ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి అధ్యక్షతన ఆయుష్ రంగంపై ఉన్నత స్థాయి సమీక్ష


ఆ రంగానికున్న శక్తిని పూర్తిగా వినియోగించునకోవడానికి వ్యూహాత్మక చర్యలు చేపట్టాలని పిలుపు

ప్రపంచవ్యాప్తంగా ఆయుష్‌కు పెరుగుతున్న ఆమోదం, నిరంతర అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా ఆయుష్‌ సామర్థ్యాన్ని చర్చించిన ప్రధాని

విధానపరమైన మద్దతు, పరిశోధన, నవకల్పన దిశగా ఆయుష్ రంగ బలోపేతం: ప్రధానమంత్రి పునరుద్ఘాటన

యోగా, నేచరోపతి, ఫార్మసీ రంగాలకు సంబంధించిన సమగ్ర, ఏకీకృత ఆరోగ్య, ప్రామాణిక ప్రోటోకాల్స్‌ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రధాని స్పష్టీకరణ

Posted On: 27 FEB 2025 8:14PM by PIB Hyderabad

ఆయుష్ రంగంపై సమీక్షించేందుకు నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఏర్పాటు చేసిన ఒక ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారుఅందరి శ్రేయంఆరోగ్యసంరక్షణసాంప్రదాయి జ్ఞ‌ానాన్ని పరిరక్షిస్తూ దేశంలో ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన విస్తారిత అనుబంధ వ్యవస్థ (ఇకోసిస్టమ్)కు తోడ్పాటును అందించడంలో ఆయుష్ రంగానికున్న కీలక పాత్రను దీని ద్వారా స్పష్టం చేసినట్లయింది.

ఆయుష్ మంత్రిత్వ శాఖను 2014లో ఏర్పాటు చేసినప్పటి నుంచిఆయుష్ రంగ విస్తృత శక్తిని వినియోగించుకోవడానికి ఒక స్పష్టమైన మార్గసూచీని ప్రధానమంత్రి రూపొందించారుఈ రంగంలో చోటుచేసుకొన్న పురోగతిని సమగ్రంగా సమీక్షించిన సందర్భంగాఈ రంగానికున్న శక్తిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి వ్యూహాత్మక ఆలోచనలను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని స్పష్టంచేశారుఈ సమీక్షలో విభిన్న కార్యక్రమాలకు పటిష్ట రూపును ఇవ్వడంవనరులను గరిష్ఠంగా వాడుకోవడంఆయుష్‌ను ప్రపంచ దేశాల్లో వేళ్లూనుకొనే స్థాయికి చేర్చడానికి ఒక దూరదర్శి మార్గాన్ని సిద్ధం చేయడం.. ఈ అంశాలపై సమీక్షా సమావేశంలో దృష్టిని కేంద్రీకరించారు.

సమీక్షలోనివారణపై ప్రధానంగా దృష్టి పెడుతూ ఆరోగ్యసంరక్షణ సేవలను ప్రోత్సహించడంలోనూఔషధ మొక్కలను సాగుచేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికవ్యవస్థకు ప్రోత్సాహాన్ని ఇవ్వడంలోనూసాంప్రదాయక వైద్యచికిత్స అంశంలో ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా భారత్ స్థానాన్ని మెరుగుపరచడంలోనూ ఆయుష్ రంగం పోషించాల్సిన భూమిక సహా ఈ రంగం అందించదగ్గ ముఖ్య తోడ్పాటులను ప్రధాని వివరించారుప్రపంచ దేశాలన్నిటా ఈ రంగానికి ఆదరణ పెరుగుతోందనినిరంతరం వృద్ధి చెందుతూ ఉండడంఉపాధి అవకాశాల కల్పనలో ఈ రంగానికున్న అవకాశాలను గురించి ఆయన చెబుతూఈ రంగానికున్న సుదృఢత్వంఈ రంగం పురోగమించడానికి ఉన్న అనేక అవకాశాలను తెలియజేశారు.

విధానాలను అమల్లోకి తీసుకురావడం ద్వారానూపరిశోధనల ద్వారానూనవకల్పనల ద్వారానూ ఆయుష్ రంగాన్ని బలపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారుయోగానేచరోపతిఫార్మసీ రంగాలకు సంబంధించిన సమగ్రఏకీకృత ఆరోగ్యప్రామాణిక ప్రోటోకాల్స్‌ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వంలో అన్ని రంగాలతో ముడిపడి ఉన్న పనులలో పారదర్శకత్వాన్ని అనుసరించాలని ప్రధాని ప్రధానంగా చెప్పారునిజాయతీ పరంగా అత్యున్నత ప్రమాణాలను పరిరక్షించాలనివారు చేసే పని పూర్తి స్థాయిలో చట్టాలను అమలు చేయడం ద్వారా ప్రజలకు మంచి చేయడానికే నిర్దేశించిందన్న సంగతిని ఆసక్తిదారులు (స్టేక్‌హోల్డర్స్దృష్టిలో పెట్టుకోవాలని ఆయన ఆదేశాంచారు.

