ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వారణాసిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ సందర్భంగా ప్రధాని ప్రసంగం

Posted On: 11 APR 2025 1:29PM by PIB Hyderabad

నమ: పార్వతీపతయేహర హర మహాదేవ్!

ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాధ్ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్యబ్రజేష్ పాఠక్ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులుప్రజా ప్రతినిధులుబనాస్ డెయిరీ ఛైర్మన్ శంకర్‌భాయ్ చౌధురిఆశీస్సులు అందించడానికి ఇక్కడ పెద్ద సంఖ్యలో హాజరైన నా ప్రియ కుటుంబ సభ్యులందరికీ..

నా కాశీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంలో మీ అందరి ఆశీస్సులను సవినయంగా కోరుతున్నానుమీ అవ్యాజమైన ప్రేమకు నేను ఎంతో రుణపడి ఉన్నానుకాశీ నాదినేను కాశీకి చెందినవాడిని.

స్నేహితులారా,

రేపు పవిత్రమైన హనుమాన్ జన్మోత్సవం. సంకట మోచన మహారాజ్‌కు ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర కాశీ నగరంలో మీ అందరినీ ఈ రోజు ఇలా కలుసుకొనే అవకాశం లభించిందిహనుమాన్ జన్మోత్సవం సందర్భంగా అభివృద్ధి స్ఫూర్తిని చాటి చెప్పేందుకు కాశీ ప్రజలు ఇక్కడ హాజరయ్యారు.

స్నేహితులారా,

గత పదేళ్లలో, బెనారస్ గణనీయమైన వేగంతో అభివృద్ధి చెందిందిఘనమైన వారసత్వాన్ని సంరక్షిస్తూనే ఆధునికతను స్వీకరించిన కాశీ ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా అడుగులువేస్తోందిప్రాచీనతకు చిహ్నంగా నిలుస్తూనే పురోగతికి మార్గదర్శిగా మారుతోందిపూర్వాంచల్ ఆర్థిక చిత్రపటంలో ముఖ్యమైన స్థానానికి చేరుకుందిభగవాన్ మహాదేవుని నాయకత్వంలో నడిచిన ఇదే కాశీ ఇప్పుడు పూర్వాంచల్ ప్రాంత అభివృద్ధి రథాన్ని నడుపుతోంది.

స్నేహితులారా,

కొద్ది సేపటి క్రితమే, కాశీపూర్వాంచల్ ప్రాంతాలకు సంబంధించిన వివిధ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయిమరికొన్నింటికి శంకుస్థాపన చేశాంరవాణా సౌకర్యాలను మెరుగుపరచడంప్రతి గ్రామంలో ఇంటింటికీ నల్లా నీరు అందించడంవిద్యఆరోగ్యక్రీడా సౌకర్యాలను విస్తరించడంప్రతి ప్రాంతానికికుటుంబానికియువతకు అవసరమైన సౌకర్యాలు కల్పించడమే ఈ ప్రాజెక్టుల లక్ష్యంపూర్వాంచల్‌ను అభివృద్ధి చెందిన ప్రాంతంగా మార్చే క్రమంలో ప్రాజెక్టులు కీలకపాత్ర పోషిస్తాయికాశీలో ఉన్న ప్రతి వ్యక్తి వీటి వల్ల ప్రయోజనాన్నిపొందుతారుఈ అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభమైన నేపథ్యంలో బెనారస్పూర్వాంచల్ ప్రజలకు శుభాకాంక్షలు.

స్నేహితులారా,

ఈ రోజు ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతీబా ఫూలే జయంతి. మహాత్మా జ్యోతీబా ఫూలేసావిత్రీబాయి ఫూలే మహిళా సంక్షేమానికివారి సాధికారతకుసామాజిక అభ్యున్నతికి తమ జీవితాలను అంకితం చేశారుఇప్పుడు వారి వారసత్వాన్ని మనం కొనసాగిస్తున్నాంవారి లక్ష్యాన్నిఆదర్శాన్నిమహిళా సాధికారత కోసం చేపట్టిన ఉద్యమాన్ని నూతన ప్రయోజనాల కోసం సరికొత్త ఉత్తేజంతో కొనసాగిస్తున్నాం.

