సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత గేమింగ్ సామర్థ్యాన్ని వెలికి తీయటం

Posted On: 21 FEB 2025 6:16PM by PIB Hyderabad

పరిచయం

 

భారతదేశ గేమింగ్ పరిశ్రమ ముఖ్యంగా డిజిటల్ఆన్‌లైన్‌ గేమింగ్‌లో గణనీయమైన వృద్ధిని చూసిందిదేశ మీడియావినోద రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఇది ఒకటిగా మారిందిఈ వృద్ధికి మద్దతుగా క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్ 1లో భాగంగా భారత్ టెక్ ట్రయంఫ్ ప్రోగ్రామ్(టీటీపీ) ప్రారంభమైందికేంద్ర సమాచారప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీభాగస్వామ్యంతో ఇంటరాక్టివ్ ఎంటర్‌టైన్మెంట్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (ఐఈఐసీనిర్వహిస్తోన్న ఈ కార్యక్రమం అంతర్జాతీయ వేదికపై భారత గేమింగ్ ప్రతిభను గుర్తించి ప్రదర్శించడమే లక్ష్యంగా పెట్టుకుంది.



2025లో జరిగే వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్మెంట్ సదస్సు (వేవ్స్), గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ (జీడీసీ)లో భారత్ ‌పెవిలియ‌న్ తో ఈ కార్యక్రమం అంతిమ స్థాయికి చేరుకుంటుందిఇది భారత ఆవిష్కర్తలకు ఒక ప్రపంచ స్థాయి వేదికను అందించనుంది


మీడియావినోద (ఎం&రంగాన్ని ఏకీకృతం చేయడానికి ప్రత్యేకమైన హబ్ అండ్ స్పోక్ ప్లాట్‌ఫామ్‌గా మొదటి విడత వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్మెంట్ సదస్సు (వేవ్స్ఉందిఈ కార్యక్రమం ఒక ప్రధాన ప్రపంచ స్థాయి కార్యక్రమంగా ఉండనుందిఇది ప్రపంచ ఎంఈ పరిశ్రమ దృష్టిని భారత్‌కు మార్చాలనిదానిని భారత ఎంఈ రంగంతో అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ముంబ‌యిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్జియో వరల్డ్ గార్డెన్స్‌లో మే నుంచి వరకు ఈ సదస్సు జరగనుంది.
ప్రసార రంగంఇన్ఫోటైన్మెంట్.. ఏవీజీసీ-ఎక్స్ఆర్.. డిజిటల్ మీడియానవకల్పనలు..సినిమాలతో కూడిన నాలుగు మూల స్తంభాలతో ఉన్న వేవ్స్ భారత వినోద రంగ భవిష్యత్తును ప్రదర్శించేందుకు నాయకులుక్రియేటర్లుసాంకేతిక నిపుణులను ఒకే దగ్గరకు తీసుకురానుంది.

ముఖ్యంగా గేమింగ్యానిమేషన్విజువల్ ఎఫెక్ట్స్ఏఆర్వీఆర్మెటావర్స్ వంటి ఇమ్మ‌ర్సివ్‌ సాంకేతికతల కలయిక గురించి పని చేసే భారత్ టెక్ ట్రయంఫ్ ప్రోగ్రామ్ లక్ష్యాలకు అనుగుణంగా ఏవీజీసీ-ఎక్స్ఆర్ (యానిమేషన్విజువల్ ఎఫెక్ట్స్గేమింగ్కామిక్స్ఆగ్మెంటెడ్ రియాలిటీవర్చువల్ రియాలిటీమెటావర్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలుఉంటుంది.


