సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మహాకుంభ్ 2025: విశ్వాసం.. ఐక్యత.. సంప్రదాయాల సంగమం


పోటెత్తిన పవిత్ర జలాల ప్రతిధ్వనులు కుదుటపడిన నేపథ్యంలో చరిత్రపై మహత్తర భక్తి.. వైభవాల శాశ్వత ముద్ర

Posted On: 26 FEB 2025 7:22PM by PIB Hyderabad

పరిచయం

అడుగడుగునా ఆధునికత నిండిన హడావుడి ప్రపంచంలో మహాధ్యాత్మిక అన్వేషణ దిశగా కోట్లాది ప్రజానీకాన్ని ఒకచోట మమేకం చేయగల శక్తిమంతమైన కొన్ని కీలక ఘట్టాలుంటాయి. అటువంటి ప్రధాన ఘట్టాల్లో 2025 జనవరి 13న ప్రారంభమై, ఫిబ్రవరి 26 వరకూ సాగిన మహా కుంభమేళా ఒకటి. ఇది పుష్కర (12 ఏళ్ల) కాలంలో నాలుగు దఫాలుగా సాగే పవిత్ర తీర్థయాత్ర. ప్రపంచంలోనే అతిపెద్ద శాంతియుత మహా సమ్మేళనమిది. ఆత్మశుద్ధి, పాప విముక్తి, పుణ్య ప్రాప్తి, జన్మరాహిత్యం లక్ష్యంగా పవిత్ర నదీస్నానం వైపు కోట్లాది భక్తజనాన్ని ఆకర్షించే మహా కుంభమేళాకు హిందూ ఇతిహాసాలలో లోతైన మూలాలున్నాయి. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన భక్తివిశ్వాస సమ్మేళనాల్లో ఇదొకటి. ఈ పవిత్ర ఘట్టం భారత్‌లోని నాలుగు ప్రదేశాలు- హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్‌రాజ్‌లలో అంచెలవారీగా సాగుతుంది. దేశంలోని గంగ, శిప్రా, గోదావరి నదీతీరాల్లో, ప్రయాగ్‌రాజ్‌లోని గంగ-యమున-పౌరాణిక సరస్వతి నదుల సంగమం వద్ద మహా సమ్మేళనం సాగుతుంది. మొత్తం 45 రోజుల్లో 45 కోట్ల మంది భక్తులు తీర్థయాత్రకు రాగలరని అంచనా వేయగా, కేవలం నెల రోజుల్లోనే సంఖ్యను దాటి, ముగింపు రోజుకల్లా 66 కోట్లకు చేరింది.

 

 

కుంభమేళా-2025 ప్రధానాకర్షణలు

 

· త్రివేణి సంగమం: లోతైన అధ్యాత్మిక అనుభవాన్నిచ్చే గంగ-యమున-సరస్వతి నదుల పవిత్ర సంగమం.

· ప్రాచీన దేవాలయాలు: హనుమాన్ మందిర్, అలోపి దేవి మందిర్, మంకమేశ్వర్ ఆలయం తదితరాలు నగర అధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి.

· చారిత్రక ప్రదేశాలు: అశోక స్తంభం, అలహాబాద్ విశ్వవిద్యాలయం, స్వరాజ్ భవన్ వగైరాలు భారతదేశ చరిత్ర, వలసపాలన శకం నిర్మాణ శైలిని చాటుతాయి.

· సాంస్కృతిక ఉత్తేజం: సందడిగా ఉండే వీధులు, మార్కెట్లు, స్థానిక కళలు, వంటకాలు వంటివి నగర జీవనశైలిని సంగ్రహంగా వివరిస్తాయి.

· కళాగ్రామ్: మహా కుంభ్ జిల్లాలోని సెక్టార్-7లో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దీన్ని ఏర్పాటు చేసింది. ఇది సుసంపన్న భారత వారసత్వాన్ని ప్రదర్శించే శక్తిమంతమైన సాంస్కృతిక గ్రామం. హస్తకళా ఉత్పత్తులు, వంటకాలతోపాటు సంస్కృతి సంబంధిత ఇతివృత్తాలతో రూపొందించిన కళారూపాలు, ప్రదర్శనలు, పరస్పర సంధాన కేంద్రాలు యాత్రికులను మమేకం చేసుకుంటూ పవిత్ర, ఆహ్లాదానుభూతినిచ్చాయి.

· అఖాడా శిబిరాలు: సాధువులు, భగవదాన్వేషకులంతా ధ్యానం, చర్చలు, తాత్త్విక ఆదానప్రదానాల్లో నిమగ్నమయ్యే అధ్యాత్మిక కేంద్రాలు.

· డిజిటల్ అనుభవసహిత తాదాత్మ్యం: కుంభమేళా 2019 స్ఫూర్తితో యాత్రికులకు ఈ అనుభవం కల్పించేలా కుంభమేళా జిల్లాలోని పది కీలక ప్రదేశాల్లో ప్రత్యేకంగా 10 స్టాళ్లను ఏర్పాటు చేశారు. వీటిలో పేష్వై, పవిత్ర స్నాన దినాలు, గంగా హారతి వంటి ప్రధాన కార్యక్రమాల వీడియోలను ప్రదర్శించారు.

· డ్రోన్ షో: గగనతలంలో ఉత్తేజకర రూపాలు సృష్టించే వందలాది డ్రోన్లతో ఉత్తర ప్రదేశ్ పర్యాటక శాఖ డ్రోన్‌ షో నిర్వహించింది. ఇందులో భాగంగా క్షీరసాగర మథనం, దేవతలు కలశం నుంచి అమృత పానం చేసే దృశ్యాలను చిత్రించిన ఈ ప్రదర్శన భక్తులను మంత్రముగ్ధులను చేసింది.

· గంగా మండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు: మండపంలో ఫిబ్రవరి 7 నుంచి 10వ తేదీవరకూ దేశంలోని ప్రసిద్ధ కళాకారులు తమ అద్భుత సంగీత, నృత్య తదితర కళా ప్రదర్శనలతో యాత్రికులను సమ్మోహితులను చేశారు. ముఖ్యంగా 7న ఒడిస్సీ నర్తకి డోనా గంగూలీ; 8న ప్రముఖ గాయకులు కవితా కృష్ణమూర్తి, డాక్టర్ ఎల్.సుబ్రమణ్యం; 9న సురేష్ వాడ్కర్, సోనాల్ మాన్‌సింగ్‌ వంటి వారి కళా ప్రదర్శనలు; 10వ తేదీన ప్రముఖ గాయకుడు హరిహరన్ తదితరులు తమ ప్రతిభా విశేషాలతో భక్తులను అప్రతిభులను చేశారు. అలాగే వివిధ భారత శాస్త్రీయ నృత్య- సంగీత సంప్రదాయాలకు చెందిన ప్రముఖ కళాకారులు సాయంత్రం వేళల్లో తమ ప్రదర్శనలతో యాత్రికులను అలరించారు.

· అంతర్జాతీయ పక్షుల ఉత్సవం: ఫిబ్రవరి 16-18 తేదీలలో నిర్వహించిన ఈ ఉత్సవంలో భాగంగా అంతరించిపోతున్న జాతులుసహా 200కుపైగా వలస, స్థానిక పక్షుల విశేషాలను ప్రదర్శించారు.

ప్రధాన ఆచార-వ్యవహారాలు

· షాహి స్నాన్: పాప విముక్తి, జన్మరాహిత్యం లక్ష్యంగా త్రివేణి సంగమంలో లక్షలాదిగా భక్తులు ఆచరించే అత్యంత ప్రధానమైన పుణ్యస్నానం. పుష్య పౌర్ణమి, మకర సంక్రాంతి వంటి ప్రత్యేక పర్వదినాల్లో మహా కుంభమేళా అధికారిక ఆరంభాన్ని సూచిస్తూ సాధువులు, అఖాడాల నుంచి భారీ ఊరేగింపులు సాగుతాయి.

· గంగా హారతి: పవిత్ర గంగా నదికి పూజారులు ఉజ్వల దీపకాంతితో హారతి అర్పిస్తూ భక్తి భావనను ఉత్తేజితం చేస్తారు.

· కల్ప దీక్ష: భక్తులు నెల రోజులపాటు సర్వసంగ పరిత్యాగులై ధ్యానం చేస్తూ, యజ్ఞాలు-హోమాల వంటి వేద క్రతువుల్లో పాల్గొనే అధ్యాత్మిక క్రమశిక్షణ వ్రతం.

· ప్రార్థనలు-నైవేద్యాలు: దేవతలను గౌరవిస్తూ దైవారాధాన. ఇదే సమయంలో ఆత్మ సమర్పణ, ఆత్మశుద్ధిని ప్రతిబింబించే శ్రాద్ధం (పూర్వికులకు పిండప్రదానం) గంగా మాతకు తలనీలాల సమర్పణ (వేణీదానం) వంటి క్రతువులు కూడా నిర్వహిస్తారు. అలాగే పుణ్య సముపార్జనలో భాగంగా గో దానం (ఆవును దానమివ్వడం), వస్త్ర దానం వంటి పవిత్ర కార్యక్రమాలు చేస్తారు.

· దీప దానం: నదీ జలాలపై విడిచే వేలాది దీపపు ప్రమిదలు నీటిలో తేలుతూ భక్తి, దైవాశీర్వాదాన్ని సూచించే పవిత్ర కాంతులు వెదజల్లుతాయి.

· ప్రయాగ్‌రాజ్ పంచకోషి పరిక్రమ: ప్రయాగ్‌రాజ్‌లోని పవిత్ర స్థలాల సందర్శనం పవిత్ర ప్రయాణం ప్రాచీన సంప్రదాయ పునరుజ్జీవనంతో ఆధ్యాత్మిక సంతృప్తినిస్తుంది.

 

చరిత్ర - పుణ్యస్నానానికి ప్రధాన తేదీలు

· కుంభమేళాకు హిందూ ఇతిహాసాలలో లోతైన మూలాలున్నాయి. ప్రాచీన గ్రంథాల్లోని క్షీరసాగర మథనం ఘట్టంలో పేర్కొన్న ప్రకారం- దేవదానవుల మధ్య అమృతం (అమరత్వాన్నిచ్చే పానీయం) కోసం పెనుగులాట సాగింది. ఆ క్రమంలో కలశం నుంచి అమృత బిందువులు ఒలికి నాలుగు ప్రదేశాలు-హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని, ప్రయాగ్‌రాజ్’లలో పడ్డాయి. ప్రదేశాల్లోనే ఇప్పుడు కుంభమేళా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రయాగ్‌రాజ్‌లో 144 ఏళ్లకు ఒకసారి మహా కుంభమేళా నిర్వహిస్తారు. చారిత్రకంగా పురాతన కాలం నుంచీ... మౌర్య, గుప్తుల కాలంలోనే మహా కుంభమేళా ప్రస్తావన కనిపిస్తుంది. అంతేగాక ఇది మొఘలులు సహా వివిధ రాజవంశాల సమాదరణతో కొనసాగినట్లు జేమ్స్ ప్రిన్సెప్ వంటి వలస పాలకులు రూపొందించిన రికార్డులు చెబుతున్నాయి. అలా శతాబ్దాలుగా ఇది ప్రపంచ అధ్యాత్మిక, సాంస్కృతిక మహా ఘట్టంగా పరిణామం చెందింది. యునెస్కో దీన్నొక నిరాకార సాంస్కృతిక వారసత్వంగా గుర్తించింది. ఆ మేరకు అనాదిగా కొనసాగుతున్న భారత సంప్రదాయాలకు కుంభమేళా ఒక ప్రతీకగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజానీకంలో ఐక్యత, అధ్యాత్మికత, సాంస్కృతిక ఆదానప్రదానాలకు ఇది దోహదం చేస్తోంది.

· సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి వంటి గ్రహస్థానాల ప్రాతిప‌దిక‌న ప్ర‌తి కుంభ‌మేళాకు ముహూర్తం నిర్ణ‌యిస్తారు. ఆత్మశుద్ధికి, జ్ఞానోదయానికి ఇది శుభప్రదమైన కాలమని విశ్వసిస్తారు. ఈ పండుగ విశ్వాసం, సంస్కృతి, సంప్రదాయాల సంగమం. సాధువులు, అన్వేషకులు, భక్తులను ఒకేవిధంగా ఆకట్టుకుంటుంది. ఈ కార్యక్రమ వైభవాన్ని షాహి స్నాన్‌ ప్రతిబింబిస్తుంది. అధ్యాత్మిక ప్రసంగాలు, లోతైన భారత అధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఉత్తేజపూర్వక సాంస్కృతిక ప్రదర్శనలు దీనికి ప్రత్యేక గుర్తింపునిచ్చాయి.

 

పుణ్యస్నానాలకు ప్రధాన తేదీలివే:

తేదీ

స్నానం చేసే సందర్భం

ప్రాధాన్యం

స్నానం

చేసిన భక్తులు (దాదాపు)

2025 జనవరి 13

పుష్య పౌర్ణమి

ఇది మహా కుంభమేళా అనధికార ప్రారంభోత్సవం. కార్యక్రమం ఘనంగా మొదలవటాన్ని ఇది సూచిస్తుంది. అలాగే పుష్య పౌర్ణమి కల్ప దీక్ష ఆరంభ సూచిక. మహా కుంభమేళా సందర్భంగా యాత్రికులు భక్తితో కఠోర అధ్యాత్మిక దీక్షనాచరించే కాలం.

1.5 కోట్లు

2025 జనవరి 14

మకర సంక్రాంతి

(తొలి షాహి స్నానం)

హిందూ కేలెండర్ ప్రకారం సూర్యుడు తన తదుపరి ఖగోళ స్థానానికి మారే దశను మకర సంక్రాంతి సూచిస్తుంది. మహా కుంభమేళాలో దానధర్మాలకు శ్రీకారాన్ని ఈ పర్వదినం సూచిస్తుంది. యాత్రికులు సంప్రదాయకంగా తమ స్వీయ సంకల్పం, దాతృత్వం మేర విరాళాలిస్తారు.

3.5 కోట్లు

2025 జనవరి 29

మౌని అమావాస్య

(రెండో షాహి స్నానం)

మౌని అమావాస్యకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. పవిత్ర నదీస్నానం చేసే పుణ్య కార్యానికి ఖగోళ స్థితిగతులు అత్యంత సానుకూలమని విశ్వసిస్తారు. తొలినాటి రుషులలో ఒకరిరైన రిషభ్‌ దేవ్ తన సుదీర్ఘ మౌన దీక్షకు స్వస్తి పలికి, నీట మునగడం ద్వారా సంగమ శుద్ధి చేయడాన్ని ఇది సూచిస్తుంది. అందుకే, మౌని అమావాస్య నాడు కుంభమేళాకు జన సందోహం పెద్ద సంఖ్యలో వస్తారు. అధ్యాత్మిక భక్తి, ఆత్మశుద్ధికి ఇదొక చిరస్మరణీయ దినం.

5 కోట్లు

2025 ఫిబ్రవరి 3

వసంత పంచమి

(మూడో షాహీ స్నానం)

వసంత పంచమి రుతువుల మార్పును సూచిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం జ్ఞాన దేవత సరస్వతి ఆగమన వేడుక ఈ పర్వదినం నాడు సాగుతుంది.

2.33 కోట్లు

2025 ఫిబ్రవరి 12

మాఘ పౌర్ణమి

మాఘ పౌర్ణమి… దేవగురువు బృహస్పతి పూజతో హిందువుల దైవం గంధర్వుడు స్వర్గం నుంచి పవిత్ర సంగమంలో ప్రవేశిస్తాడని విశ్వసిస్తారు.

2 కోట్లు

2025 ఫిబ్రవరి 26

మహా శివరాత్రి

మహా శివరాత్రి పర్వదినాన్ని దీక్షధారులు తమ వ్రత విరమణకు చివరి రోజుగా పరిగణిస్తారు. ఈ పవిత్ర స్నానానికి ఇది లోతైన ప్రతీకను సూచిస్తుంది. ఈ పర్వదినం పూర్తిగా మహాదేవునితో ముడిపడి ఉంది.

1.3 కోట్లు

ప్రధాన మౌలిక సదుపాయాలు

 

· తాత్కాలిక నగర నిర్మాణం: వేలాది గుడారాలు, షెల్టర్లతో మహా కుంభనగర్ తాత్కాలిక నగరంగా రూపొందింది. ‘ఐఆర్‌సిటిసి’ ఇందులో “మహా కుంభ గ్రామ్పేరిట ‘విలాస, అత్యంత విలాస’ వసతి సౌకర్యాలు కల్పించింది. ఆధునిక సౌకర్యాలతో కూడిన డీలక్స్ గుడారాలు, విల్లాలు అద్దెకు లభిస్తాయి.

· రోడ్లు - వంతెనలు:

o మొత్తం 92 రహదారుల పునరుద్ధరణ; మరో 17 ప్రధాన రహదారుల సుందరీకరణ

o మొత్తం 3,308 పాంటూన్‌లతో 30 పాంటూన్ వంతెనల నిర్మాణం.

· ప్రయాణికుల కోసం సూచిక బోర్డులు: సందర్శకులకు మార్గనిర్దేశం కోసం 800 దాకా (హిందీ, ఇంగ్లీష్, ప్రాంతీయ) బహు భాషా సూచిక బోర్డుల ఏర్పాటు.

· ప్రజా సదుపాయాలు: నడక మార్గాల్లో ప్రజల సౌకర్యార్థం 2,69,000కిపైగా ఉబ్బెత్తు పలకలతో బాటల నిర్మాణం. మొబైల్ టాయిలెట్లు, వ్యర్థాల నిర్వహణకు బలమైన వ్యవస్థలు పరిశుభ్రతకు భరోసా ఇచ్చాయి.

మహా కుంభమేళాలో వైద్య సదుపాయాలు:

  • మహా కుంభమేళా-2025కు వచ్చే కోట్లాది భక్తుల ఆరోగ్యానికి భరోసా ఇస్తూ విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు మేళా ప్రాంతంలో 2,000 మందికిపైగా వైద్య సిబ్బందిని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మోహరించింది. ప్రతి రంగంలోనూ అత్యాధునిక సాంకేతిక ఆరోగ్య సంరక్షణసేవలందించింది. అలాగే చిన్నచిన్న వైద్య చికిత్సల నుంచి భారీ శస్త్రచికిత్సల దాకా అన్నిరకాల వైద్య సేవలను సమర్థంగా సమకూర్చారు.

 

ప్రధాన వైద్య వసతులు:

· పెరేడ్‌ గ్రౌండ్‌లో సెంట్రల్‌ హాస్పిటల్‌:

o 100 పడకల సామర్థ్యం

o ఒపిడి, ఐసీయూ, అత్యవసర ఆరోగ్య సంరక్షణ

o వీటిలో 10,000కుపైగా చికిత్సలు, పెద్దసంఖ్యలో ప్రసవాలు కూడా నిర్వహించారు.

· అదనపు ఆస్పత్రులు:

o మొత్తం 360 పడకల సామర్థ్యంతో 23 ఆసుపత్రులు

o రెండు ఉప-కేంద్ర ఆసుపత్రులు (ఒక్కొక్కటి 25 పడకలు)

o 8 సెక్టార్ ఆసుపత్రులు (ఒక్కొక్కటి 20 పడకలు)

o రెండు అంటు వ్యాధి ఆసుపత్రులు (ఒక్కొక్కటి 20 పడకలు)

· అమృత స్నానం-మాఘ పౌర్ణమి సందర్భంగా వైద్య సేవల విస్తరణ:

o 7 నదీ, ఒక విమాన అంబులెన్సు సహా 133 అంబులెన్సులను ఏర్పాటు చేశారు.

o అత్యవసర పరిస్థితుల కోసం కీలక స్టేషన్లలో వైద్య పరిశీలన గదులు

o అనేక ప్రదేశాల్లో సుశిక్షిత సిబ్బందితో ప్రథమ చికిత్స శిబిరాలు

· ఎస్‌ఆర్‌ఎన్‌ సహా నగరంలోని ఇతర ఆస్పత్రులలో నిరంతర అప్రమత్తత:

o ఎస్‌ఆర్‌ఎన్‌ ఆస్పత్రిలో 250 పడకలు సదా సిద్ధం

o బ్లడ్ బ్యాంకులో 200 యూనిట్లతో రక్తం నిల్వ

o స్వరూప్ రాణి నెహ్రూ ఆస్పత్రిలో కింది సదుపాయాల కల్పన:

· 40 పడకల ట్రామా సెంటర్

· 50 పడకల శస్త్రచికిత్స ఐసీయూ

· 50 పడకల మెడికల్‌ వార్డ్

· 10 పడకల గుండె చికిత్స వార్డ్, ఐసీయూ

· వైద్య బృందాలు… అత్యవసర సంసిద్ధత:

o సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 300 మంది స్పెషలిస్ట్ వైద్యుల నియామకం

o ఎయిమ్స్‌’, ‘బిహెచ్‌యు’ల నుంచి వైద్య నిపుణుల నిరంతర అప్రమత్తత

· 150 మంది ఆయుష్ వైద్య సిబ్బంది ద్వారా ప్రత్యామ్నాయ చికిత్స సౌకర్యం

· ఆధునిక సదుపాయాలు - ఎఐ వినియోగం:

o ఇసిజి’ సేవలు, సెంట్రల్ పాథాలజీ ల్యాబ్ ద్వారా నిత్యం 100కుపైగా రకాల పరీక్షలు

o యాత్రికులకు 50కిపైగా ఉచిత రోగనిర్ధారణ పరీక్షల అందుబాటు

o ఎఐ ఆధారిత అనువాద సాంకేతికత: 22 ప్రాంతీయ, 19 అంతర్జాతీయ భాషలలో వైద్యులకు సంభాషించే వీలు కల్పించింది.

· జనౌషధి కేంద్రాల ద్వారా చౌకధరతో మందులు:

o కళాగ్రామ్‌లో ఒకటితో సహా మహాకుంభ్ నగర్‌లో 5 జనౌషధి కేంద్రాల ఏర్పాటు

o ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన (పిఎంబిజెపి) కింద ఏర్పాటు

o కుంభమేళా ఆద్యంతం యాత్రికులకు చౌక ధరతో నాణ్యమైన మందుల లభ్యత

o దేశవ్యాప్తంగాగల 15,000కుపైగా జనౌషధి కేంద్రాల నెట్‌వర్క్‌లో భాగంగా ప్రయాగ్‌రాజ్లో 62 కేంద్రాలు

o దేశవ్యాప్తంగా రూ.2,000 కోట్ల ఔషధ విక్రయ లక్ష్యంలో ఇప్పటికే రూ.1,500 కోట్ల దాకా అమ్మకాలు

కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడటంతోపాటు పరిశుభ్రత, సత్వర, అత్యవసర ప్రతిస్పందన సేవలకు భరోసా ఇస్తూ సీనియర్ అధికారులు మొత్తం వైద్య మౌలిక సదుపాయాలను నిరంతరం పర్యవేక్షించారు. మేరకు మహా కుంభ్‌-2025లో కోట్లాది యాత్రికుల ఆరోగ్య సంరక్షణ అవసరాలు తీర్చడంలో ఈ ఏర్పాట్లు కీలక పాత్ర పోషించాయి.

