ప్రధాన మంత్రి కార్యాలయం
“పరీక్ష పే చర్చ-2025” కార్యక్రమంలో విద్యార్థులతో ప్రధానమంత్రి సంభాషణ
Posted On:
10 FEB 2025 4:18PM by PIB Hyderabad
విద్యార్థి: సర్... ‘పరీక్షా పే చర్చ’లో పాల్గొనడం మాకెంతో ఉత్సాహమిస్తోంది!
ఖుషి: ఈ రోజు... నేనింకా కలగంటున్నట్లే అనిపిస్తోంది.
వైభవ్: ఈ కార్యక్రమం కోసం చాలామంది విద్యార్థులు పేరు నమోదు చేసుకున్నారు. వారిలో మేం కూడా ఉండటం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం.
సాయి సహస్ర: ఇదే ఆడిటోరియంలో నేను ఇంతకుముందు ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం చూశాను. ఈసారి కూడా అదేవిధంగా ఉంటుందని భావించాను.
ఇరా శర్మ: కానీ, ఈసారి అంతా మారిపోయింది. నిర్వహణ విధానం పూర్తి భిన్నంగా ఉంది.
అక్షర: ఈ ఏడాది కార్యక్రమం ‘సుందర్ నర్సరీ’ అనే బహిరంగ ప్రదేశంలో నిర్వహిస్తున్నారు.
అడ్రియల్ గురుంగ్: నేనెంతో ఉత్సాహంగా.. ఉల్లాసంగా ఉన్నాను! చాలా ఉద్వేగంగా కూడా అనిపిస్తోంది!
అద్వితీయ సాదుఖన్: చాలా కాలంనుంచి ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది- మనమంతా ప్రధానమంత్రిని ప్రత్యక్షంగా కలవబోతున్నాం!
అడ్రియల్ గురుంగ్: ఈ రోజు నేనిక్కడికి ఎవరితో సంభాషించడానికి ఇక్కడికొచ్చానంటే-
లోపోంగ్‌షై లవై: భారత ప్రధానమంత్రితో!
అక్షర జె.నాయర్: ప్రధానమంత్రి మోదీగారి రాకతో అందరిలో ఒకవిధమైన ఆశాభావం నెలకొంది.
విద్యార్థులు: (ముక్తకంఠంతో) నమస్తే, సర్!
ప్రధానమంత్రి: నమస్తే! మీరంతా ఎవరికివారు సుఖాసీనులయ్యారా?
విద్యార్థి: లేదు సర్!
రితురాజ్ నాథ్: ఆయనను చూసిన మరుక్షణం మా అందరిలో ఒక సానుకూల శక్తి ఉప్పొంగింది.
ప్రధానమంత్రి: ఇక్కడున్న వారిలో మీరు ఎందరిని గుర్తుపట్టగలరు?
విద్యార్థి: సర్.. దాదాపు ప్రతి ఒక్కరినీ!
ప్రధానమంత్రి: అయితే, వాళ్లందర్నీ మీ ఇంటికి ఆహ్వానిస్తావా?
విద్యార్థి: తప్పకుండా సర్… ప్రతి ఒక్కర్నీ ఆహ్వానిస్తాను.
ప్రధానమంత్రి: ఓహో అవునా? అయితే ఇప్పటికే నువ్వు ఆ పని చేసి ఉండాల్సింది!
ఆకాంక్ష అశోక్: ఆయనెంతో ఆకర్షణీయంగా, అందర్నీ ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు!
ప్రధానమంత్రి: మకర సంక్రాంతి రోజున మీరు ఏమి ఆరగించారు?
విద్యార్థులు: (ముక్తకంఠంతో) నువ్వులు.. బెల్లం సర్!
ప్రధానమంత్రి: ఒకటి మాత్రమే తినాలనేమీ షరతు లేదు… మీకెన్న కావాలంటే అన్ని తినొచ్చు.
విద్యార్థి: ప్రధానిగారు నాకు ‘నువ్వు లడ్డు’ స్వయంగా అందిస్తే చెప్పలేనంత సంతోషమేసింది!
ప్రధానమంత్రి: సరే… దీనిపై ఓ నానుడి ఉంది తెలుసా… “తిల్ గూడ్ ఘ్యా.. ని గూడ్‌గూడ్ బోలా!”
విద్యార్థి: “తిల్ గూడ్ ఘ్యా.. ని గూడ్‌గూడ్ బోలా!” (తియ్యని నువ్వులడ్డు తిని… మధురంగా మాట్లాడు)
ప్రధానమంత్రి: శభాష్…!
యు. అనన్య: మన ఇంటికి అతిథులొస్తే… వాళ్లు తినడానికి మనం ఏదో ఒకటి ఇస్తాం. అదేవిధంగా ఆయన నువ్వులడ్డు ఇచ్చారు.
ప్రధానమంత్రి: కేరళలో దీన్నేమంటారు?
విద్యార్థి: నువ్వు లడ్డు అంటారు సర్!
ప్రధానమంత్రి: ఓహో, నువ్వులడ్డు అంటారా…
విద్యార్థి: అక్కడ ఇది దొరకడం అరుదు.
ప్రధానమంత్రి: అయితే, మీకు తరచూ దొరకదా?
విద్యార్థి: దొరకదు సర్!
ప్రధానమంత్రి: అయితే సరే!
విద్యార్థి: మా గురించి మరెవరో కూడా ఆలోచిస్తున్నట్లు అనిపిస్తోంది.
ప్రధానమంత్రి: మీరు ఎవరికోసమైనా... కొన్ని తీసుకెళ్లాలని అనుకుంటున్నారా?
విద్యార్థి: సర్... ఒకటిరెండు మాత్రమే!
ప్రధానమంత్రి: అవును.. చక్కగా చెప్పావ్.
విద్యార్థి: నిజం చెప్పాలంటే- ఇది నాకెంతో నచ్చింది సర్!
ప్రధానమంత్రి: మంచిది... మీరంతా కూర్చోండి... ఇప్పుడు చెప్పండి... నువ్వులు, బెల్లం ఏ కాలంలో తింటే మంచిందంటారు?
విద్యార్థి: శీతాకాలం!
ప్రధానమంత్రి: సరే... ఆ కాలంలోనే ఎందుకు తింటారు?
విద్యార్థి: ఇది శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతుంది.
ప్రధానమంత్రి: నిజమే! అది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది, సరే... పౌష్ఠికత గురించి మీకేం తెలుసో చెప్పండి?
విద్యార్థి: సర్.. మన శరీరానికి వివిధ కీలక ఖనిజాలు అవసరం.
ప్రధానమంత్రి: కానీ, మీకు దానిగురించి తెలియకపోతే ఏం చేస్తారు?
విద్యార్థి: నిజానికి... భారతదేశం చిరుధాన్యాల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది... వాటిలో ఎన్నో పోషకాలుంటాయి.
ప్రధానమంత్రి: మీలో ఎందరు చిరుధాన్యాలు తీసుకున్నారు? వాటి ప్రయోజనం మీరు గ్రహించకపోయినా ప్రతి ఒక్కరూ వాటిని తీసుకోవాలి.
విద్యార్థి: సజ్జలు, రాగులు, జొన్న వంటివి...!
ప్రధానమంత్రి: ప్రతి ఒక్కరూ వాటిని వాడుతుంటారు. చిరుధాన్యాలకు ప్రపంచంలో ఎలాంటి హోదా లభించిందో మీకు తెలుసా?
విద్యార్థి: ప్రపంచంలో భారత్ అతిపెద్ద చిరుధాన్యాల ఉత్పత్తిదారు... వినియోగదారు కూడా.
ప్రధానమంత్రి: సరిగ్గా చెప్పావ్! భారత్ ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్యసమితి 2023లో ఆ ఏడాదిని ‘అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం’గా ప్రకటించింది. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా వాటి వినియోగాన్ని ప్రోత్సహించింది సరైన పోషకాహారంతో అనేక వ్యాధులను నివారించవచ్చు. కాబట్టి, పోషకాహారంపై అవగాహన పెంచడానికి భారత ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. చిరుధాన్యాలను ‘సూపర్‌ఫుడ్’గా అభివర్ణిస్తారు. కాబట్టి, ఏడాది పొడవునా మీలో ఎందరు ఇళ్లలో ఏదో ఒక రకమైన చిరుధాన్యాలు తీసుకుంటుంటారు?
విద్యార్థి: సర్.. మేం గోధుమ, జొన్న, సజ్జ ధాన్యాల పిండిని కలగలిపి వాడుతుంటాం!
ప్రధానమంత్రి: మీరంతా గమనించారా... కొన్ని పద్ధతులను మన సంప్రదాయాల్లో భాగం చేసుకున్నాం. ప్రతి కాలంలో తొలి తాజా పండును దేవుడి పటం ముందు నైవేద్యంగా పెడతాం.
విద్యార్థి: అవును సర్!
ప్రధానమంత్రి: మనకు అదొక వేడుక కూడా... కదా?
విద్యార్థి: అవును సర్!
ప్రధానమంత్రి: ఇది మనకు అన్నిచోట్లా కనిపిస్తుంది.
విద్యార్థి: అవును సర్!
ప్రధానమంత్రి: నైవేద్యం తర్వాత ఆ పండును ప్రసాదంగా స్వీకరిస్తాం.
విద్యార్థి: అవును సర్!
ప్రధానమంత్రి: అంటే- దేవుడు కూడా ఏ కాలంలో లభించే పండును ఆ కాలంలో నైవేద్యంగా స్వీకరిస్తాడు. మరి మానవమాత్రులమైన మనం అలా చేయాలా.. వద్దా?
విద్యార్థి: అవును సర్! మనమంతా తప్పక తినాలి!
ప్రధానమంత్రి: క్యారట్ హల్వా అంటే మీకందరికీ ఇష్టమేనని నా నమ్మకం... కానీ, మీలో ఎందరు పచ్చి క్యారట్ దుంప తింటారు?
విద్యార్థి: అవును సర్!
ప్రధానమంత్రి: మీరు బహుశా క్యారట్ రసం కూడా తాగుతుండవచ్చు. అయితే, కొన్నిరకాల ఆహారం తీసుకోవడం పౌష్ఠికతకు ముఖ్యమని మీరు నమ్ముతారా?
విద్యార్థి: నమ్ముతాం సర్!
ప్రధానమంత్రి: అదేవిధంగా కొన్ని ఆహారాల జోలికి వెళ్లకూడదని మీకు తెలుసా
విద్యార్థి: తెలుసు సర్!
ప్రధానమంత్రి: సరే... మనం వేటికి దూరంగా ఉండాలంటారు?
విద్యార్థి: రుచి తప్ప పోషకాలు లేని ఆహారం (జంక్ ఫుడ్)
ప్రధానమంత్రి: జంక్ ఫుడ్!
విద్యార్థి: నూనె, నాజూకైన (శుద్ధిచేసిన) పిండితో తయారయ్యే ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి కాబట్టి, అలాంటి వాటిని నివారించాలి.
ప్రధానమంత్రి: అవును! ఎప్పుడేం తినాలో, తినకూడదో మనకు తెలుసు. కానీ, ఎలా తినాలో తెలుసా? మనకెన్ని దంతాలున్నాయి?
విద్యార్థి: 32 సర్!
ప్రధానమంత్రి: 32!... మనకు 32 పళ్లున్నాయి కాబట్టి, ఆహారాన్ని కనీసం 32 సార్లు నమలాలని పాఠశాలలో ఉపాధ్యాయులు, ఇళ్లలో తల్లిదండ్రులు మనకు తరచూ చెబుతుంటారు కదూ!
విద్యార్థి: అవును సర్! సరైన పద్ధతిలో నమలాలి.
ప్రధానమంత్రి: కాబట్టి... ఎలా తినాలో తెలిసి ఉండటం కూడా ముఖ్యమే.
విద్యార్థి: అవును సర్!
ప్రధానమంత్రి: సరే... ఏం తింటున్నామో పట్టించుకోకుండా, ఆహారాన్ని బాగా నమలకుండా పోస్టు డబ్బాలో ఉత్తరం పడేసినట్టు గుటుక్కున మింగేవారు మీలో ఎందరున్నారు? మీ మిత్రుడు మీతో కలసి తింటున్నపుడు- ‘వీడు నాకన్నా ఎక్కువ తింటాడేమో?’ అని ఆలోచిస్తారా?
విద్యార్థి: అది వాస్తవమే సర్! మీరు చెప్పింది నిజం!
ప్రధానమంత్రి: మంచినీళ్లు తాగేటపుడు మీలో ఎందరు దాని రుచిని గమనించారు? ఎందుకంటే- నీరు తాగేటపుడు నేను ఆ రుచిని నిజంగా ఆస్వాదిస్తాను. మీలో ఎందరు అలా చేస్తుంటారు?
విద్యార్థి: నిజమే సర్!
ప్రధానమంత్రి: కానీ, మీలో అధికశాతం అలా చేయరు! మీరంతా స్కూలుకు పరుగుతీసే హడావుడిలో ఉంటారు.
విద్యార్థి: లేదు సర్!... లేదు సర్!
ప్రధానమంత్రి: అలాకాదు... నిజాయితీగా... వాస్తవం చెప్పండి.
విద్యార్థి: నిజమే చెబుతున్నాం సర్!
ప్రధానమంత్రి: మనం కొద్దికొద్దిగా చప్పరిస్తూ టీ తాగే విధంగానే మంచినీళ్లను కూడా ఆస్వాదిస్తూ తాగేందుకు యత్నించాలి. నీటి రుచిని మనం వాస్తవంగా తెలుసుకోవాలి. సరే.. ఎలా తినాలో, ఏం తినాలో మనం చర్చించుకున్నాం. ఇక ఎప్పుడు తినాలన్నది మూడో ముఖ్యమైన విషయం.
విద్యార్థి: ఊరగాయలు, సలాడ్లు సాయంత్రం వేళ తినకూడదు సర్. ఉదయం పూట సలాడ్ తినడం మంచిది సర్!
విద్యార్థి: మనం రాత్రి 7 గంటలకల్లా భోజనం పూర్తి చేయాలి సర్, అది జీర్ణక్రియకు చాలా ముఖ్యం. జైన సమాజం ఈ పద్ధతిని విస్తృతంగా అనుసరిస్తుంది.