 

అర్హతలు
 

 


 


భారత్ టెక్ ట్రయంఫ్ కార్యక్రమం డెవలపర్లుస్టూడియోలుఅంకురాలుటెక్ కంపెనీలతో సహా ఇంటరాక్టివ్ ఎంటర్‌టైన్మెంట్ పరిశ్రమ తదితర విభిన్న విభాగాల్లో దరఖాస్తులు ఆహ్వానిస్తోందిగేమింగ్ పరరిశ్రమలో కీలకమైన గేమింగ్ డెవలప్మెంట్-స్పోర్ట్స్వ్యాపార పరిష్కారాల్లో నిమగ్నమైన వ్యక్తులుసంస్థలు ఇందులో పాల్గొనవచ్చుఅభివృద్ధికి సంబంధించిన పలు దశల్లో వర్కింగ్ ప్రోటోటైప్ ఉన్న సంస్థలకు స్వాగతం పలుకుతోంది


 

రిజిస్ట్రేషన్ ప్రక్రియ


 

టెక్ ట్రయంఫ్ సీజన్ భారత గేమింగ్ రంగాన్ని పెంపొందించేందుకు సిద్ధంగా ఉందిఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారత్‌లోనే తయారైన సాంకేతిక పరిశ్రమను సృష్టించే దేశ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుందిఇప్పటికే 1,078 రిజిస్ట్రేషన్లు, 12 మంది అంతర్జాతీయ భాగస్వాములతో ఈ కార్యక్రమం ఊపందుకుంది.


 

టెక్ ట్రయంఫ్ సీజన్ కోసం దరఖాస్తు సమర్పించేందుకు గడువు 2025 ఫిబ్రవరి 20న ముగిసింది.

ఛాలెంజ్‌లో దశలు:


 

దశ 1: గేమ్ సమర్పణఅధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న కాంటెస్ట్ ఫామ్ ద్వారా మీ గేమ్‌ను సమర్పించటం ద్వారా మీ ప్రయాణాన్ని ప్రారంభించండి.


 

దశ 2: నిపుణుల మూల్యాంకనంవచ్చిన అన్ని దరఖాస్తులను గౌరవనీయ నిపుణుల ప్యానెల్ జాగ్రత్తగా సమీక్షించి పిచింగ్ రౌండ్ కోసం జాబితా తయారు చేస్తుందిపిచ్‌ రౌండ్ తరువాత తుది ఫలితాలను విశిష్ట జ్యూరీ ప్రకటిస్తుంది.


 

దశ 3: కార్యక్రమానికి సన్నద్ధం కావడంవిజేతలను ప్రకటించిన వెంటనే నిర్వహకులు వారిని సంప్రదిస్తారుప్రధాన కార్యక్రమంలో ప్రదర్శనకు సిద్ధం కావడానికి వారికి మార్గనిర్దేశం చేస్తారు

 


 

విజేతను నిర్ణయించే ప్రమాణాలు
 

భారత్ టెక్ ట్రయంఫ్ కార్యక్రమంలో మూల్యాంకనం ప్రాడక్ట్పిచ్టీమ్ అనే కీలక అంశాలను అంచనా వేస్తుందిఇది ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ ఉంది.
 

 



బహుమతులు


భారత్ టెక్ ట్రయంఫ్ కార్యక్రమం విజేతలకు తమ ప్రాడక్ట్‌మేధో సంపత్తిసాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించే అద్భుతమైన అవకాశం ఉంటుందిమార్చి 17 నుంచి 21 వరకు శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగే ప్రతిష్టాత్మక గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (జీడీసీ)-2025లో.. ఆ తర్వాత భారత్‌తో జరిగే వేవ్స్‌లో తమ ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు పూర్తి స్పాన్సర్సిప్ అందుతుందిఅంతర్జాతీయ గుర్తింపు పొందడానికిపరిశ్రమకు సంబంధించిన నాయకులతో కనెక్ట్ కావడానికి ఇది ఒక ప్రత్యేక వేదిక.

 

 

మూలాలు:


 

https://www.thetechtriumph.

https://wavesindia.org/

https://pib.gov.in/

Click here to see PDF.

 

***


(Release ID: 2105580) Visitor Counter : 5