సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
సదస్సు ప్రత్యేక వీడియోగా మీ సృజనాత్మక పోటీ
Posted On:
21 FEB 2025 6:24PM by PIB Hyderabad
సదస్సు ప్రత్యేక వీడియోగా... మీ సృజనాత్మక పోటీ
పరిచయం
రాబోయే ప్రపంచ ఆడియో విజువల్, ఎంటర్‌టైన్‌మెంట్ సదస్సు (వేవ్స్) 2025 స్ఫూర్తిని తెలియజేసే ఆకర్షణీయమైన వీడియోలను రూపొందించాలని క్రియేటర్స్, దార్శనికులు, కథకుల (స్టోరీ టెల్లర్స్)కు క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజెస్‌లో భాగమైన వేవ్స్ ప్రోమో వీడియో ఛాలెంజ్ పిలుపునిచ్చింది. "రండి, మాతో ప్రయాణించండి (కమ్, సెయిల్ విత్ అస్)" అనే ఇతివృత్తం చుట్టూ కేంద్రీకృతమైన ఈ ఛాలెంజ్ కొత్త దృక్పథాలను పంచుకునేందుకు, ప్రతిభను ప్రదర్శించేందుకు దార్శనిక డైరెక్టర్లు, సృజనాత్మక ప్రకటనలు తయారు చేసే వ్యక్తులు, ప్రసార రంగంలో మార్గదర్శక వ్యక్తులతో పాటు వివిధ అంశాలపై పని చేసే వారిని ఆహ్వానిస్తోంది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహకారంతో ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్ (ఐబీడీఎఫ్) నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమం 2025 మే 1 నుంచి 4 వరకు ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ అండ్ జియో వరల్డ్ గార్డెన్స్‌లో జరగనుంది.
పూర్తి మీడియా, వినోద (ఎంఈ) రంగాన్ని ఏకీకృతం చేసేందుకు హబ్-అండ్-స్పోక్ పద్ధతిలో సిద్ధంగా ఉన్న ఒక ప్రత్యేకమైన వేదిక ఈ వేవ్స్ మొదటి విడత. ప్రధాన ప్రపంచ స్థాయి వేదికగా ఉండనున్న ఈ కార్యక్రమం.. ప్రపంచ ఎంఈ రంగాన్ని భారత్‍కు తీసుకురావటం, దానిని భారత ఎంఈ రంగంతో అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రసార రంగం, ఇన్ఫోటైన్మెంట్.. ఏవీజీసీ-ఎక్స్ఆర్ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్-ఎక్స్‌టెండెడ్ రియాలిటీ).. డిజిటల్ మీడియా, నవకల్పనలు..సినిమాలతో కూడిన నాలుగు ప్రధాన అంశాలపై పనిచేసే వేవ్స్ ప్రోమో వీడియో ఛాలెంజ్.. ప్రసార రంగం, ఇన్ఫోటైన్మెంట్ విభాగంలో భాగంగా ఉంది. ప్రపంచ ప్రేక్షకులతో అనుసంధానం చేస్తూ కంటెంట్ డెలివరీకి సంబంధించిన సంప్రదాయ, కొత్తగా వస్తోన్న రూపాలను ఇది ప్రధానంగా తెలియజేయనుంది.
వేవ్స్‌లో ప్రధాన కార్యక్రమైన క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజెస్‍లో ప్రపంచవ్యాప్తంగా 73,000 మంది పాల్గొన్నారు. నవ ఆలోచనలు పెంపొందే, కథ చెప్పే స్థాయి విషయంలో సరిహద్దులను నిరంతరం నిర్వచించే సృజనాత్మక వ్యవస్థను ఇది రూపొందిస్తోంది.
అర్హతలు
ఎవరు పాల్గొనవచ్చు?- భారత్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సృజనాత్మకకు సంబంధించిన నిపుణులు, ఔత్సాహిక కంటెంట్ క్రియేటర్లందరికీ ఈ పోటీ అందుబాటులో ఉంటుంది.
వయసుః 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.
భౌగోళిక పరిధిః భారత్, విదేశాలకు చెందిన వ్యక్తులు పాల్గొనవచ్చు.
ఎన్ని సార్లు పాల్గొనవచ్చు?- బహుళ ఎంట్రీలు చేసుకోవచ్చు.
ఒరిజినాలిటీ: అన్ని సమర్పణలు ఈ పోటీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒరిజినల్ వి అయి ఉండాలి. ఏ విధమైన కాపీ, కాపీరైట్ ఉన్న వాటిని అనుమతి లేకుండా ఉపయోగించడం అనర్హతకు దారితీస్తుంది.
