మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ప్రధానమంత్రి బాల్ పురస్కార్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్న కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ
దరఖాస్తుల సమర్పణకు తుది గడువు జూలై 31
Posted On:
27 MAR 2025 4:53PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ కోసం మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవనుండగా, జాతీయ అవార్డుల పోర్టల్ద్వా (https://awards.gov.in) ద్వారా దరఖాస్తు నమోదు చేసుకోవలసి ఉంటుంది. ధైర్య సాహసాలు, క్రీడలు, సామాజిక సేవ, శాస్త్ర సాంకేతిక విషయాలు, పర్యావరణం, కళలు, సాంస్కృతిక రంగాల్లో విశేష ప్రతిభ చూపిన 5 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న బాలలను సత్కరించేందుకు మంత్రిత్వశాఖ ప్రతి ఏటా ప్రధానమంత్రి బాల్ పురస్కారాలని అందిస్తోంది.

దేశంలో నివసిస్తున్న భారతీయ పౌరులై, 5 నుంచి 18 సంవత్సరాలకు మించని (జూలై 31, 2025 నాటికి) వయసున్న ఏ చిన్నారి అయినా ఈ అవార్డుకు అర్హులే. అవార్డుల కోసం స్వీయ-నామినేషన్లు, సిఫార్సులు... రెండూ పరిగణించబడతాయి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ జూలై 31, 2025. మరిన్ని వివరాలకు (https://awards.gov.in) ను సందర్శించండి.
5 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న అత్యంత ప్రతిభావంతులైన బాలలు శౌర్యం, క్రీడలు, సామాజిక సేవ, శాస్త్ర, సాంకేతిక రంగం, పర్యావరణ, కళలు, సాంస్కృతిక రంగాల్లో సాధించిన విజయాలను ప్రధానమంత్రి బాల్ పురస్కార్ ద్వారా గౌరవించే కార్యక్రమాన్ని మంత్రిత్వశాఖ ప్రతి ఏటా నిర్వహిస్తుంది.
***
(Release ID: 2116064)
Visitor Counter : 21