WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

వేవ్స్ 2025లో యానిమేషన్ ఫిలిం మేకర్స్ కాంపిటీషన్ (ఏఎఫ్‌సీ): రౌండ్ -2కి ఎంపికైన 78 మంది లండన్ నుంచి బాలి వరకు అంతర్జాతీయ స్థాయిలో ఎంట్రీలను ఆహ్వానిస్తున్న వేవ్స్ 2025

 Posted On: 13 MAR 2025 5:32PM |   Location: PIB Hyderabad

ప్రపంచంలోనే అసాధారణమైన యానిమేషన్ ప్రతిభను వేవ్స్ 2025 వెలికితీయనుందిఈ క్రమంలోనే యానిమేషన్ ఫిలిం మేకర్స్ కాంపిటీషన్ (ఏఎఫ్‌సీ) రెండో రౌండ్‌కు 78 మంది క్రియేటర్లు అర్హత సాధించారుక్రియేట్ ఇన్ ఛాలెంజ్ సీజన్ -1 లో భాగంగా ఈ పోటీలను డ్యాన్సింగ్ ఆటమ్స్‌ తో కలసి సమాచారప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీనిర్వహిస్తోందిఅయిదు విభాగాల్లో ఈ పోటీలు జరుగుతున్నాయిఅవి యానిమేషన్ఏఆర్ (ఆగ్మెంటెడ్ రియాల్టీ), వీఆర్ (వర్చువల్ రియాల్టీ), వర్చువల్ ప్రొడక్షన్విజువల్ ఎఫెక్ట్స్.

ప్రపంచ వినోద పరిశ్రమకు చెందిన ప్రముఖులతో కూడిన జ్యూరీ ప్యానెల్ సినిమా ప్రాజెక్టులను మూల్యాంకనం చేసిందిఈ విషయంలో సహజత్వంకథన సామర్థ్యంవినోద విలువమార్కెట్ విలువప్రేక్షకుల్ని నిమగ్నం చేసే విధానంసాంకేతికతను ఉపయోగించుకున్న విధానం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారుఎంటర్టైన్మెంట్ మార్కెటింగ్ నిపుణుడైన జన్ నేగల్యానిమేషన్ వరల్డ్ నెట్వర్క్ చీఫ్ ఎడిటర్ వ్యవస్థాపకుడు డాన్ సార్టోదర్శకుడు – నిర్మాత – రచయిత జియాన్‌మార్కో సెర్రాప్రఖ్యాత రచయిత్రి ఇందు రాంచందానీపురస్కార విజేతగా నిలిచిన నిర్మాత వైభవ్ పివ్లత్కర్ ఈ జ్యూరీలో సభ్యులుగా ఉన్నారు.

వైవిధ్యం ప్రతిఫలించేలా విద్యార్థులుఔత్సాహికులునిపుణులుస్టూడియోలను పోటీదారులుగా ఎంపిక చేశారుఅదనంగాఈ పోటీలకు అంతర్జాతీయ దృక్పథాన్ని జోడిస్తూ లండన్బాలికెనడా నుంచి ఎంట్రీలు వచ్చాయిఆరోగ్యంకుటుంబంవిద్య నేపథ్యంలో రూపొందిన మూడు చిత్ర ప్రాజెక్టులు ప్రత్యేక గుర్తింపును సాధించాయిఅర్హత పొందిన వాటి నుంచి తుది పోటీలకు ఎంట్రీలను ఎంపిక చేసే ప్రక్రియ మార్చి 20, 2025తో పూర్తవుతుందివాటిని కొత్తగా ఎంపిక చేసిన ప్యానెల్ సభ్యులు సమీక్షిస్తారు.  

అగ్రస్థానంలో నిలిచిన మొదటి మూడు ప్రాజెక్టులకు మొత్తంగా రూ. 5లక్షల నగదు బహుమతి అందజేస్తారుఈ కార్యక్రమంలో భాగంగా ముంబయి నగరాన్ని సందర్శించేందుకు అగ్రశ్రేణి క్రియేటర్లను సమాచారప్రసార మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తుందిఅక్కడ వారు ప్రపంచం నలుమూలలకు చెందిన నిర్మాతలుఓటీటీ వేదికలుపంపిణీదారులుపెట్టుబడిదారులకు తమ ప్రాజెక్టులను చూపించవచ్చుతుది పోటీలకు ఎంపికైన వారి వివరాలు ఏప్రిల్ 10, 2025న లేదా అంతకంటే ముందే ప్రకటిస్తారు.

మరిన్ని వివరాల కోసం waves@dancingatoms.com కు  ఈ-మెయిల్ చేయండిలేదా https://waves.dancingatoms. ను సందర్శించండి.

 

***


Release ID: (Release ID: 2111378)   |   Visitor Counter: 30