సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
సిటీ క్వెస్ట్: షేడ్స్ ఆఫ్ భారత్
Posted On:
20 FEB 2025 3:23PM by PIB Hyderabad
భారతదేశ పట్టణాభివృద్ధికి ఊపిరిని ఊదే ఒక కార్డులాట
పరిచయం
వేవ్స్ సిటీ క్వెస్ట్: షేడ్స్ ఆఫ్ భారత్ అనేది ఒక వినూత్న విద్యావిషయక ఆట. ఇది ఒక సరదా అయిన, ఆకర్షణీయమైన అనుభూతి మాధ్యమం ద్వారా భారతదేశ పట్టణాభివృద్ధిని చైతన్యవంతం చేస్తుంది. పట్టణ ప్రణాళికా రచన విషయంలో ప్రధానమంత్రి దృష్టికోణానికి అనుగుణంగా రూపొందించిన ఆట. దీనిని ఆడే వారికి.. నీతి ఆయోగ్ నిర్దేశించిన స్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీస్)ను గురించిన అవగాహనను అందిస్తుంది.

కార్డులతో ఆడే ఈ ఆటను సమాచార, ప్రసార శాఖ సహకారంతో ఈ-గేమింగ్ ఫెడరేషన్ (ఈజీఎఫ్) రూపొందించింది. ఈ ఆటలో స్వచ్ఛత, ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌలిక సదుపాయాలు వంటి ప్రధాన అభివృద్ధి సూచికల ఆధారంగా భారతదేశ వ్యాప్తంగా 56 నగరాలను పోల్చి చూసేందుకు ఆటగాళ్లకు అవకాశం చిక్కుతుంది. నగర బలాల ప్రాతిపదికన స్కోర్ పాయింట్లను సంపాదించడానికి పోటీపడుతూ ఈ ఆటలో పాల్గొనేవారు నగరాల సవాళ్లతోపాటు నగరాల్లోని ప్రగతిని తెలిపే సమాచారం అందుబాటులోకి వస్తుంది. దీంతోపాటే చిన్నప్పుడు ఆడుకున్న ట్రంప్ కార్డు ఆటల జ్ఞాపకాలు కూడా మళ్లీ ఒకసారి గుర్తుకొస్తాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 15 నాటికి సిటీక్వెస్ట్‌లో పాల్గొనడానికి 1,920 మంది ముందుకు వచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.
సిటీ క్వెస్ట్: షేడ్స్ ఆఫ్ భారత్ అనేది క్రియేట్ ఇన్ ఇండియా పోటీల్లో ఓ ముఖ్య భాగం. ఇది వరల్డ్ ఆడియో విజువల్, ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (డబ్ల్యూఏవీఈఎస్.. ‘వేవ్స్)లోని ప్రధాన కార్యక్రమాల్లో ఒకటి. భారత మీడియా, వినోద (ఎం అండ్ ఈ) పరిశ్రమను కొత్త శిఖర స్థాయిలకు తీసుకుపోవడానికి రూపొందించిన ఒక ప్రతిష్ఠాత్మక కార్యక్రమమే వేవ్స్. ఈ సంవత్సరం మే నెల 1 నుంచి 4 మధ్య జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లోను, జియో వరల్డ్ గార్డెన్స్‌లోను వేవ్స్‌ను నిర్వహించనున్నారు. వేవ్స్ శిఖరాగ్ర సదస్సు నాలుగు ప్రధాన స్తంభాలపైన ఆధారపడి ఉంది: అవి.. ప్రసారం, విజ్ఞానంతో ముడిపెట్టిన వినోదం; యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీ, (ఏవీజీసీ-ఎక్స్ఆర్); డిజిటల్ మీడియా అండ్ ఇన్నోవేషన్; ఫిలింస్. రెండో స్తంభమైన ఏవీజీసీ-ఎక్స్ఆర్‌లో భాగంగా ఈ పోటీ ఉంటుంది. ఇది తన్మయపరచే కథాకథనం (ఇమర్సివ్ స్టోరీటెల్లింగ్), మమేకమయ్యే అనుభూతుల (ఇంటరాక్టివ్ ఎక్స్ పీరియన్స్)ను అందిస్తుంది. ఈ స్తంభం సాంకేతికతను సృజనాత్మకతకు ముడిపెట్టి గేమింగ్, యానిమేషన్, ఎక్స్టెండెడ్ రియాలిటీలో చోటు చేసుకొన్న ప్రగతిని చాటుతుంది. అంతేకాక పరిశ్రమ ప్రముఖులు, ఆసక్తిదారుల (స్టేక్‌హోల్డర్లు)కు కొత్త ఎల్లలను కనుగొనే అవకాశాల్ని అందిస్తుంది.
క్రియేట్ ఇన్ ఇండియా పోటీల్లో 73,000కు పైగా పేర్లు నమోదై, సృజనాత్మకతను, నవకల్పనను ప్రోత్సహించాయి. వేరు వేరు నేపథ్యాల నుంచి వచ్చిన మహత్వ కాంక్ష కలిగిన, వృత్తిసంబంధ సృజనకారులను ఈ ప్రక్రియలో భాగస్వాముల్ని చేశాయి.
అర్హత, పాలుపంచుకొనే వ్యవధులు