ఇతివృత్తం
"రండి, మనతో ప్రయాణించండి" అనే ఇతివృత్తంతో ఉన్న వేవ్స్ 2025 లక్ష్యాలు, ఇతివృత్తానికి అనుగుణంగా సమర్పణలు ఉండాలి.
ఫార్మట్/వ్యవధి
మూడు వెర్షన్లలో ప్రసారం చేసేందుకు వీలైన నాణ్యతగల వీడియోలను తయారు చేయాలి. 1 నిమిషం, 30 సెకన్లు, 15 సెకన్ల వ్యవధితో ఎంపీ4, ఎంఓవీ, డబ్ల్యూఎంవీ లేదా ఏవీఐ ఫార్మట్‌లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి 50 MB కంటే తక్కువ ఉండాలి.
భాష
తప్పకుండా ఆంగ్లంలోనే ఉండాలి.
సాంకేతికపరమైన అర్హతలు:
ఆడియో, విజువల్ ఎఫెక్ట్ హెచ్డీ(హై డెఫినేషన్) లేదా ప్రసార స్థాయి నాణ్యతతో ఉండాలి. తక్కువ నాణ్యతతో సమర్పించినట్లయితే తిరస్కరణకు గురౌతాయి.
బ్రాండింగ్ అంశాలు
ప్రోమో వీడియోలో వేవ్స్ కార్యక్రమం బ్రాండింగ్ తప్పకుండా ఉండాలి. వీటిని పోటీకి సంబంధించిన వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు
20 సెప్టెంబర్ 2024- పోటీ ఆవిష్కరణ
28 ఫిబ్రవరి 2025 - సమర్పించేందుకు చివరి తేదీ
15 మార్చి 2025- పాల్గొన్న అందరికి ఫలితాలు పంపించటం, విజేత ప్రకటన
విజేతలను నిర్ణయించే తీరు
అసలైన(ఒరిజినల్) కంటెంట్, సృజనాత్మకత
సృజనాత్మక అంశాలు, కథనాన్ని చెప్పటంలో కొత్త పోకడలు
ఇతివృత్తం
ఎంత ప్రభావంతో వేవ్స్ కార్యక్రమం ఇతివృత్తాన్ని, లక్ష్యాలను తెలియజేస్తున్నారు
వీడియో నాణ్యత
ఆడియో, విజువల్ సంబంధించిన నాణ్యత, ప్రొడక్షన్ విషయంలో పూర్తి విలువ
కథనం ప్రభావం
వేవ్స్ ఎలిమెంట్స్‌ను సరిగ్గా, వ్యూహాత్మకంగా ఉపయోగించటం
బహుమతులు, గుర్తింపు
అగ్రస్థానాల్లో ఉన్న మొదటి 5 క్రియేటర్లకు నగదు బహుమతితో పాటు వేవ్స్ 2025 కార్యక్రమానికి పూర్తి ఖర్చుతో కూడిన ట్రిప్
1వ బహుమతి: 1,00,000
2వ బహుమతి: 75000
3వ బహుమతి: 50000
4వ బహుమతి: 25000
5వ బహుమతి: 25000
ముగింపు:
వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్మెంట్ సదస్సు(వేవ్స్) 2025లో భాగంగా జరుగుతోన్న వేవ్స్ ప్రోమో వీడియో ఛాలెంజ్ కార్యక్రమం క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజెస్ ద్వారా ప్రపంచ స్థాయి వేదికపై క్రియేటర్ల తమ నైపుణ్యాలను ప్రదర్శించుకునేందుకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. నగదుతో పాటు క్రియేటర్లకు ఉచిత ట్రిప్ వంటి ఉత్తేజకరమైన బహుమతులతో ఉన్న ఈ కార్యక్రమం కేవలం ఒక పోటీ మాత్రమే కాదు, ప్రపంచ స్థాయి ప్రేక్షకులతో క్రియేటర్ల దార్శనికతను ప్రభావవంతమైన కథనాల రూపంలోకి మార్చే వేదిక. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సృజనాత్మకత విషయంలో భారత్‌లో జరుగుతోన్న భారీ మార్పుతో భాగమై అంతర్జాతీయ మీడియా, వినోద రంగంలో చిరకాల ముద్రను ఏర్పాటు చేయాలని సినిమాకు సంబంధించిన ఔత్సాహికులు, ప్రకటనలు తయారు చేసే వ్యక్తులు, కథలను వివిధ రూపాల్లో చెప్పే వారిని ప్రోత్సహిస్తున్నారు.
మూలాలు:
https://wavesindia.org/challenges-2025
https://ibdf-waves.com/
https://ibdf-waves.com/rules-and-guidelines/
Click here to see PDF.
(Release ID: 2105581)
Visitor Counter : 5