స్నేహితులారా,

ఈ రోజు మీకు నేను మరో విషయాన్ని చెప్పదలుచుకున్నాను. మహాత్మా ఫూలే లాంటి గొప్ప వ్యక్తుల నుంచి ప్రేరణ పొందిసబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే మార్గదర్శక సూత్రంతో దేశ సేవలో పాలుపంచుకుందాంఈ సమ్మిళిత స్ఫూర్తితో దేశం కోసం పనిచేద్దాందీనికి విరుద్ధంగా అధికారం కోసమే రాజకీయ క్రీడల్లో మునిగి తేలేవారు పరివార్‌ కా సాత్పరివార్‌ కా వికాస్ మంత్రాన్ని పాటిస్తారుఈ రోజుపూర్వాంచల్‌లో పశువులను పోషించే కుటుంబాలకుముఖ్యంగా సబ్‌కా సాత్సబ్ కా వికాస్ సారాంశాన్ని స్వీకరించి కష్టపడి పనిచేస్తున్న సోదరీమణులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానుఈ మహిళలు వారిపై నమ్మకాన్ని ఉంచితే ఏదైనా సాధించగలమని నిరూపించారుఈ నమ్మకమే చరిత్రను సృష్టిస్తుందిఇప్పుడు వారు మొత్తం పూర్వాంచల్‌కే ఆదర్శంగా నిలిచారుకొంతసేపటి క్రితమే ఉత్తరప్రదేశ్‌లోని బనాస్ డెయిరీకి అనుబంధంగా పనిచేస్తున్న పాడిరైతులకు బోనస్ అందించాంఇది కేవలం బహుమతి కాదుమీ అంకిత భావానికి దక్కిన ప్రతిఫలంరూ.100 కోట్ల విలువైన ఈ బోనస్ మీ కృషికినిబద్ధతకు లభించిన గుర్తింపు.

స్నేహితులారా,

బనాస్ డెయిరీ కాశీలోని వేల కుటుంబాల పరిస్థితులను, భవిష్యత్తును మార్చిందిఈ డెయిరీ మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్నిచ్చి మీ కలలకు రెక్కల్ని తొడిగిందిఇక్కడ మనం గర్వపడాల్సిన అంశం ఏమిటంటే ఈ ప్రయత్నాల ద్వారా పూర్వాంచల్‌లో ఎంతో మంది మహిళలు లక్పతి దీదీలుగా మారారుఒకప్పుడు మనుగడ గురించి ఆందోళన చెందే పరిస్థితుల నుంచి సంక్షేమం దిశగా స్థిరమైన ప్రయాణం కొనసాగుతోందిఈ ప్రగతి బెనారస్‌లోఉత్తరప్రదేశ్‌లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కనిపిస్తోందిప్రస్తుతం ప్రపంచలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా భారత్ నిలిచిందిగడచిన పదేళ్లలో దేశంలో పాల ఉత్పత్తి రెట్టింపు కంటే ఎక్కువగా 65 శాతం మేర పెరిగిందిఈ ఘనత పశు సంవర్థక రంగంలో నిమగ్నమై ఉన్న మీలాంటి కోట్లాది రైతులకే చెందుతుందిఇది ఒక్కరోజులో సాధించిన విజయం కాదుగత పదేళ్లుగా మన పాడి పరిశ్రమను ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళుతున్నాం.