ఎలా ఆడాలంటే: సిటీక్వెస్ట్ నియమాలు
· ఆటగాడు వర్సెస్ విశ్వకర్మ (ఏఐ): ఆటగాడు, విశ్వకర్మ (ఏఐ).. ఈ ఇద్దరికీ 56 సిటీ కార్డులలో నుంచి యాదృచ్ఛికంగా కలిపేసిన 11 కార్డుల డెక్‌ను ఇస్తారు.
· ఒప్పందం: ఆట మొదట్లో , ఆటగాళ్లు ఇద్దరికీ 11 ఓపెన్ సిటీ కార్డుల్ని పంచుతారు.
· బయటపెట్టడం: ప్రతి ఒక్క రౌండులోనూ, ఆటగాడు ఏఐ.. ఈ ఇద్దరూ వారి వారి డెక్ నుంచి అగ్రగామి నగర కార్డును బయటపెడతారు. వెనుకటి రౌండును గెలిచే ఆటగాడు తొలి పోలిక కొలబద్దను ఎంపిక చేస్తాడు.
· పోలిక: ప్రతి ఒక్క కార్డులో స్వచ్ఛత, జనాభా, విద్య ల వంటి ఆరు కొలబద్దలు కలిసుంటాయి.ఆటగాడు ఏఐ కార్డు నుంచి పోల్చి చూడడానికి ఒక కొలబద్దను ఎంపిక చేస్తాడు.
· స్కోరింగు: గెలవడానికి +1 పాయింటు సంపాదించాలి, సమం కావడానికి +0.5 పాయింట్లు, వరుసగా గెలవడానికి అదనంగా +0.5 పాయింట్లను సంపాదించాలి.
· ఆటను గెలవడం: పదకొండు రౌండ్లు అయ్యాక, అత్యధిక మొత్తం పాయింట్లను సంపాదించిన ఆటగాడిని విజేతగా ప్రకటిస్తారు.
బహుమతుల కేటగిరీలు

లీడర్‌బోర్డు
ఆట ఆడటం పూర్తి అయిన తరువాత, ఒక గతిశీల లీడర్‌బోర్డు పైన స్కోర్లను ప్రస్తుత స్థితికి అనుగుణంగా సవరిస్తారు. లీడర్బోర్డులు మూడు విధాలుగా ఉంటాయి:

అదనపు సమాచారం కోసం:
· https://wavesindia.org/challenges-2025
· https://www.egf.org.in/city-quest
· https://pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2101293
Click here to see PDF.
***
(Release ID: 2105164)
Visitor Counter : 78