ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానికి డొమినికా అత్యున్నత జాతీయ పురస్కారం

నాడు పోస్టు చేయడమైనది: 21 NOV 2024 5:39AM by PIB Hyderabad

కామన్వెల్త్ ఆఫ్ డొమెనికా అత్యున్నత జాతీయ పురస్కారం ‘డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్’ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఆదేశ అధ్యక్షురాలు సల్వేని బర్టోన్ సత్కరించారు. ప్రధాని రాజనీతికి, కొవిడ్-19 సమయంలో డొమినికాకు అందించిన సాయానికి, భారత్ - డొమినికా దేశాల మధ్య సంబంధాన్ని బలోపేతం చేసే విషయంలో ఆయనుకున్న నిబద్ధతకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందించారు. డొమినికా ప్రధానమంత్రి రూజ్వెల్ట్ స్కెరిట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గయానా అధ్యక్షుడు డాక్టర్ ఇర్ఫాన్ ఆలీ, బార్బడోస్ ప్రధానమంత్రి మియా అమోర్ మోట్లీ, గ్రెనెడా ప్రధాని డికెన్ మిషెల్, సెయింట్ లూసియా ప్రధానమంత్రి ఫిలిప్ జె. పియర్, ఆంటిగ్వా, బార్బుడా ప్రధాని గాస్టన్ అల్ఫాన్సో బ్రౌన్ సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

భారతీయులకు, భారత్ - డొమెనికా మధ్య ఉన్న బలమైన చారిత్రక, సాంస్కృతిక సంబంధాలకు ఈ పురస్కారాన్ని ప్రధాని అంకితం చేశారు. రానున్న కాలంలో రెండు దేశాల మధ్య దైపాక్షిక సంబంధాలు మరింత పురోగతి సాధిస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
గయానా జార్జి టౌన్లో భారత్-కారికోమ్ సదస్సు జరుగుతున్న సందర్భంగా ఈ నెల 20న ఈ పురస్కార ప్రధాన కార్యక్రమం జరిగింది.


(రిలీజ్ ఐడి: 2106350) సందర్శకుల సూచీ సంఖ్య : : 87