భారత్ ఆరోగ్యసంరక్షణ రంగంలో ఆయుష్ శరవేగంగా ఒక ప్రేరక శక్తిగా మారిపోయిందిఈ రంగం విద్యపరిశోధనప్రజారోగ్యంఅంతర్జాతీయ సహకారంవ్యాపారండిజిటలీకరణప్రపంచదేశాల్లో విస్తరణ వంటి అంశాలలో కీలక విజయాలను సాధించిందిప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతోఈ రంగం సాధించిన అనేక విజయాలను ఈ సమీక్ష సమావేశం సందర్భంగా ప్రధాని దృష్టికి అధికారులు తీసుకువచ్చారు.

• ఆయుష్ రంగం వేగవంతమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తోందిదీని తయారీ మార్కెటు పరిమాణం 2014లో 2.85 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉండగా, 2013లో 23 బిలియన్ అమెరికన్ డాలర్లకు ఎగబాకింది.

• రుజువులపై ఆధారపడ్డ సాంప్రదాయక వైద్యచికిత్సలలో ఇండియా తనను తాను ప్రపంచ స్థాయిలో ఒక అగ్రగామి దేశంగా రూపొందించుకొందిఆయుష్ రిసర్చ్ పోర్టల్ ఇప్పుడు 43,000కు పైగా అధ్యయనాలను హోస్ట్ చేస్తోంది.

• గత పది సంవత్సరాల్లో పరిశోధనల సంబంధిత ఫలితాల ప్రచురణఅంతకు వెనుకటి అరవై సంవత్సరాలలో జరిగిన ఈ తరహా ప్రచురణలను మించిపోయింది.

• వైద్య ప్రధాన పర్యాటకానికి ఆయుష్ వీజాలు ఊతాన్ని ఇవ్వనున్నాయిఇవి సంపూర్ణ ఆరోగ్యసంరక్షణకు దోహదపడే పరిష్కారాల వైపు మొగ్గుచూపే విదేశీ రోగులను ఆకట్టుకోనున్నాయి.

• జాతీయ స్థాయిలోనూఅంతర్జాతీయ స్థాయిలోనూ ప్రతిష్ఠాత్మక సంస్థలతో సహకారాన్ని ఏర్పరుచుకోవడం ద్వారా ఆయుష్ రంగం ఘనమైన విజయాల్ని నమోదు చేసింది.

• ఆయుష్ గ్రిడ్‌లో భాగంగా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతోపాటు కృత్రిమ మేధ (ఏఐఏకీకరణపై సరికొత్తగా దృష్టిని సారిస్తున్నారు.

• యోగాను ప్రోత్సహించడానికి డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించుకొంటారు.

• వై-బ్రేక్ యోగా వంటి మరింత సమగ్ర కంటెంటును అందించడానికిగాను ఐజీఓటీ (iGotప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేశారు.

• ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓకు చెందిన గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటరును గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఏర్పాటు చేయడం ఒక ప్రధాన విజయంఇది సాంప్రదాయక వైద్యచికిత్స రంగంలో భారత్ నాయకత్వాన్ని పటిష్టం చేసింది.

• ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ (ఐసీడీ) -11 లో సాంప్రదాయక వైద్యాన్ని చేర్చారు.

• ఈ రంగంలో మౌలిక సదుపాయాలుప్రవేశ యోగ్యతను (ఏక్సెసబులిటీవిస్తరించడంలో జాతీయ ఆయుష్ మిషన్ ప్రధాన పాత్రను పోషించింది.

•  అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవైప్రస్తుతం ఒక ప్రపంచవ్యాప్తంగా జరిగే ఘట్టంగా మారిపోయిందిగత సంవత్సరం ఐడీవైలో 24.52 కోట్ల కన్నా ఎక్కువ మంది పాల్గొన్నారు.

• ఈ ఏడాదిలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవైఈ శ్రేణిలో పదోదిప్రపంచవ్యాప్తంగా మరింత మంది పాలుపంచుకోనున్న కారణంగా ఈ ఘట్టం మరో గొప్ప విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతోంది.

ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డాఆయుష్ శాఖలో సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ఆరోగ్యంకుటుంబ సంక్షేమం శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్‌రావ్ జాదవ్ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పి.కెమిశ్రరెండో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శక్తికాంత దాస్ప్రధానమంత్రికి సలహాదారు శ్రీ అమిత్ ఖరేలతోపాటు ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.

 

***


(Release ID: 2106877) Visitor Counter : 5