ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

14 ఏళ్ల కిందట ప్రతినబూనిన శ్రీ రాంపాల్ కశ్యప్‌తో ముచ్చటించిన ప్రధానమంత్రి

Posted On: 14 APR 2025 7:03PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హర్యానాలోని యమునా నగర్ పరిధిలోగల కైతాల్‌లో శ్రీ రాంపాల్‌ కశ్యప్‌ను కలుసుకున్నారుతాను ప్రధాని కావాలనిఆ తర్వాత తనను కలిసేదాకా పాదరక్షలు ధరించబోనని కశ్యప్‌ 14 ఏళ్ల కిందట ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలుసుకుని శ్రీ మోదీ గౌరవ పూర్వకంగా స్పందించారుసామాజిక సేవదేశ ప్రగతి సంబంధిత అర్థవంతమైన కార్యకలాపాలపై పౌరులు తమ శక్తిసామర్థ్యాలను కేంద్రీకరించాలని సూచించారు.

దీనిపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన మరో సందేశంలో:

యమునానగర్‌లో నేటి బహిరంగ సభ సందర్భంగా కైతాల్‌ వాస్తవ్యులు శ్రీ రాంపాల్ కశ్యప్ గారిని నేను కలిశానునేను ప్రధానమంత్రి కావాలనిఅటుపైన నన్ను కలిసేదాకా పాదరక్షలు ధరించబోనంటూ ఆయన 14 ఏళ్ల కిందట శపథం చేశారట!

రాంపాల్ జీ వంటివారికి నా సవినయ వందనాలునాపై వారి ఆప్యాయతానురాగాలను స్వాగతిస్తున్నానుఅయితేఇటువంటి ప్రతినలు చేసే ప్రతి ఒక్కరికీ ఇదే నా అభ్యర్థనమీ ప్రేమాభిమానాలకు హృదయపూర్వక కృతజ్ఞతలుదయచేసి సామాజిక సేవదేశ ప్రగతితో ముడిపడిన అర్థవంతమైన కార్యకలాపాల కోసం మీ శక్తిసామర్థ్యాలను కేంద్రీకరించండి!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(Release ID: 2121689) Visitor Counter : 18