ప్రధానమంత్రి: మన దేశంలో రైతులు సాధారణంగా ఏ సమయంలో తింటారో తెలుసా?
విద్యార్థి: మధ్యాహ్నం వేళ సర్!
ప్రధానమంత్రి: నాకు తెలిసినంత వరకూ రైతులు ఉదయం 8 లేదా 8:30 గంటలకు పొలం పనులకు వెళ్లే ముందు కడుపారా భోజనం చేస్తారు. వారు రోజంతా శ్రమిస్తారు... ఆకలిగా అనిపిస్తే, మధ్యాహ్నం వేళ పొలంలో ఏది దొరికితే అది తింటారు. సాయంత్రం 5 లేదా 6 గంటలకు ఇంటికి తిరిగొచ్చి సూర్యాస్తమయానికి ముందే భోజనం చేస్తారు.
కానీ, మీరైతే బహుశా ఏమంటారంటే- “నేనిప్పుడు ఆడుకోవాలి లేదా టీవీ షో చూడాలి లేదా నా ఫోన్ చెక్ చేసుకోవాలి!” అంటారు! లేదా “ఇప్పుడు కాదమ్మా! నాకింకా ఆకలి కాలేదు!” అంటారేమో!
విద్యార్థి: లేదు సర్!
ప్రధానమంత్రి: ఒక వాస్తవం గుర్తుంచుకోండి... అనారోగ్యం లేనంతమాత్రాన మనం ఆరోగ్యంగా ఉన్నామని అనుకోరాదు. మన శరీర శ్రేయస్సును ఆరోగ్యం స్థాయితో అంచనా వేయాలి. మనం నిద్రించే పద్ధతి కూడా పోషకాహారంతో ముడిపడి ఉంటుంది- మనం తగినంత నిద్ర పోతున్నామా... కొన్నిసార్లు ఎక్కువగా నిద్రిస్తున్నామా అన్నది చూసుకోవాలి.
విద్యార్థి: సర్! పరీక్షల సమయంలో నిద్ర ఎక్కువగా వస్తున్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో...
ప్రధానమంత్రి: అంటే- ఆ సమయంలో మీకు మగతగా అనిపిస్తుందా?
విద్యార్థి: అవును సర్! పరీక్షలు ముగిశాయంటే నిద్రమత్తు ఇట్టే మాయమవుతుంది!
ప్రధానమంత్రి: పోషకాహారం, ఆరోగ్యం- మొత్తం మీద శరీర దారుఢ్యంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఇవాళ వైద్య రంగం యావత్తూ నిద్రపై దృష్టి సారిస్తోంది- ఒక వ్యక్తి ఎంత బాగా నిద్రిస్తాడు... ఎన్ని గంటలు విశ్రాంతి తీసుకుంటాడు.. వంటి అంశాలపై లోతైన అధ్యయనాలు సాగుతున్నాయి. అదంతా సరేగానీ, ‘మనం నిద్రపోవడం గురించి ప్రధానమంత్రి ఎందుకు చెబుతున్నారు?’ అనే ప్రశ్న మీ మనసులో మెదలుతోందని నాకు తెలుసు!
సరే... మీలో ఎందరు రోజూ ఎండలోకి వెళ్లి సూర్యరశ్మిని ఆస్వాదిస్తారు?
విద్యార్థి: స్కూలులో ప్రార్థన సమయాన మేమంతా ఉదయపు ఎండలో నిలుచుంటాం.
ప్రధానమంత్రి: అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చినవారు ఈ సందర్భంగా ఏమైన చెబుతారా?
విద్యార్థి: అరుణాచల్ అంటే.. సూర్యోదయ రాష్ట్రం. కాబట్టి, మేం ప్రతిరోజూ సూర్యరశ్మిని ఆస్వాదిస్తుంటాం!
ప్రధానమంత్రి: నిత్యం ఉదయాన్నే కొన్ని నిమిషాలు ఎండలో నిలుచోవడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. వీలైన సమయంలో- 2, 5 లేదా 7 నిమిషాల పాటు శరీరానికి సాధ్యమైనంత ఎక్కువగా సూర్యకాంతి తగలాలి. పాఠశాలకు వెళ్లేటప్పుడు సూర్యుడిని చూడటం కాదు; రోజూ ప్రయత్నపూర్వకంగా మన ప్రయోజనార్థం ఇలా చేయాలి.
సూర్యోదయం తర్వాత మీలో ఎందరు ఏదైనా చెట్టుకింద నిలబడి కనీసం 10 సార్లు గాఢంగా శ్వాస తీసుకుంటారు? మీరేం చేయాలంటే ఓ చెట్టుకింద నిలుచుని, గాఢంగా గాలి పీల్చుకుని, వీలైనంత ఎక్కువ సేపు ఊపిరి బిగబట్టండి. మీలో ఎవరైనా ఈ పద్ధతిని క్రమం తప్పకుండా పాటించేవారు ఉన్నారా?
విద్యార్థి: సర్... లోతైన శ్వాస కాదుగానీ, అలా కాసేపు చేస్తే ఎంతో ప్రశాంతత లభిస్తుంది.
ప్రధానమంత్రి: జీవితంలో ముందడుగు వేయాలంటే పోషకాహారం అత్యావశ్యకం. మీరే తింటున్నారు.. ఎప్పుడు తింటున్నారు... ఎలా తింటున్నారు.. ఎందుకు తింటున్నారు.. వంటివన్నీ ముఖ్యమైన అంశాలేనని మరువకండి అన్నదే నేను మీకిచ్చే సలహా.
విద్యార్థి: అలాగే సర్!
ప్రధానమంత్రి: నేనొకసారి భోజనం కోసం ఒక ఇంటికి వెళ్లాను. వారి కుమారులలో ఒకరు గోధుమ లేదా చిరుధాన్యపు ఆహారం తినడానికి నిరాకరించాడు. ఎవరైనా ఉపాధ్యాయుడు చెప్పడమో లేదా స్వయం ఎక్కడైనా తెలుసుకున్నాడోగానీ, జొన్నలు లేదా గోధుమ రొట్టెలు తింటే చర్మం నల్లబడుతుందని విన్నాడు. కాబట్టి ఎప్పుడూ అన్నం మాత్రమే తినేవాడు...
అయితే, అలాంటి అపోహలేమీ వద్దు. నిత్యం ఏమేం తినాలో మీకు మీరు నిర్ణయించుకోవాలి తప్ప ‘గూగుల్ గురువు’ను ఆశ్రయించకూడదు.
విద్యార్థి: అలా చేయం సర్!
ప్రధానమంత్రి: ఆ విధంగా ఎప్పుడూ చేయకండి... చేయరు కదూ?
విద్యార్థి: చేయం సర్!
ప్రధానమంత్రి: మంచిది... నేను మీతో చాలాసేపు మాట్లాడాను... మీరేమైనా చెప్పాలని భావిస్తున్నారా?
విద్యార్థి: నమస్కారం సర్! నా పేరు ఆకాంక్ష. మా స్వస్థలం కేరళ... నా ప్రశ్న ఏమిటంటే-
ప్రధానమంత్రి: అరే! నువ్వు హిందీ చాలా చక్కగా మాట్లాడుతున్నావు... ఎలా సాధ్యం?
విద్యార్థి: హిందీ అంటే నాకెంతో ఇష్టం సర్!
ప్రధానమంత్రి: హిందీ ఇంత బాగా ఎందుకు నేర్చుకోగలిగావో ఎప్పుడైనా ఆలోచించావా?
విద్యార్థి: లేదుగానీ, నేను కవితలు రాస్తాను.
ప్రధానమంత్రి: భేష్... అలాగైతే మొదట నీ కవిత ఒకటి విని తీరాల్సిందే!
విద్యార్థి: అలాగే సర్... నాకు గుర్తున్నంత వరకూ మీ కోసం ఓ కవిత చదువుతాను.
ప్రధానమంత్రి: అలాగే తల్లీ... నీకెంత వరకూ గుర్తుకొస్తే అక్కడదాకా వినిపించు.. నాకైతే సాధారణం అంత జ్ఞాపకం ఉండదు.
విద్యార్థి: “ఇత్‌నా షోర్ హై ఇన్ బజారోమే,
ఇత్‌నా షోర్ హై ఇన్
ఇత్‌నా షోర్ హై ఇన్ గలియోంమే
క్యోం తో అప్నే కలమ్ లేకర్ బైఠా హై ఫిర్ ఏక్ గజల్ లిఖ్‌నే
ఫిర్ ఉస్ కితాబ్ కే పన్నోం పర్ తూ లిఖానా క్యా చాహ్తా హై, ఐసా క్యా హై తేరే మన్ మే
సవాలోం భరే తేరే మన్ మే ఏక్ స్యాయాహీ షాయద్ జవాబ్ లిఖ్ రహీహై
ఫిర్ క్యోం తూ ఆస్మాన్ దేఖ్‌తా హై
ఐసా క్యా హై ఇన్ సితారోంమే, ఐసా క్యాహై తేరే మన్ మే”
అంటే-
“ఈ బజారులలో అంతా కోలాహలంగా ఉంది
ఈ వీధులన్నీ సందడి సందడిగా ఉన్నాయి
నువ్వెందుకు ఓ గజల్ రాద్దామని కలం పట్టుక్కూర్చున్నావు
ఆ పుస్తకంలోని పుటల్లో ఏం రాయాలని అనుకుంటున్నావు
నీ మనసులోని భావాలేమిటి.. అవన్నీ జవాబులేని ప్రశ్నలేనా?
బహుశా నీ కలంలోని సిరాచుక్కలు వాటికి బదులిస్తున్నవేమో
మరి నీవెందుకు ఆకాశంలోకి చూస్తూ కూర్చున్నావు?
ఆ నక్షత్రాల్లో ఏముంది... ఇంతకూ నీ మదిలో మెదిలేదేమిటి?”
ప్రధానమంత్రి: వహ్వా... వహ్వా... అద్భుతం!
విద్యార్థి: సర్... మీతో ముచ్చటించడం చాలా ఆత్మీయంగా, ఎంతో స్నేహపూర్వకంగా అనిపించింది- నిజానికి మా పెద్దలతో సాదర సంభాషణ గుర్తుకొచ్చింది.
ప్రధానమంత్రి: సరే... నీకు ఆందోళన కలిగిస్తున్నదేమిటి?
విద్యార్థి: పరీక్షల ఒత్తిడే సర్... చదువులో బాగా రాణించాలని, మంచి మార్కులు తెచ్చుకోకపోతే భవిష్యత్తు పాడవుతుందని సాధారణంగా మనం అనుకుంటుంటాం.
ప్రధానమంత్రి: మరి దీనికి నీవు ఆలోచించిన పరిష్కారం ఏమిటి?
విద్యార్థి: మార్కులు మన భవిష్యత్తుకు కొలబద్దలు కావు సర్!
ప్రధానమంత్రి: కాబట్టి, మార్కుల గురించి చింతించే అవసరం లేదంటావా?
విద్యార్థి: విజ్ఞానార్జనే ప్రధానమని నా అభిప్రాయం.
ప్రధానమంత్రి: అయితే, ట్యూషన్లు, పరీక్షలు అర్థరహితమని భావిస్తున్నావా?
విద్యార్థి: లేదు సర్! మన ప్రయాణంలో అదొక భాగమే తప్ప, అదే గమ్యం కాదని విశ్వసిస్తాను.
ప్రధానమంత్రి: కానీ, సమస్య ఎక్కడొస్తుందంటే, మీకు అర్థమైన వాస్తవాన్ని మీ కుటుంబాలు మీ దృక్కోణంలో చూడవు.
ప్రధానమంత్రి: మరి ఏం చేద్దామంటావు?
విద్యార్థి: సర్! మన వంతుగా శ్రమించడం తప్పనిసరి... ఫలితాన్ని దైవానికే వదిలేయాలి.
ప్రధానమంత్రి: ఆకాంక్ష! నువ్వు చెప్పింది పూర్తిగా నిజమే! ఒక విద్యార్థి నిర్దిష్ట మార్కులు సాధించలేకపోతే, దురదృష్టవశాత్తూ 10 లేదా 12వ తరగతి పరీక్షల్లో బాగా రాణించకపోతే, జీవితమే తలకిందులైనట్లు భావించే ధోరణి మన సమాజంలో లోతుగా నాటుకుపోయింది.
విద్యార్థి: అవును సర్!
ప్రధానమంత్రి: అందుకే అంత ఒత్తిడి.. అమిత ఒత్తిడి.. ఇంట్లో ఒత్తిడి... కుటుంబంలో ఒత్తిడి... నిరంతరం ఆందోళనే!
విద్యార్థి: అవును సర్!
ప్రధానమంత్రి: అంటే- ఈ విషయాన్ని తల్లిదండ్రులకు అర్థమయ్యేలా చేయలేకపోతున్నట్లు చెబుతున్నావు. మీ పరీక్షలకు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. మరి మీ తల్లి బాధ్యత గుర్తుచేస్తే ఆమెకు “అమ్మా, మళ్లీ లెక్చర్ ఇవ్వొద్దు!” అని గట్టిగా చెప్పాలనిపిస్తుంది. కానీ, నీవలా చెప్పలేదు... కదూ! నీకు నువ్వే సర్దిచెప్పుకోవాలి... అంతేనా!
అంటే- నీ మీద ఒత్తిడి ఉందన్న మాట. నీ చుట్టూ ఉన్నవాళ్లు- అలా చెయ్యి... ఇలా చెయ్యి.. అంటుంటారు అవునా?
విద్యార్థి: అవును సర్!
ప్రధానమంత్రి: సరే... క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడల్లా మీలో ఎంతమంది టీవీ చూస్తారు? మీలో ఎందరున్నారు?
విద్యార్థి: సార్, మేమందరం! అవును సార్!
ప్రధాన మంత్రి: మీరు గమనించి ఉంటారు, ఎప్పుడైనా మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్టేడియం శబ్దంతో మారుమోగిపోతుంది.
విద్యార్థి: అవును సార్!
ప్రధాన మంత్రి: మీరు ఏ శబ్దాలు వింటారు?
విద్యార్థి: మొత్తం ప్రేక్షకులు అంతా ఉత్సాహంగా పెట్టే కేకల శబ్దాలు సార్!
ప్రధాన మంత్రి: కొందరు సిక్సర్! సిక్సర్ అని అరుస్తారు! మరికొందరు ఫోర్ అంటూ కేకలు పెడతారు.