 

మహా కుంభమేళాలో ఆయుష్

ఆయుష్ ఓపీడీలు, క్లినిక్ లు, స్టాల్స్, వెల్నెస్ సెషన్లు ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో భక్తులు, సందర్శకులకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఉత్తర ప్రదేశ్ లోని జాతీయ ఆయుష్ మిషన్ సహకారంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ దేశీయ, అంతర్జాతీయ యాత్రికులకు ఉచిత ఆరోగ్య సేవలను అందించింది. సంప్రదాయ చికిత్సా విధానాలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ విస్తృత స్థాయిలో అందించిన ఆయుష్ సేవలు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదం, హోమియోపతి, ప్రకృతివైద్యంపై నమ్మకాన్ని బలోపేతం చేశాయి.

ఆయుష్ సేవల ముఖ్యాంశాలు:

విస్తృత ఆరోగ్య సంరక్షణ: ఉత్సవాల సందర్భంగా 1.21 లక్షల మంది భక్తులు ఆయుష్ సేవలను వినియోగించుకున్నారు.

ప్రత్యేక ఆయుష్ ఔట్‌పేషెంట్ విభాగాలు (ఓపీడీలు ): 20 ఓపీడీల్లోని 80 మంది వైద్యుల బృందం 24 గంటలూ వైద్య సేవలను అందించింది. సాధారణ, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సను అందించింది.

అంతర్జాతీయ భాగస్వామ్యం: విదేశీ యాత్రికులు కూడా ఆయుష్ ఓపీడీ సంప్రదింపులు, ఆరోగ్య చికిత్సలను పొందారు.

యోగా థెరపీ సెషన్లు: న్యూఢిల్లీలోని మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా (ఎండీఎన్ఐవై) నిపుణుల నేతృత్వంలో సంగం ప్రాంతం సెక్టార్ -8 లోని నిర్దేశిత శిబిరాల్లో ఉదయం 8:00 గంటల నుండి 9:00 గంటల వరకు రోజువారీ యోగా చికిత్సా సెషన్లు నిర్వహించారు.

సమగ్ర ఆరోగ్య సేవలు: 7 లక్షల మందికి పైగా యాత్రికులకు వైద్య సేవలు అందించారు. వీటిలో:

•4.5
లక్షల మందికి 23 అల్లోపతి ఆసుపత్రుల్లో చికిత్స

•3.71 లక్షల పాథాలజీ పరీక్షల నిర్వహణ

విజయవంతంగా 3,800 చిన్న, 12 పెద్ద శస్త్రచికిత్సలు

ప్రత్యేక నిపుణుల సహకారం: ఢిల్లీ ఎయిమ్స్,, ఐఎంఎస్- బి హెచ్ యు నిపుణులతో పాటు కెనడా, జర్మనీ, రష్యా నుంచి అంతర్జాతీయ నిపుణులు పాల్గొని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆరోగ్య సేవలను అందించారు.

సంప్రదాయ వైద్య చికిత్సలు: 20 ఆయుష్ ఆస్పత్రులు 2.18 లక్షల మందికి ఆయుర్వేదం, హోమియోపతి, ప్రకృతి వైద్యంలో చికిత్సలు అందించాయి.

సమగ్ర ఆరోగ్య సంరక్షణ: పంచకర్మ, యోగా థెరపీ వంటి సేవలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు వంటి సేవలకు మంచి స్పందన లభించింది. వచ్చినవారి ఆరోగ్య మెరుగుదలకు దోహదపడ్డాయి.

భద్రతా చర్యలు

మహా కుంభమేళాలో భద్రతను కృత్రిమ మేధ ఆధారిత నిఘా, విస్తృతంగా సిబ్బంది మోహరింపు, అత్యవసర ప్రతిస్పందన యంత్రాంగాలతో ఏడు అంచెల వ్యవస్థ ద్వారా బలోపేతం చేశారు. పారామిలటరీ బలగాలు, 14 వేల మంది హోంగార్డులు, 2,750 ఏఐ ఆధారిత సీసీ కెమెరాలతో సహా 50 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. డ్రోన్, అండర్ వాటర్ సర్వైలెన్స్, సైబర్ సెక్యూరిటీ, నదీ భద్రత వంటి చర్యలు చేపట్టారు. ప్రత్యేక వాహనాలు, అగ్నిమాపక కేంద్రాలతో ఫైర్ సేఫ్టీ మౌలిక సదుపాయాలను విస్తరించారు. తప్పిపోయిన వ్యక్తులను వారి కుటుంబాలతో తిరిగి కలపడానికి లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్లు డిజిటల్ రిజిస్ట్రేషన్, సోషల్ మీడియా నవీకరణలను ఉపయోగించాయి.



ప్రధాన భద్రతా చర్యలు

నిఘా, చట్టాల అమలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డ్రోన్ మానిటరింగ్: రియల్ టైమ్ ట్రాకింగ్ కోసం 2,750 ఏఐ ఆధారిత కెమెరాలు, డ్రోన్లు యాంటీ డ్రోన్లు, టెథర్డ్ డ్రోన్లు ఉపయోగించారు.

అండర్‌వాటర్ డ్రోన్లు: నది లోపల 24 గంటల నిఘాకు తొలిసారిగా వినియోగం, 100 మీటర్ల లోతువరకు పనితీరు సామర్థ్యం.

తనిఖీ కేంద్రాలు, ఇంటెలిజెన్స్ బృందాలు: అనేక ప్రవేశ ద్వారాల వద్ద, హోటళ్లు, అమ్మకం చోట్ల సమగ్ర తనిఖీలు, అలాగే గస్తీ చర్యలు నిర్వహించారు.

ఏడు అంచెల భద్రతా వ్యవస్థ: గుడి బయటి ప్రాంగణం నుంచి లోపలి గర్భగుడి వరకు అడుగడునా భద్రత.

అగ్నిమాపక భద్రతా చర్యలు

అగ్ని ప్రమాదాల నివారణ కోసం రూ.131.48 కోట్లు కేటాయించారు.

351
అగ్నిమాపక వాహనాలు

50+ అగ్నిమాపక కేంద్రాలు, 20 ఫైర్ పోస్టులు

థర్మల్ కెమెరాలు కలిగి, 35 మీటర్ల ఎత్తువరకు చేరుకునే సామర్థ్యం కలిగిన నాలుగు నీటిని వెదజల్లే టవర్లు (ఎడబ్ల్యుటీ )

2,000 మందికి పైగా సుశిక్షితులైన అగ్నిమాపక సిబ్బంది

అన్ని గుడారా ఆవాసాల్లో అగ్నిమాపక భద్రతా పరికరాల ఏర్పాటు

 

 


అత్యవసర, విపత్తు ప్రతిస్పందన

మల్టీ డిజాస్టర్ రెస్పాన్స్ వెహికల్స్: లిఫ్టింగ్ బ్యాగులు (10-20 టన్నులు), రెస్క్యూ టూల్స్, విక్టిమ్ లొకేషన్ కెమెరాలు ఉంటాయి.

రిమోట్ కంట్రోల్డ్ లైఫ్ బోయ్స్: నీటిలో తక్షణ రక్షణ చర్యల కోసం మోహరింపు

ఇన్సిడెంట్ రెస్పాన్స్ సిస్టం ( ఐఆర్ఎస్): సమన్వయ కమాండ్ వ్యవస్థ ద్వారా అవాంఛనీయ ఘటనలకు వెంటనే స్పందించేందుకు ఏర్పాటు.

నది పొడవునా భద్రత పెంపు

కార్యక్రమానికి ముందు 1,300 మంది, ప్రస్తుతం విధుల్లో ఉన్న 2,500 మంది సహా మొత్తం 3,800 మంది వాటర్ పోలీస్ సిబ్బందిని నియమించారు.

గస్తీ కోసం 11 ఎఫ్ ఆర్ పి స్పీడ్ మోటార్ బోట్లు , మార్గమధ్యంలో మార్పునకు వీలైన నాలుగు భారీ మోటార్ బోట్లు అందుబాటులో ఉంచారు..

24 గంటలూ పని చేసే మూడు వాటర్ పోలీస్ స్టేషన్లు, రెండు ఫ్లోటింగ్ రెస్క్యూ స్టేషన్లు ఏర్పాటు చేశారు.

నది వెంబడి వైద్య సదుపాయాలతో కూడిన నాలుగు వాటర్ అంబులెన్సులు ఉన్నాయి.

డీప్ వాటర్ బారికేడింగ్: ప్రమాదాలను నివారించడానికి 8 కిలోమీటర్ల మార్గాన్ని సురక్షితం చేశారు

పరికరాల మోహరింపు: 100 డైవింగ్ కిట్లు, 440 లైఫ్ బాయ్స్, 3,000 లైఫ్ జాకెట్లు.

మొత్తం మోహరింపు, మౌలిక సదుపాయాలు

భద్రతా దళాలు: 10,000+ పోలీసు సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సీఏపీఎఫ్, పీఏసీ, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు.

ప్రయాగ్ రాజ్ లో పోలీస్ మౌలిక సదుపాయాలు:

57 శాశ్వత పోలీస్ స్టేషన్లు..

13
తాత్కాలిక పోలీస్ స్టేషన్లు..

23
సెక్యూరిటీ చెక్ పోస్టులు..

8
జోన్లు, 18 సెక్యూరిటీ సెక్టార్లు.

నదుల వెంబడి పోలీసులు, విపత్తు ప్రతిస్పందన సిబ్బందితో కూడిన 700+ బోట్లు

మాక్ డ్రిల్స్ , తనిఖీలు: భద్రతా సన్నద్ధత కోసం పోలీసులు, ఎటిఎస్ బృందాలతో నిర్వహణ

మహా కుంభమేళాలో సీఆర్పీఎఫ్ పాత్ర

24/7 భద్రత: ఘాట్లు, మేళా మైదానాలు, కీలక మార్గాల్లో సిబ్బందిని మోహరించారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం: అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా నిర్వహించడానికి అప్రమత్త పర్యవేక్షణ.

మార్గదర్శకం - సహాయం: భక్తులు విస్తృత జన సమూహంలో సులభంగా వెళ్లేందుకు మర్యాదపూర్వకంగా సహాయం చేయడం.

విపత్తు నిర్వహణ: సంక్షోభ నివారణ కోసం అత్యంత అప్రమత్తంగా రాపిడ్ రెస్పాన్స్ టీమ్

మానవతా ప్రయత్నాలు: దారి తప్పిన పిల్లలు, వృద్ధులను వారి కుటుంబాల వద్దకు తిరిగి చేర్చడానికి సహాయపడటం.

మహాకుంభమేళాలో సైబర్ భద్రత

మహా కుంభమేళాను 65 కోట్లకు పైగా భక్తులు దర్శించుకున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులకు అవగాహన కల్పించేందుకు ప్రింట్, డిజిటల్, సోషల్ మీడియా సహా ప్రతి వేదికను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వినియోగించుకుంది. సైబర్ నిపుణులు ఆన్లైన్ బెదిరింపులను సమర్థంగా పర్యవేక్షించారు. ఏఐ, ఫేస్ బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ ఫామ్ లను దుర్వినియోగం చేసే ముఠాలపై గట్టి నిఘా పెట్టారు. ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు మొబైల్ సైబర్ టీంను కూడా రంగంలోకి దింపారు.

ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే యాత్రికుల రక్షణ కోసం ప్రత్యేక సైబర్ భద్రతా ఏర్పాట్లు ప్రారంభించారు. సైబర్ పెట్రోలింగ్ కోసం 56 మంది ప్రత్యేక సైబర్ వారియర్స్, నిపుణులను నియమించారు.

మోసపూరిత వెబ్సైట్లు, సోషల్ మీడియా మోసాలు, నకిలీ లింకులు వంటి సైబర్ బెదిరింపులను ఎదుర్కోవడానికి మహా కుంభ్ సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు.

సైబర్ ముప్పులపై అవగాహన కల్పించేందుకు ఫెయిర్ ఏరియా, కమిషనరేట్లలో 40 వేరియబుల్ మెసేజింగ్ డిస్ ప్లేలు (వీఎండీలు) ఏర్పాటు చేశారు.

ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ 1920 ఏర్పాటుతో పాటు ప్రభుత్వ అధికార వెబ్‌సైట్‌లకు ప్రచారం.

