట్టాల్ వేసుకుని నడుస్తున్నాయిఅవి ఒకదానితో మరొకటి పోట్లాడుకోవడం లేదుచక్కని సామరస్యంతో యథేచ్ఛగా విహరిస్తున్నాయిఇక్కడి ప్రతి వీధీ మీకొక కథని చెబుతుందిఇక్కడ మీరు వేసే ప్రతి ఒక్క అడుగులో ఆత్మనిర్మాణక్రమం.. వీటి కలయిక వైపునకు మీ దృష్టి మళ్లి తీరాల్సిందే.  

ప్రాచీన కాశీ నగరం ఈ నెల 11న ఒక ప్రగతిశీల ఘట్టానికి సాక్షిగా నిలిచిందిప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారణాసిలో రూ.3,880 కోట్లకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితమివ్వడమే కాక శంకుస్థాపనలు కూడా చేశారువృద్ధి తాలూకు ఈ పండుగను ప్రధాని శ్రీ మోదీ ‘‘వికాస్ కా ఉత్సవ్’’ (అభివృద్ధి ఉత్సవంగా అభివర్ణించారు.

పదేళ్ల కిందటవారణాసిని చూద్దామంటే వాహనాల రాక-పోకలతో ఇబ్బందులు పడుతూ ఉండడందుమ్ము రేగే చుట్టు తిరుగుళ్లతో సర్దుకుపోవాల్సివచ్చేదిఇవాళఈ నగరం ఆ కథను తిరగరాస్తోందిఫుల్‌వరియా ఫ్లయ్ఓవర్రింగ్ రోడ్డు వంటి ప్రాజెక్టులు ట్రాఫిక్ సమస్యలను తగ్గించేస్తున్నాయిదీంతో రోజూ ఇంటి నుంచి ఆఫీసులకు వెళ్లిరావాల్సిన వారితోపాటు లక్షలాది తీర్థయాత్రికులకు అమూల్యమైన సమయం ఆదా అవుతోందిజౌన్‌పూర్గాజీపూర్బలియాలతోపాటు మవూ వంటి జిల్లాల మధ్య ప్రయాణం ఇదివరకటితో పోలిస్తే చాలా వేగంగాచక్కని అనుసంధానం కలిగినదిగా మారిమెరుగుపడింది.
వారణాసి రింగ్ రోడ్డుసార‌నాథ్‌లను కలిపే ఒక రోడ్డు బ్రిడ్జిచాలా కాలంగా కాగితాల మీదే ఉన్న భిఖారీపూర్మండువాడీహ్ ఫ్లయ్ఓవర్లతోపాటు వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద 31వ జాతీయ రహదారిలో రూ.980 కోట్లకు పైగా ఖర్చుతో ఒక హైవే అండర్‌పాస్ రోడ్డు టన్నెల్ (రహదారి సొరంగంనిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారుఈ ప్రాజెక్టులు కేవలం కాంక్రీటుతోఉక్కుతో రూపుదాల్చే ప్రాజెక్టులు కావు... ఇవి శరవేగంగా విస్తరిస్తూ ప్రపంచానికి తలుపులను తెరుస్తున్న ఓ నగరానికి వెన్నెముక లాంటివి.

ప్రజాజీవనాన్ని ప్రకాశవంతం చేయడంతోపాటు నగరం తళుకులీనేటట్లు చూడాలనే ఉద్దేశంతో ప్రధాని శ్రీ మోదీ కాశీలో విద్యుత్తు నెట్‌వర్కుకు అండదండలను అందించారు. 400 కేవీ సామర్థ్యం గల రెండు సబ్‌స్టేషన్లతోపాటు 220 కేవీ సామర్థ్యం గల ఒక సబ్‌స్టేషనును ఆయన ప్రారంభించారువీటిని నిర్మించడానికి రూ.1,045 కోట్లకు పైనే ఖర్చు చేశారుదీనికి అదనంగా రూ.775 కోట్ల వ్యయంతో చౌకాఘాట్‌లోగాజీపూర్‌లో కొత్త సబ్‌స్టేషన్లను నిర్మించారు.
 
 
అయితే సిసలైన శక్తి... తీగల్లో (వైర్లలోలేదు.. జ్ఞ‌ానంలో ఉంది. ‘‘విద్యను అందరికీ అందుబాటులో ఉంచాల’’న్న తన దృష్టికోణాన్ని ప్రధాని పక్కాగా అమలుచేస్తూనేర్చుకోవడానికి కొత్త అవకాశాలను అందించారు. 356 గ్రంథాలయాలు, 100 ఆంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు కావడంతోగ్రామీణ ప్రాంతాల్ల విద్యాభ్యాసానికి దన్ను లభించిందిస్మార్ట్ సిటీ మిషన్‌లో భాగంగా 77 ప్రాథమిక పాఠశాలల పునరుద్ధరణ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు.

 

పూర్వాంచల్‌లో అన్నింటి కన్నా మిన్నగాహృదయానికి హత్తుకొనే మార్పుల్లో ఒక మార్పుగా బనాస్ డెయిరీ ఏర్పాటైందిఇది వేలాది చిన్న పాడి రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపివారిని ఔత్సాహిక వ్యాపార తత్వం కలవారిగా తీర్చిదిద్దిందిపశువులను పెంచి పోషించే కుటుంబాలకు బోనసుల రూపంలో రూ.105 కోట్లకు పైచిలుకు సొమ్మును పంపిణీ చేశారులబ్ధిదారుల్లో చాలా మంది మహిళలున్నారువారు ‘‘లఖ్‌పతి దీదీ’’ పేరుతో ప్రసిద్ధిగాంచిగర్వపడుతున్నారుఈ మహిళలు సిసలైన సాధికారతకు మారుపేరుగా నిలుస్తున్నారు.