విద్యార్థి : అవును సార్! కొందరు సిక్స్ కొట్టాలంటూ కేకలు పెడతారు.
ప్రధాన మంత్రి : ఇప్పుడు చెప్పండి, బ్యాట్స్ మన్ ఏం చేస్తాడు? అతను ప్రేక్షకుల అరుపులు వింటాడా, లేదా బంతిపై దృష్టి పెడతాడా?
విద్యార్థి: బంతిపై దృష్టి పెడతాడు.
ప్రధానమంత్రి: సరిగా చెప్పారు! 'అయ్యో, వాళ్లు సిక్సర్ కోసం అరుస్తున్నారు, నేను సిక్సర్ కొట్టాలి' అని బ్యాట్స్ మన్ అనుకోవడం మొదలుపెడితే.. -ఏం జరుగుతుంది?
విద్యార్థి: అతను తన వికెట్ కోల్పోతాడు!
ప్రధానమంత్రి: అది నిజం! అంటే బ్యాట్స్ మన్ తనపై ఒత్తిడి ప్రభావం చూపనివ్వడు.
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి : అతని మొత్తం దృష్టి అంతా బంతిపైనే ఉంటుంది. అదేవిధంగా, మీరు మీపై ఒత్తిడి పడకుండా, మీ చదువుపై మాత్రమే దృష్టి పెట్టాలి. 'ఈ రోజు, నేను ఇంత చదవాలని నిర్ణయించుకున్నాను, నేను దానికి కట్టుబడి ఉంటాను!' అని అనుకుంటే అప్పుడు మీరు ఎలాంటి ఒత్తిడికి లోనుకారు.
విద్యార్థి: సార్, మా ప్రశ్నలకు చాలా బాగా సమాధానం చెప్పారు. పరీక్ష సమయంలో ఒత్తిడికి గురికాకుండా ఎలా ఉండాలో చక్కగా వివరించారు.
ప్రధానమంత్రి: మీ లక్ష్యం గురించి మీకు స్పష్టత ఉంటే, ఏ పరధ్యానాలు లేదా అడ్డంకులు మిమ్మల్ని ఆపలేవు. మీరు ఎల్లప్పుడూ స్వీయ ప్రేరణతో ఉండాలి.
విద్యార్థి: మీరు చెప్పినట్టు ఎంత ఒత్తిడి ఉన్నా, దాన్ని నిర్మొహమాటంగా స్వీకరిం చాలి- కానీ దాని గురించే ఆలోచించ కూడదు!
ప్రధానమంత్రి: ప్రతి ఒక్కరూ ఎవరికి వారు ఎల్లప్పుడూ జవాబుదారీగా ఉండాలి.
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: నిరంతరం తనను తాను సవాలు చేసుకుంటూ ఉండాలి.
విద్యార్థి: అవును సార్!
ప్రధాన మంత్రి: మీరు గతసారి 30 మార్కులు సాధించారా? ఈసారి 35 మార్కుల కోసం లక్ష్యంగా పెట్టుకోండి. మీకు మీరే సవాల్ చేసుకోండి! చాలా మంది తమ స్వంత పోరాటాలను చేసుకోరు. మీ స్వంత పోరాటాలను చేయాలని మీరు ఎప్పుడైనా నిర్ణయించుకున్నారా?
విద్యార్థి: అవును సార్!
ప్రధాన మంత్రి: మిమ్మల్ని మీరు సవాలు చేసుకోవాలనుకుంటే, ముందుగా మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి.
విద్యార్థి : అవును సార్!
ప్రధానమంత్రి: 'జీవితంలో నేనేం కాగలను?' అని మీరెప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? నేనేం చేయగలను? నిజంగా నాకు ఏది తృప్తిని ఇస్తుంది?" ఈ ప్రశ్నలను మీరు తరచుగా వేసుకోవాలి.
అది ఇలా ఉండకూడదు—ఒకరోజు ఉదయాన్నే పత్రికలో ఏదో చదివి, “అరే, ఇది ఆసక్తికరంగా ఉంది!” అనుకోవడం… మరుసటి రోజు టీవీలో ఏదో చూసి, “ఇది కూడా బాగుంది!” అనుకోవడం కాకుండా మీరు మీ మనసును క్రమంగా ఒక లక్ష్యంపై కేంద్రీకరించాలి.
చాలా మంది సులభంగా దృష్టి అటూ ఇటూ మరలిస్తుంటారు. వారి ఆలోచనలు మనస్సు ఎప్పుడూ అటూ ఇటూ తిరుగుతూనే ఉంటాయి.
విద్యార్థి: అది అవాంఛనీయ పరిణామాలకు దారితీస్తుంది.
ప్రధానమంత్రి: సరిగా చెప్పారు! మీకు స్పష్టత ఉంటేనే తదుపరి ఏ సవాలును స్వీకరించాలో మీరు నిర్ణయించగలరు. ప్రయత్నిస్తారా?
విద్యార్థి: తప్పకుండా సార్!
విద్యార్థి: ప్రధానమంత్రి సార్, మీకో ప్రశ్న! మీరు అంతర్జాతీయ స్థాయిలో గొప్ప నాయకుడిగా ఎదిగారు. ఇంకా అనేక కీలకమైన పదవులు నిర్వహించారు. మా వంటి పిల్లలకు జీవితంలో ముందుకు సాగడానికి ఉపయోగపడే రెండు లేదా మూడు నాయకత్వ పాఠాలను మీరు పంచుకోగలరా?
ప్రధానమంత్రి: విరాజ్!
విద్యార్థి: చెప్పండి సార్!
ప్రధానమంత్రి: బీహార్ నుంచి వచ్చిన ఒక అబ్బాయికి రాజకీయాల గురించి ప్రశ్నలు లేకపోవడం అసాధ్యం! బీహార్ ప్రజలు అసాధారణమైన తెలివితేటలు కలిగినవారు. నాయకత్వం అంశం గురించి ఇంకెవరైనా ఆలోచిస్తున్నారా?
విద్యార్థి: అవును సార్! నేను కూడా దాని గురించే ఆలోచిస్తాను. కానీ నేను దానిని ఎలా వివరించగలను?
ప్రధానమంత్రి: మీకు నచ్చిన విధంగా వివరించండి.
విద్యార్థి: కొన్నిసార్లు ఉపాధ్యాయుడు మమ్మల్ని క్లాస్ మానిటర్లుగా నియమించినప్పుడు లేదా అందరూ క్రమశిక్షణ పాటించేలా చూసే బాధ్యత అప్పగించినప్పుడు, మిగతా విద్యార్థులు ఒకోసారి మాట వినరు. వారికి అర్థమయ్యేలా ఒక మార్గం ఉండాలి. కేవలం “కూర్చోండి! కూర్చోండి!” అని ఆదేశించడం లేదా వారి పేర్లు రాస్తామని బెదిరించడం సమస్యను మరింత పెంచుతుంది. వారు ఇంకా గందరగోళం చేస్తారు. కాబట్టి వారు మాట విని క్రమశిక్షణతో ఉండేందుకు మరేదైనా మంచి మార్గం ఉందా?
ప్రధానమంత్రి: మీరు హరియాణాకు చెందిన వారా?
స్టూడెంట్: లేదు సార్! నేను పంజాబ్-చండీగఢ్ నుంచి వచ్చాను!
ప్రధాని: చండీగఢ్!
స్టూడెంట్: అవును సార్!
ప్రధానమంత్రి : నాయకత్వం అంటే కుర్తా-పైజామా ధరించడం, జాకెట్ ధరించడం, పెద్ద వేదికలపై గొప్ప ప్రసంగాలు చేయడం కాదు. మీలాంటి సమూహంలో కొందరు సహజంగానే నాయకులుగా ఎదుగుతారు. నాయకులను అధికారికంగా ఎవరూ నియమించరు, కానీ వారు 'వెళ్దాం' అని చెబితే, మరికొందరు అనుసరిస్తారు. నిజమైన నాయకత్వం సహజంగానే వికసిస్తుంది.
ఇది ఇతరులను సరిదిద్దడం గురించి కాదు- ఇది మీరే ఒక ఉదాహరణగా నిలవడం గురించి.
ఉదాహరణకు, మీరు క్లాస్ మానిటర్ గా ఆలస్యంగా వచ్చి, ఇతరులు సమయానికి రావాలని ఆశించినట్లయితే, వారు మీ మాట వింటారా?
విద్యార్థి: లేదు సార్!
ప్రధానమంత్రి: హోమ్‌వర్క్ పూర్తిచేయాల్సి ఉంది అనుకుందాం. మానిటర్ దాన్ని ముందుగానే పూర్తిచేశాడంటే, ఇతరులకు కూడా ప్రేరణ కలుగుతుంది. మానిటర్ సహ విద్యార్థులతో , “ మీ హోమ్‌వర్క్ ఇంకా పూర్తి కాలేదా? సరే, రండి - నేను సహాయం చేస్తాను!” అని చెప్పినప్పుడు, అది ఒక మంచి ఉదాహరణగా మారుతుంది.
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: ఉపాధ్యాయుడు ఎవరో ఒకరిని మందలించకుండా ఉండటానికి, మీరు ముందుగా వెళ్లి వారికి సహాయం అందించండి. సాటి విద్యార్థులను ఆదరించండి, వారి సమస్యలను అర్థం చేసుకోండి. ఎవరైనా అస్వస్థంగా కనిపిస్తే, “ఈరోజు బాగోలేదా? జ్వరం ఉందా? నిన్న రాత్రి సరిగ్గా నిద్రపోలేదా?” అని పలకరించడం ముఖ్యం. అప్పుడు, మానిటర్ కేవలం పెత్తనం చేసే వ్యక్తి కాదు, నిజంగా శ్రద్ధ వహించే మనిషి అని తోటి విద్యార్థులు భావిస్తారు. వారి నుంచి గౌరవాన్ని ఆశించకండి.
విద్యార్థి: అవును సార్!
ప్రధాన మంత్రి : మీరు ఆజ్ఞాపించవచ్చు!
విద్యార్థి: అవును సార్! అవును సార్!
ప్రధానమంత్రి: కానీ దాన్ని ఎలా సాధించాలి?
విద్యార్థి: ముందు తమను తాము మార్చుకోవడం ద్వారా
ప్రధానమంత్రి : సరిగాచెప్పారు! మనల్ని మనం మార్చుకోవాలి.
విద్యార్థి: మన ప్రవర్తన ద్వారానే ప్రజలు మనలను గుర్తిస్తారు.
ప్రధానమంత్రి: నిజం! మన ప్రవర్తన సహజంగానే ఇతరులను ప్రభావితం చేస్తుంది.
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: నాయకత్వాన్ని బలవంతంగా రుద్దలేం. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని స్వీకరిస్తున్నారా? మీరు కేవలం ఉపదేశాలు చెబుతూ పోతే, వారు అంగీకరించరు. ప్రజలు మీ మాటలకంటే, మీ చేతల ద్వారా మిమ్మల్ని అంగీకరిస్తారు.
ఉదాహరణకు పరిశుభ్రతపై ఉపన్యాసం ఇచ్చి కూడా మీరే ఆచరించకపోతే…
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి:... అప్పుడు మీరు నాయకుడు కాలేరు.
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: ఒక నాయకుడిగా మారాలని అంటే, మీరు ముందుగా జట్టుతో కలిసి పనిచేయడం నేర్చుకోవాలి. సహనం ఎంతో ముఖ్యం. చాలా సందర్భాల్లో, మనం ఎవరికైనా ఏదైనా పని అప్పగిస్తే, అది పూర్తవకపోతే వెంటనే తీవ్రంగా స్పందిస్తాం.
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: మనం వెంటనే “నువ్వు ఎందుకు చేయలేదు?” అని ప్రశ్నించేస్తాం. కానీ, నిజమైన నాయకత్వం అలా ఉండకూడదు.
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: ఎవరైనా ఒక పనిలో కష్టపడుతుంటే, వారి కష్టాలను అర్థం చేసుకోండి. ఎక్కడైనా వనరులు లోపిస్తే అవసరమైన చోట వాటిని అందించే వాడే నిజమైన నాయకుడు
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: ఒక నాయకుడిగా, మీరు ఎప్పుడూ మీ జట్టుకు తోడుగా ఉండాలి. వారు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే, ముందుగా మీరు సహాయం చేయడానికి ముందుకు రావాలి. అలా చేయడం వల్ల, వారిలో మీపై నమ్మకం పెరుగుతుంది. చివరికి, వారు “ తమకు తామే చేసుకున్నాం!” అని భావిస్తారు- నిజానికి, మీరు 80% సహాయం చేసినా సరే!
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: కానీ 'నేను చేశాను' అనే భావన వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, ఈ ఆత్మవిశ్వాసం మీ నాయకత్వాన్ని బలపరుస్తుంది.
ఈ చిన్ననాటి కథను మీరు వినే ఉంటారు—ఒక పిల్లవాడు,అతని తండ్రి ఒక జాతరలో ఉన్నారు. నా చెయ్యి పట్టుకో అని ఆ తండ్రి పిల్లాడితో అన్నాడు. కానీ ఆ పిల్లాడు మాత్రం- లేదు, నువ్వు నా చెయ్యి పట్టుకో!
మొదట, ఎవరికైనా ఇలా అనిపించవచ్చు—“ వీడు ఎలాంటి కొడుకు? తండ్రి చేతిని పట్టుకోవాల్సింది పోయి, తండ్రినే తన చేతిని పట్టుకోమంటున్నాడు!” కానీ, ఆ పిల్లవాడు ఇలా వివరించాడు:
నాన్నా, నేను నీ చెయ్యి పట్టుకుంటే అది ఏ క్షణంలోనైనా జారిపోవచ్చు... కానీ మీరు నా పట్టుకుంటే, మీరు ఎప్పటికీ విడిచిపెట్టరని నాకు తెలుసు.
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: ఆ నమ్మకమే- అచంచల విశ్వాసం- నాయకత్వానికి గొప్ప బలాల్లో ఒకటి, కాదా?
విద్యార్థి: నా పేరు ప్రీతమ్ దాస్, త్రిపురలోని పీఎంసీ ఆర్య హయ్యర్ సెకండరీ స్కూల్లో 12వ తరగతి చదువుతు న్నా..