మహాకుంభమేళాలో చెల్లింపులు సులభతరం

నిరంతర డిజిటల్ బ్యాంకింగ్ సేవలు: లక్షలాది మంది భక్తులు, యాత్రికులకు సౌలభ్యం, భద్రత, రక్షణ కల్పించడం.

సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్: ఐదు కీలక ప్రాంతాల్లో సర్వీస్ కౌంటర్లు, మొబైల్ బ్యాంకింగ్ యూనిట్లు, కస్టమర్ అసిస్టెన్స్ కియోస్క్ లు

డాక్ సేవకులు: విశ్వసనీయమైన డాక్ సేవకులు ఏఈపీఎస్ (ఆధార్ ఏటీఎం) ద్వారా ఆధార్ లింక్ ఉన్న ఖాతాల నుంచి నగదు ఉపసంహరణకు అవసరమైనవారి వద్దకు వెళ్లి బ్యాంకింగ్ సేవలను అందించారు.

'బ్యాంకింగ్ ఎట్ కాల్' సదుపాయం: మహా కుంభమేళాలో ఎక్కడైనా బ్యాంకింగ్ సేవలను పొందడానికి యాత్రికులకు 7458025511 డయల్ సేవలు అందించారు.

డిజిటల్ లావాదేవీల సాధికారత: స్థానిక విక్రేతలు, వ్యాపారులు డాక్ పే క్యూఆర్ కార్డుల ద్వారా డిజిటల్ చెల్లింపులను ఆమోదించడానికి వీలు కల్పించారు. నగదు రహిత వ్యవస్థను ప్రోత్సహించారు.

అవగాహన కార్యక్రమాలు: శిక్షణ పొందిన నిపుణులు, డాక్ సేవకులు హోర్డింగ్ లు డిజిటల్ ప్రదర్శనల ద్వారా యాత్రికులు విక్రేతలకు అవగాహన కల్పించారు. ఖాతా తెరవడంలో లావాదేవీలలో, సందేహాలు తీర్చడంలో సహాయపడ్డారు.

జ్ఞాపికలు: సందర్శకులు గుర్తుగా ఉంచుకోవడానికి ముద్రిత ఛాయాచిత్రాలను ఉచితంగా అందించారు.

మహాకుంభమేళాకు రైల్వే సేవలు

మహా కుంభమేళా 2025 కు అంతరాయం లేని రవాణా, భద్రత, అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేయడంలో భారతీయ రైల్వే విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్‌రాజ్, పరిసర ప్రాంతాల్లో విపరీతమైన భక్తుల రద్దీకి అనుగుణంగా రైల్వే కార్యకలాపాలు, మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలను చేపట్టింది.

1.నిర్వహణపరమైన చర్యలు: ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా భారతీయ రైల్వే ఈ కింది చర్యలను అమలు చేసింది:

ప్రత్యేక రైళ్లు : దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాగ్ రాజ్ కు అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో 1,000 కి పైగా ప్రత్యేక రైళ్లను నడిపింది.

రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపు: అదనపు ప్రయాణికులను నిర్వహించడానికి కీలకమైన మార్గాల్లో నడిచే సాధారణ రైళ్లను పెంచారు.

రిజర్వేషన్ వ్యవస్థ మెరుగుదల: తత్కాల్, ప్రత్యేక బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేసి టికెట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశారు.

ప్రత్యేక హెల్ప్ డెస్కులు : యాత్రికులకు సహాయం చేయడానికి ప్రధాన రైల్వే స్టేషన్లలో సమాచార కేంద్రాలను, విచారణ కౌంటర్లను పెంచారు.

2.
భద్రత, రద్దీ నిర్వహణ: విపరీతమైన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, భద్రతా చర్యలను గణనీయంగా పెంచారు:

ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది మోహరింపు: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ)కు చెందిన 10,000 మందికి పైగా సిబ్బందిని కీలక స్టేషన్లలో మోహరించారు.

సీసీటీవీ నిఘా: వాస్తవ సమయ పర్యవేక్షణ కోసం కోసం రైల్వే స్టేషన్లు, రైళ్ల లోపల హై రిజల్యూషన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

డ్రోన్ నిఘా: రద్దీ పర్యవేక్షణ, అత్యవసర పరిస్థితుల్లో సత్వర స్పందన కోసం డ్రోన్లను ఉపయోగించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రద్దీ పర్యవేక్షణ వ్యవస్థలు: ప్రయాణికుల రద్దీని పర్యవేక్షించడానికి, తొక్కిసలాటలను నివారించడానికి అడ్వాన్స్డ్ ఏఐ ఆధారిత ప్రిడిక్టివ్ మోడలింగ్ ను ఉపయోగించారు.

3.
పెరిగిన సందర్శకులకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రధాన మౌలిక సదుపాయాలకు అప్ గ్రేడ్ లు:

ప్లాట్ ఫాంల విస్తరణ: అదనపు రైళ్ల నిర్వహణ కోసం ప్రయాగ్ రాజ్, పరిసర ప్రాంతాల్లోని స్టేషన్లను విస్తరించారు.

కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు (ఎఫ్ వోబీలు): ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేయడానికి అదనపు ఎఫ్ వోబీలను నిర్మించారు.

మరింత లైటింగ్, సైనేజ్: రైల్వే స్టేషన్లలో మరింత మెరుగైన లైటింగ్, డిజిటల్ సైన్‌బోర్డులు ఏర్పాటు చేసి ప్రయాణీకులకు సులభమైన మార్గదర్శనం అందించారు.

ఎస్కలేటర్లు, లిఫ్టులు: వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం స్టేషన్లను ఎస్కలేటర్లు, లిఫ్టులతో అప్ గ్రేడ్ చేశారు.

4.
ప్రయాణీకుల సౌకర్యాలు, డిజిటల్ చొరవలు: ప్రయాణీకులకు మరింత సౌకర్యం గా ఉండేందుకు భారతీయ రైల్వే అనేక ప్రయాణీకుల స్నేహపూర్వక కార్యక్రమాలను ప్రవేశపెట్టింది:

అదనపు వెయిటింగ్ రూమ్ లు, విశ్రాంతి ప్రాంతాలు: తగినంత సీటింగ్, పరిశుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలతో తాత్కాలిక వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు.

ఆహారం, మంచినీరు: పరిశుభ్రమైన భోజనం, తాగునీరు అందించేందుకు ప్రత్యేక ఫుడ్ కౌంటర్లు, కియోస్క్ లను ఏర్పాటు చేశారు.

డిజిటల్ టికెటింగ్, మొబైల్ యాప్ సేవలు: రియల్-టైమ్ రైలు ట్రాకింగ్, టికెట్ బుకింగ్, అత్యవసర సేవల సమాచారం కోసం భారతీయ రైల్వే యాప్‌ను అప్డేట్ చేశారు.

పబ్లిక్ అనౌన్స్‌మెంట్ వ్యవస్థలు: రైళ్ల రాక, పొకల సంబంధిత సమయానుకూల ప్రకటనల కోసం అధిక నాణ్యత గల పిఎ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.

5. విపత్తు సంసిద్ధత, అత్యవసరంగా స్పందించటం: ప్రమాదాలను తగ్గించడానికి, అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారతీయ రైల్వే శాఖ ఈ చర్యలు తీసుకుంది.
అత్యవసర స్పందన దళాలు : వైద్యారోగ్య అత్యవసర పరిస్థితి, భారీ జనాన్ని సమర్థవంతంగా నియంత్రించేందుకు వీటిని కీలక స్టేషన్లలో మోహరించారు.

రైళ్లలో వైద్యారోగ్య సదుపాయాలు: సుదూర రైళ్లలో ప్రత్యేక వైద్యారోగ్య బోగీలను చేర్చారు.

అగ్నిమాపక భద్రతా చర్యలు: రైల్వే బోగీలు, స్టేషన్లలో అగ్నిమాపక యంత్రాలు, అత్యవసరంగా బయటకు వెళ్లే ద్వారాలను సమీక్షించి అప్‌గ్రేడ్ చేశారు.

స్థానిక అధికారులతో సమన్వయం: స్థానిక పోలీసులు, వైద్యారోగ్య సంరక్షణ యూనిట్లు, విపత్తు నిర్వహణ బృందాలతో నిరంతర సమన్వయం.

మహా కుంభమేళా వద్ద బస్సు రవాణా

మహా కుంభమేళా కోసం ఫిబ్రవరి 12 న అదనంగా 1200 అదనపు బస్సులను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మోహరించింది. ఇవి అప్పటికే కేటాయించిన 3050 బస్సులకు అదనం. నగరంలో అంతర్గతంగా రవాణాను మెరుగుపరిచేందుకు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు.

నాలుగు తాత్కాలిక బస్ స్టేషన్లలో ప్రతి 10 నిమిషాలకు ఒకటి చొప్పున బస్సులు అందుబాటులో ఉన్నాయి.

నగరాల మధ్య రవాణా కోసం ప్రతి 2 నిమిషాలకు 750 బస్సులు(షటిల్ సర్వీసెస్) నడిచాయి.

భారీ రద్దీని నివారించడానికి, యాత్రికుల రాకపోకలు సజావుగా సాగేందుకు చర్యలు తీసుకున్నారు.

మహా కుంభమేళాకు విమాన రవాణా సౌకర్యం


జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగిన కుంభమేళా మహోత్సవం సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయాగ్‌రాజ్‌ విమానాశ్రయాన్ని భారీగా ఆధునికీకరించారు. విమానాశ్రయ విస్తరణ వల్ల అనుసంధానత, సామర్థ్యం పెరిగి ప్రయాణికులకు సేవలు మెరుగుపడ్డాయి. దీనివల్ల అంతరాయం లేని ప్రయాణ అనుభవాన్ని యాత్రికులు పొందారు. మహా కుంభమేళాకు వచ్చే పర్యాటకులకు అంతరాయం లేని ప్రయాణాన్ని అందేలా చూసుకునేందుకు పర్యాటక మంత్రిత్వ శాఖ అలయన్స్ ఎయిర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలోని అనేక నగరాల నుంచి ప్రయాగ్‌రాజ్‌కు విమాన కనెక్టివిటీని పెంచేందుకు ఈ భాగస్వామ్యం పని చేసింది.

విమాన కార్యకలాపాలు, అనుసంధానత

యాత్రికుల సౌకర్యార్థం జనవరిలో 81 కొత్త విమానాలను ప్రవేశపెట్టారు.

మొత్తం విమానాల సంఖ్య 132 కు పెరిగింది. దీని ద్వారా నెలకు 80,000 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.

8 నగరాల నుంచి ఉన్న ప్రత్యక్ష అనుసంధానం గత డిసెంబరులో 17 నగరాలకు పెరిగింది. పరోక్ష(కనెక్టింగ్) విమానాలు శ్రీనగర్, విశాఖపట్నంతో సహా 26 నగరాలకు ఉన్నాయి.

ముఖ్యంగా షాహీ స్నాన్ (జనవరి 29, ఫిబ్రవరి 3), ఇతర ప్రధాన స్నాన తేదీలు(ఫిబ్రవరి 4, 12, 26) వంటి రద్దీ రోజులకు విమాన ఛార్జీలను నియంత్రించాలని విమానయాన సంస్థలను కేంద్ర పౌర విమానయాన మంత్రి ఆదేశించారు.


ప్రయాణీకులు, విమాన ట్రాఫిక్

వారం రోజుల్లో 30,172 మంది ప్రయాణికులు విమానాల్లో ప్రయాగ్‌రాజ్‌ వచ్చారు. ఒకే వారంలో 226 విమానాలు నిర్వహించారు.

తొలిసారిగా ఒకే రోజులో 5 వేల మంది ప్రయాగ్‌రాజ్‌ విమానాశ్రయం నుంచి ప్రయాణించారు.

