హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డబ్బు పై ఆశతో యువతను మత్తులోకి లాగుతున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులను మోదీ ప్రభుత్వం ఎంతమాత్రం ఉపేక్షించదు: కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా


కింది స్థాయి నుంచి పై వరకు, పై నుంచి కిందికి పటిష్టమైన వ్యూహంతో నిర్వహించిన దర్యాప్తు ఫలితంగా, దేశవ్యాప్తంగా 12 వేర్వేరు కేసుల్లో 29 మంది మాదకద్రవ్యాల స్మగ్లర్లను దోషులుగా నిర్ధారించిన కోర్టు

మాదక ద్రవ్యాల ముప్పును అరికట్టేందుకు కఠినమైన, సమగ్రమైన దర్యాప్తులతో మాదక ద్రవ్యాల రహిత భారత్ ను నిర్మించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, ప్రభుత్వం కట్టుబడి ఉంది.

మాదక ద్రవ్యాల విషయంలో ఎంతమాత్రం ఉదాసీనంగా ఉండరాదనే మోదీ ప్రభుత్వ విధానానికి అనుగుణంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సి బి) ఈ గొప్ప విజయాన్ని సాధించింది.

Posted On: 02 MAR 2025 11:33AM by PIB Hyderabad

డబ్బు పై దురాశతో  యువతను మత్తు లోకి లాగుతున్న మాదకద్రవ్యాల స్మగ్లర్లను శిక్షించడంలో మోదీ ప్రభుత్వం ఎంత మాత్రం వెనకాడదని కేంద్ర హోం,  సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు.

కఠినమైన, కచ్చితమైన పరిశోధనలతో మాదకద్రవ్యాల బెడదను అరికట్టడం ద్వారా మాదకద్రవ్యాల రహిత భారత్ ను నిర్మించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ధృఢ సంకల్పంతో ఉందని శ్రీ అమిత్ షా ‘ఎక్స్‘  వేదికపై ఒక పోస్ట్ లో పేర్కొన్నారు.

కింది స్థాయి నుంచి పై వరకు, పై నుంచి కింది వరకు పకడ్బందీ వ్యూహంతో దర్యాప్తు ఫలితంగా, దేశవ్యాప్తంగా 12 వేర్వేరు కేసుల్లో 29 మంది మాదకద్రవ్యాల స్మగ్లర్లను కోర్టు దోషులుగా నిర్ధారించిందని హోం మంత్రి తెలిపారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో అవలంబించిన 'బాటమ్ టు టాప్', 'టాప్ టు బాటమ్' విధానానికి ఈ విజయం నిదర్శనం. మాదక ద్రవ్యాల విషయంలో ఎంతమాత్రం ఉదాసీనంగా ఉందరాదనే మోదీ ప్రభుత్వ విధానానికి అనుగుణంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సి బి) ఈ గొప్ప విజయాన్ని సాధించింది.

హైదరాబాద్ జోన్ వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ జోన్

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డులోని పెద్ద అంబర్ పేట టోల్ ప్లాజా వద్ద 681.8 కిలోల గంజాయిని ఎన్సీబీ హైదరాబాద్ జోన్ అధికారులు పట్టుకున్నారు. మహీంద్రా బొలెరో పికప్, హోండా సిటీ, స్విఫ్ట్ డెజైర్ అనే మూడు వాహనాల్లో సీలేరు, విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్) నుంచి హైదరాబాద్ మీదుగా పుణె, ఉస్మానాబాద్ కు ఈ గంజాయిని తరలిస్తున్నారు. సురేష్ శ్యాంరావ్ పవార్, విశాల్ రమేష్ పవార్, బాలాజీ రాందాస్ వరే, మనోజ్ విలాస్ ధోత్రే, ధ్యానేశ్వర్ లాలాసాహెబ్ దేశ్ముఖ్, రామ్రాజే చతుర్భుజ్ గుంజలే, అక్షయ్ అనంత్ గాంధీ, సచిన్ దగడు సనప్ అనే ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసి మాదకద్రవ్యాల అక్రమ రవాణా అభియోగాలు మోపారు. రంగారెడ్డి అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ఎనిమిది మంది నిందితులను దోషులుగా నిర్ధారించి ఎన్డీపీఎస్ చట్టం 1985 కింద పదేళ్ల కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది.

 

 

***


(Release ID: 2107557) Visitor Counter : 20