ప్రధానమంత్రి : ఎక్కడి నుంచి?
విద్యార్థి: బెలోనియా, దక్షిణ త్రిపుర జిల్లా!
ప్రధానమంత్రి: మీరు ఇక్కడికి ఎలా వచ్చారు?
విద్యార్థి: అది నా అభిరుచి సార్. నేను మిమ్మల్ని కలవాలని, ఏదో నేర్చుకోవాలని, ఏదో అర్థం చేసుకోవాలనుకున్నాను-అంతే!
ప్రధానమంత్రి: మిమ్మల్ని ఎలా ఎంపిక చేశారు? లంచం ఇవ్వాల్సి వచ్చిందా?
విద్యార్థి: లేదు సార్!
ప్రధాని: అయితే ఎలా జరిగింది?
విద్యార్థి: సార్, త్రిపురలో లంచం పని చేయదు.
ప్రధానమంత్రి: నిజమా?
విద్యార్థి: నేను నా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడానికి, నా ఆలోచనలను మీకు తెలియజేయడానికి ఇక్కడకు వచ్చాను.
ప్రధానమంత్రి: అయితే సరే! నేను నా మనసులో ఉన్నది చెబుతాను, కూడా మనసారా మాట్లాడవచ్చు.
విద్యార్థి: సార్, మీకో ప్రశ్న. మా బోర్డు పరీక్షల సంవత్సరాల్లో, 10 వ తరగతి లేదా 12 వ తరగతిలో, నృత్యం, తోటపని లేదా చిత్రలేఖనం వంటి మేము ఇష్టపడే వాటిని మా కుటుంబాలు తరచుగా నిరుత్సాహపరుస్తాయి. వీటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని అంటారు. బోర్డ్ పరీక్షల తర్వాత కూడా చదువు, కెరీర్ పైనే దృష్టి పెట్టాలని పట్టుబడుతున్నారు. ఈ కార్యకలాపాలకు భవిష్యత్తు లేదని, విజయం సాధించడానికి ఏకైక మార్గం చదువే అని వారు వాదిస్తారు.
ప్రధాన మంత్రి: అంటే, నువ్వు నాట్యం చేయగలవా?
విద్యార్థి: అవును, సార్! అయితే, చిన్నప్పటి నుంచీ నేర్చుకునే అవకాశం ఇవ్వలేదు. మా గ్రామంలో అబ్బాయిలు నాట్యం చేస్తే, ప్రజలు వేరే విధంగా అర్థం చేసుకుంటారు.
ప్రధానమంత్రి : ఎలా చేశారో చూపించండి!
విద్యార్థి: ఇలా… ఇంకా ఇది! బెంగాలీ 'ధునుచి' నృత్యం కూడా - అది ఇలా సాగుతుంది... ఆపై ఇలాంటిది మరొకటి.
ప్రధాన మంత్రి: మీరు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఎలా ఫీలవుతారు?
విద్యార్థి: ఇది నా మనస్సుకు ఆనందాన్ని, తృప్తిని ఇస్తుంది.
ప్రధానమంత్రి: ఆ తర్వాత మీకు అలసటగా అనిపిస్తుందా లేదా మీ అలసట తొలగిపోతుందా?
విద్యార్థి: లేదు సార్, అలసట మాయమవుతుంది.
ప్రధానమంత్రి: అంటే మీరు మీ తల్లిదండ్రులకు అర్థం అయ్యేలా చెప్పాలి. రోజంతా ఒత్తిడికి గురైతే, దీని వల్ల మంచిగా ఉంటుందని చెప్పారా?
విద్యార్థి: లేదు సార్
ప్రధానమంత్రి: మనం విశ్రాంతి తీసుకోవడానికి కొంత సమయం తీసుకోవాలని మీరు భావించడం లేదా? మీ ఇంట్లో ఒక పెంపుడు కుక్క ఉందని ఊహించుకోండి- మీరు చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. ఇప్పుడు, మీరు 10 వ తరగతికి చేరుకున్నప్పుడు, మీ తల్లిదండ్రులు మీకు అకస్మాత్తుగా చెబుతారు, ఇకపై కుక్కతో సమయం గడపవద్దు. మేము చూసుకుంటాం, మీరు మీ చదువుపై దృష్టి పెట్టాలి. అది మీకు చదువును సులభతరం చేస్తుందా, లేదా మీకు అశాంతిని కలిగిస్తుందా?
విద్యార్థి: అది నాకు అశాంతిని కలిగిస్తుంది.
ప్రధాని: నిజమే! కాబట్టి, మీరు చెప్పింది పూర్తిగా కరెక్టే- మనం రోబోట్ ల వలె జీవించలేమని వివరించాలి. మనం మనుషులం. అసలు మనం ఎందుకు చదువుకుంటాం? జీవితంలో తదుపరి దశకు చేరుకోవడానికి…
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: మన సమగ్రాభివృద్ధి కోసం ప్రతి స్థాయిలో అధ్యయనం చేస్తాం. మీరు శిశుమందిర్ లో ఉన్నప్పుడు, మీకు వివిధ కార్యకలాపాలలో నిమగ్నం చేస్తారు. ఆ సమయంలో, వారు మమ్మల్ని ఎందుకు అంత కష్టపడేలా చేస్తున్నారు అని మీరు ఆశ్చర్యపోయి ఉండవచ్చు. వారు పువ్వుల గురించి ఎందుకు బోధిస్తున్నారు? నేను తోటమాలిని కావాలనుకోవడంలేదు కదా !
అందుకే నేను ఎప్పుడూ విద్యార్థులకు, వారి కుటుంబాలకు, వారి గురువులకు చెప్పే మాట ఇదే—బిడ్డలను నాలుగు గోడల మధ్య బంధించి, పుస్తకాల మధ్య ఖైదు చేస్తే, వారు నిజమైన ఎదుగుదల సాధించలేరు. వారికి విస్తృతమైన స్వేచ్ఛ అవసరం. తమ ఆసక్తులను అన్వేషించేందుకు స్వేచ్ఛ కావాలి. వారు తమ అభిరుచులను మనసారా ఆస్వాదిస్తే, చదువులో కూడా మెరుగ్గా రాణిస్తారు.
పరీక్షలు ఒక్కటే జీవితంలో ప్రధానం కావు. ఆ మనస్తత్వంతో బతకకూడదు. మీరు దీన్ని అర్థం చేసుకోగలిగితే, మీరు మీ కుటుంబాన్ని, మీ ఉపాధ్యాయులను కూడా ఒప్పించగలరని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.
ప్రధానమంత్రి: వైభవ్, మీ అనుభవం ఏమిటి?
విద్యార్థి: విద్యార్థి: సార్, మీరు చెప్పింది నిజమే. ఒకవేళ కేవలం చదువుపైనే దృష్టి పెట్టమని బలవంతం చేస్తే, వారు ఆసక్తిని కోల్పోతారు. కానీ మా లోపల…
ప్రధాని: అవును
విద్యార్థి: పుస్తకాల పురుగుగా మారితే, నిజ మైన జీవితాన్ని అనుభవించలేరు!
ప్రధానమంత్రి: అయితే, మనం కేవలం పుస్తకాలను వదిలిపెట్టి ముందుకు వెళ్లాలా?
విద్యార్థి: పుస్తకాలు చదవాలి ఎందుకంటే వాటిలో అపారమైన జ్ఞానం ఉంటుంది, కానీ మన కోసం కూడా సమయం ఉంచుకోవాలి.
ప్రధానమంత్రి: నేను పుస్తకాలు చదవకూడదని చెప్పడం లేదు. నిజానికి ఎక్కువగా చదవాలి, సాధ్యమైనంత జ్ఞానం సంపాదించాలి. అయితే, పరీక్షలే సర్వం కాదు. విజ్ఞానం, పరీక్షలు—ఇవి రెండు వేర్వేరు విషయాలు.
విద్యార్థి: అవును సార్!
ప్రధానమంత్రి: అవి పూర్తిగా వేరు.
విద్యార్థి: ఆయన మనకు జీవితం గురించి చాలా నేర్పించారు. పరీక్షల ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో, ఒత్తిడిని ఎలా దూరం చేసుకోవాలో, సరైన మనస్తత్వంతో పరీక్షలను ఎలా ఎదుర్కోవాలో చూపించారు. ఈ విషయాలన్నింటిలో ఆయన మాకు మార్గనిర్దేశం చేశారు.
విద్యార్థి: ఆయన చాలా సానుకూల దృక్పథం కలిగినవారు. మాలో కూడా ఆ సానుకూలతను నింపారు పాజిటివిటీని నింపాడు.
విద్యార్థి: ఆయన ప్రతి తరానికి సాధికారత కల్పిస్తున్నారు.
విద్యార్థి: ఈ రోజు ఆయన చెప్పినవన్నీ- నా జీవితంలో అన్వయించుకోవడానికి నావంతు ప్రయత్నం చేస్తాను!
ప్రధానమంత్రి: కూర్చోండి! అవును, అవును—తరువాతి విద్యార్థి ముందుకు వచ్చి వారి ప్రశ్న అడగనివ్వండి.
విద్యార్థి: నమస్కారం, సార్! నా పేరు ప్రీతి బిస్వాల్. నా తరగతిలో చాలా మంది విద్యార్థులు అత్యంత ప్రతిభావంతులు, ఎంతో కష్టపడి చదివే వారు. అయితే, వారు తగిన విజయాన్ని సాధించలేదు. ఇలాంటి వారికి మీరు ఏం సలహా ఇస్తారు?
ప్రధానమంత్రి : సలహాలు ఇవ్వడం సులభం కాదు- దయచేసి కూర్చోండి!
ప్రధాన మంత్రి: నేను మీకు ఏదైనా సలహా ఇచ్చిన వెంటనే, “ఆయన నాకు ఇది ఎందుకు చెప్పారు? దాంట్లో అర్థం ఏమిటి? ఆయనకు నాలో ఏదైనా లోపం కనిపించిందా?” అని ఆలోచించడం ప్రారంభించవచ్చు.
విద్యార్థి: అవును సార్!
ప్రధాన మంత్రి: దీని అర్థం ఒక వ్యక్తి మనస్తత్వం కష్టం అనే దానిమీద ఆధారపడి ఉండేదిగా మారుతుంది. ఇలా చేయటం వల్ల వారితో తోడుగా ఉన్నవాళ్లకు ఉపయోగపడటం కష్టమౌతుంది. లోపాలపై దృష్టి పెట్టటానికి బదులుగా వాటిలోని మంచిని వెతకండి.
మీరు ఒకరిని ఐదు నుంచి ఏడు రోజులు గమనించినట్లయితే మీరు కచ్చితంగా సానుకూలమైన విషయాలను గమనిస్తారు- బహుశా వారు బాగా పాడవచ్చు, దుస్తులను చక్కగా ధరించవచ్చు లేదా మరేదైనా ప్రశంసనీయమైన లక్షణాన్ని కలిగి ఉండొచ్చు. మీరు దీన్ని గుర్తించిన తర్వాత, దాని గురించి చర్చించటం ప్రారంభించండి. మీరు వారి కున్న బలాలను గుర్తించినప్పుడు.. మీరు నిజంగా వారి పట్ల ఆసక్తి చూపుతున్నారని, వారి సామర్థ్యాలను ప్రశంసిస్తున్నారని వారు తెలుసుకుంటారు.
అప్పుడు మీరు "మిత్రమా, మీరు చాలా కష్టపడతారు, కానీ పరీక్ష సమయంలో ఏమి జరుగుతుంది? మీరు ఎందుకు ఇంత కష్టపడుతుంటారు. మీకు ఏమనిపిస్తుంది? అని అడగండి. "నేను పరీక్షల్లో సమర్థున్ని కాదు. అలా ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు" అని చెబుతారు.
ఆ క్షణ౦లో మీరు వారిని "మా ఇంటికి రండి, కలిసి చదువుకుందాం" అని ప్రోత్సహించొచ్చు.
అలాగే మీరు గమనించి ఉంటారు.. చాలా మంది ఉపాధ్యాయులు సంవత్సరం మొత్తం చదువు చెప్తారు. కానీ పరీక్ష సమయం సమీపిస్తున్నప్పుడు.. వారు విద్యార్థులకు ప్రశ్నలు-జవాబులను రాయమని చెప్తారు.
విద్యార్థి: అవును సర్!
ప్రధాన మంత్రి: వయసుతో సంబంధం లేకుండా రాయడం అలవాటు చేసుకోవాలనేది నా నమ్మకం. కొందరు కవితలు రాస్తారు. విరాజ్, ఆకాంక్ష తమ కవితలను చెప్పారు. కవితలు రాసే వారు వాస్తవానికి వారి ఆలోచనల రూపంలో చెబుతున్నారు. అహ్మదాబాద్‌లోని కొందరు పాఠశాల అధికారులను కలిసినప్పటి సందర్భం నాకు గుర్తుంది. తమ బిడ్డను స్కూల్ నుంచి బహిష్కరిస్తున్నారని ఓ చిన్నారి తల్లిదండ్రులు నాకు లేఖ రాశారు. "ఆయన్ని ఎందుకు బహిష్కరిస్తున్నారు?" అని అడిగాను. చిన్నారి దృష్టి పెట్టటం లేదని వారు బదులిచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆ తర్వాత పాఠశాలలో టింకరింగ్ ప్రయోగశాలను ప్రారంభించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అదే పిల్లవాడు టింకరింగ్ ల్యాబ్లో ఎక్కువ సమయం గడిపాడు. రోబోటిక్స్ పోటీలో పాఠశాల జట్టు ప్రథమ స్థానాన్ని గెలుచుకుంది. ఎలా? ఎందుకంటే ఆ పిల్లాడు రోబోను తయారు చేశాడు కాబట్టి! వారు బహిష్కరించబోయే పిల్లాడే రోబోటిక్స్ అగ్రస్థానాల్లో ఉన్నాడని తేలింది. అంటే అతనిలో ప్రత్యేకమైన టాలెంట్ ఉంది. ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే ఉపాధ్యాయుడి పని. నేను మీతో ఒక ప్రయోగం గురించి మీకు చెప్తాను. మీరు ఈ రోజు తప్పకుండా చేస్తారా?
విద్యార్థి : తప్పకుండా సర్!