రాత్రి విమానాలను ప్రవేశపెట్టారు. దీనిద్వారా 24/7 అనుసంధానత లభించింది. 106 ఏళ్ల ఈ విమానాశ్రయ చరిత్రలో ఇది చారిత్రాత్మక మైలురాయిగా చెప్పుకోవచ్చు.

మౌలిక సదుపాయాల విస్తరణ


విమానాశ్రయ టర్మినల్ వైశాల్యాన్ని 6,700 చదరపు మీటర్ల నుంచి 25,500 చదరపు మీటర్లకు విస్తరించారు.

పాత టెర్మినల్‌ను రద్దీ సమయంలో 1,080 మంది ప్రయాణికులు ప్రయాణించేలా, కొత్త టెర్మినల్ 1,620 మందిని నిర్వహించేలా పునర్నిర్మించారు.


పార్కింగ్ సామర్థ్యాన్ని 200 నుంచి 600 వాహనాలకు పెంచారు.

చెక్-ఇన్ కౌంటర్లు 8 నుంచి 42కు, బ్యాగేజ్ స్కానింగ్ మెషీన్లు(ఎక్స్‌బీఐఎస్-హెచ్బీ) 4 నుంచి 10కి పెరిగాయి.

విమానాల పార్కింగ్ బేలు 4 నుంచి 15కు, కన్వేయర్ బెల్టులు 2 నుంచి 5కు పెరిగాయి.

ట్యాక్సీ ట్రాక్‌లు, విమానాశ్రయ గేట్లను 4 నుంచి 11కు విస్తరించారు.


మెరుగైన ప్రయాణ అనుభవం


ప్రయాణీకుల రాకపోకలు సజావుగా సాగేందుకు బోర్డింగ్ బ్రిడ్జిలను 2 నుంచి 6కు పెంచారు.

కొత్త లాంజ్‌లు, చిన్నపిల్లల సంరక్షణ గదులు, అదనపు ఎఫ్‌అండ్‌బీ కౌంటర్లను ఏర్పాటు చేశారు. .

అందుబాటు ధరలో ఎక్కువ ఆహార పదార్ధాలు లభ్యమయ్యేలా ఉడాన్ యాత్రి కేఫ్‌ను ఏర్పాటు చేశారు.

దివ్యాంగుల కోసం మీట్‌ అండ్‌ గ్రీట్ సేవలను ప్రారంభించారు.

ప్రీపెయిడ్ ట్యాక్సీ కౌంటర్లు, సిటీ బస్సు సర్వీసులను యూపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రవేశపెట్టారు.


భద్రత, వైద్య సౌకర్యాలు


అదనపు ఏరోబ్రిడ్జిలు, ద్వారాల్లో ఉండే మెటల్ డిటెక్టర్లతో భద్రతకు సంబంధించిన మౌలిక సదుపాయాలను బలోపేతం చేశారు.

వైద్యారోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అంబులెన్సులు, ఎయిర్ అంబులెన్స్ సేవలను ఉపయోగించారు.

ఇక్కడికి వచ్చిన యాత్రికులకు పుష్పగుచ్ఛాలు అందించి ఆధ్యాత్మిక ప్రయాణ అనుభూతిని పెంచారు.

సురక్షితమైన ఆహార పదార్ధాలు

మహా కుంభమేళాలో అందుబాటు ధరలో సురక్షితమైన ఆహారాన్ని అందించడానికి కేంద్ర, ఉత్తర‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకున్నాయి. లక్షలాది మంది భక్తులకు సబ్సిడీ రేషన్, ఉచిత భోజనం అందించటమే కాకుండా.. కఠినమైన ఆహార భద్రతా పద్ధతులను అనుసరించారు.



నాఫెడ్ ద్వారా సబ్సిడీ రేషన్ పంపిణీ

అందుబాటు ధరల్లో నాణ్యమైన సరుకులను(రేషన్‌) ప్రయాగ్‌రాజ్ అంతటా పంపిణీ చేశారు.

1000
మెట్రిక్ టన్నులకు పైగా సరుకులను అందించారు.

20
మొబైల్ వ్యాన్లు మహా కుంభమేళా అంతటా డెలివరీ చేశాయి.

ఇంటి వద్దనే డెలివరీ కోసం 72757‌81810 నంబర్‌కు వాట్సాప్ లేదా ఫోన్ కాల్ ద్వారా ఆర్డర్ చేసేలా ఏర్పాటు చేశారు.

సబ్సిడీ సరుకులు:

గోధుమ పిండి, బియ్యం (10 కిలోల ప్యాకెట్లు).

పెసర, శనగ పప్పు (1 కిలో ప్యాకెట్లు).

రాత్రంతా నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమంలో ఘాట్లు, ఉత్సవ ప్రదేశాల్లో పరిశుభ్రత పునరుద్ధరణ

జనవరి 21 నుంచి ఫిబ్రవరి 1 వరకు 40 లక్షల మంది యాత్రికులు ఈ వాటర్ ఏటీఎంలను ఉపయోగించున్నారు.

మొదట్లో నాణేలు, యూపీఐ చెల్లింపుల ద్వారా రూ.1కి ఒక లీటరు లభించేంది. కానీ తర్వాత ఉచితంగా అందించారు.

లోపాలను గుర్తించేందుకు ప్రతి ఏటీఎంలో సెన్సార్ ఆధారిత మానిటరింగ్.

సిమ్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం అధికారుల సెంట్రల్ నెట్‌వర్క్‌తో అనుసంధానమై ఉండేలా చూసుకుంటుంది.

ఒక్కో ఏటీఎంలో రోజుకు 12 వేల నుంచి 15 వేల లీటర్ల ఆర్వో నీటి సరఫరా.

సజావుగా పనిచేయడానికి, సాంకేతిక సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ఆన్-సైట్ ఆపరేటర్లు.

భక్తులు ప్లాస్టిక్ వాడకుండా బాటిళ్లను మళ్లీ మళ్లీ నింపుకొని వ్యర్థాలను తగ్గిచేలా చర్యలు.

పరిశుభ్రత, సుస్థిరతపై దృష్టి పెట్టిన నీటి సరఫరా..

నిరంతరాయంగా సేవలు అందించేందుకు ఏటీఎంలను పర్యవేక్షించిన సాంకేతిక బృందాలు

ఇంటర్నేషనల్ బర్డ్ ఫెస్టివల్

సైన్స్, ప్రకృతి, సంస్కృతిని మిళితం చేస్తూ పర్యావరణ పరిరక్షణ, సుస్థిరాభివృద్ధి విషయంలో ప్రేరణ కలిగించిన కుంభమేళా

తేదీ, ప్రాంతం: ఫిబ్రవరి 16-18, 2025, ప్రయాగ్‌రాజ్.

పక్షి జాతులు: అంతరించిపోతున్న జాతులతో సహా 200కి పైగా వలస, స్థానిక పక్షులు.

లక్ష్యం: పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యతపై అవగాహన పెంపొందించడం.

కుంభమేళా విశేషాలు

పక్షులను వీక్షించటం, అవగాహన

ఇండియన్ స్కిమ్మర్, ఫ్లెమింగో, సైబీరియన్ క్రేన్ వంటి అరుదైన పక్షులు.

సైబీరియా, మంగోలియా, ఆఫ్ఘనిస్తాన్, ఇతర ప్రాంతాల నుంచి వేలాది వలస పక్షులు.

నిపుణుల నేతృత్వంలోని పక్షుల మధ్య నడక, ప్రకృతి మధ్య నడకతో పాటు భక్తుల కోసం ఎకో టూరిజం ప్రణాళిక.

పోటీలు, కార్యకలాపాలు

ఫొటోగ్రఫీ, పెయింటింగ్, స్లోగన్ రైటింగ్, డిబేట్స్, క్విజ్‌లు.

21
లక్షల విలువైన బహుమతులు(రూ. 10,000 నుంచి రూ. 5 లక్షలు)

నిపుణుల భాగస్వామ్యం

సాంకేతిక సెషన్‌లలో పక్షి శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు, సంరక్షణ నిపుణులు.

పక్షుల వలసలు, ఆవాసాల పరిరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావంపై చర్చ

సాంస్కృతిక, విద్యా సంబంధిత కార్యక్రమాలు

జీవవైవిధ్యంపై వీధినాటకాలు, కళా ప్రదర్శనలు, సాంస్కృతిక ప్రదర్శనలు.

ప్రత్యక్ష అభ్యాసం కోసం పరిరక్షణ కార్యక్రమాల్లో విద్యార్థుల భాగస్వామ్యం.

 

మహా కుంభమేళా ప్రముఖుల జాబితా

అనేకమంది ప్రముఖులు ప్రయాగ్ రాజ్ కు వచ్చి పవిత్ర త్రివేణీ సంగమంలో స్నానమాచరించారు:

గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

హోం మంత్రి శ్రీ అమిత్ షా

రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్

ఉత్తరప్రదేశ్ గవర్నరు శ్రీమతి ఆనందీబెన్ పటేల్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర కేబినెట్ మంత్రులు

ముఖ్యమంత్రులు:

రాజస్థాన్ - శ్రీ భజన్ లాల్ శర్మ

హర్యానా - శ్రీ నయాబ్ సింగ్ సైనీ

మణిపూర్ - శ్రీ ఎన్. బీరెన్ సింగ్

గుజరాత్ - శ్రీ భూపేంద్ర పటేల్

కేంద్రమంత్రులు:

శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్

శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్

శ్రీ శ్రీపాద నాయక్

పార్లమెంటు సభ్యులు:

డాక్టర్ సుధాన్షు త్రివేది

శ్రీ అనురాగ్ ఠాకూర్

శ్రీమతి సుధా మూర్తి

శ్రీ రవి కిషన్

క్రీడాకారులు, చలనచిత్ర ప్రముఖులు

ఒలింపిక్ పతక విజేత సైనా నెహ్వాల్

క్రికెటర్ సురేశ్ రైనా

అంతర్జాతీయ రెజ్లర్ ఖలీ

సుప్రసిద్ధ కవి కుమార్ విశ్వాస్

కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా

బాలీవుడ్ నటి కత్రినా కైఫ్

బాలీవుడ్ నటి రవీనా టాండన్

 

కళాగ్రామం

మహా కుంభమేళా జిల్లా సెక్టార్ -7లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కళాగ్రామ్ సుసంపన్నమైన భారత వారసత్వాన్ని చాటే ఉత్తేజకరమైన సాంస్కృతిక గ్రామం. కళలు, వంటకాలు, సంస్కృతి ఇతివృత్తాలుగా నెలకొల్పిన ఈ గ్రామం.. ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లు, ప్రత్యక్షానుభూతినిచ్చే ఏర్పాట్లతో అద్భుతమైన అనుభవాన్నిచ్చింది. సాంప్రదాయక కళలు, జానపద ప్రదర్శనలు, డిజిటల్ కథనాలు, పాకశాస్త్ర ప్రావీణ్యాలను ఒక్కచోట చేర్చిన ఈ గ్రామం భక్తులు, పర్యాటకులు తప్పక చూడాల్సిన ప్రదర్శన. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 15,000 మంది కళాకారులు ఇందులో ప్రదర్శనలిచ్చారు.

 

 

కళాగ్రామ విశేషాలు:

గొప్ప ప్రవేశ ద్వారం: 635 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తుతో ముఖద్వారాన్ని ఏర్పాటు చేశారు. 12 జ్యోతిర్లింగాలు, హాలాహలాన్ని సేవిస్తున్న శివుడి ప్రతిమలను చిత్రించారు.

భారీ వేదిక: 104 అడుగుల వెడల్పు, 72 అడుగుల ఎత్తుతో చార్ ధామ్ ఇతివృత్తంగా వేదికను నిర్మించారు.

ప్రదర్శనలు: 14,632 మంది కళాకారులు వివిధ దశాల్లో రోజూ వేదికపై ప్రదర్శనలిస్తారు.