కిసాన్ క్రెడిట్ కార్డుపశువులకు ఉచిత టీకాలురాష్ట్రీయ గోకుల్ మిషన్ వంటి పథకాలు రైతులకు ఎలా సాయపడుతున్నాయో ప్రధాని శ్రీ మోదీ ప్రస్తావించారురైతులు పశువులను పుష్టిగలవిగా పెంచి పోషించుకొంటూతాము పండించిన పంటలను మెరుగైన మార్కెట్లలో అమ్ముకోగలుగుతున్నారన్న సంగతిని ప్రధాని వివరించారు.
 

ఒకప్పుడుపూర్వాంచల్ ప్రాంత నివాసులు మంచి వైద్య చికిత్స సదుపాయం కోసందూరప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదిఆయుష్మాన్ భారత్ పథకంతో ఉత్తరప్రదేశ్‌లో లక్షలాది కుటుంబాలు ఉచిత చికిత్సను పొందుతూ ప్రాణాలను కాపాడుకుంటున్నారువయోవృద్ధులకు ‘ఆయుష్మాన్ వయ వందన’ కార్డులను ప్రధాని శ్రీ మోదీ స్వయంగా అందజేశారు. 70 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సున్న వారందరికీవారి ఆదాయం ఎంతన్నదానితో సంబంధం లేకుండాఉచిత చికిత్స సదుపాయాన్ని ఈ కార్డులు అందిస్తున్నాయి.
 

కాశీలో అభివృద్ధి జరిగిందంటేఅది ఒక్క రోడ్లకుఆసుపత్రులకే పరిమితం కాలేదు... కలల విషయంలో కూడా అది వర్తిస్తుందికొత్త కొత్త స్టేడియంలతోనూప్రపంచ స్థాయి స్పోర్ట్‌స్ కాంప్లెక్స్‌తోనూ వారణాసిలో యువ క్రీడాకారులు ఇక తాము రాణించడానికి అవసరమైన వేదికలను అందుకోబోతున్నారు. 2036 ఒలింపిక్స్‌ను నిర్వహించాలని భారత్ కోరుకుంటూ ఉంటే గనక అందుకు మన యువత వారి ప్రస్థానాన్ని ఇప్పుడే మొదలుపెట్టాలని ప్రధానమంత్రి గుర్తుచేశారు... మరి వారిని సర్వసన్నద్ధం చేసే బాధ్యతను కాశీ తాను తీసుకుంటోంది.

 
తబలా అందించే లయబద్ధ ధ్వనితరంగాల మొదలు జర్దోజీ సూక్ష్మ డిజైన్ల వరకు చూస్తే.. వారణాసిలో సుసంపన్న సంస్క‌ృతి అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతులు సంపాదిస్తోందివారణాసిదాని చుట్టుపక్కల జిల్లాలకు చెందిన 30కి పైగా స్థానిక ఉత్పత్తులు ప్రస్తుతం ప్రతిష్ఠాత్మక జీఐ (జియాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్..భౌగోళిక గుర్తింపుట్యాగులతో మెరిసిపోతున్నాయివీటిలో ప్రజల మనసులు గెలుచుకున్న ఠండాయీ (చల్లని పానీయాలు), భర్వాన్ లాల్ మిర్చ్ (లావు ఎర్ర మిరపకాయల్లో పూర్ణాన్ని పెట్టి వండే తినుబండారం), తిరంగా బర్ఫీలే కాకుండా జౌన్‌పుర్‌లో వండే ఇమార్‌తీ (జాంగ్రీని పోలిన తినుబండారం), పీలీభీత్‌లో తయారుచేసే వేణువు వంటివి కూడా ఉన్నాయి.

ఏక్తా మాల్‌ను ఏర్పాటు చేస్తామని కూడా ప్రధాని శ్రీ మోదీ ప్రకటించారుదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విభిన్న చేతివ‌ృత్తి కళాకారులు తయారు చేసిన వస్తువులుఉత్పత్తులను ఈ మాల్‌లో ఒకే చోటఇక్కడే కాశీలోకొలువుదీర్చనున్నారు.
సంప్రదాయంమార్పుల చౌరస్తాలో వారణాసి నిలబడి ఉంది...ఈ నగరం
ఒక సీదాసాదా సత్యాన్ని చాటిచెబుతోంది... అది... అభివృద్ధి అనేది మానవ జీవనాన్ని మెరుగుపరిచినప్పుడుఅంతేకాక ఏదైనా ప్రాంతానికి ఉన్న ఆత్మను పదిలపరిచినప్పుపడు.. ఈ రెండూ జరిగినప్పుడే ప్రగతి సార్థకం అవుతుందనేదే ఈ వాస్తవం.  నమస్కారాన్ని సూచించే ముకుళిత హస్తాలతోదృఢ సంకల్పం చెప్పుకొంటూ కాశీ ముందంజ వేస్తోంది.. తన గతాన్ని తలచుకొని గర్విస్తూనూమరి అలాగే తన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికీనూ.
అదనపు సమాచారం కోసం...

•    https://x.com/narendramodi/status/1766504020967879025(Images) 

•     https://pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=2120875&reg=3&lang=1

Lighting Up Kashi

 

***


(Release ID: 2121690) Visitor Counter : 14