ప్రధాన మంత్రి: చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీ స్నేహితులందరి గురించి ఆలోచించండి. 25, 30 ఇలా ఎంత మంది ఉంటే వారి గురించి. వారి తండ్రుల పేర్లతో సహా వారి పూర్తి పేర్లను రాయడానికి ప్రయత్నించండి. బహుశా మీరు 10 మంది వరకు ఇది చేయచ్చు. అప్పుడు వారి అమ్మా నాన్నలు, ఇతర కుటుంబ సభ్యుల పేర్లను రాయండి. ఈ సంఖ్య మరింత తగ్గిపోతుందని మీరు గ్రహించవచ్చు. మీరు మంచి స్నేహితులుగా భావించే వారి గురించి కూడా మీకు చాలా తక్కువ తెలుసు అని ఇది తెలియజేస్తుంది. పైపైన తెలుసుకోవటమే నడుస్తోంది. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకోండి. "నేను వైభవ్‌తో మూడు రోజులుగా ఉన్నాను, కానీ అతనిలో నిర్దిష్టమైన మంచి లక్షణాన్ని నేను చెప్పగలనా?" మీరు ఈ అలవాటును పెంపొందించుకుంటే, మీరు సహజంగానే ప్రతిదానిలో సానుకూల అంశాలను కనుగొనడం ప్రారంభిస్తారు. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను.
విద్యార్థి: సర్, నా ప్రశ్న ఇది: పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ, విద్యార్థులు వీలైనంత ఎక్కువ చదివి ఉత్తమ ప్రతిభ కనబరచాలనే ఒత్తిడిలో ఉంటారు. ఆ దశలో చదువుపై ఎక్కువ దృష్టి పెట్టి.. తినటం, నిద్రపోవటం, ఇతర దినచర్యలకు భంగం కలుగుతుంది. సర్, మీరు మీ రోజును చాలా ఉత్పాదకంగా గడుపుతారు. సర్, విద్యార్థులు తమ రోజంతా సమర్థవంతంగా నిర్వహించుకోవటం, మంచిగా చదువుకునేందుకు మీరు ఇచ్చే సలహా?
ప్రధాన మంత్రి: ముందుగా అందరికీ 24 గంటల సమయం ఉంటుంది కదా?
విద్యార్థి: అవును సర్!
ప్రధాన మంత్రి: మీకు తెలుసు కదా?
విద్యార్థి: అవును సర్!
ప్రధాన మంత్రి: కొంతమంది 24 గంటల్లో అద్భుతమైన పని చేస్తారు. మరికొందరు రోజంతా గడిపినప్పటికీ ఏమీ చేయలేదని తెలుస్తుంది.
విద్యార్థి: అవును సర్!
ప్రధాన మంత్రి: వారి సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, ఎలా సరిగ్గా నిర్వహించుకోవాలో అవగాహన లేకపోవడం ప్రధాన సమస్య.
విద్యార్థి: అవును సర్!
ప్రధాన మంత్రి: మిత్రుడు వస్తే చాటింగ్ చేస్తూ సమయాన్ని వృథా చేస్తుంటారు.
విద్యార్థి: అవును సర్!
ప్రధాన మంత్రి: ఫోన్ కాల్ వస్తే దానికే అతుక్కుపోతుంటారు. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో వారికి తెలియదు. మన సమయ౦ గురి౦చి ఆలోచి౦చడ౦ మొదటి పని. నేను నా సమయాన్ని గరిష్ఠంగా ఉపయోగించుకుంటటంపై అప్రమత్తంగా ఉంటాను. దీనిలో చాలా తేడా ఉంటుంది. నా సమయాన్ని వృథా కానివ్వను. దీని అర్థం నేను నిరంతరం ఒక పని నుండి మరొక పనికి పరిగెత్తుతున్నానని కాదు. సమయ నిర్వహణకు అనుగుణంగా అనుగుణంగా నా పనులను రాతపూర్వకంగా ప్రణాళిక వేసుకుంటాను. ఆపై వాటిని నేను పూర్తి చేశానో లేదో సమీక్షిస్తాను. రేపు మీరు చేయాలనుకునే మూడు పనులను జాబితా తయారు చేసుకోండి. తప్పకుండా వాటిని పూర్తి చేయండి. ఆ పనులను పూర్తి చేశారో లేదో తర్వాతి రోజు చూసుకోండి. తరచుగా జరిగేది ఏమిటంటే.. మనం ఇష్టపడే సబ్జెక్ట్‌లపై ఎక్కువ సమయం గడుపుతాం, మనకు నచ్చని వాటిని పూర్తిగా విస్మరిస్తాం.
విద్యార్థి: అవును సర్! అది నిజం!
ప్రధాన మంత్రి: ముందు మీరు ఈ విధానాన్ని మార్చుకోవాలి.
విద్యార్థి: అవును సర్!
ప్రధానమంత్రి: ఒక సవాలుగా తీసుకోండి. "ఈ భౌగోళిక శాస్త్రం ఏంటి? నాకెందుకు ఇది అర్థమవటం లేదు? ఇందులో నేను గెలుస్తాను” అని ఆలోచించండి. ఈ సబ్జెక్ట్‌ను జయించాలనే దృఢ సంకల్పాన్ని పెంపొందించుకోండి. అది గణితం కూడా కావచ్చు-"రా, ముఖాముఖిగా ఎదురుపడుదాం. నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను” అని అనుకోండి. గెలిచే మనస్తత్వాన్ని పెంపొందించుకోండి- ఎన్నడూ విడిచిపెట్టద్దు లేదా తలవంచొద్దు.
విద్యార్థి: ప్రతి ఒక్కరికీ 24 గంటలు ఉంటాయి, కానీ కొంతమంది చాలా ఉత్పాదకంగా ఉంటారు. మరికొందరు మీరు చెప్పినట్లుగా చాటింగ్ చేస్తూ వృథా చేస్తారు. కాబట్టి పనులు సకాలంలో పూర్తి చేయడానికి, రోజంతా ఉత్పాదకంగా ఉండేందుకు మనకు సరైన సమయ నిర్వహణ అవసరం.
విద్యార్థి: సర్ మొదటగా మీరు గొప్ప సమాధానం ఇచ్చారు కాబట్టి మేం మీ కోసం చప్పట్లు కొట్టాలనుకుంటున్నాము, కానీ ఇవి "ఫ్లవర్ క్లాప్స్".
ప్రధాన మంత్రి: ఎందుకిలా చేస్తారో తెలుసా?
విద్యార్థులు: సర్, ఇది వినలేని వారి కోసం.
ప్రధాన మంత్రి: వారు వెంటనే చేతులు ఊపుతూ తమ అభిమానాన్ని ఇలా చూపిస్తారు.
విద్యార్థి: సర్ ఎన్నో ఆలోచనలు, అవకాశాలు, ప్రశ్నలు మన మదిలో మెదులుతూనే ఉంటాయి. ఇవి పరీక్షల సమయంలో ఆటంకానికి కారణమవుతాయి. కాబట్టి సర్, ఇటువంటి పరిస్థితులలో మన మనస్సులను ఎలా శాంతంగా ఉంచుకోవాలి.?
ప్రధాన మంత్రి: చూడండి, మీరు ఇబ్బంది పడతారని నేను నమ్మను.
విద్యార్థి: సర్, కొంచెం ఆటంకం కలుగుతుంది. ఎందుకంటే…
ప్రధాన మంత్రి: మీరు నిజంగా ఆటంకానికి గురవుతారని నేను అనుకోను.
విద్యార్థి: సర్, కాస్త ఆటంకానికి గురవుతాను.
ప్రధాన మంత్రి: మీ ఆత్మవిశ్వాసం స్థాయిని చూస్తున్నాను. ఈ రోజు ఉదయం మిమ్మల్ని గమనించినప్పటి నుంచి మీ ఆత్మవిశ్వాసం అసాధారణంగా ఉంది.
విద్యార్థి: అయినా పరీక్షలు చాలా కఠినంగా ఉంటాయి సర్.
ప్రధాన మంత్రి: అంటే మీ గురించి మీకు పూర్తిగా తెలియదన్నమాట. స్నేహితుల ముందు "అవును, ఇది కష్టం" అని చెప్పడం మంచిదని మీకు అనిపించొచ్చు. పదో తరగతి విద్యార్థులు తరచుగా ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటారు—"నేను నిన్న చదవలేకపోయాను, నాకు నిద్ర పట్టింది" లేదా "నిన్న నా మానసిక స్థితి సరిగ్గా లేదు". స్నేహితులతో ఫోన్‌లో కూడా ఇలాంటి విషయాలు చెబుతుంటారు.
విద్యార్థి: అవును!
ప్రధాన మంత్రి: మరి మీరు ఎలా దృష్టి పెడతారు?
ప్రధాన మంత్రి: అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి?
విద్యార్థి: ప్రస్తుత క్షణం!
ప్రధాన మంత్రి: ప్రస్తుత క్షణం గడిచిపోతే అది గతం అవుతుంది. అది ఇకపై మీ చేతుల్లో లేదు. కానీ మీరు నిజంగా జీవించి ఉంటే...
విద్యార్థి: అవును సర్!
ప్రధాన మంత్రి: అప్పుడు అది మీ జీవితంలో భాగమౌతుంది. కానీ మీరు ఎప్పుడు జీవించగలరు? చూడండి, ప్రస్తుతం గాలి చాలా చక్కగా వీస్తోంది. కానీ మీరు కూడా గమనించారా? అందమైన ఫౌంటెన్ కూడా ఉంది. నేను చెప్పగానే మీకు హఠాత్తుగా అవును అని తెలిసింది.
విద్యార్థి: అవును సర్!
ప్రధాన మంత్రి: ఇంతకు ముందు కూడా గాలి ఉంది.
విద్యార్థి: అవును సర్!
ప్రధాన మంత్రి: కానీ మీరు గమనించలేదు.
విద్యార్థి: అవును సర్!
ప్రధాన మంత్రి: మీ మనసు వేరే చోట ఉంది.
విద్యార్థి: అవును సర్!
విద్యార్థి: నా ప్రశ్న ఏటంటే..సర్, ఈ రోజుల్లో విద్యార్థులు చదివేటప్పుడు తరచుగా నిరాశ, ఆందోళనకు లోనవుతున్నారు. దీన్ని ఎలా అధిగమించగలం సర్?
ప్రధాన మంత్రి: ఈ సమస్య ఎక్కడ మొదలౌతుంది? క్రమంగా మీరు ఈ మార్పులను గమనిస్తారు- మీరు ఇంట్లో సంభాషణలను ఆస్వాదించరు. ఇంతకు ముందు మీరు మీ తమ్ముడితో చాలా ఆడుకునేవారు.
విద్యార్థి: అవును సర్!
ప్రధాన మంత్రి: ఇప్పుడు అతను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లు అనిపిస్తోంది. వెళ్లిపో, నన్ను ఒంటరిగా వదులు అంటారు. అంతకుమందు పాఠశాల నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి స్కూల్లో జరిగినదంతా ఉత్సాహంగా అమ్మకు చెప్పేవారు.
విద్యార్థి: అవును సర్!
ప్రధాన మంత్రి: ఇప్పుడు మీరు మీ అమ్మతో ఆ విషయాలు పంచుకోరు. మర్చిపో అని కొట్టిపారేస్తారు. మీరు ఇంటికి వచ్చి కాసేపు ఒక పుస్తకాన్ని తీసుకొని, తరువాత దానిని విడిచిపెడతారు. ఈ రకమైన ప్రవర్తన క్రమంగా మిమ్మల్ని ఒంటరి చేస్తుంది. నెమ్మదిగా మీలో మీరు కుంచించుకుపోతారు. చివరికి ఇది నిరాశకు దారితీస్తుంది. మీ మనసులోని సందేహాలు, సందిగ్ధతలను సంకోచించకుండా బహిరంగంగా పంచుకోవడానికి ప్రయత్నించాలి. మీరు వాటిని పంచుకోక లోపలే ప్రతిదాన్ని దాచుకోవటం వల్ల చివరి విస్పోటనానికి దారి తీస్తుంది. పూర్వం మన సామాజిక నిర్మాణం వల్ల ఎంతో ప్రయోజనం ఉండేది. ఆ కుటుంబం కూడా ఒక విశ్వవిద్యాలయం లాంటిది. కొన్నిసార్లు మీరు మీ తాతతో, కొన్నిసార్లు మీ అమ్మమ్మతో, కొన్నిసార్లు మీ మామయ్య, అత్త, తోబుట్టువులతో కూడా బహిరంగంగా మాట్లాడేవారు. ఎల్లప్పుడూ పంచుకోవడానికి ఎవరైనా ఉండేవారు. ఇది ప్రెషర్ కుక్కర్ పైన ఉండే విజిల్ లాంటిది...
విద్యార్థి: అవును సర్!
ప్రధాన మంత్రి: ప్రెషర్ కుక్కర్ పేలదు.
విద్యార్థి: అవును సర్!
ప్రధాన మంత్రి: అదే తరహాలో ఇది మీరు అనుభవించే ఒత్తిడి లాంటిది.
విద్యార్థి: అవును సర్!
ప్రధాన మంత్రి: అప్పుడు మీ తాత మామూలుగా సాధారణంగా మాట్లాడుతూ "వద్దు బాబూ, అలా చెయ్యకు" అనేవారు.
విద్యార్థి: అవును సర్!
ప్రధాన మంత్రి: మనం సరే అని అనుకొని "అవును, నేను అలా చేయను" అని అనుకుంటాం. అప్పుడు తాత లేదా మామయ్య, "జాగ్రత్తగా ఉండు, పడిపోతావు" అని అనవచ్చు. అది ధైర్యానిస్తుంది.
విద్యార్థి: అవును సర్!
