ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మారిషస్ అధ్యక్షుడు శ్రీ ధరంబీర్ గోకుల్ ఆతిథ్యానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గౌరవ పలుకులు

Posted On: 11 MAR 2025 9:33PM by PIB Hyderabad

మారిషస్ అధ్యక్షుడు శ్రీ ధరంబీర్ గోకుల్,

మారిషస్ ప్రథమ మహిళ శ్రీమతి బృందా గోకుల్,

గౌరవనీయ ఉపాధ్యక్షుడు శ్రీ రాబర్ట్ హంగ్‌లీ,

ప్రధానమంత్రి శ్రీ రాంగులామ్,

విశిష్ట అతిథులారా,

మారిషస్ జాతీయ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాలుపంచుకోవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.

ఈ  సత్కారానికి గాను అధ్యక్షునికి నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఇది భోజన సందర్భం మాత్రమే కాదు.. చాలా కాలంగా భారత్, మారిషస్‌ల మధ్య కొనసాగుతూ వస్తున్న ప్రగాఢ సంబంధాలకొక ప్రతీక.

మారిషస్ వంటకాలు మంచి రుచికరంగా ఉండడంతోపాటు ఈ దేశంలోని సమృద్ధ సామాజిక వైవిధ్యాన్ని కూడా చాటిచెబుతున్నాయి.

వీటిలో భారత్, మారిషస్‌ల ఉమ్మడి వారసత్వం ఘుమఘుమలు కూడా ఉన్నాయి.

మారిషస్ ఇస్తున్న ఆతిథ్యం మన రెండు దేశాల మైత్రిలోని తీయదనాన్ని కలబోసుకుంది.

ఈ ప్రత్యేక సందర్భంలో, నేను ప్రముఖుడు, అధ్యక్షుడు శ్రీ ధరంబీర్ గోకుల్, శ్రీమతి బృందా గోకుల్‌లకు చక్కని ఆరోగ్యం, శ్రేయం కలగాలని కోరుకుంటూ నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే, మారిషస్ ప్రజలు నిరంతర ప్రగతి, సమృద్ధి, సుఖ సంతోషాలతో జీవించాలని కూడా అభిలషిస్తున్నాను. మన సంబంధాల పట్ల భారత్ దృఢ నిబద్ధతను సైతం నేను పునరుద్ఘాటిస్తున్నాను.

జై హింద్.

వివే మారిస్.

గమనిక : ఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం.

 

***


(Release ID: 2110712) Visitor Counter : 6