జల శక్తి మంత్రిత్వ శాఖ
పార్లమెంటులో ప్రశ్న: జలజీవన్ మిషన్ ప్రగతి – తాజా వివరాలు
Posted On:
24 MAR 2025 12:13PM by PIB Hyderabad
దేశంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికీ తాగునీరు అందించాలన్న సంకల్పంతో భారత ప్రభుత్వం 2019 ఆగస్టు నుంచీ జల జీవన్ మిషన్ (జేజేఎం)- హర్ ఘర్ జల్ పేరిట, రాష్ట్రాల సహకారంతో ఒక వినూత్న పథకాన్ని మొదలుపెట్టింది. ప్రతి ఇంటికీ రోజుకి 55 లీటర్ల మేర, నిర్దేశిత నాణ్యతతో కూడిన (బీఐఎస్:10500) తాగు నీటిని నల్లా కనెక్షన్ల ద్వారా అందించాలన్నది ఈ దీర్ఘకాలిక పథకం లక్ష్యం.
పథకం ప్రారంభం నాటికి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 3.23 కోట్ల (16.7%) ఇళ్ళకే కుళాయి కనెక్షన్లు ఉన్నట్లు వెల్లడైంది. జేజేఎం ద్వారా మరో 12.30 కోట్ల గృహాలకి తాగునీటి సౌకర్యం కల్పించినట్లు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచీ అందిన నివేదికలు వెల్లడిస్తున్నాయి. 17.03.2025 నాటికి దేశంలోని మొత్తం 19.36 కోట్ల గ్రామీణ గృహాల్లో దాదాపు 15.53 కోట్ల ఇళ్ళలో (80.20 శాతం), గృహావసారాలు సహా ఇతర అవసరాలకు కూడా నీటి సౌకర్యం లభిస్తుంది.
మిగతా 3.83 కోట్ల కుటుంబాలకి ఆయా రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల కోటాను అనుసరించి, నీటి కనెక్షన్లు అందించే పనులు కొనసాగుతున్నాయి – ఈ పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
పథకానికి సంబంధించి తొలి అంచనా వ్యయం రూ. 3.60 లక్షల కోట్లు కాగా కేంద్ర ప్రభుత్వ వాటా రూ. 2.08 లక్షల కోట్లు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన కేంద్ర నిధులను దాదాపు సంపూర్ణంగా వినియోగించారు. కేంద్ర ఆర్థిక మంత్రి 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చేసిన బడ్జెట్ ప్రసంగంలో జల జీవన్ మిషన్ పథకాన్ని 2028 వరకూ పొడిగిస్తున్నట్లు, తదనుగుణంగా కేటాయింపులు పెంచుతున్నట్లు ప్రకటించారు.
తాగునీరు రాష్ట్రాల జాబితాలోనిది కావడంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు తాగునీటి పథకాల రూపకల్పన, వాటికి ఆమోదాలు, అమలు, నిర్వహణ తదితరాలను చేపట్టే అధికారం కలిగి ఉంటాయి. నల్లా కనెక్షన్లు సక్రమంగా పనిచేస్తున్నట్లు, అందించే నీరు జేజేఎం నాణ్యతా ప్రమాణాలకు(బీఐఎస్:10500) అనుగుణమైందని ధృవీకరించాలని, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వివిధ సమీక్షా సమావేశాలు, ఫీల్డ్ విజిట్ల ద్వారా తెలియచేశారు.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చేసే కేటాయింపుల్లో 2 శాతాన్ని వివిష పరీక్షా ప్రక్రియలు, సాధనాల కోసం ప్రత్యేకించారు. నీటి నాణ్యత పర్యవేక్షణ, నిఘా (డబ్ల్యూక్యూఎం అండ్ ఎస్) కార్యకలాపాలు, వివిధ స్థాయుల్లో నీటి నాణ్యత ప్రయోగశాలలను ఏర్పాటు చేయడం, ఇప్పటికే ఉన్న వాటిని ఆధునీకరించడం, ప్రయోగశాలలకు రసాయనాలు, వినియోగ వస్తువులను అందించడం, పరికరాలు, సాధనాలు, రీయేజెంట్లు, రసాయనాలు, ఎఫ్టీకేల సేకరణ, రసాయనాలు, క్లోరైడ్ సహా క్షేత్రస్థాయిలో బ్యాక్టీరియలాజికల్ నీటి నాణ్యత పర్యవేక్షణ కోసం హెచ్2ఎస్ నాళికలు, ఎన్ఏబీఎల్ అక్రిడిటేషన్, ప్రయోగశాలల గుర్తింపు మొదలైన వాటి కోసం ఈ నిధులను వినియోగిస్తారు.
ఎఫ్‌టికెలు/బ్యాక్టీరియాలజికల్ పరీక్షా నాళికలను ఉపయోగించి ప్రత్యేకమైన స్థానిక అవసరాలకు తగినట్లు ఆర్సెనిక్, ఫ్లోరైడ్ సహా సాధారణ ప్రమాణాల పరీక్షలను చేపట్టాలని రాష్ట్రాలకు సూచించారు. పాఠశాలలు, అంగన్వాడీలు, గ్రామ పంచాయితీ (జీపీ) స్థాయిలో నీటి నాణ్యతను పరీక్షించి కలుషిత నీటి ద్వారా ఉత్పన్నమయ్యే సమస్యలను గుర్తించాలని సూచించారు. ఆయా పరికరాల ద్వారా నీటిని పరీక్షించేందుకు రాష్ట్రాలు స్థానికంగా అయిదుగురు మహిళలను గుర్తించి వారికి శిక్షణనిస్తాయి.
గృహాలకు అందించే నీరు తగిన నాణ్యతతో కూడినదని నిర్ధారించేందుకు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాలని, అవసరాన్ని బట్టి తగిన శుద్ధి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రయోగశాలల్లో, ఫీల్డ్ టెస్ట్ కిట్ల ద్వారా చేపట్టిన తాగునీటి శాంపిళ్ళ పరీక్షల వివరాలు, సంవత్సరాల వారీగా.. ఈ వివరాలు గత సంవత్సరం నుంచీ 17.03.2025 వరకు చేసిన పరీక్షలకు సంబంధించినవి.
Year
|
No. of samples tested
|
Total no. of Samples Tested
|
in labs
|
using FTKs
|
2023-24
|
75,00,041
|
1,08,54,196
|
1,83,54,237
|
2024-25
|
77,40,369
|
90,52,382
|
1,67,92,751
|
లోక్ సభకు ఈరోజు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ వీ సోమన్న ఈ వివరాలను వెల్లడించారు.
***
(Release ID: 2114364)
Visitor Counter : 28