పాడి రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డుల సౌకర్యాన్ని తీసుకొచ్చి, వారికిచ్చే రుణాల పరిమితిని పెంచిరాయితీలను అందిస్తున్నాంఅలాంటి ప్రధాన ప్రయత్నాల్లో భాగంగా జంతువుల పట్ల కరుణ చూపించి గాలికుంటు వ్యాధి సోకకుండా ఉచితంగా టీకాలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించాంకొవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా అందించిన విషయం అందరికీ గుర్తుండిపోయిందిఅదేవిధంగా సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఆశయంతో జంతువులకు కూడా ఉచితంగా టీకాలను అందించే ప్రభుత్వం ఇది.

దేశ వ్యాప్తంగా పాల సేకరణను వ్యవస్థీకృతం చేసే లక్ష్యంతో 20,000కు పైగా సహకార సంఘాలను పునరుద్ధరించాంఈ సంఘాల్లో లక్షల సంఖ్యలో కొత్త సభ్యులు చేరారుపాడి పరిశ్రమలో ఉన్నవారందరినీ  ఏకం చేసి అభివృద్ధి వైపు నడిపించడమే దీని లక్ష్యందేశీయ ఆవుజాతుల పెంపకాన్నిశాస్త్రీయమైన గర్భధారణ పద్ధతులను ప్రోత్సహిస్తున్నాంఈ ప్రయత్నాలను మద్ధతు అందించేలా రాష్ట్రీయ గోకుల్ మిషన్ కొనసాగుతోంది.

పశుపోషణలో నిమగ్నమైన మన సోదరసోదరీమణులను అభివృద్ధి దిశగా కొత్త మార్గంలో నడిపించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నాం. ఆశాజనకమైన మార్కెట్‌ఇతర అవకాశాలతో వారిని అనుసంధానిస్తున్నాంఈ లక్ష్యాన్ని బనాస్ డెయిరీకి చెందిన కాశీ కాంప్లెక్స్ పూర్వాంచల్ ప్రాంతంలో ముందుకు తీసుకెళుతోందిఈ ప్రాంతంలో గిర్ ఆవులను బనాస్ డెయిరీ పంపిణీ చేసిందివాటి సంఖ్య స్థిరంగా పెరుగుతోందని నాకు తెలిసిందిఅలాగేబెనారస్‌లో పశువులకు దాణా అందించే వ్యవస్థను ప్రారంభించిందిప్రస్తుతం ఈ  డెయిరీ పూర్వాంచల్ ప్రాంతంలో దాదాపుగా లక్ష మంది రైతుల నుంచి పాలను సేకరిస్తోంది. తద్వారా పాడి రైతుల సమాజానికి సాధికారత కల్పిస్తోంది

స్నేహితులారా,

కొంత సేపటి క్రితమే ఇక్కడ ఉన్న చాలామంది వృద్ధులైన స్నేహితులకు ఆయుష్మాన్ వయో వందన కార్డులను పంపిణీ చేసే అవకాశం నాకు దక్కింది. వారి ముఖాల్లో నాకు కనిపించిన సంతృప్తిఈ పథకం సాధించిన విజయాన్ని సూచిస్తోందివైద్య సేవల అంశంలో వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మనందరికీ తెలిసిందేఆరోగ్య సేవల్లో దశాబ్దం క్రితం వరకు పూర్వాంచల్ ఎన్నో సమస్యలు ఎదుర్కొందిఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయిందినా కాశీ ఇప్పుడు ఆరోగ్య రాజధానిగా మారిందిఒకప్పుడు ఢిల్లీముంబయికే పరిమితమైన ప్రధాన ఆసుపత్రులు ఇప్పుడు మీ ఇంటికి సమీపంలోనే ఉన్నాయిప్రజలకు అవసరమైన సేవలుసౌకర్యాలు వారికి చేరువలో ఉండటమే నిజమైన అభివృద్ధి.

