ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో అమెరికా జాతీయ గూఢచర్య విభాగం డైరెక్టరు భేటీ
నాడు పోస్టు చేయడమైనది:
13 FEB 2025 8:15AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో అమెరికా జాతీయ గూఢచర్య విభాగం డైరెక్టరు తులసి గబ్బార్డ్ ఈ రోజు సమావేశమయ్యారు.
తులసి గబ్బార్డ్‌తో ఉన్న పరిచయాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకొన్నారు. గూఢచర్య పరంగా ద్వైపాక్షిక సహకారాన్ని ఇప్పటికన్నా మరింత పెంచుకోవడం, ముఖ్యంగా ఉగ్రవాదాన్ని నిరోధించడం, సైబర్ సెక్యూరిటీ రంగం, కొత్తగా ఎదురవుతున్న బెదరింపులను సమర్ధంగా వమ్ముచేయడం అనే అంశాల్లో సహకరించుకోవడంతోపాటు వ్యూహాత్మక గూఢచర్యానికి సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడం అనే అంశాలపై ఇద్దరూ చర్చించారు. పరస్పర హితం ముడిపడి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై వారు తమ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో సురక్షిత, సుస్థిర, నియమ పాలనకు పెద్దపీట వేసే అంతర్జాతీయ వ్యవస్థకు మద్దతును కొనసాగించుదామని వారు పునరుద్ఘాటించారు.
***
(రిలీజ్ ఐడి: 2106328)
సందర్శకుల సూచీ సంఖ్య : : 46
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Manipuri
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam