ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యూరోపియన్ కమిషన్ అధ్యక్షునితో ప్లీనరీ సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం

Posted On: 28 FEB 2025 5:39PM by PIB Hyderabad

గౌరవనీయులారా,

భారత్ మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతోందిఈయూ కాలేజ్ ఆఫ్ కమిషనర్స్ ఈ స్థాయిలో ఒక దేశంతో కలిసి పనిచేయడం నిజంగా అపూర్వం.

ద్వైపాక్షిక చర్చల కోసం మా మంత్రులు ఇంతమంది కలిసి చర్చలో పాల్గొనడం ఇదే మొదటిసారి. 2022లో రైసినా చర్చల సందర్భంలో భారత్ఈయూలను సహజ భాగస్వాములుగా మీరు అబివర్ణించడంఅలాగే రాబోయే దశాబ్దంలో భారతదేశంతో సంబంధాలను బలోపేతం చేయడంతోపాటు భారత్ కు ప్రాధాన్యత ఉంటుందని మీరు పేర్కొనడం నాకు ఇప్పటికీ గుర్తుంది.    

ఇప్పుడుమీ ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజులకే మీరు భారత్‌లో పర్యటించడం భారత్ఈయూ సంబంధాల్లో సరికొత్త మైలురాయిగా నిలుస్తుంది.

గౌరవనీయులారా,
ప్రపంచంలో నేడు అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయిఏఐఆధునిక సాంకేతికతలు సామాజిక-ఆర్థిక స్థితిగతులను సమూలంగా మార్చేస్తున్నాయి.

భౌగోళిక-ఆర్థికరాజకీయ సమీకరణాలు సైతం వేగంగా మారుతున్నాయిపాత సమీకరణాలు నిరుపయోగం అవుతున్నాయిఇలాంటి పరిస్థితుల్లో భారత్ఈయూ భాగస్వామ్యం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రజాస్వామిక విలువలువ్యూహాత్మక స్వయంప్రతిపత్తినియమ-ఆధారిత ప్రపంచ వ్యవస్థ వంటి పరస్పర విశ్వాసాలు భారత్ఈయూల మైత్రికి ప్రధాన ఆధారంగా ఉన్నాయిఇరుదేశాలు వైవిధ్యమైన మార్కెట్ ఆర్థిక వ్యవస్థలను కలిగి ఉన్నాయిఅంటే ఒకవిధంగా మన ఇరు దేశాలు సహజ వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నాయి.

గౌరవనీయులారా,
భారత్ఈయూల వ్యూహాత్మక భాగస్వామ్యం ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుందిమీ పర్యటన ద్వారా మరో దశాబ్దానికి పునాది పడింది.

ఈ విషయంలో ఇరుపక్షాలు చూపిన నిబద్ధత ప్రశంసనీయంఈ రెండు రోజుల్లోనే ఇరవైకి పైగా మంత్రిత్వ శాఖల స్థాయి సమావేశాలు జరగడం నిజంగా గొప్ప విషయం.

ఈ రోజు ఉదయం వాణిజ్యసాంకేతిక మండలి సమావేశం విజయంతమైందిచర్చల సందర్భంగా రూపొందించిన ఆలోచనలుఇప్పటివరకు సాధించిన పురోగతితో ఇరు బృందాలు నివేదికను అందిస్తాయి.

గౌరవనీయులారా,
మన సహకారానికి సంబంధించిన కొన్ని ప్రాధాన్య అంశాలను నేను ప్రస్తావించాలనుకుంటున్నాను.

మొదటిది వర్తకంపెట్టుబడిపరస్పర లాభదాయకంగా ఎఫ్‌టీఏపెట్టుబడి భద్రత ఒప్పందాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసుకోవడం చాలా కీలకమైనది.

