ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గురుద్వారా రకాబ్ గంజ్‌ సాహిబ్‌ను సందర్శించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధాని శ్రీ క్రిస్టోఫర్ లక్సన్

Posted On: 17 MAR 2025 10:26PM by PIB Hyderabad

న్యూజిలాండ్ ప్రధాని శ్రీ క్రిస్టోఫర్ లక్సన్‌తో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీలోని గురుద్వారా రకాబ్ గంజ్ సాహిబ్‌ను సందర్శించారు. గురుద్వారా సందర్శనకు సంబంధించిన కొన్ని దృశ్యాలను శ్రీ మోదీ షేర్ చేస్తూ సేవ అన్నా, మానవీయ దృక్పథంతో నడుచుకోవడం అన్నా దృఢమైన కట్టుబాటును కలిగి ఉండే సిక్కు సముదాయం నిజంగా ప్రపంచమంతటా ప్రశంసాపాత్రమవుతోందన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ-

‘గొప్ప విశ్వాసానికి, చరిత్రకు ఆలవాలంగా ఉన్న గురుద్వారా రకాబ్ గంజ్ సాహిబ్‌కు ‘ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్, నేను కలిసి వెళ్లాం. సేవ చేయడమన్నా, మానవీయ దృక్పథంతో నడుచుకోవడమన్నా దృఢమైన కట్టుబాటును కలిగి ఉండే సిక్కు సముదాయం నిజంగా ప్రపంచం అంతటా వేనొోళ్ల ప్రశంసలకు నోచుకొంటోంది.

@chrisluxonmp”


(Release ID: 2112219) Visitor Counter : 9