అనుభూతి మండపం: సంపూర్ణంగా 360° అనుభవాన్ని అందిస్తూ, అందులో లీనమయ్యేలా గంగావరోహణను వర్ణిస్తూ ఈ మండపాన్ని తీర్చిదిద్దారు.

అవిరళ శాశ్వత కుంభమేళా: కుంభమేళా చరిత్రపై ఏఎస్ఐ, ఎన్ఏఐ, ఐజీఎన్సీఏ డిజిటల్ ప్రదర్శన.

ఫుడ్ జోన్: వివిధ ప్రాంతాల సాత్విక వంటకాలను, ప్రయాగరాజ్ స్థానిక వంటకాలను పరిచయం చేస్తుంది.

సంస్కృతి ఆవరణ: ఏడు జోనల్ సాంస్కృతిక కేంద్రాలకు చెందిన 98 మంది చేతివృత్తుల వారి హస్తకళలు, చేనేత.

 

మహా కుంభమేళాలో అంతర్జాతీయ పర్యాటకం

విదేశీ యాత్రికులు, యాత్రా రచయితలు, వివిధ దేశాల ఆధ్యాత్మిక సాధకులు ఎందరో తరలిరాగా.. ప్రపంచమంతా ఈ ప్రయాగరాజ్ మహాకుంభమేళా వైపే చూసింది. ప్రపంచవ్యాప్తంగా తరలివచ్చిన యాత్రికులకు సౌలభ్యాన్ని కలిగించేలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, పర్యాటక మంత్రిత్వ శాఖ విస్తృత ఏర్పాట్లు చేశాయి. సాంస్కృతిక వినిమయాన్ని ప్రోత్సహించి, ప్రపంచ పర్యాటక పటంలో ఈ కార్యక్రమాన్ని విశిష్ట స్థానంలో నిలపడం లక్ష్యంగా కృషిచేశాయి.

అంతర్జాతీయ భాగస్వామ్యం, పర్యాటక కార్యక్రమాలు:

ఫిబ్రవరి 25, 26 తేదీల్లో బ్రిటిష్ యాత్రా రచయితల బృందం మహా కుంభమేళాకు వచ్చి ప్రయాగరాజ్ లోని మతపరమైన ప్రాధాన్యమున్న, చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించింది.

విదేశీ సందర్శకులకు వసతి, వారి పర్యటనకు మార్గనిర్దేశనం, డిజిటల్ సమాచార కేంద్రాలు, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేశారు.

అయోధ్య, వారణాశి, లక్నో పర్యటనలతోపాటు ప్రయాగరాజ్ కోట, ఆనంద భవన్, అక్షయవటం, ఆల్ఫ్రెడ్ పార్క్, సంగమ ప్రాంతాన్ని కూడా ప్రతినిధి బృందం సందర్శించింది.

విదేశీ పర్యాటకులు, సాంస్కృతిక సంలీనత

దక్షిణ కొరియా, జపాన్, స్పెయిన్, రష్యా, అమెరికా, తదితర దేశాలకు చెందిన యాత్రికులు, పర్యాటకులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.

చాలా మంది సంగమఘాట్ వద్ద స్థానిక గైడ్లతో ముచ్చటిస్తూ కార్యక్రమ ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని తెలుసుకున్నారు.

‘‘ఇది జీవితంలో ఒకే సారి లభించే అవకాశం’’ అని స్పెయిన్ కు చెందిన ఓ సందర్శకుడు తన అనుభవాన్ని వివరించారు.

క్రతువులు, కార్యక్రమాల్లో విదేశీ భక్తులు చురుగ్గా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధుసంతులు పుణ్యస్నానాలు ఆచరించారు.

అంతర్జాతీయ సాంస్కృతిక చిహ్నంగా మహా కుంభమేళా

పర్యాటకం, పెట్టుబడుల్లో ఉత్తరప్రదేశ్ కు గల అపారమైన అవకాశాలను చాటేలా.. ‘బ్రాండ్ యూపీ’ లక్ష్యంతో ఈ కార్యక్రమానికి ప్రాచుర్యం కల్పించారు.

అంతర్జాతీయ ఉత్సవాల సందర్భంగా ప్రపంచవ్యాప్త పర్యాటక, ఆతిథ్య రంగ భాగస్వాములతో సంప్రదింపుల ద్వారా సుస్థిర పర్యాటకాన్ని, పెట్టుబడి అవకాశాలను పెంపొందించుకోవడంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నమైంది.

ఆధ్యాత్మికత, నూతన ఆవిష్కరణలకు నిలయంగా భారత ఖ్యాతిని పెంపొందించడమే ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం లక్ష్యం.

అంతర్జాతీయ పర్యాటక ఉత్సవాల్లో ప్రచారం

స్పెయిన్ లోని మాడ్రిడ్ లో ఉన్న ఫితూర్ లో (జనవరి 24-28న) మహా కుంభమేళాను ప్రదర్శించారు. జర్మనీలోని బెర్లిన్ లో ఉన్న ఐటీబీలోనూ (మార్చి 4-6) ప్రదర్శిస్తారు.

ఉత్తరప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని చాటేలా, ప్రపంచవ్యాప్త పర్యాటకులను ఆకర్షించేలా 40 చదరపు మీటర్ల ప్రత్యేక పెవిలియన్లను ఏర్పాటు చేశారు.

అంతర్జాతీయ సహకారానికి ఊతమిచ్చేలా.. వాణిజ్య సంస్థల మధ్య పరస్పర సంప్రదింపుల కోసం, నేరుగా వినియోగదారులతో వాణిజ్య సంస్థల లావాదేవీల కోసం వీవీఐపీ లాంజిలను ఏర్పాటు చేశారు.

వివిధ ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వీక్షకులకు అర్థమయ్యేలా పలు భాషల్లో ప్రచార ఏర్పాట్లు చేశారు.

డిజిటల్ మహా కుంభమేళా అంతర్జాతీయ భాగస్వామ్యం

జనవరి మొదటి వారంలో 183 దేశాల నుంచి 33 లక్షల మంది ఈ మహాకుంభమేళా అధికారిక వెబ్ సైటును వీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా 6,206 నగరాల నుంచి ఈ ఆన్లైన్ వేదికను సందర్శించారు. భారత్, అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ ఇందులో ముందంజలో ఉన్నాయి.

రోజూ లక్షలాదిగా ప్రజలు మహా కుంభమేళా చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాధన్యంపై సమాచారం కోసం వెతుకుతున్నారని ఈ వెబ్ సైటును నిర్వహించే సాంకేతిక బృందం తెలిపింది.

ఈ డిజిటల్ ఏర్పాటు ద్వారా పర్యాటకులకు నిరంతరం సమాచారాన్ని అందించారు. దాంతో ప్రయాణ ఇబ్బందులు లేకుండా, ముఖ్యంగా ఈ ఉత్సవ ఆధ్యాత్మిక అంశాలను తెలుసుకునే అవకాశం పర్యాటకులకు కలిగింది.

 

ఇంక్రెడిబుల్ ఇండియా పెవిలియన్, పర్యాటక సేవలు

పర్యాటక మంత్రిత్వ శాఖ జనవరి 12న మహా కుంభమేళాలో 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇన్ క్రెడిబుల్ ఇండియా పెవిలియన్ ను ఏర్పాటు చేసింది.

విదేశీ పర్యాటకులు, పండితులు, పరిశోధకులు, పాత్రికేయులు, ఫొటోగ్రాఫర్లు, ప్రవాస భారతీయులకు ఇందులో సౌకర్యం కల్పించారు.

దేఖో అప్నా దేశ్ పీపుల్స్ ఛాయిస్ పోల్ ద్వారా భారత్ లో తమకిష్టమైన పర్యాటక ప్రదేశాలకు ఓటు వేసే అవకాశాన్ని సందర్శకులకు కల్పించారు.

కుంభమేళా సమాచారాన్ని 10 అంతర్జాతీయ భాషలతోపాటు తమిళం, తెలుగు, కన్నడ, బెంగాళీ, అస్సామీ, మరాఠీ వంటి స్థానిక భారతీయ భాషల్లో అందించేలా అందించేలా ఓ ప్రత్యేక టోల్ ఫ్రీ టూరిస్ట్ ఇన్ఫోలైన్ (1800111363 లేదా 1363)ను ప్రారంభించారు.

 

విలాసవంతమైన వసతి, ప్రయాణ ప్యాకేజీలు

యూపీఎస్ టీడీసీ, ఐఆర్సీటీసీ, ఐటీడీసీలతో కలిసి పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రత్యేక పర్యాటక ప్యాకేజీలు, విలాసవంతమైన వసతి సదుపాయాలను కల్పిస్తోంది.

ప్రయాగరాజ్ లోని టెంట్ సిటీలో ఐటీడీసీ 80 విలాసవంతమైన వసతి ఏర్పాట్లను చేయగా, ఐఆర్సీటీసీ అంతర్జాతీయ పర్యాటకుల సౌలభ్యం కోసం లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేసింది.

డిజిటల్ బ్రోచర్ తో భారత రాయబార, పర్యాటక కార్యాలయాల ద్వారా పర్యాటక ప్యాకేజీలకు విస్తృతంగా ప్రాచుర్యం కల్పించారు. అలా అంతర్జాతీయ స్థాయిలోనూ పర్యాటకులను వివరాలు అందేలా చూశారు.

ఈ విస్తృత చర్యల ద్వారా ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమంగా మహా కుంభమేళా నిలిచింది. ఇది ఆధ్యాత్మిక పర్యాటకం, అంతర్జాతీయ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా ఉత్తర ప్రదేశ్ స్థానాన్ని సుస్థిరం చేస్తోంది.

 

మహా కుంభమేళాలో ముఖ్య ప్రదర్శనలు

సుసంపన్నమైన భారత సాంస్కృతిక, కళాత్మక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని చాటేలా రూపొందించిన విస్తృత శ్రేణి ప్రదర్శనలను ఈ మహా కుంభమేళాలో ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనల ద్వారా భారత సంప్రదాయాలు, హస్తకళల విశేషాలతోపాటు చారిత్రక కథనాలను తెలుసుకునే అవకాశం సందర్శకులు, యాత్రికులకు దక్కింది.

 

 

1. కుంభ గ్రామ్ (సెక్టార్ 7) ప్రదర్శనలు

కుంభగ్రామ్ లోని సెక్టార్ 7లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలంలో భారతదేశ వారసత్వం, హస్తకళలు, పర్యాటకం, విపత్తు సంసిద్ధత వంటి విభిన్న అంశాలను ప్రతిబింబించేలా అనేక ప్రదర్శనలను నిర్వహించారు:

ఖాదీ గ్రామోద్యోగ్ ప్రదర్శన: దీని ద్వారా ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ప్రాధాన్యాన్ని చాటడంతోపాటు దేశీయ హస్తకళా నైపుణ్యాన్ని, స్వావలంబనను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఒక జిల్లా ఒక ఉత్పత్తి (ఓడీఓపీ) ప్రదర్శన: ఉత్తర ప్రదేశ్ నుంచి జిల్లాల వారీగా ఉత్పత్తుల ప్రదర్శించారు. స్థానిక చేతివృత్తులు, వ్యాపారాలకు చేయూతనివ్వడం దీని లక్ష్యం.

ఉత్తర ప్రదేశ్ దర్శన మండపం: ఉత్తర ప్రదేశ్‌లోని ముఖ్యమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రదేశాలను కళ్లెదుట నిలిపేలా ఏర్పాటు చేశారు.

ఇంక్రెడిబుల్ ఇండియా కళాగ్రామ్: భారత జానపద, సాంప్రదాయక కళారూపాల ఘనతను చాటేలా.. అనేక కళాఖండాలను సేకరించి ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు.

ఛత్తీస్ గఢ్ ప్రదర్శన: గిరిజన కళలు, హస్తకళలు సహా చత్తీస్ గఢ్ కు చెందిన ప్రత్యేకమైన సాంస్కృతిక, సాంప్రదాయక అంశాలను ఇందులో ప్రదర్శించారు.