రెండోది అన్ని రకాల పరిస్థితులను తట్టుకుని సుస్థిరంగా ఉండేలా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంఎలక్ట్రానిక్స్సెమీకండక్టర్స్టెలికాంఇంజనీరింగ్రక్షణఫార్మా వంటి రంగాల్లో మన సామర్థ్యాలు పరస్పరం పరిపూర్ణమైనవిఇది వైవిధ్యాన్నినష్టాన్ని తగ్గించే చర్యలను బలోపేతం చేయడం ద్వారా సురక్షితమైనవిశ్వసనీయమైననమ్మకమైన సరఫరా వ్యవస్థ రూపకల్పనకు తోడ్పడుతుంది.   

మూడోది అనుసంధానంజీ20 సదస్సు సమయంలో ప్రారంభించిన ఐఎమ్ఈసీ కారిడార్ గణనీయమైన మార్పులకు తోడ్పడిందిఇరు పక్షాలు పూర్తి నిబద్ధతతో ఈ విషయంలో కృషిని కొనసాగించాల్సి ఉంది.

నాల్గోది సాంకేతికతఆవిష్కరణలుసాంకేతికతలో తిరుగులేని ఆధిక్యం పొందాలనే మన ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడం కోసం మనం మరింత వేగంగా ముందుకు సాగాలిడీపీఐఏఐక్వాంటం కంప్యూటింగ్అంతరిక్షం, 6జీ వంటి రంగాల్లో మనం మన పరిశ్రమలుఆవిష్కర్తలుయువ ప్రతిభను అనుసంధానించుకుంటూ కలిసి పనిచేయాల్సి ఉంది.

ఐదోదివాతావరణపరమైన చర్యలుహరిత ఇంధన ఆవిష్కరణభారత్ఈయూలు పర్యావరణహితమైన ప్రపంచం కోసం అత్యంత ప్రాధాన్యమిచ్చాయిసుస్థిర పట్టణీకరణనీరుశుద్ధ ఇంధనం వంటి రంగాల్లో పరస్పర సహకారం ద్వారా మనం పర్యావరణ హితమైన ప్రపంచ సాధనలో చోదకశక్తిగా మారవచ్చు.

ఆరోది రక్షణ రంగంసహ-అభివృద్ధిసహ-ఉత్పత్తి ద్వారా మనం పరస్పరం మన అవసరాలను తీర్చుకోగలంఎగుమతి నియంత్రణ చట్టాల్లో మనం పరస్పర ప్రాధాన్యమిచ్చే దిశగా కృషి చేయాలి.

ఆరోది భద్రతఉగ్రవాదంతీవ్రవాదంసముద్రమార్గ భద్రతసైబర్ సెక్యూరిటీఅంతరిక్ష భద్రత పరంగా తలెత్తుతున్న సవాళ్ల విషయంలో పరస్పర సహకారం అత్యంత అవసరం.

ఎనిమిదోది ఇరు దేశాల ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలువలసలురాకపోకలుషెంగెన్ వీసాలుఈయూ బ్లూ కార్డుల ప్రక్రియను మరింత సరళంగాసజావుగా ఉండేలా చేయడం కోసం ఇరుపక్షాలు ప్రాధాన్యమివ్వాలిఈయూ అవసరాలకు ఇది మరింత ఊతమిస్తుందిదీని వల్ల యూరప్ వృద్ధిశ్రేయస్సు కోసం భారత యువ శ్రామికులు మరింత తోడ్పాటునందించడం సాధ్యపడుతుంది.

గౌరవనీయులారా,
తదుపరి భారత్-ఈయూ సదస్సు కోసంఆశయంకార్యాచరణనిబద్ధతతో మనం ముందుకు సాగాల్సి ఉందినేటి ఏఐ యుగంలో దార్శనికతనువేగాన్ని కలిగిన వారిదే భవిష్యత్తు.

గౌరవనీయా...

ఇప్పుడు మీ ఆలోచనలు పంచుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

 

***


(Release ID: 2107280) Visitor Counter : 12