సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వామ్! మార్చి 23న ముంబయిలో పోటీలు
Posted On:
20 MAR 2025 6:38PM by PIB Hyderabad
మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎంఈఏఐ) సహకారంతో వామ్! (వేవ్స్ యానిమీ - మాంగా కంటెస్ట్) తదుపరి సంచికను ముంబయిలో నిర్వహిస్తున్నట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీ), భారత ప్రభుత్వం ప్రకటించాయి. వేవ్స్ (వరల్డ్ ఆడియో విజువల్, ఎంటర్టైన్మెంట్ సమ్మిట్) లో క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. వీటిని మే 1 నుంచి 4 వరకు ముంబయిలో నిర్వహిస్తారు. వామ్! మునుపటి సంచికలను గౌహతి, కోల్‌కతా, భువనేశ్వర్, వారణాసి, ఢిల్లీల్లో విజయవంతంగా నిర్వహించారు.
ముంయిలో నిర్వహించే సంచికను విజిలింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్‌లో నిర్వహిస్తారు. దిగువ పేర్కొన్న వాటితో సహా ఇతర విభాగాల్లో పోటీదారులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు:
• మాంగా (జపనీస్ శైలి కామిక్స్)
• వెబ్ టూన్ (డిజిటల్ కామిక్స్)
• యానిమీ (జపనీస్ శైలి యానిమేషన్)
పోటీదారులు తమ ప్రతిభను ప్రదర్శించడం మాత్రమే కాకుండా ఉత్తేజకరమైన వాయిస్ యాక్టింగ్, కాజ్‌ప్లే పోటీలను ఆస్వాదిస్తారు. అలాగే వైభవీ స్టూడియోస్ రూపొందించిన మొట్టమొదటి భారత యానిమీ ‘ట్రయో’ ప్రత్యేక స్క్రీనింగ్‌ను వీక్షించే అవకాశం లభిస్తుంది. విజేతలకు పురస్కారాలు అందించి వారిని సత్కరించడంతో పోటీ పూర్తవుతుంది.
ఈ పోటీలను మూల్యాంకనం చేసేందుకు, పురస్కార గ్రహీతలను సత్కరించేందుకు ఈ పరిశ్రమకు చెందిన దిగ్గజాలు కొందరు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు: విజిలింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్, నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ - యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్, కామిక్స్ అండ్ ఎక్స్టెండెడ్ రియాల్టీ సీఈవో చైతన్య చించిల్కర్, అక్విజిషన్ అండ్ ప్రోగ్రామింగ్ (కిడ్స్ క్లస్టర్), స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ దత్త, నటుడు - గుల్ మోహర్ మీడియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సుమీత్ పాథక్, నటుడు, వాయిస్ యాక్టర్, వాయిస్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు, పూర్వ అధ్యక్షుడు అంకుర్ జవేరీ, 2డీ యానిమేషన్ నిపుణుడు, భారత్ లో మొదటి మాంగా ‘బీస్ట్ లెజియన్’ సృష్టికర్త జాజిల్ హోమవజీర్
ఇవి పోటీలు మాత్రమే కాదని, సృజనాత్మక ఉత్సవాలని, కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించే వేదిక అని ఎంఈఏఐ కార్యదర్శి అంకుర్ భాసిన్ అన్నారు.
మరిన్ని వివరాలకు: అంకుర్ భాసిన్, కార్యదర్శి, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, 9880623122, secretary@meai.in; www.meai.in/wam
వేవ్స్ గురించి
పాత్రికేయ, వినోద (ఎం అండ్ ఈ) రంగంలో ముఖ్యమైన కార్యక్రమంగా నిలిచిపోయే ఈ మొదటి విడత వరల్డ్ ఆడియో విజువల్, ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)ను భారత ప్రభుత్వం మహారాష్ట్ర రాజధాని ముంబయిలో మే 1 నుంచి 4 వరకు నిర్వహించనుంది.
ఈ రంగంలో నిపుణులు, పెట్టుబడిదారుడు, రూపకర్త, ఆవిష్కర్త, ఇలా ఏ పాత్రను మీరు పోషిస్తున్నా సరే.. ఈ సమ్మేళనంలో పాల్గొనవచ్చు. పాత్రికేయ, వినోద పరిశ్రమతో అనుసంధానమయ్యేందుకు, సహకారం పెంపొందించుకొనేందుకు, నూతన ఆవిష్కరణలు చేయడానికి, మీ వంతు తోడ్పాటు అందించేందుకు అంతర్జాతీయ వేదికను వేవ్స్ మీకు అందిస్తుంది.
ఇండియాలో దాగున్న సృజనాత్మకతను ప్రోత్సహించి, కంటెట్ రూపకల్పన, మేధోహక్కులు, సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రంగా దేశాన్ని తయారు చేయడమే వేవ్స్ లక్ష్యం. ప్రసార రంగం, పత్రికా మాధ్యమం, టెలివిజన్, రేడియో, చలనచిత్రాలు, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, శబ్దం - సంగీతం, ప్రకటనలు, డిజిటల్ మీడియా, సామాజిక మాధ్యమ వేదికలు, జనరేటివ్ ఏఐ, ఆగ్మెంటెడ్ రియాల్టీ (ఏఆర్), వర్చువల్ రియాల్టీ (వీఆర్), ఎక్స్టెండెడ్ రియాల్టీ (ఎక్స్‌ఆర్) తదితర రంగాలు, పరిశ్రమలపై దృష్టి సారించింది.
ఇంకా సందేహాలున్నాయా? వాటికి సమాధానాలు ఈ లింక్‌లో దొరుకుతాయి.
రండి, మాతో కలసి ప్రయాణించండి! వేవ్స్ లో పాల్గొనేందుకు ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి.
***
(Release ID: 2113604)
Visitor Counter : 18