ప్రధాన మంత్రి: శ్రద్ధ కావాలనుకోవటం మానవ నైజం. నేను ఇక్కడికి వచ్చి సుదీర్ఘ ప్రసంగం చేస్తే, "ఈ ప్రధాన మంత్రి ఎవరు ఏమనుకుంటున్నారు?" అని మీరు బహుశా అనుకుంటారు. బదులుగా నేను నిజంగా మీ పాటలు, మీ ఆలోచనలు వినాలనుకుంటున్నాను, మీ గ్రామం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. "ఆయన మనలాగే ఉన్నాడు. మాట్లాడుకుందాం" అని మీకు అనిపిస్తుంది. అప్పుడు ఒత్తిడి ఉండదు కదా? నిజమైన సంరక్షణ లేకపోవడం డిప్రెషన్‌కు అతిపెద్ద కారణాలలో ఒకటి. రెండోది పూర్వకాలంలో, ఉపాధ్యాయులు విద్యార్థులపై దృష్టి సారించేవారు. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు నా చేతిరాత భయంకరంగా ఉన్నప్పటికీ నా ఉపాధ్యాయులు నా కోసం చాలా కష్టపడ్డారనే విషయం ఇంకా నాకు గుర్తుంది. దాన్ని మెరుగుపర్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. బహుశా వారు మెరుగుపరిచారు. బహుశా నా కంటే వారి చేతిరాతనే మెరుగురుచుకున్నారు(నవ్వుతూ)! కానీ వారి శ్రద్ధ నా హృదయాన్ని తాకింది. వారు నిజంగా శ్రద్ధ వహించారు.
విద్యార్థి: సర్, నాకు చివరి ప్రశ్న ఉంది.
ప్రధాన మంత్రి: అవునా చెప్పండి!
విద్యార్థి: తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగా చాలా మంది విద్యార్థులు ఆసక్తి లేని వృత్తులను, రంగాలను ఎంచుకుంటున్నారు. అలాంటి విద్యార్థులు తల్లిదండ్రుల మనోభావాలను దెబ్బతీయకుండా తమ అభిరుచులను ఎలా కొనసాగించాలి?
ప్రధాన మంత్రి: తల్లిదండ్రులకు తరచుగా కొన్ని అంచనాలు ఉంటాయి, కానీ అవి నెరవేరకపోతే వారు శాశ్వతంగా గాయపడి ఉంటారనేది నిజం కాకపోవచ్చు. వారి ఆశలు సాధారణంగా తమ బిడ్డను రాణించాలనే కోరిక నుంచి వస్తాయి. కొన్నిసార్లు ఇది వారి స్వంత ఆలోచనలు కూడా కాదు. వారు తమ పిల్లలను ఇతరులతో పోలుస్తారు. "నా మేనల్లుడు చాలా సాధించాడు; నా బిడ్డ కూడా అలా ఎందుకు చేయడం లేదు?” అనేది ఉదాహరణగా తీసుకోవచ్చు.
విద్యార్థి: అవును సర్!
ప్రధాన మంత్రి: వారి సామాజిక స్థితి తరచుగా వారికి అడ్డంకిగా మారుతుంది.
విద్యార్థి: అవును సర్!
ప్రధాన మంత్రి: కాబట్టి, తల్లిదండ్రులకు నా సలహా ఏమిటంటే- దయచేసి మీ పిల్లలను అన్ని చోట్లా చెప్పుకునే నమూనాగా మార్చొద్దు. వాళ్లు ఏంటో దానితోనే మీ పిల్లలను ప్రేమించండి. వారి ప్రత్యేక బలాలను అంగీకరించండి. ప్రపంచంలో ప్రత్యేక ప్రతిభ లేని వ్యక్తి లేడు. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా పాఠశాల నుంచి నుంచి దాదాపు పంపించేసిన పిల్లవాడు రోబోల తయారీలో అగ్ర స్థానంలో నిలబడ్డాడు. కొంతమంది పిల్లలు చదువు కంటే క్రీడల్లో రాణిస్తారు. క్రికెట్లో దిగ్గజ ఆటగాళ్లలో ఒకరైన సచిన్ టెండూల్కర్‌ను తీసుకోండి. చదువుపై ఆసక్తి లేదని ఆయనే స్వయంగా అంగీకరించారు. కానీ అతని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అతని సామర్థ్యాన్ని గుర్తించారు. అది అతని జీవితాన్ని మార్చింది. ఒకసారి ఎవరో ‘మీరు ప్రధానమంత్రి కాకపోతే, లేదా మంత్రిగా ఉండి, ఒక శాఖను ఎంచుకోమని కోరితే, మీరు ఏ శాఖను ఇష్టపడతారు?’ అని అడిగారు. నేను నైపుణ్య శిక్షణ శాఖను ఎంచుకుంటాను' అని బదులిచ్చాను.
విద్యార్థి: అవును సర్!
ప్రధాన మంత్రి: నైపుణ్యాలకు అపారమైన శక్తి ఉంది. నైపుణ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టాలి. పిల్లలు చదువులో రాణించకపోతే కచ్చితంగా వేరే రంగంలో వారికి నైపుణ్యం ఉంటుంది. ఆ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించి తదనుగుణంగా పిల్లలకు మార్గనిర్దేశం చేయాలి. తద్వారా అనవసర ఒత్తిడి తగ్గుతుంది.
విద్యార్థి: పిల్లలపై ఒత్తిడి చేయొద్దని తల్లిదండ్రులకు ప్రధాన మంత్రి మోదీ కీలక సందేశం ఇచ్చారు. పిల్లలు తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవాలి, తల్లిదండ్రులు తమ పిల్లలను అర్థం చేసుకోవాలి. పరస్పర అవగాహన ఉండాలి.
ప్రధాన మంత్రి: మరింత దగ్గరకి జరుగుదాం. మీరంతా చాలా దూరంగా కూర్చున్నారు. కొంచెం ధ్యానం చేద్దాం.
విద్యార్థి: అవును సర్!
ప్రధాన మంత్రి: సరళంగా చెప్పాలంటే మీ భాషలో ధ్యానాన్ని ఏమని అంటారు?
విద్యార్థి: మనసును ఏకాగ్రంగా ఉంచటం.
ప్రధాన మంత్రి: నిజమే. ఇప్పుడు ఆ ఫౌంటెన్ శబ్దాన్ని ఒక్క క్షణం వినండి. అందులో ఏదైనా మెలోడీ వినిపిస్తోందా?
విద్యార్థి: పీఎం సర్ మమ్మల్ని ధ్యానం ద్వారా మార్గనిర్దేశం చేసినప్పుడు, ముఖ్యంగా ఫౌంటెన్‌ను గమనించి మన ఆలోచనలను పంచుకోమని చెప్పటం నన్ను ఎక్కువగా ఆకర్షించింది. అది నిజంగా మేలైన అంశం.
ప్రధాన మంత్రి: పక్షుల కిలకిలలారావాలు విన్నారా?
విద్యార్థి: అవును సర్!
ప్రధానమంత్రి: ఎలా అనిపించింది నీకు?
విద్యార్థి: అద్భుతంగా అనిపించింది సర్!
ప్రధానమంత్రి: ఒకేసారి అయిదు రకాల శబ్దాలు వచ్చుండాలి కద.. ఏ కూత ఏ పక్షిదో, ఎక్కడి నుంచీ వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేశావా? అటువంటి ప్రయత్నం చేస్తే సహజంగానే నీ దృష్టి కేంద్రీకరణ సామర్థ్యం మెరుగవుతుంది. ఆ శబ్దాల ఆధారంగా నువ్వు నీ లోపలి వ్యక్తితో అనుసంధానమవగలుగుతావు. ఇందాక ఒత్తిడి గురించి వైభవ్ అడిగాడు కదా.. ఒత్తిడికి పరిష్కారం ఏమిటి? శ్వాస తీసుకోవడమే!
విద్యార్థి: సర్, మీరనేది ప్రాణాయామమే కద..
ప్రధానమంత్రి: సరిగ్గా చెప్పావ్!
ప్రధానమంత్రి: అవును, ప్రాణాయామం చాలా బాగా పని చేస్తుంది. ఒక ప్రత్యేక రకమైన శక్తిని విడుదల చేస్తుంది. మీరు శ్వాస తీసుకునేటప్పుడు మీ శరీరంలోకి చల్లని గాలి ప్రవేశిస్తున్నట్లు, శ్వాస వదిలేటప్పుడు వెచ్చని గాలి మీ శరీరాన్ని విడిచి వెళుతున్నట్లు ఊహించుకోండి. మీరు ఏ ముక్కుపుటం ద్వారా ఊపిరి తీసుకుంటున్నారో గమనించారా?
విద్యార్థి: కుడి వైపు నుంచి సర్..
ప్రధానమంత్రి: రెండు ముక్కుపుటాలూ అన్నివేళలా ఒకేసారి పని చేయవు. ఒక్కో సమయంలో ఒక్కో ముక్కుపుటం పని చేయకపోవచ్చు (అప్పుడు తనని తాను పనికి రానిదాన్ననుకుంటుందా?!) సరే.. ఈ శ్వాస తీసుకునే ప్రక్రియలో భాగంగా కుడి ముక్కు పుటం నుంచీ ఎడమ వైపుకి మారాలి అనుకున్నారనుకోండి.. మీరు ఆజ్ఞ ఇవ్వగానే ఈ మార్పు సహజంగా జరిగిపోతుందా?
విద్యార్థి: లేదండీ!
ప్రధానమంత్రి: సరే వినండి మరి.. ఇందుకోసం ఒక ప్రత్యేక పద్ధతి ఉంది. ప్రస్తుతం మీ కుడి ముక్కుపుటం పని చేస్తోంది అనుకుందాం. ఎడమ వైపుకి మారాలంటే, ముందుగా మీ ఎడమవైపు మృదువుగా కొరకండి, తరువాత కుడి బుగ్గ మీద మీ వేలితో మెత్తగా నిమరండి. ఇప్పుడు గమనించండి, శ్వాస తీసుకునే ప్రక్రియ నెమ్మదిగా ఎడమ వైపుకి మారడాన్ని మీరు గమనించవచ్చు.
విద్యార్థి: అవును సర్!
ప్రధానమంత్రి: చూశారా, అయిదు సెకన్లలో మీ శరీరాన్ని ఆధీనంలోకి తెచ్చుకోగలిగారు!
విద్యార్థి: నిజమే సర్!
ప్రధానమంత్రి: నిజానికి రెండు ముక్కుపుటాలూ సమంగా పనిచేయాలి. చేతులు కట్టుకుని నిటారుగా కూర్చోండీ అంటూ మీ టీచర్లు మీకు సూచించే సమయంలో కూడా మీరు ఈ పద్ధతిని పాటిస్తూ శ్వాస తీసుకునే ప్రయత్నం చేయండి. త్వరలో రెండు ముక్కుపుటాలూ సమానంగా పనిచేయడాన్ని మీరు గమనిస్తారు.
విద్యార్థి: తప్పక సర్!
ప్రధానమంత్రి: ఈ పద్ధతి బాగా పని చేస్తుందని చెప్పాను కద! మీరే స్వయంగా తెలుసుకున్నారుగా!
విద్యార్థి: అవును సర్, మీరు చెప్పిన పద్ధతి భలే పనిచేస్తోంది!
విద్యార్థి: సర్ మాకు ధ్యానం చేసే పద్ధతిని, శ్వాస మీద నియంత్రణ తెచ్చుకునే పద్ధతినీ నేర్పారు. ఇవి నేర్చుకోవడం మాకెంతో బాగుంది. మా ఒత్తిడంతా మాయమయ్యింది.
విద్యార్థి: ధ్యానం చేసే పద్ధతిని మాకు నేర్పారు, ఇంక ఒత్తిడి అనేది మా తలకెక్కదు. శ్వాస మీద నియంత్రణ ఎలా తెచ్చుకోవాలో కూడా చెప్పారు. ఎక్కువగా ఒత్తిడిని తీసుకోకూడదు, ఒకవేళ ఒత్తిడి ఉన్నా సరే, అతిగా ఆలోచించ కూడదు.. జీవితాన్ని హాయిగా గడపాలి.
ప్రధానమంత్రి: బాగుంది! అందరూ దగ్గరికి రండి, ఈరోజుకి ఇదే మన గురుకులం!
విద్యార్థి: సర్, మేం పొద్దున లాఫ్టర్ థెరిపీ లో కూడా పాల్గొన్నాం.
ప్రధానమంత్రి: భలే! అందరికంటే ఎక్కువగా ఎవరు నవ్వారు?
విద్యార్థి: సర్, అందరమూ..
ప్రధానమంత్రి: వాళ్ళు ఏం నేర్పారు? మీరేం చేశారో చెప్పండి..
విద్యార్థి: హాహాహా.. హోహోహొ.. హాహాహా.. హోహోహో అహ్హహ్హహ్హ!
ప్రధానమంత్రి: మీరు ఇళ్ళకి వెళ్ళి ఇంట్లో వాళ్ళతో ఇది చేయించారనుకోండి, వాళ్ళేం అంటారు? ఈ కార్యక్రమానికి వచ్చి మీరు పిచ్చివాళ్ళయ్యారు అనుకోరూ! సరదా సంగతి సరే, మీరు ఈ పని తప్పక చేయండి. అందరినీ ఒక దగ్గరికి చేర్చి నవ్వు చికిత్సని అందించండి. ఈ ఆనందంలో గొప్ప శక్తి దాగుంది. సరిగ్గా మూడురోజుల్లో మీరు మార్పును గమనిస్తారు, ఇంట్లో వాతావరణమే మారిపోతుంది.
విద్యార్థి: క్రితం సారి లాగా ఈసారి కూడా ప్రధానమంత్రి గారు స్టేజి మీద కూర్చుని ఉంటే, మేమంతా కింద కూర్చుంటాం అనుకున్నాం. కానీ ఈరోజు అలా లేనే లేదు. ఆయన ఒక మిత్రుడిలాగా మాతో మాట్లాడారు, దేశ ప్రధానమంత్రి ఇక్కడున్నారు అన్న బెరుకే మాకు కలగలేదు.
విద్యార్థి: నా పేరు యుక్తా ముఖీ సర్!
ప్రధానమంత్రి: ఎక్కడినుంచీ వచ్చావు తల్లీ?
విద్యార్థి: ఛత్తీస్ గఢ్!
ప్రధానమంత్రి: ఛత్తీస్ గఢా!
విద్యార్థి: సర్, మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను... చిన్న విజయాలతో కూడా ఆనందంగా ఉండటం ఎలా? అన్నిటి గురించి నిరాశ పడటం నాకున్న అలవాటు!
ప్రధానమంత్రి: నీ గురించి నువ్వు తక్కువగా అనుకుని నిరాశ పడతావా? లేక, ఇతరుల ప్రవర్తన వల్ల నీకు అలా అనిపిస్తుందా?