స్నేహితులారా,

గడచిన పదేళ్లలో మేం ఆసుపత్రుల సంఖ్యను మాత్రమే కాకుండా.. రోగుల గౌరవాన్ని కూడా పెంచాంనా పేద సోదరసోదరీమణులకు ఆయుష్మాన్ భారత్ యోజన ఓ వరం లాంటిదిఈ పథకం ఆరోగ్యసేవలను అందించడంతో పాటు వారిలో స్థైర్యాన్ని నింపుతోందిఉత్తరప్రదేశ్‌లోని లక్షల మందివారణాసిలో వేల మంది ఈ పథకం నుంచి ప్రయోజనం పొందుతున్నారుదీని ద్వారా అందించే వైద్య సహాయంశస్త్రచికిత్సతక్షణం లభించే ఉపశమనం వ్యక్తి జీవితంలో నూతన ప్రారంభాన్ని సూచిస్తాయిఆయుష్మాన్ యోజన  ద్వారా ఉత్తరప్రదేశ్‌లోని లక్షలాది కుటుంబాలకు కోట్ల రూపాయలు ఆదా అయ్యాయిఎందుకంటే మీ ఆరోగ్యం ఇప్పుడు మా బాధ్యత అని ప్రభుత్వం ప్రకటించింది.

ఇంకా మిత్రులారా,
మీరు మూడోసారి మమ్మల్ని ఆశీర్వదించినప్పుడుమేము కూడా మీ అభిమానానికి వినయపూర్వక సేవకులుగా మా కర్తవ్యాన్ని గుర్తించాంమీకు ఏమన్నా తిరిగి ఇవ్వాలన్న మనసుతో మావంతుగా అన్ని ప్రయత్నాలు చేశాంసీనియర్ సిటిజన్లకు ఉచిత వైద్య సహాయం అందిస్తామని  హామీ ఇచ్చాంఆ నిబద్ధత ఫలితమే ఆయుష్మాన్ వయ వందన యోజనకేవలం వృద్ధులకు వైద్య చికిత్స మాత్రమే కాదు -  వారికి తగిన గౌరవం కల్పించడమే ఈ పథకం అసలు ఉద్దేశంఇప్పుడు ప్రతి ఇంట్లో 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆదాయంతో సంబంధం లేకుండా ఉచిత వైద్యం లభిస్తుందిఒక్క వారణాసిలోనే అత్యధికంగా 50 వేల వయ వందన కార్డులను వృద్ధులకు జారీ చేశారుఇవి కేవలం గణాంకాలు మాత్రమే కాదు -  ఇది ఒక ప్రజా సేవకుడు నిజాయితీగా చేసిన సేవకు ఫలితంఇప్పుడు వైద్యం కోసం భూమిని అమ్ముకోవాల్సిన అవసరం లేదుఇకపై వైద్యం కోసం అప్పులు చేయనవసరం కూడా లేదుచికిత్స కోసం నిస్సహాయతతో గడప గడపకూ తిరగాల్సిన పరిస్థితీ ఇక లేదువైద్య ఖర్చుల గురించి ఆందోళన చెందకండి-ఆయుష్మాన్ కార్డు ద్వారాఇప్పుడు మీ చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది!

మిత్రులారా,

ఈ రోజు కాశీ మీదుగా వెళ్ళే ప్రతి ఒక్కరూ అక్కడి మౌలిక సదుపాయాలు,  సౌకర్యాల గురించి గొప్పగా మాట్లాడతారుప్రతిరోజూ లక్షలాది మంది కాశీని సందర్శిస్తుంటారుబాబా విశ్వనాథుని ఆశీస్సులు పొందడానికిగంగా మాత పవిత్ర జలాల్లో స్నానం చేయడానికి వస్తారుప్రతి సందర్శకుడూ ఒకే మాట చెబుతున్నారు -  కాశీ ఎంతగా మారిపోయింది!