ఉత్తరప్రదేశ్ పర్యాటక ప్రదర్శన: ప్రయాణాలు, పర్యటనలను ప్రోత్సహించడం కోసం ఉత్తరప్రదేశ్ లోని ప్రధాన పర్యాటక ప్రదేశాల వివరాలను తెలియజేసేలా దీనిని ఏర్పాటు చేశారు.

ఉత్తర మధ్య ప్రాంత సాంస్కృతిక కేంద్రం (ఎన్సీజెడ్ సీసీ) పెవిలియన్: ఈ ప్రాంత సాంస్కృతిక ప్రదర్శనలు, కళలు, వారసత్వంలో వైవిధ్యానికి ప్రాచుర్యం కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శన ఇది.

జాతీయ విపత్తు నిర్వహణ ఆధీకృత సంస్థ (ఎన్డీఎంఏ) ప్రదర్శన: విపత్తు సన్నద్ధత, వైపరీత్యాలను ఎదుర్కొని పూర్వస్థితికి చేరుకోగల సమర్థత, అత్యవసర ప్రతిస్పందన యంత్రాంగాలపై సందర్శకులకు అవగాహన కల్పించడం కోసం ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు.

 

2. అలహాబాద్ మ్యూజియంలో భాగవత ప్రదర్శన

భాగవతంలోని ఘట్టాల ఆధారంగా రూపొందించిన వివిధ సూక్ష్మచిత్రాలతో అలహాబాద్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ‘భాగవత’ ప్రదర్శనను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభించారు. భాగవతంలోని ముఖ్యమైన ఘట్టాలను సునిశితమైన చిత్రాల ద్వారా ఇందులో ప్రదర్శించారు. దీని ద్వారా భారత ఆధ్యాత్మిక, కళా సంప్రదాయాల విశేషాలను సందర్శకులకు వివరించారు.

 

3. ‘అవిరళ శాశ్వత కుంభ్’ ప్రదర్శన

కుంభమేళా మూలాలు, అనేక శతాబ్దాలుగా ఈ వేడుకలో జరిగిన పరిణామాలతో కూడిన చారిత్రక విశేషాలను ఈ ప్రదర్శన తెలియజేసింది. కళాఖండాలు, డిజిటల్ ప్రదర్శనలు, సమాచార పోస్టర్లను ఇందులో భాగంగా ఏర్పాటు చేశారు. ఈ మహా వేడుక శాశ్వత వారసత్వం, భారత ఆధ్యాత్మిక రంగంలో దాని పాత్రపై సందర్శకులకు అవగాహన కల్పించడం అవిరళ శాశ్వత కుంభ్ ప్రదర్శన లక్ష్యం.

మహాకుంభమేళా సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలు యాత్రికులకు మెరుగైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందించడం మాత్రమే కాకుండా, సుసంపన్నమైన భారతీయ సాంస్కృతిక వారసత్వపు గవాక్షాలుగా నిలిచాయి. సాంప్రదాయక కళానైపుణ్యం, చారిత్రాత్మక పూర్వాపరాలు, ప్రత్యక్షానుభవాన్నిచ్చే ప్రదర్శనల సమ్మేళనంగా నిలిచిన ఈ ప్రదర్శనలు మహా కుంభమేళాను లక్షలాది మంది యాత్రికులకు చిరస్మరణీయమైనదిగా నిలిపాయి.

 

4. జనభాగిదారీ సే జనకల్యాణ్’ ప్రదర్శన

జన్‌భాగిదారీ సే జాన్‌కల్యాణ్‌’ పేరిట మల్టీమీడియా ప్రదర్శనను కూడా కేంద్ర సమాచార కార్యాలయం (సీబీసీ) మహా కుంభమేళాలో ఏర్పాటు చేసింది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగిన ఈ ఎగ్జిబిషన్ లో గత దశాబ్ద కాలంగా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, విధానాలు, పథకాలు, సాధించిన విజయాలను ప్రదర్శించారు. అనార్మఫిక్ గోడలు, ఎల్ఈడీ టీవీ తెరలు, హాలోగ్రాఫిక్ సిలిండర్ల వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సందర్శకులకు వివిధ ప్రభుత్వ కార్యక్రమాలపై సమగ్ర సమాచారాన్ని అందించింది.ఒకే దేశం ఒకే పన్ను’, ‘ఒకే దేశం, ఒకే పవర్ గ్రిడ్’, ‘ఒకే దేశం ఒకే రేషన్ కార్డు’ వంటి ఇతివృత్తాలకు ప్రాధాన్యమిస్తూ జాతీయ ఐక్యతను ప్రోత్సహించే చర్యలను ఈ ప్రదర్శన ప్రముఖంగా చాటుతోంది. అంతేకాకుండా, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధి, ఆర్థిక సాధికారతకు సంబంధించిన పథకాలకు ప్రాచుర్యం కల్పించడంపై ఇందులో ప్రధానంగా దృష్టి సారించారు. ప్రజలకు విస్తృతంగా సమాచారాన్ని అందించడం ద్వారా దేశాభివృద్ధిలో వారిని వారిని భాగస్వాములను చేయడం దీని లక్ష్యం.

మహా కుంభ్‌లో టెలికాం: బీఎస్ఎన్ఎల్

ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా, మహా కుంభ మేళాలో కమ్యూనికేషన్ సంబంధి మౌలిక సదుపాయాలను పటిష్టపరచడంలో భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఒక ముఖ్య పాత్రను పోషించింది. లక్షల సంఖ్యలో తీర్థయాత్రికులకు, పరిపాలనాధికారులకు, భద్రత దళాల వారికి, స్వచ్ఛంద సేవకులకు విశ్వసనీయ సంధాన సౌకర్యాన్ని బీఎస్ఎన్ఎల్ కల్పించింది. మేళా ప్రాంతంలో ఒక ప్రత్యేక వినియోగదారు సేవాకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ కేంద్రం ద్వారా సందర్శకులకు అక్కడికక్కడే సహాయం చేయడం, ఫిర్యాదులకు పరిష్కారం చూపడం, అంతరాయ రహిత కమ్యూనికేషన్ సేవలను అందించడం చేశారు.

దేశంలో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన యాత్రికులకు వారు ఏ సర్కిళ్లకు చెందిన వారయితే ఆ సర్కిళ్ల సిమ్ కార్డులను ఉచితంగా ఇచ్చారు. యాత్రికుల్లో ఎవరైనా వారి సిమ్ కార్డు పోగొట్టుకున్నా, లేదా ఆ కార్డు పాడయిపోయినా మరో కార్డును పొందడానికి వారి స్వరాష్ట్రానికి తిరిగివెళ్లనక్కరలేకుండానే, బీఎస్ఎన్ఎల్ వారు దేశమంతటా అన్ని సర్కిళ్లకు చెందిన సిమ్ కార్డుల్ని మేళా ప్రాంతంలో అందుబాటులో ఉంచుతూ తగిన ఏర్పాట్లను చేశారు. ఈ విధమైన సేవలను ఎలాంటి రుసుం వసూలు చేయకుండా అందజేశారు. దీంతో భక్తులు ఈ కార్యక్రమం కొనసాగినన్ని రోజులూ తమ కుటుంబ సభ్యులతో ఫోన్ మాధ్యమం ద్వారా సంప్రదింపులు జరిపేందుకు అవకాశం ఏర్పడింది.

రెండో సెక్టర్ లాల్ రోడ్డులో ఒక క్యాంప్ కార్యాలయాన్ని బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి కమ్యూనికేషన్ సేవలనన్నింటినీ నిర్వహించారు. కుంభ మేళా కాలంలో ఫైబర్ కనెక్షన్లకు, లీజ్‌డ్ లైన్ కనెక్షన్లకు, మొబైల్ రీచార్జులకు గిరాకీ చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. వేరు వేరు రాష్ట్రాల సిమ్ కార్డులు అందుబాటులో ఉండేటట్లు బీఎస్ఎన్ఎల్ జాగ్రత్తలు తీసుకోవడంతో ఇటు యాత్రికులూ, అటు భద్రత సిబ్బందీ లాభపడ్డారు.

అంతరాయానికి తావు ఉండని కమ్యూనికేషన్ల సదుపాయానికి హామీని ఇవ్వడం కోసం మేళా ప్రాంతంలో మొత్తం 90 బీటీఎస్ టవర్లు పనిచేస్తూ ఉండేటట్లు బీఎస్ఎన్ఎల్ శ్రద్ధ తీసుకొంది. ఈ 90 టవర్లలోనూ:

• 700 మెగాహెర్ట్‌జ్ (ఎంహెచ్‌జడ్) 4జి బ్యాండు పై పనిచేసే టవర్లు 30,

• 2100 ఎంహెచ్‌జడ్ బ్యాండు పై పనిచేసే టవర్లు 30,

• 2జి అనుకూల సంధానంతో కూడిన టవర్లు 30 ఏర్పాటు చేశారు.

అదనంగా, బీఎస్ఎన్ఎల్ అనేక ఆధునిక కమ్యూనికేషన్ సేవలను కూడా సమకూర్చింది. వాటిలో:

• ఇంటర్‌నెట్ లీజ్‌డ్ లైన్లు

• డబ్ల్యూఐ-ఎఫ్ఐ (Wi-Fi) హాట్‌స్పాట్స్

• హై-స్పీడ్ ఇంటర్‌నెట్ (ఎఫ్‌టీటీహెచ్)

• వెబ్‌కాస్టింగ్

• ఎస్‌డి-డబ్ల్యూఏఎన్ సేవలు,

• బల్క్ ఎస్ఎమ్ఎస్ సేవలు

• ఎమ్2ఎమ్ సిమ్ లు,



  • శాటిలైట్ ఫోన్ సేవలు.. భాగంగా ఉన్నాయి.

    కార్యక్రమాల అండతో, బీఎస్ఎన్ఎల్ మహా కుంభ మేళా కొనసాగినంత కాలం పాటు నిరంతరాయ కమ్యూనికేషన్‌ను అందజేసింది. దీంతో ఈ వైభవోపేత కార్యక్రమాన్ని దీటైన రీతిలో నిర్వహించడంలో పాలన యంత్రాంగానికీ, ప్రజలకూ సమర్థన అందింది.

     


  • మహా కుంభ మేళాలో అఖాడాలు

    సంవత్సర మహా కుంభ మేళాలో, అఖాడాలు ముఖ్య పాత్ర పోషించాయి. అఖాడాలు సనాతన ధర్మంలో వివిధ సంప్రదాయాలు, శాఖలకు ప్రాతినిధ్యం వహించే వర్గాలన్నమాట. అఖాడా అనే పదం ‘అఖండ్’ నుంచి పుట్టింది. అఖండ్ అంటే విడదీయలేనిది అని అర్థం. ధార్మిక సంస్థలు ఆది గురు శంకరాచార్య కాలం అయిన 6 శతాబ్ది నుంచి ఉనికిలో ఉన్నాయి. ఇవి కుంభ మేళాలో ఆచరించే ధార్మిక కార్యాలతోపాటు ఆచారాల పరిరక్షణ సంస్థలు.

    మొత్తం 13 అఖాడాలు ఈ మహాకుంభ మేళాలో పాలుపంచుకొన్నాయి. వాటిలో కిన్నర్ అఖాడా, దశ్‌నాం సన్యాసినీ అఖాడా, మహిళా అఖాడాలు లైంగిక సమానత్వానికీ, పురోగామి దృష్టికోణానికీ ప్రతీకలు. అఖాడాల ఆధ్వర్యంలో ఘనమైన ఊరేగింపులు, పవిత్ర అనుష్ఠానాలు సాగడం ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణల్లో ఒకటిగా నిలిచాయి. ఇవి లక్షల కొద్దీ భక్తులలో ఆధ్యాత్మిక ఉన్నతి, క్రమశిక్షణ, ఐకమత్యమనే భావనలను ప్రేరేపించాయి.

