హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2024-25 నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరం వరకు వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్-2 (వీవీపీ-2)కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

Posted On: 04 APR 2025 3:12PM by PIB Hyderabad

వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్-2 (వివిపి-2) ను కేంద్ర పథకంగా (100% కేంద్ర నిధులుప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందితద్వారా  వికసిత భారత్ - 2047 లక్ష్యానికి అనుగుణంగా సురక్షితమైనభద్రమైన, పటిష్ఠమైన సరిహద్దులను సాధించే దిశగా ప్రభుత్వం తన నిబద్ధతను మరింతగా చాటుకుందిఇప్పటికే వీవీపీ-1 పరిధిలోకి ఉన్న ఉత్తర సరిహద్దు కాకుండా అంతర్జాతీయ భూ సరిహద్దుల (ఐఎల్ బీ)కు ఆనుకుని ఉన్న బ్లాకుల్లో ఉన్న గ్రామాల సమగ్రాభివృద్ధికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది.

మొత్తం రూ.6,839 కోట్ల వ్యయంతో 2028-29 ఆర్థిక సంవత్సరం వరకు అరుణాచల్ ప్రదేశ్అసోంబీహార్గుజరాత్జమ్ముకశ్మీర్ (యూటీ), లడఖ్ (యూటీ), మణిపూర్మేఘాలయమిజోరాంనాగాలాండ్పంజాబ్రాజస్థాన్సిక్కింత్రిపురఉత్తరాఖండ్ఉత్తరప్రదేశ్పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన వ్యూహాత్మక గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.

సుసంపన్నమైన,  సురక్షితమైన సరిహద్దులను నిర్ధారించడానికిమెరుగైన జీవన పరిస్థితులు,  తగిన ఉపాధి అవకాశాలను కల్పించడంసరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలను నియంత్రించడంఅక్కడి జనాభాను దేశ ప్రధాన జన జీవన స్రవంతిలో చేర్చడంఅలాగే వారిని సరిహద్దు రక్షణ దళాల కళ్ళుచెవులుగా మారుస్తూ అంతర్గత భద్రతను మరింత మెరుగుపరచడం ఈ కార్యక్రమ లక్ష్యాలలో ప్రధానమైనవి.

ఈ కార్యక్రమం గ్రామంలో లేదా గ్రామ సమూహాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులను అందించడంతో పాటుసహకార సంఘాలుస్వయం సహాయ సంఘాలు వంటి సంస్థల ద్వారా విలువ ఆధారిత అభివృద్ధి వ్యవస్థను ప్రోత్సహిస్తుందిఅలాగేసరిహద్దు ప్రాంతాలకు ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమాలుస్మార్ట్ తరగతులు వంటి విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు పర్యాటక సర్క్యూట్ల అభివృద్ధి కిసరిహద్దు ప్రాంతాల్లోవైవిధ్యమైనస్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించే  పనులు ప్రాజెక్టులకు నిధులను అందిస్తుంది.

సహకార దృక్పథంతో రూపోందించిన గ్రామ కార్యాచరణ ప్రణాళికల ఆధారంగా సరిహద్దు ప్రదేశాలకు ముఖ్యంగా  ఆయా రాష్ట్రాలు  గ్రామాల పరిస్థితులకు అనుగుణంగా నిర్దిష్ట చర్యలను చేపడతారు

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంవోఆర్డీఇప్పటికే ఆమోదించిన ప్రధాన్ మంత్రి గ్రామీణ సడక్ యోజన-4 (పీఎంజీఎస్వై-4) కింద ఈ గ్రామాలకు అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు అనువైన రహదారుల నిర్మాణాన్ని చేపట్టనున్నారుసరిహద్దు ప్రాంతాల్లో పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి మార్గదర్శకాల్లో తగిన మార్పులుచేర్పులను కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నతాధికార కమిటీ పరిశీలిస్తుంది.

ఎంపిక చేసిన మండలాల్లోని అన్ని గ్రామాలను ఏ కాలంలో నైనా ప్రయాణించగలిగే రహదారి అనుసంధానంటెలికమ్యూనికేషన్ సౌకర్యంటెలివిజన్ సదుపాయంవిద్యుదీకరణ అనే నాలుగు ప్రధాన రంగాలలో పూర్తి కవరేజీ సాధించేలా చేయాలని కూడా ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుందిఇప్పటికే ఉన్న ప్రభుత్వ పథకం నిబంధనల సమన్వయం ద్వారా వీటిని అమలు చేస్తారు

ఈ కార్యక్రమం గ్రామాలలో చైతన్యభరిత జీవనానికి దోహదపడుతుందిజాతరలుపండుగలుఅవగాహన శిబిరాలుజాతీయ పండుగలను నిర్వహించడంకేంద్ర,  రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులుఉన్నత స్థాయి అధికారులు ఈ గ్రామాలకు పర్యటనలు,  ప్రజలతో కలసి రాత్రి బస చేయడం వంటి కార్యక్రమాలు చేపడతారుఇవన్నీ స్థానిక సంస్కృతివారసత్వాన్ని ప్రోత్సహించడంతో పాటుపర్యాటక అవకాశాలను పెంపొందిస్తుంది

ఈ ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు పీఎం గతి శక్తి వంటి సమాచార డేటాబేస్ లను వినియోగించనున్నారు.

వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్-2 (వివిపి-2), ఇప్పటికే అమలులో ఉన్న వివిపి-1 తో కలసి సరిహద్దు గ్రామాలను స్వయం సమృద్ధిగా చైతన్యవంతంగా మార్చేందుకు చేపట్టిన మార్గదర్శక కార్యక్రమం.

 

***


(Release ID: 2119116) Visitor Counter : 6