ఒక్కసారి ఊహించండికాశీలో రోడ్లురైల్వేవిమానాశ్రయాల పరిస్థితి పదేళ్ల క్రితం ఎలా ఉండేదో కానీ ఈ రోజు నగరం పరిస్థితి ఎలా ఉందిగతంలో చిన్న చిన్న పండుగల సమయంలో కూడా  ట్రాఫిక్ స్తంభించేదిఉదాహరణకు చునార్ నుంచి శివ్ పూర్ కు ప్రయాణిస్తున్న వారిని తీసుకోండి వారు కాశీ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది.  అంతులేని ట్రాఫిక్ జామ్ లలో చిక్కుకునిదుమ్మువేడిలో ఊపిరాడకుండా ఉండాల్సి వచ్చేదినేడు ఫుల్వారియా ఫ్లైఓవర్ నిర్మించారుదీంతో ఇప్పుడు దారి దగ్గరైపోయిందిసమయం ఆదా అవుతోందిజీవితం చాలా సౌకర్యవంతంగా మారిందిఅదేవిధంగాజౌన్పూర్,  ఘాజీపూర్ గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు ఒకప్పుడు వారణాసి మీదుగా ప్రయాణించాల్సి వచ్చేదిబలియామౌఘాజీపూర్ జిల్లాలకు చెందిన ప్రజలు విమానాశ్రయానికి చేరుకోవడానికి నగరం మధ్యలో గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకు పోయేవారుకానీఇప్పుడు రింగ్ రోడ్డు పుణ్యమా అని ప్రజలు కేవలం నిమిషాల్లోనే ఒక వైపు నుంచి మరో వైపునకు ప్రయాణించవచ్చు.

మిత్రులారా,

గతంలో ఘాజీపూర్ కు వెళ్లాలంటే కొన్ని గంటల సమయం పట్టేదిఇప్పుడు ఘాజీపూర్జౌన్పూర్మీర్జాపూర్అజంగఢ్ వంటి నగరాలను కలిపే రహదారులను గణనీయంగా విస్తరించారుఒకప్పుడు ట్రాఫిక్ జామ్ లు ఉన్న చోట నేడు అభివృద్ధి వేగాన్ని చూస్తున్నాంగత దశాబ్దకాలంలో వారణాసిపరిసర ప్రాంతాల అనుసంధానానికి సుమారు రూ.45,000 కోట్లు వెచ్చించారుఈ డబ్బు  కేవలం కాంక్రీట్ పై పెట్టిన ఖర్చు కాదు అది నమ్మకంపై చేసిన వ్యయంనేడు కాశీదాని చుట్టుపక్కల జిల్లాలన్నీ ఈ ఖర్చు తాలూకు ప్రయోజనాలను పొందుతున్నాయి.

మిత్రులారా,

కాశీలో మౌలిక సదుపాయాలపై ఈ ఖర్చు నేటికీ కొనసాగుతోందివేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరిగాయిమన లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయ విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయివిమానాశ్రయం విస్తరించేకొద్దీ,  దానిని అనుసంధానించే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం కూడా అంతే ముఖ్యంఅందుకే ఇప్పుడు విమానాశ్రయానికి సమీపంలో ఆరు వరుసల భూగర్భ సొరంగం నిర్మించబోతున్నారునేడు భదోహిఘాజీపూర్జౌన్పూర్లకు సంబంధించిన రోడ్డు ప్రాజెక్టుల పనులు కూడా ప్రారంభమయ్యాయిభిఖారీపూర్మండువాదిహ్ వద్ద ఫ్లైఓవర్లు నిర్మించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉందిఈ డిమాండ్ ఇప్పుడు నెరవేరుతున్నట్లు ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాకాశీ నగరాన్ని సారనాథ్ తో కలిపేందుకు కొత్త వంతెనను నిర్మించనున్నారుఇది విమానాశ్రయం లేదా ఇతర జిల్లాల నుంచి సారనాథ్ చేరుకోవడానికి నగరం మీదుగా రద్దీలో వెళ్ళాల్సిన పరిస్థితిని తప్పిస్తుంది.