విద్యార్థి: పదో క్లాస్ పరీక్షల్లో 95 శాతం మార్కులు వస్తాయనుకున్నా, కానీ చివరికి 93 శాతమే సాధించగలిగాను సర్! ఆ రెండు శాతం తలుచుకుంటే నాకు దిగులుగా అనిపిస్తుంది.
ప్రధానమంత్రి: చూడమ్మా, నీది విజయంగానే నేను భావిస్తున్నాను. నువ్వు ఏర్పరుచుకునే లక్ష్యం చేరగలిగేది అయ్యుండాలి తప్ప పూర్తిగా అందకూడదు. ముందుగా నువ్వు సాధించగలిగిన దాని కన్నా 2 పాయింట్ల ఉన్నత లక్ష్యం పెట్టుకున్నందుకు నీకు శుభాకాంక్షలు చెబుతున్నాను. ఇది గొప్ప విషయం. ఈసారి 97 శాతం లక్ష్యంగా పెట్టుకుని 95 శాతం సాధించగలిగితే నువ్వు గర్వపడాలి. 97, 99, 100 శాతం అని కాకుండా నువ్వు అందుకోదగ్గ 95 శాతాన్ని నీ లక్ష్యంగా పెట్టుకోవడం నిజం గొప్ప విషయం. పరిస్థితి అదే, మనం దానిని చూసే దృష్టికోణంలో మార్పు చేసుకోవచ్చు. అది మన చేతిలోనే ఉంది.
విద్యార్థి: సర్, పరీక్షల సమయంలో చాలా మంది బోర్డు ఎగ్జామ్స్ అనగానే భయపడుతూ ఉంటారు. ఇక ఆరోగ్యం మీద శ్రద్ధే పెట్టరు.
ప్రధానమంత్రి: ఈ సమస్యకు విద్యార్థులకన్నా వారి కుటుంబాలదే ఎక్కువ బాధ్యత ఉంటోంది. పిల్లవాడు బొమ్మలు వేయడంలో దిట్ట అయ్యుండవచ్చు, చిత్రకారుడు అవ్వాలని కలలు కంటూ ఉండవచ్చు, అయితే విద్యార్థి కుటుంబ సభ్యులు మాత్రం వాళ్ళు ఏ ఇంజినీరో లేక డాక్టరో కావాలని పట్టుబడతారు.
విద్యార్థి: నిజం సర్!
ప్రధానమంత్రి: ఈ విషయం విద్యార్థిని ఎప్పుడూ ఒత్తిడిలోకి నెట్టేస్తూ ఉంటుంది. పిల్లల్ని అర్ధం చేసుకోమని, వారి ఆసక్తులేమిటో, ప్రత్యేక నైపుణ్యాలేమిటో తెలుసుకొమ్మని నేను తల్లిదండ్రులకు మొదటగా విజ్ఞప్తి చేస్తున్నాను. వారి సామర్థ్యాన్ని బట్టి వారేం చేస్తున్నారో గమనించండి. వీలైతే వారికి చేయూతనివ్వండి. మీ బిడ్డలు క్రీడలలో ఆసక్తిని కనపరిస్తే, వారిని ఆటలపోటీలకు తీసుకువెళ్ళండి, వాడు ఆ ఆటలని చూసి స్ఫూర్తి పొందుతాడు. రెండోది, సాధారణంగా స్కూల్లో బాగా చదివే విద్యార్థులకే ఎక్కువ ప్రాముఖ్యాననిచ్చి, వారిని మాత్రమే ప్రశంసించే వాతావరణాన్ని టీచర్లు తయారుచేస్తున్నారు. మిగతావారిని పట్టించుకోకపోవడం, లేదా వెనక బెంచీల్లో కూర్చోమనీ చెప్పడం జరుగుతోంది. అటువంటి సమయాల్లోనే పిల్లలు దిగాలు పడిపోతారు. పిల్లలను ఒకరితో మరొకరిని పోల్చవద్దని ఈ సందర్భంగా నేను టీచర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ ఒక్కరినీ వేలెత్తి చూపి, వాడిని తోటి విద్యార్థుల ముందు అవమానించవద్దు. ఏదైనా సలహా ఇవ్వదలుచుకుంటే, ఆ విషయాన్ని పక్కకు పిలిచి చెప్పండి. ప్రతి విద్యార్థితో సానుకూలంగా వ్యవహరిస్తూ మీ ప్రోత్సాహాన్ని అందించండి. “నీలో ఎంతో ప్రతిభ ఉంది, చక్కగా కృషి చేయి, అయితే, శ్రద్ధ పెట్టడం మాత్రం మరవద్దు” అని చెప్పండి. “నేను కష్టపడాలి, నా స్థాయిని పెంచుకోవాలి, పోయినసారి కన్నా మంచి ప్రదర్శన చూపాలి, నా మిత్రుల కన్నా ముందుండాలి ” అని విద్యార్థులు కూడా అనుకోవాలి. అయితే, పరీక్షలే సర్వస్వం కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. నేను ఇందాకటి నుంచీ గమనిస్తున్నాను, మీరు మీ ప్రపంచంలో ఉన్నట్టున్నారు, బిడియం విడిచి, నాతో హాయిగా మాట్లాడటం లేదేం !
విద్యార్థి: సర్, మా స్కూల్లో నేనిప్పుడు సీనియర్ ని. పరీక్షల సమయంలో, సాంస్కృతిక పోటీల్లో, సాహిత్య కార్యక్రమాల్లో నేను నా జూనియర్స్ కి అండగా నిలబడి వారికి ప్రేరణ కలిగిస్తాను. అయితే ఒక్కోసారి నన్ను నేనే మోటివేట్ చేసుకోలేక సతమతమవుతాను.
ప్రధానమంత్రి: నిన్ను నువ్వు ఏకాకిగా చేసుకోవద్దు, అట్లాగే అతిగా ఆలోచించకు. నీ గురించి నువ్వు లోతుగా ఆలోచించిస్తున్నట్టు కనబడుతోంది, అయితే నీ భావాలని ఇతరులతో పంచుకోవడం లేదు. నీకు ప్రేరణ కలిగించేవారు కావాలి, అది మీ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా నీకన్నా సీనియర్లు కావచ్చు. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని నిన్ను నువ్వు సవాల్ చేసుకో. ఉదాహరణకి, ఇవ్వాళ సైకిల్ మీద 10 కిలోమీటర్లు తొక్కాలని నేను లక్ష్యంగా పెట్టుకున్నాను. అది అరుణాచల్ ప్రదేశ్ లోని కొండలు గుట్టల దారి అయ్యుండచ్చు, లక్ష్యాన్ని చేరుకున్నాక, “నేనీరోజు అనుకున్నది సాధించాను” అని రోజంతా ఉల్లాసాన్నిచ్చే ఆలోచనలతో గడపండి. మిమ్మల్ని మీరు సవాల్ చేసుకుంటే, చిన్న చిన్న సవాళ్ళు కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు దోహదపడతాయి. గతాన్ని ఓడించే ప్రయత్నం చేయండి, ప్రస్తుత కాలాన్ని సంపూర్ణంగా అనుభూతి చెందుతూ జీవించండి, దాంతో ఈ తీరు గతాన్ని దాటేశాం అన్న భరోసాని మీకు కల్పిస్తుంది.
విద్యార్థి: మనకి మనమే ఏర్పరుచుకునే లక్ష్యాలు ఎంతో విలువైనవని ఆయన చెప్పారు. ప్రేరణ నిలుపుకోవాలి, ఇందుకు అనేక మార్గాలున్నాయన్నారు. ఉదాహరణకి, చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోండి, వాటిని అందుకోగానే మీకు మీరు బహుమానాలు ఇచ్చుకోండి అన్నారు. ఈ విధానం నాకు బాగా పనిచేసింది.
విద్యార్థి: సర్, మీకు స్ఫూర్తి ఎవరు?
ప్రధానమంత్రి: మీరందరూ నాకు స్ఫూర్తి ప్రదాతలే. అజయ్ ని చూడండి, పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని గురించి పాట రాశాడు. పుస్తకాన్ని నేనే రాసి ఉండచ్చు, అయితే ఎక్కడో ఊళ్ళో కూర్చున్న అజయ్, కవిత్వం ద్వారా అదే అంశాన్ని వ్యక్తీకరించాడు. ఇలాంటివి ఎదురైనప్పుడు మరింత పని చేయాలన్న స్ఫూర్తి కలుగుతుంది నాకు. మన చుట్టూ పరిశీలిస్తే, ప్రేరణను కలిగించేవి ఎన్నో ఎన్నెన్నో!
విద్యార్థి: లోతైన ఆలోచన, అవగాహన, విషయాన్ని జీర్ణం చేసుకోవడం – ఏదైనా విషయాన్ని గురించి వినడం, అర్ధం చేసుకోవడం, సొంతం చేసుకోవడం – ఇవేవీ నేను చేయలేకపోతున్నాను.
ప్రధానమంత్రి: నువ్వు ఏదో విన్నావు, తరువాత దాని గురించి ఆలోచన చేశావు – ఇంతకీ నువ్వు ఆలోచించింది ఏమిటి? వారన్న మాటల గురించి, వారి సందేశాన్ని గురించేనా? ఒక ఉదాహరణ తీసుకుందాం, ఎవరైనా నీకు పొద్దున్నే మేల్కొనడం మంచిది అని చెప్పారనుకుందాం, పొద్దున్నే లేవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి నువ్వు ఆలోచించవచ్చు. అయితే, పొద్దున్నే లేవకుండా తిరిగి నిద్రలోకి జారుకున్నావనుకో, ఆ సలహాని నువ్వు స్వీకరించినట్టౌతుందా? ఏదైనా విషయాన్ని నీ సొంతం చేసుకోవడం అంటే నిన్ను నువ్వు ఒక ప్రయోగశాలగా భావించి, నీ అలవాట్లను మార్చుకునే ప్రయత్నం చేయాలి. చాలా మంది తమకంటే పైమెట్టు మీద ఉన్నవారితో పోల్చుకుని వారితో పోటీ పడరు. తమకన్న బలహీనులతో పోటీ పడి ఉత్తుత్తి సంతృప్తి పొందుతారు. “చూడు, వాడెంత కష్టపడ్డాడో, అయినా 30 మార్కులే వచ్చాయి, నాకు 35 వచ్చాయిలే..” అంటారు! చూశారా వీరి తీరు! నిజానికి తమతో తాము పోటీ పడేవారు ఎన్నడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు.
విద్యార్థి: ప్రపంచానికి దారిదీపంగా నిలుస్తున్న ఒక వ్యక్తి ఉన్నారు. తన సంఘర్షణని శక్తిగా మలుచుకుని రేయింబవళ్ళు ఇతరుల ఆనందం కోసం వారు శ్రమిస్తారు. ఆ వ్యక్తి, మన ప్రధానమంత్రిగా సేవలందిస్తూ మనకి స్ఫూర్తిగా నిలుస్తారు, మనకి సలహాలూ సూచనలూ అందిస్తారు, తమతో సంభాషించేవారికి అపరిమితమైన ఆనందాన్ని కలిగిస్తారు. ఆయన మరెవరో కాదు, మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు! ధన్యవాదాలు సర్!
ప్రధానమంత్రి: థాంక్ యూ, బేటా. థాంక్ యూ.
విద్యార్థి: సర్, నేను మిమ్మల్ని అడగదలచుకొన్న ప్రశ్న ఏమిటి అంటే, నేను పరీక్ష రాయడానికి వెళ్లినప్పుడల్లా, ఒకవేళ నేను ఫెయిలైతే, దాని పరిణామాలు ఎలా ఉంటాయనే నేను ఆందోళన చెందుతూ ఉంటాను. మనం ఫెయిల్యూర్‌ను తప్పించుకోవడమెలాగంటారు?
ప్రధానమంత్రి: బళ్లో, పదో తరగతి కావచ్చు, లేదా పన్నెండో తరగతి కావచ్చు, విద్యార్థుల్లో దాదాపు 30-40 శాతం మంది ఫెయిలవుతారు. వారి సంగతేమిటి?
విద్యార్థి: వాళ్లు మళ్లీ ప్రయత్నం చేస్తారు.
ప్రధానమంత్రి: మరి అప్పుడు కూడా వాళ్లు ఫెయిలైతే?
ప్రధానమంత్రి: చూడండి జీవనమేమీ ఆగిపోదు. జీవనంలో విజేత అవ్వాలా, పుస్తకాలతో సఫలమవ్వాలా అనేది మీరు నిర్ణయించుకోవాలి. మీరు మీ జీవనంలో ఎన్ని వైఫల్యాలు ఎదురైనా, వాటిని మీ గురువుగా చూడండి. ఇదే జీవనంలో సఫలం కావడానికి ఒక ఉపాయం. మీకు తెలుసనుకుంటాను.. క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటే, ఆటగాళ్లు రోజంతా ఆట జరిగిన తీరును గమనిస్తారు. వారి పొరపాట్లు చూసుకొంటారు. అప్పుడు ఏయే మెరుగులు పెట్టుకోవాలో తేల్చుకొంటారు. మీరు కూడా మీ వైఫల్యాల విషయంలో ఇలా చేయగలరా? వాటి నుంచి పాఠాలు నేర్చుకోగలరా? రెండో విషయం, జీవనం అంటే పరీక్షలే కాదు. దీనిని పూర్తి దృష్టితో చూడాలి. దివ్యాంగజనుల జీవనాన్ని దగ్గరగా పరిశీలించండి. దైవం వారికి కొన్ని ఇచ్చి ఉండకపోవచ్చు. అయితే తరచుగా వారికి అసాధారణ సామర్థ్యాలను దైవం ప్రసాదిస్తుంది. అవి వారి శక్తులుగా మారుతాయి. అదే విధంగా, మనందరిలోనూ, దైవం లోటుపాటులతో పాటే విశిష్ట లక్షణాల్ని కూడా ప్రసాదిస్తుంది.
విద్యార్థి: అవును, సర్.
ప్రధానమంత్రి: అలా మీలో ఉన్న విశిష్ట లక్షణాల్ని ఎలా పెంచుకోవాలనే దానిపై దృష్టి పెట్టండి. అప్పడు, మిమ్మల్ని మీ డిగ్రీ ఏమిటనేది గాని, మీరు ఎక్కడ చదివారని గాని ఎవ్వరూ అడగరు. పట్టించుకోవాల్సింది ఏమిటి అంటే-అది మీ మార్కులు మాట్లాడాలా లేక మీ జీవనం మాట్లాడాలా అనేదే?.
