మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నవకార్ మహామంత్ర దివస్ పేరిట మహావీర్ జయంతి వేడుకలు

Posted On: 10 APR 2025 10:09AM by PIB Hyderabad

“భారతదేశ మేధో వైభవానికి జైన సాహిత్యం వెన్నెముక వంటిది. ఈ సంపద పరిరక్షణ మా బాధ్యత” – ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ



ఆధ్యాత్మిక, శాంతి సామరస్య భావనలకు ప్రతీకగా   జైన మత 24వ తీర్థంకరుడు మహావీర జైనుడి  జయంతిని భారతదేశం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటోంది. ఈ సందర్భంగా కరుణ, సంయమనం, నిజాయితీలకు జీవితాన్ని అంకితం చేసిన ఆ పుణ్యమూర్తికి ప్రజలు హృదయపూర్వక నివాళులర్పిస్తున్నారు. యుద్ధాలు సంఘర్షణలతో సతమతమవుతున్న మానవాళికి, కాలానికి అతీతమైన మహావీరుని సత్యాహింసల, జాగురూకతల సందేశాలు ఊరటనిస్తూ సామరస్యం, ఎరుకతో కూడిన జీవితాన్ని అలవర్చుకోవలసిన ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి.  

ఏప్రిల్ 9న ప్రధానమంత్రి ప్రారంభించిన  నవకార్ మహామంత్ర దివస్    ద్వారా ఈ ఏటి మహావీర్ జయంతి పర్వదినానికి మరింత ఆధ్యాత్మిక పరిపూర్ణత చేకూరింది.

"నవకార్ మహామంత్రం కేవలం ఒక మంత్రం కాదుమన విశ్వాసాలకి కేంద్ర బిందువు, జీవన సారానికి ప్రతిబింబం: ప్రధానమంత్రి"

 

జైన ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన నవకార్ మంత్రం కేవలం పవిత్రమైన పంక్తుల అమరిక మాత్రమే కాదు... ఒక లయలో ఒదిగి దివ్యమైన శక్తిని, స్థిరచిత్తతను, వెలుగును ప్రసారం చేసే అద్భుత సాధనం.

గుజరాత్ లో జన్మించిన తనకు బాల్యంలోనే లభించిన జైన ఆచార్యుల సాంగత్యం,  ధర్మం పట్ల అవగాహన పెంపొందటంలో సాయపడిందని ప్రధానమంత్రి అన్నారు. జైన ధర్మం చరిత్రకు పరిమతమైన అంశం మాత్రమే కాదని, తన మూలాలను మరిచిపోకుండా వృద్ధి చెందాలని ఆశిస్తున్న నేటి భారతావనికి దారి దీపమని ప్రధాని స్వీయ అనుభవం తెలియజేసింది.  

 

***


(Release ID: 2120931) Visitor Counter : 11