మిత్రులారా,

రాబోయే నెలల్లోఈ ప్రాజెక్టులు పూర్తయితేకాశీలో ప్రయాణం ఎంతో సులభం అవుతుందిప్రయాణ సమయాలు తగ్గుతాయివాణిజ్య కార్యకలాపాలు పెరుగుతాయిఅంతేకాకజీవనోపాధి లేదా వైద్య చికిత్స కోసం కాశీకి వచ్చేవారికి చాలా ఎక్కువ సౌలభ్యం ఉంటుందికాశీలో సిటీ రోప్ వే ట్రయల్ కూడా ప్రారంభమైందిఇలాంటి సదుపాయాన్ని అందించే ప్రపంచంలోని ఎంపిక చేసిన కొన్ని నగరాల సరసన ఇప్పుడు కాశీ కూడా చేరనుంది.

మిత్రులారా,

వారణాసిలో చేపట్టే ఏ అభివృద్ధి లేదా మౌలిక సదుపాయాల ప్రాజెక్టు అయినా పూర్వాంచల్ మొత్తం యువతకు ప్రయోజనం చేకూరుస్తుందికాశీలోని యువతకు క్రీడల్లో రాణించడానికి స్థిరమైన అవకాశాలు కల్పించడానికి మా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. 2036లో భారత్ లో ఒలింపిక్స్ ను నిర్వహించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.  ఒలింపిక్స్ పతకాలు ఇంటికి తీసుకురావాలంటే కాశీ యువత ఇప్పటి నుంచే ఆ దిశగా సన్నాహాలు మొదలుపెట్టాలిఅందుకే నేడు కాశీలో కొత్త స్టేడియాలు నిర్మించిమన యువ ప్రతిభావంతుల కోసం ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారుకొత్తగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించారుఅందులో ప్రస్తుతం వారణాసికి చెందిన వందలాదిమంది అథ్లెట్లు శిక్షణ పొందుతున్నారుసంసద్ క్రీడా పోటీల్లో పాల్గొన్న వారు కూడా ఇదే మైదానంలో తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం పొందారు.

మిత్రులారా,

ఈరోజు భారత్ అభివృద్ధివారసత్వం ఈ రెండింటినీ సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోందిఈ సమతుల్యానికి కాశీ అత్యుత్తమ ఉదాహరణగా  నిలుస్తోందిఇక్కడ పవిత్ర గంగా నది ప్రవహిస్తోందిఆ గంగానదితో పాటు భారతీయ చైతన్యం కూడా ప్రవహిస్తోందిభారత్ ఆత్మ దాని వైవిధ్యంలోఉందికాశీ ఆ ఆత్మను అత్యంత స్పష్టంగా ప్రతిబింబిస్తుందికాశీలోని ప్రతి ప్రాంతం ఒక ప్రత్యేకమైన సంస్కృతికి ప్రాతినిధ్యం వహిస్తుందిప్రతి వీధి భారత దేశ వైవిధ్య వర్ణాన్ని ఆవిష్కరిస్తుందికాశీ-తమిళ సంగమం వంటి కార్యక్రమాలు ఈ ఐక్యతా బంధాలను మరింత బలోపేతం చేస్తున్నందుకు నాకు సంతోషంగా ఉందిఇప్పుడు ఇక్కడ ఒక  ఐక్యతా మాల్ కూడా ఏర్పాటు చేయబోతున్నారుఈ ఐక్యతా మాల్ భారత వైవిధ్యాన్ని ప్రతిఫలింపజేస్తుంది.  దేశవ్యాప్తంగా వివిధ జిల్లాల ఉత్పత్తులు ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండబోతున్నాయి.