విద్యార్థి: జీవనమే, సర్.
ప్రధానమంత్రి: ఊఁ, మాట్లాడాల్సింది జీవనమే.
విద్యార్థి: నేను అజయ్‌ని. అరోహీ మోడల్ సీనియర్ సెకండరీ స్కూల్ నుంచి వచ్చాను. ఈ రోజుల్లో సాంకేతికత ముందంజలో ఉంది. అయితే కొన్ని సార్లు మనం దీనిని కావల్సిందాని కన్నా ఎక్కువగా వాడేస్తున్నాం. సర్, సాంకేతికతను ఉత్తమంగా మనం ఎలా ఉపయోగించుకోగలమనే విషయంలో మీ మార్గదర్శనం కోరాలనుకుంటున్నాను.
ప్రధానమంత్రి: అన్నిటి కన్నా ముందుగా, మనమందరం అదృష్టవంతులం. ప్రత్యేకించి మీరు. ఎందుకంటే మీరు సాంకేతికత చాలా విరివిగా, ప్రభావవంతంగా, ఉపయోగకరంగా ఉన్న కాలంలో మీరు వయసుకు వస్తున్నారు. సాంకేతికత నుంచి పారిపోవాల్సిన పనేమీ లేదు. ఏమైనప్పటికీ, మీరు తేల్చుకోవాల్సిన అవసరమైతే ఉంది, అది.. మీరు అదే పనిగా రీల్స్‌ను చూడడంలోనే కాలాన్ని గడిపేస్తున్నారా, లేక మీకు నిజంగానే దేనిపైనైనా ఆసక్తి ఉందా అని? ఆ ఆసక్తే ఉంటే, దానిలో తల దూర్చి లోతుపాతుల్ని విశ్లేషించండి. అలా చేశారంటే సాంకేతికతే మీ బలమవుతుంది. అది భయపడిపోవాల్సిన తుపాను ఏమీ కాదు. అదేమీ మిమ్మల్ని ఎత్తి పడేయదు. పరిశోధనలు చేస్తున్న వాళ్ల గురించి, నవకల్పనల్ని గురించి కృషిచేస్తున్న వాళ్ల గురించి ఆలోచించండి. వారు మీ మేలు కోసమే పనిచేస్తున్నారు. సాంకేతికతను అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం, సాంకేతికతను వీలయినంత ఎక్కువగా ఉపయోగించుకోవడం మన లక్ష్యం కావాలి.
విద్యార్థి: సర్, నేను ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏదైనా పనిని పూర్తి చేయడానికి మనం మన అత్యుత్తమ స్థాయిలో ఎలా కృషి చేయొచ్చంటారు?
ప్రధానమంత్రి: మనం మన అత్యుత్తమమైన కృషిని అందించడానికే నిరంతరం పాటుపడాలి. మరి నిన్నటి కన్నా మేలైన విధంగా పనిచేయడం మొదటి నియమం.
విద్యార్థి: సర్, మేం ఏం చేయాలో మా కుటుంబాలు తరచుగా సలహా ఇస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఏ స్ట్రీమ్ ఎంపిక చేసుకోవాలి అనో లేదా ఏ సబ్జెక్టును చదవాలో అనో. మేం వారి సూచనలు అనుసరించాలా, లేక మా అంతరంగం చెప్పేది వినాలా?
ప్రధానమంత్రి: వారు చెప్పేది మీరు వినాలి, ఇంకా వారిని ఒప్పించాలి కూడా. వాళ్లు ఏదైనా చెప్పినప్పుడు, గౌరవపూర్వకంగా అంగీకరించండి. ముందడుగు ఎలా వేయాలో వారిని అడగండి. అవసరమైన సమాచారాన్ని ఎక్కడ నుంచి పొందాలి, మారు ఏ రకమైన సహాయాన్ని అందిస్తారో అనేవి. అటు తరువాత, మీ ఆలోచనలు, మీ ఉపాయాలను సౌమ్యంగా పంచుకోండి. మెల్లమెల్లగా, వారు మీరు ఆలోచిస్తున్నట్లే భావన చేస్తూ మీ దృష్టికోణాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెడతారు.
విద్యార్థి: నా ప్రశ్నను విని, దానికి సమాధానం చెప్పి, నాకు అనేక విలువైన పాఠాలను నేర్పినందుకు మీకు అనేకానేక ధన్యవాదాలు. ప్రశాంతంగా ఉండాలని, సానుకూల ఆలోచనలను కలిగివుండాలని, ప్రతికూల ఆలోచనలను మనస్సులోకి చొరనీయరాదని.. ఇలాంటివి చెప్పారు. ఇదొక అద్భుతమైన అనుభవం. చాలా చాలా ధన్యవాదాలు.
విద్యార్థి: నేటి రోజుల్లో, చాలా మంది విద్యార్థులు పరీక్షల కాలంలో ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు. అది వారు వారి పరీక్షపత్రాన్ని సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారనేదే. ఇది వారిలో ఒత్తిడిని కలగజేస్తోంది. సర్, వారు ఈ తరహా ఒత్తిడిని, పరిస్థితులను ఎలాగ తట్టుకోగలగాలంటారు?
ప్రధానమంత్రి: మొదటి పరిష్కారం ఇదివరకటి పరీక్షపత్రాలు తీసుకొని క్షుణ్నంగా అభ్యాసం చేయడం.మీరు చక్కగా అభ్యాసం చేశారంటే, మీరు చిక్కనైన సమాధానాల్ని రాయడమెలాగ నేర్చనుకొంటారు. కాలాన్ని ఆదా చేసుకోగలుగుతారు. ఇక, పరీక్షలో ఏ ప్రశ్నలకు జవాబులు రాయాలో ప్రాధాన్య క్రమాన్ని ఎంచుకోండి. ముందుగా, మీకు బాగా తెలిసిన ప్రశ్నలపై శ్రద్ధ తీసుకోండి. తరువాత ఒక మోస్తరుగా ఉన్న వాటికి వెళ్లండి. చివరగా, సవాలుగా అనిపించే ప్రశ్నల జోలికి పోండి. ఒక ప్రశ్న మీకు చేతకావడంలేదనుకోండి, దానిని వదలివేసినా పర్లేదు. విద్యార్థులు చాలా సార్లు చేసే పొరపాటు ఏమిటి అంటే వారికి తెలియని దానికి చాలా సమయాన్ని వెచ్చిస్తుంటారు. దీంతో వారికి తెలిసిన ప్రశ్నలకు తక్కువ సమయమే మిగులుస్తున్నారు. ఒక్కొక్క సారి, వారికి జవాబు ఏమిటో తెలిసినా, వారు చాలా పొడవైన సమాధానాన్ని రాస్తూ, బోలెడంత సమయాన్ని ఖర్చు చేసేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం అభ్యాసాన్ని మరింతగా ఆశ్రయించడమే.
విద్యార్థి: నేను పీవీఆర్ బాలికా అన్‌గతి పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాను. మాది ఆంధ్ర ప్రదేశ్. ఈ సుందర ప్రదేశంలో మీతో భేటీ కావడం మేం చేసుకున్న గొప్ప అదృష్టం. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలచుకొన్నాను. అది.. వాతావరణ స్థితులు మారుతూ ఉన్నాయని మేం మా పుస్తకాల్లో చదువుతూ వస్తున్నాం. ఈ విషయంలో మనం చేయగలిగిందేమిటంటారు?
ప్రధానమంత్రి: చాలా మంచి ప్రశ్నను వేశారు మీరు, మరి వాతావరణాన్ని గురించి నా దేశంలోని బాలల్లో సైతం ఇంతటి చింత ఉంది అని తెలుసుకొని నేను సంతోషిస్తున్నాను. ప్రపంచంలో చాలా చోట్ల, అభివృద్ధి భోగాల్లో మునిగి అనుభూతి చెందాలన్న భావన పెచ్చుపెరిగిపోయింది. ఇది ఎటువంటి మనస్తత్వం అంటే, ప్రతిదీ ఒకరి స్వీయ ఆనందానికే వెలిసింది అనేటటువంటిదన్నమాట. ఎవరైనా మంచి సామాను కావాలని కోరుకుంటే, వారు 200 ఏళ్ల నాటి చెట్టును నరికేయడానికైనా వెనుకాడరు. వారు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరాను కోరుకున్నారా అంటే వారంలో ప్రతి రోజూ లైట్లను వెలిగించి ఉంచడానికి అవసరపడినంత బొగ్గును మండించేస్తారు. ఇది ప్రకృతిని భారీ ఎత్తున విధ్వంసానికి లోనుచేసింది. మన సంస్కృతి ప్రకృతిని దోచుకోవడాన్ని గురించి బోధించదు.
మిషన్ లైఫ్ అనే పేరుతో ఒక ఉద్యమాన్ని నేను తీసుకువచ్చాను. మన జీవన శైలి ప్రకృతిని కాపాడడంతోపాటు ప్రకృతిని పెంచి పోషించాలని నేను స్పష్టంగా చెబుతున్నాను. మన సంస్కృతిలో, తల్లితండ్రులు వారి పిల్లలకు పొద్దున నేల మీద అడుగు పెట్టే కన్నా ముందు భూ మాతను క్షమాపణలు వేడుకోవాలనీ, ఆమెకు ఇబ్బంది కలిగిస్తున్నామన్న ఒప్పుకోలును విన్నవించుకోవాలనీ చెబుతారు. మనం చెట్లను పూజిస్తాం, వాటి చుట్టూరా పండుగలు జరుపుకొంటాం, అంతేకాకుండా నదులను మన తల్లులుగా భావిస్తాం. ఈ విలువలు మనం గర్వపడేటట్లుగా చేయాలి సుమా. భారతదేశం ప్రస్తుతం ‘ఏక్ పేడ్ మాఁ కే నామ్’ పేరుతో ఒక ముఖ్య ప్రచారోద్యమాన్ని నడుపుతోంది. ఇది ఇద్దరు మాతృమూర్తులకు ప్రశంస. ఒకరు మనకు జన్మనిచ్చిన అమ్మ. ఇంకొకరు మనకు జీవనాన్ని అందించే అమ్మ. మీ అమ్మగారి యాదిలో ఒక మొక్కను నాటండి, ఆ మొక్క మీ అమ్మగారిని గుర్తు చేస్తూ ఉంటుందనే భావనతో దాన్ని సంరక్షిస్తూ ఉండండి. ఆ మొక్క ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే పెరిగి పెద్దదవ్వాలి. ఆ మొక్కను గురించి మనం శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? ప్రజలందరూ పెద్ద ఎత్తున మొక్కలను నాటుతారు. ఈ బాధ్యతతో కూడిన భావన, మొక్క పట్ల ఏర్పడే యాజమాన్య భావన భారీ స్థాయిలో ప్రకృతిని పరిరక్షించడానికి సాయపడుతుంది.
విద్యార్థి: ప్రకృతికి మన జీవనంలో ఓ ముఖ్య భాగముంది. మనం మొక్కలతో అనుబంధం పెంచుకోవాలి, ఎందుకంటే అవి మనకు అనేక రకాలుగా ప్రయోజనాన్నిస్తాయి. మనం ప్రకృతిని ప్రోత్సహించి తీరాలి.
ప్రధానమంత్రి: ప్రతి ఒక్కరు వారి వంతుగా మొక్కలను నాటడానికి తయారుగా ఉన్నారని నాకనిపిస్తోంది. మొక్కలకు నీరు పోసేందుకొక చిట్కా చెప్పనివ్వండి నన్ను. మీరు ఒక మట్టి కుండను నీటితో నింపి మొక్కకు పక్కగా ఉంచండి. ఈ పద్ధతిలో, ఆ కుండను నెలకు ఒక్కసారే మీరు నింపాల్సి వస్తుంది. ఆ మొక్క చాలా తక్కువ నీటిని ఉపయోగించుకొని ఏపుగా పెరుగుతుంది. ఇది ఆచరణసాధ్యమైన పద్ధతి. దీనిని ఏ చోటులోనైనా పాటించవచ్చు. అందరికీ అభినందనలు.
విద్యార్థి: థాంక్ యు, సర్.
విద్యార్థి: సర్, ఇక్కడకు మీరు వచ్చినందుకు, మాకీ అపురూపమైన అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.
ప్రధానమంత్రి: మరి, మీకు ఈ రోజు బాగా అనిపించిన సంగతి ఏమిటి?
విద్యార్థి: పర్యావరణాన్ని గురించిన చర్చ, సర్.
ప్రధానమంత్రి: పర్యావరణ అంశం.
విద్యార్థి: అవును, సర్. మీరు నిజంగానే మాలో ప్రేరణను కలిగిస్తున్నారు. ఈ రోజును మేం గుర్తుపెట్టుకుంటాం, మరి పరీక్షలంటే మాకు ఇక ఒత్తిడిగా ఏమీ అనిపించడంలేదు.
ప్రధానమంత్రి: పరీక్షలంటే ఇకపై ఎలాంటి ఒత్తిడి లేదు, మార్కులు తక్కువ వచ్చినా సరేనా?.
విద్యార్థి: మీరు సరిగా చెప్పారు, సర్. నిజంగా గొప్పది జీవనంలో సఫలం కావడమే
విద్యార్థి: సర్. ఇక పరీక్షలు మమ్మల్ని చూసి భయపడడం మొదలుపెడతాయి.
ప్రధానమంత్రి: భలే. మీకందరికీ చాలా చాలా ధన్యవాదాలు.
విద్యార్థి: థాంక్ యు, సర్.
ప్రధానమంత్రి: మరి ఇక, ఇంట్లో పెత్తనం చెలాయించడం మొదలుపెట్టకండి. గుర్తు పెట్టుకోండి, మనం నేరు పరిచయం చేసేసుకొన్నాం. మీ గురువుల్ని కూడా బెదరించకండి.
విద్యార్థి: నో, సర్. బై, సర్.
గమనిక: ఇది విద్యార్థులతో ప్రధానమంత్రి సంభాషణకు భావానువాదం. వారు హిందీలో మాట్లాడుకున్నారు.
***
(Release ID: 2106336)
Visitor Counter : 45
Read this release in:
Hindi
,
Assamese
,
Punjabi
,
Marathi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam
,
English
,
Urdu
,
Gujarati