    సంస్థలు సనాతన ధర్మానికున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలను పరిరక్షించడం ఒక్కటే కాకుండా అన్ని వర్గాలు కలసిమెలసి ఉండాలని, సమానత్వానికి పెద్ద పీట వేయాలనే ఆధునిక వివేకాన్ని అక్కున చేర్చుకొన్నాయి. మహా కుంభ మేళాలో అఖాడాల ప్రాతినిధ్యం కులం, మతం, సాంస్కృతిక భిన్నత్వం.. వీటికి అతీతంగా ఏకతను పెంచి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక సుసంపన్నతకు ప్రతీకగా కార్యక్రమం ప్రకాశించేలా చేశాయి.

    హరిత మహా కుంభ మేళా: జాతీయ స్థాయిలో పర్యావరణ సంబంధి చర్చ కార్యక్రమం

    హరిత మహా కుంభమేళాను ఈ ఏడాది జనవరి 31 నిర్వహించారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంప్రదాయాలతోపాటు పర్యావరణ విషయాల్లో చైతన్యాన్ని వ్యాప్తి చేయడానికి ఒక గొప్ప వేదికగా ఈ కార్యక్రమాన్ని జరపాలని సంకల్పించారు. దేశం నలు మూలల నుంచి 1,000 మందికి పైగా పర్యావరణ నిపుణులు, నీటి సంరక్షణ నిపుణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీనిని జ్ఞాన్ మహా కుంభ్ - 2081 శ్రేణిలో భాగంగా శిక్షా సంస్కృతి ఉత్థాన్ న్యాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

    హరిత మహా కుంభమేళా లో ఈ కింది అంశాలపై దృష్టిని కేంద్రీకరించారు. అంశాలు ఏవేవంటే..

    ప్రకృతి, పర్యావరణం, నీరు, శుభ్రతకు సంబంధించిన అంశాలు.

    ప్రకృతిలోని అయిదు మూలశక్తుల మధ్య సమతుల్యతను పరిరక్షించడం.

    పర్యావరణ పరిరక్షణ, శుభ్రతలకు సంబంధించిన ఉత్తమ పద్ధతులను గురించి ప్రచారం చేయడం

    మహా కుంభ్ కాలంలో నిర్దేశించుకొన్న ప్రమాణాలను భక్తులు తు.. తప్పక పాటించేటట్లుగా చూడడానికి వారి సానుకూల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే వ్యూహాలను సిద్ధం చేయడం.

    పర్యావరణానికి ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంలోనూ, పర్యావరణానికి అనుకూలంగా ఉండే పద్ధతులను అమలుచేయడానికి వివిధ రంగాల నిపుణులు వారి వారి ఆలోచనలను, అనుభవాలను వెల్లడించారు. అంతేకాకుండా, పర్యావరణాన్ని పరిరక్షించడానికి, మహా కుంభ్ ప్రాంతాన్ని పరిశుభ్రంగా, కాలుష్యానికి చోటుఇవ్వనిదిగా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవడానికి తలపెట్టిన కార్యక్రమాలను గురించి సందర్శకులలో అవగాహనను ఎలా పెంచవచ్చో కూడా చర్చలలో ప్రస్తావనకు వచ్చింది. కార్యక్రమం మహా కుంభ్ వేళ పర్యావరణానికి హానిని కలిగించకుండా ఉండేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని దానిని సమర్థంగా ఆచరణలోకి తీసుకురావాలని బలంగా చాటింది. ఇది రాబోయే కాలంలో ధార్మిక సమ్మేళనాల వేళ అవలంబించాల్సిన విధివిధానాలకు ఒక నమూనాను అందించింది.

 

  • కుంభ్

    2025-మహాకుంభ్ ఆరోగ్య పరిరక్షణ, సాంఘిక సంక్షేమం వంటి అంశాలపై కూడా దృష్టి సారించడంతో, ఈ దిశగా చేపట్టిన అనేక పథకాలు కొత్త రికార్డులను నెలకొల్పాయి. వీటిలో ముఖ్యంగా పేర్కొనవలసింది ‘ కుంభ్’ కార్యక్రమం – ఇది దృష్టి లోపాలని సవరించేందుకు భారీ స్థాయిలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమం. సెక్టార్-5, నాగవాసుకి పరిసరాల్లో, 10 ఎకరాల్లో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో కంటి పరీక్షలు, కళ్ళజోళ్ళ పంపిణీ భారీ ఎత్తున జరిగాయి. దాంతో, కార్యక్రమానికి గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కే అవకాశం ఏర్పడింది.

    రికార్డు సంఖ్యలో చేపట్టిన కంటి పరీక్షలు, కళ్ళజోళ్ళ పంపిణీ: దాదాపు 5 లక్షల మందికి కంటి పరీక్షలు, 3 లక్షల కళ్ళజోళ్ళ పంపిణీ పూర్తి చేశారు.

    రోజువారీ ఔట్-పేషంట్ పరీక్షలు, ఇతర సదుపాయాలు: కుంభ్ లో ఏర్పాటైన వసతుల్లో భాగంగా, మొత్తం 11 సువిశాలమైన హాళ్ళలో కంటి పరీక్ష నిపుణులు, అనుబంధ సిబ్బందీ ప్రతిరోజూ 10,000 కు పైగా కంటి పరీక్షలను నిర్వహించారు.

    గతంలో సాధించిన ఘనత: గతంలో ఏర్పాటైన కుంభ్, లిమ్కా రికార్డు బుక్ లో రెండో స్థానాన్ని పొందింది.

    గిన్నిస్ రికార్డుల్లో చోటు లక్ష్యం: గత రికార్డులని తిరగరాసి గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కించుకోవాలని 2025 కుంభ్ లక్ష్యంగా పెట్టుకుంది.

    దానాల క్యాంపు: దేశంలో 15 మిలియన్లకు పైగా ప్రజలను ప్రభావితం చేసే కార్నియా సమస్యలను పరిష్కరించేందుకు, తద్వారా అంధత్వాన్ని నివారించేందుకు అవసరమైన విరాళాలను అందించవలసిందిగా దానం క్యాంపు పర్యాటకులకు విజ్ఞప్తి చేసింది.

    మహాకుంభ్ లో భాషిణి:

    భాషా అవరోధాలను అధిగమించేందుకు, అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకూ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ‘డిజిటల్ ఇండియా’ కింద చేపట్టిన విప్లవాత్మక భాషిణి ప్రాజెక్టుని 2025 మహాకుంభ్ ప్రభావవంతంగా వినియోగించుకుంది. 11 భారతీయ భాషల్లో బహుభాషా ఎంపికలను అందించడం ద్వారా భాషిణి సమాచార వ్యాప్తి, స్థానిక నావిగేషన్, అత్యవసర స్పందన, పాలన వంటి వాటిని సులభతరం చేయడంతో లక్షలాది యాత్రికులకు ప్రయాగరాజ్ మహాకుంభ్ సాఫీగా సాగిన పర్యటనగా గుర్తుంటుంది. అంతేకాక ఏఐ- ఆధారిత “కుంభ్ సహాయక్” చాట్‌బాట్ ఎప్పటికప్పుడు సహాయాన్ని అందించడంతో, మహాకుంభ్ మునుపెన్నడూ లేనంతగా అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని పర్యాటకులకు సహాయకారిగా నిలిచింది.

    మహా కుంభ్ లో భాషిణి పాత్ర:

    తత్కాల సమాచార వ్యాప్తి: ప్రకటనలు, కార్యక్రమాల వివరాలు, భద్రతా మార్గదర్శకాల వంటి వాటిని 11 భారతీయ భాషల్లోకి అనువదించారు. దాంతో, మాతృభాష ఏదైనా యాత్రికులకు సమాచారం సులువుగా అర్ధం చేసుకునే వీలు కలిగింది.

    సరళీకృత నావిగేషన్: భాషిణి స్పీచ్-టు-టెక్స్ట్, టెక్స్ట్-టు-స్పీచ్ సౌకర్యం, మొబైల్ అప్లికేషన్‌లు, సహాయక కేంద్రాలతో అనుసంధానించిన బహుభాషా చాట్‌బాట్, భక్తులు సులభంగా గమ్యాన్ని చేరుకునేందుకు సహాయపడింది.

    అందుబాటులో అత్యవసర సేవలు: రాష్ట్ర పోలీసుల సహకారంతో చేపట్టిన కాన్వర్స్ ఫీచర్, యాత్రికులు వారి స్థానిక భాషల్లో 112-అత్యవసర హెల్ప్ లైన్‌తో అనుసంధానమయ్యేందుకు సహాయపడింది.

    -గవర్నెన్స్ మద్దతు: విభిన్న వర్గాలకు నిబంధనలు, మార్గదర్శకాలు, ప్రజాసేవా ప్రకటనలను సమర్థంగా తెలియజేసేందుకు అధికారులు భాషిణిని ఉపయోగించుకున్నారు.

    తప్పిపోయిన వస్తువుల సమాచారం: భాషిణి ‘డిజిటల్ లాస్ట్ & ఫౌండ్ సొల్యూషన్’ ద్వారా సందర్శకులు కోల్పోయిన లేదా వారికి దొరికిన వస్తువులను వాయిస్ ఇన్‌పుట్‌లను వినియోగించి స్వర సందేశం ద్వారా నమోదు చేసే వీలు కల్పించింది, అందుబాటులో ఉన్న అనువాద సౌకర్యాలు ఈ ప్రక్రియను సులభతరం చేశాయి.

    కుంభ్ సహాయక్ చాట్ బాట్:

    ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ ఏఐ-ఆధారిత, బహుభాషా, వాయిస్-ఎనేబుల్డ్ చాట్‌బాట్ యాత్రికులకు సహాయం చేయడంలో కీలక పాత్ర పోషించింది.

    లామా ఎల్ఎల్ఎం వంటి అధునాతన ఏఐ సాంకేతికతతో కూడిన ‘కుంభ్ సహాయక్ చాట్ బాట్’, తత్కాల నావిగేషన్ సహా ముఖ్య కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని అందించింది.

    భాషిణి భాషానువాద సౌకర్యం వల్ల చాట్‌బాట్‌ హిందీ, ఇంగ్లీషు సహా తొమ్మిది భారతీయ భాషల్లో పని చేసే వీలు కలిగింది.. దాంతో సమ్మిళిత అనుసంధానం సాధ్యమయ్యింది. .

    ఆకాశవాణి - కుంభవాణి

     


  • భక్తులు, యాత్రికులకు కచ్చితమైన సమాచారాన్ని సులభంగా అందించేందుకు ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభ్ నగర్‌లో అమర్చిన మైకుల ద్వారా ఆకాశవాణి ‘కుంభవాణి’ వార్తా ప్రసారాలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. మైకుల ద్వారా మొదటి కుంభవాణి వార్తా ప్రసారం 8.01.2025, ఉదయం గం.8:30 ని.లకు ప్రసారం చేశారు. కుంభవాణి వార్తా బులెటిన్‌లు రోజుకు మూడు సార్లు - ఉదయం గం.8:30 నుంచి 8:40ని. ల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 2:40 వరకు, రాత్రి గం. 8:30 నుంచీ – గం.8:40 ని. ల వరకూ అందించారు. బులెటిన్లలో మహాకుంభమేళాలో ఏర్పాటైన వివిధ కార్యక్రమాలకు సంబంధించిన తాజా వార్తలను ప్రసారం చేశారు. భక్తులు ప్రయాగ్‌రాజ్‌లో 103.5 మెగా హెర్ ట్జ్ ఫ్రీక్వెన్సీలో కుంభవాణి న్యూస్ బులెటిన్‌లను వినే వీలు కల్పించారు.

ఉల్లేఖనలు

https://pib.gov.in/EventDetail.aspx?ID=1197&reg=3&lang=1

https://www.instagram.com/airnewsalerts/p/DE3txwqIpRQ/

 


(Release ID: 2106887) Visitor Counter : 10