మిత్రులారా,

ఇటీవలి సంవత్సరాలలోఉత్తర ప్రదేశ్ తన ఆర్థిక ముఖచిత్రాన్నిదృక్పథాన్ని పూర్తిగా మార్చుకుందియూపీ ఇప్పుడు కేవలం సామర్ధ్యం ఉన్న భూమి మాత్రమే కాదు.  ఇది ఇప్పుడు సంకల్పానికిశక్తికిసాధనకు నిలయంగా మారుతోందిఈరోజు మేడ్ ఇన్ ఇండియా అనే పదం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోందిభారతదేశంలో తయారైన వస్తువులు ఇప్పుడు అంతర్జాతీయ బ్రాండ్‌లుగా గుర్తింపు పొందుతున్నాయిఅనేక స్థానిక ఉత్పత్తులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐట్యాగ్ కూడా లభించిందిజీఐ ట్యాగ్ అనేది కేవలం లేబుల్ మాత్రమే కాదుఇది ఒక ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపుధ్రువీకరణ   పత్రంఏదైనా ఉత్పత్తి ఒక నిర్దిష్ట ప్రదేశంతో ఏకీకృతమై ఉందని ఇది సూచిస్తుంది.  జీఐ ట్యాగ్ తో ఎక్కడికి వెళ్లినా ప్రపంచ మార్కెట్లకు ద్వారాలు తెరుచుకుంటాయి.

మిత్రులారా,

నేడు జీఐ ట్యాగింగ్ లో ఉత్తరప్రదేశ్ దేశంలోనే ముందంజలో ఉంది.  ఇది మన కళకుమన ఉత్పత్తులకుమన కళానైపుణ్యానికి పెరుగుతున్న అంతర్జాతీయ గుర్తింపును ప్రతిబింబిస్తుందివారణాసిదాని చుట్టుపక్కల జిల్లాలకు చెందిన 30కి పైగా ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ లభించిందివారణాసిలోని తబలాషెహనాయ్ నుంచి వాల్ పెయింటింగ్స్తండాయ్రెడ్ స్టఫ్డ్ మిరపకాయలు (లాల్ భార్వా మిర్చ్), రెడ్ పేడాత్రివర్ణ పతాకం బర్ఫీ వరకు ప్రతిదానికీ ఇప్పుడు జీఐ ట్యాగ్ ద్వారా కొత్త గుర్తింపు పత్రం లభించిందిఈరోజేరాష్ట్రం నలుమూలల నుంచి -  జౌన్పూర్ ఇమార్తిమథుర సంఝీ కళబుందేల్ ఖండ్ లోని కతియా గోధుమలుపిలిభిత్ వేణువులుప్రయాగ్ రాజ్ ముంజ్ క్రాఫ్ట్బరేలీలోని జర్దోజీచిత్రకూట్ వుడ్ క్రాఫ్ట్లఖింపూర్ ఖేరికి చెందిన తరు జర్దోజీ  వంటి అనేక ఉత్పత్తులకు జీఐ ట్యాగ్లు లభించాయియూపీ నేల పరిమళం ఇకపై గాలిలో మాత్రమే ఉండదని ఇది సూచిస్తుందిఅది ఇప్పుడు సరిహద్దులను దాటుతోంది.

మిత్రులారా,

కాశీని కాపాడేవాడు భారత్ ఆత్మనూ కాపాడతాడుకాశీకి సాధికారత కల్పిస్తూనే ఉండాలికాశీని అందంగాచైతన్యవంతంగాకలల మాదిరి ఉంచాలికాశీ పురాతన ప్రాభవాన్ని ఆధునిక రూపంతో కలిపే ప్రయత్నం నిరంతరం సాగాలిఈ సంకల్పంతో, మీరు చేతులెత్తి నాతో కలిసి మళ్లీ ఒక్కసారి చెప్పండి

నమః పార్వతీ పతయే, హర హర మహదేవ్.
మీ అందరికీ ధన్యవాదాలు.
గమనికఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి సుమారు తెలుగు అనువాదం.

 

***


(Release ID: 2121163) Visitor Counter : 16