మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకకు నాయకత్వం వహించనున్న రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము
• ‘నారీ శక్తి సే వికసిత భారత్’ ఇతివృత్తంతో జాతీయ స్థాయి సమావేశాన్ని మార్చి 8న నిర్వహించనున్న మహిళా శిశు సంక్షేమ శాఖ
• ప్రారంభ కార్యక్రమం తరువాత ఉన్నత స్థాయి బృంద చర్చ
• మూడు సాంకేతిక కార్యక్రమాల నిర్వహణ
ఒకే వేదిక మీదపై ఎస్‌టీఈఎమ్, వాణిజ్యం, క్రీడలు, ప్రసార మాధ్యమాలు, పరిపాలనతో ప్రమేయం ఉన్న ప్రసిద్ధ మహిళా నేతలు
• చర్చలు, మల్టిమీడియా ప్రదర్శనల మాధ్యమం ద్వారా ప్రగతిశీల భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో మహిళల తోడ్పాటును కళ్లకు కట్టే ఓ విశిష్ట డిజిటల్ మీడియా - ఇంటరాక్టివ్ జోన్
Posted On:
06 MAR 2025 11:48AM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించనుంది. మహిళా- శిశు సంక్షేమ శాఖ (ఎమ్‌డబ్ల్యూసీడీ) ‘‘నారీ శక్తి సే వికసిత్ భారత్’’ (మహిళాశక్తితో అభివృద్ధి చెందిన భారతదేశం) ఇతివృత్తంతో ఒక జాతీయ స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. జాతీయ సమావేశాన్ని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి, ఆ శాఖ సహాయ మంత్రి శ్రీమతి సావిత్రీ ఠాకుర్‌లతోపాటు సీనియర్ అధికారులు, విశిష్ట అతిథులు పాల్గొనున్నారు. ఇదే సందర్భంగా, #SheBuildsBharat మాధ్యమం ద్వారా ఒక విస్తృత ప్రచార కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో సాయుధ దళాలు, పారా మిలటరీ దళాలు, ఢిల్లీ పోలీసుకు చెందిన మహిళా అధికారులతోపాటు మై భారత్ వాలంటీర్లు, ఆంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, స్వయంసహాయక బృందాల సభ్యులు తదితరులు పాల్గొననున్నారు. ఇంకా, వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన మహిళా అధికారులను కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా ఆహ్వానించారు. ప్రపంచ బ్యాంకు, యునిసెఫ్, యూఎన్ విమెన్, యూఎన్డీపీ, యూఎన్ఎఫ్పీఏ వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ప్రారంభ కార్యక్రమం ముగిసిన తరువాత, ఉన్నత స్థాయి బృందం నిర్వహించే చర్చ రోజంతా కొనసాగుతుంది.
ఈ కార్యక్రమం నేపథ్యంలో, మూడు సాంకేతిక కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు. ఎస్‌టీఈఎమ్, వాణిజ్యం, క్రీడలు, ప్రసార మాధ్యమాలు, పాలన రంగాలకు చెందిన విఖ్యాత మహిళా నేతలను ఒకే వేదిక మీదకు తీసుకువస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అవి :
I. ‘ట్రయల్‌బ్లేజర్స్ అండ్ ల్యూమినరీస్’: అంతర్జాతీయ మహిళా దినోత్సవం 50వ వార్షికోత్సవం సందర్భంగా, గతాన్ని ఒకసారి పరిశీలించుకోవడం, ముందంజ వేయడం.
ఈ కార్యక్రమంలో ఎస్‌టీఈఎమ్, వాణిజ్యం, క్రీడలు, ప్రసార మాధ్యమాలు, పాలన రంగాలకు చెందిన పేరున్న మహిళా నేతలు పాల్గొని వారి అనుభవాలను వెల్లడి చేయడంతోపాటు రాబోయే తరాల వారికి స్ఫూర్తిని అందిస్తారు.
II. క్యాపిటలైజింగ్ ఆన్ విమెన్ పవర్ – ఆర్థిక సమ్మితంలో సోపానాలు
ఈ కార్యక్రమంలో ఆర్థిక సమ్మిళిత్వం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మద్దతు, ఆర్థిక వ్యవస్థలో మహిళలకు సాధికారత కల్పన.. ఈ అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు.
III. మహిళల్లో నాయకత్వం – పంచాయత్ నుంచి పార్లమెంటు వరకూ
ఈ కార్యక్రమంలో.. రాజకీయ నాయకత్వ మాధ్యమం ద్వారా స్త్రీపురుష సమానత్వాన్ని వర్ధిల్లజేయడానికి తగిన విధానాలను రూపొందించడం అవసరమనే చర్చను చేపడతారు.
ఒక విశిష్ట డిజిటల్ మీడియా అండ్ ఇంటరాక్టివ్ జోన్ వాస్తవ కాల చర్చలు, మల్టీమీడియా ప్రదర్శనలు, కథను చెప్పే మాధ్యమాల ద్వారా కార్యక్రమంలో పాల్గొనే వారిని పరస్పరం మమేకం చేస్తుంది. అంతేకాక ప్రగతిశీల భారత్‌ను తీర్చిదిద్దడంలో మహిళల తోడ్పాటులను కళ్లకు కడుతుంది.
చర్చా కార్యక్రమాన్ని దూరదర్శన్, వెబ్‌కాస్ట్, మహిళా-శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు, వరల్డ్ బ్యాంక్ లైవ్ ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దీనివల్ల విషయాలు ఎక్కువ మందికి తెలుస్తాయి. వారు తమకంటూ సొంత అభిప్రాయాలను ఏర్పరుచుకోగలుగుతారు.
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ముందుచూపు కలిగిన నాయకత్వంలో భారత ప్రభుత్వం మార్పునకు తోడ్పడే విధానాలను, కార్యక్రమాలను అమల్లోకి తీసుకువస్తూ మహిళలకు సాధికారతను సమకూర్చాలన్న తన సంకల్పాన్ని బలంగా ముందుకు తీసుకుపోతోంది. మన దేశం అభివృద్ధిపథంలో ముందుకు పోతున్న కొద్దీ, ‘ఆత్మనిర్భర్ భారత్’కూ, ‘సమృద్ధ భారత్’కూ మహిళా శక్తే అన్నింటి కన్నా మహత్వపూర్ణ అంశంగా నిలుస్తూనే ఉంటుంది.
https://pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=153866&ModuleId=3®=3&lang=1
***
(Release ID: 2108827)
Visitor Counter : 37