సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇన్నోవేట్2ఎడ్యుకేట్


* సరదాగా, వినూత్న పద్ధతుల్లో నేర్చుకోవడం

Posted On: 19 FEB 2025 3:38PM by PIB Hyderabad

సరదాగా, సరికొత్త పద్ధతుల్లో నేర్చుకోవడం

పరిచయం

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002YKGZ.png



పిల్లల్లో నేర్చుకొనే అనుభూతులను పెద్ద ఎత్తున మార్చివేయాలనే ఉద్దేశంతో ఇన్నోవేట్2ఎడ్యుకేట్ పేరిట చేతులతో నిర్వహించే ఒక పరికరాన్ని రూపకల్పన చేసే పోటీని (ఇన్నొవేట్2ఎడ్యుకేట్ హ్యాండ్‌హెల్డ్ డివైస్ డిజైన్ చాలెంజ్) నిర్వహించబోతున్నారు. క్రియేట్ ఇన్ ఇండియా చాలెంజ్ సీజన్ 1 లో ఓ భాగమిది. దీనిని వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమిట్ (వేవ్స్)లో భాగంగా నిర్వహిస్తారు. వేవ్స్ ముఖ్యంగా నాలుగు అంశాలపై దృష్టి సారిస్తోంది. అవి.. సమాచారం- విజ్ఞానంతోపాటు వినోదాన్ని అందించడం; ఏవీజీసీ-ఎక్స్‌ఆర్; డిజిటల్ మీడియాతోపాటు నవకల్పన; ఇంకా, చిత్రాలు (ఫిలింస్). వేవ్స్‌లోని రెండో ముఖ్యాంశంగా ఏవీజీసీ-ఎక్స్‌ఆర్ (అంటే.. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్‌స్, గేమింగ్, కామిక్స్‌తోపాటు ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ,  మెటావర్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీలు)ను ఎంచుకొన్నారు.

ఈ కార్యక్రమాన్ని ఇండియన్ డిజిటల్ గేమింగ్ సొసైటీత (ఐడీజీఎస్) భాగస్వామ్యంతో సమాచార, ప్రసార శాఖ ఏర్పాటు చేస్తోంది. నవకల్పన భాగస్వామిగా హ్యాక్2స్కిల్ (Hack2Skill), నైపుణ్యాలను బోధించే భాగస్వామిగా ఐసీటీ అకాడమి వ్యవహరిస్తాయి.

ఇంతవరకు మొత్తం 334 మంది అభ్యర్థులు నమోదు ఘట్టాన్ని ముగించారు. వారిలో విదేశాలకు చెందిన వారు ముగ్గురున్నారు.

లక్ష్యం

విద్యావిషయకమైన ఉపకరణం మూలరూపాన్ని (ప్రోటోటైప్) తయారు చేయడానికి ఉద్దేశించిన ఈ పోటీలో.. విద్యా రంగంతో ముడిపడ్డ వారు, డిజైనర్లు, ఇంజినీర్లు, ఆవిష్కర్తలు పాల్గొనవచ్చు. ఆ ఉపకరణం:

          v.  లెక్కలను నేర్చుకోవడంలో పిల్లలు లీనమయ్యేటట్టు చేస్తుంది

          v.పజిళ్ల సాధన ద్వారా సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా వారిని ప్రోత్సహిస్తుంది

          v. మమేకం అయిపోయే కంటెంట్ అండతో పరిశీలనాత్మక నైపుణ్యాలను పెంచుతుంది

          v.ఈ ఉపకరణం చాలా మంది సొంతం చేసుకొనేలా తక్కువ ధరలో దొరుకుతూ, అందరి అందుబాటులోకి వచ్చేటటువంటిదిగా ఉండాలి.


https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003WFUG.png

పోటీ మార్గదర్శకాలు

ప్రధానంగా చేతుల్తో పట్టుకోవడానికి అనువుగా ఉంటూ, విద్యతోపాటు వినోదాన్ని కలగలిపే ఓ కొత్త తరహా ఉపకరణానికి రూపకల్పన చేయాల్సిందిగా ఈ పోటీకి నిర్దేశించిన మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. ఈ కింద పేర్కొన్న మార్గదర్శకసూత్రాలను పోటీలో పాల్గొనే వారు పాటించాలి :

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004E77X.png
 

పోటీలో వివిధ దశలు

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005ZC3M.png
 
ఈ పోటీలో మూడు కీలక దశలుంటాయి. ప్రతి దశా పోటీలో పాల్గొనే వారికి ఆలోచన స్థాయి నుంచి తుది ఉత్పాదన స్థాయి దాకా మార్గదర్శకత్వాన్ని అందించేలా ఉంటుంది.


రిజిస్ట్రేషన్ ప్రక్రియ

రిజిస్ట్రేషనును పూర్తి చేయడానికి ఈ కింది అంచెలను పూర్తి చేయాలి:

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006EWRO.png

ఒకటో అంచె: ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.

నమోదు ప్రక్రియ ఈ నెల 23న (భారత ప్రామాణిక కాలమానం ప్రకారం [ఐఎస్‌టీ] 11గంటల 59 నిమిషాలకు ముగుస్తుంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00714IC.png

రెండో అంచె2: మీరు ఏ విధమైన ఆలోచన చేసిందీ వివరించాలి.

చిత్తు నమూనాలు, వర్ణనలు, విశేషాంశాల వివరాలు అందించాలి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008BCM8.png

మూడో అంచె: మీరు అనుకున్న మూలరూపానికి ఆకృతిని ఇచ్చి, సమర్పించాలి.


https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image009GZN7.png

పోటీలో పాల్గొన్న వారిలో నుంచి ఎంపిక చేసిన వారిని ఒక ఆచరణసాధ్య ప్రోటోటైపును తయారు చేసి, సమర్పించాల్సిందిగా పిలుస్తారు.

ఎంపిక ప్రమాణాలు

పోటీలో పాల్గొనేవారి నివేదనలను ఈ కింది ప్రమాణాల ఆధారంగా బేరీజు వేయనున్నారు:

          v.నవకల్పన: ఉపకరణాన్ని, కంటెంటును డిజైన్ చేయడంలో నూతనత్వముందా?, సృజనశీలత్వానికి పెద్ద పీట వేశారా? అనేవి చూస్తారు.

          v.నేర్పించగల విలువలు: గణితాన్ని ఎంత సమర్ధంగా బోధించగలుగుతుంది, జ్ఞానాన్ని సంపాదించుకొనే నైపుణ్యాలను పెంచగలుగుతుందా అనేవి లెక్కలోకి తీసుకుంటారు.

          v.వినియోగదారుకు కలిగే అనుభూతి: ఈ సాధనం బాలలు సులువుగా ఉపయోగించడానికి అనువుగా ఉందా?, వారిని ఇది ఎంతవరకు ఆకట్టుకోగలుగుతుంది అన్నవి పరిశీలిస్తారు.

          v.చౌకగా రూపొందించేవిగా ఉండాలి: ఉపకరణాన్ని కొంచెం తక్కువ ధరలో సొంతం చేసుకొనేందుకు వీలుగా రూపొందించారా అనేది కూడా గమనిస్తారు.

          v.మన్నిక, డిజైను:  వాడుకకు అనువైందిగా డిజైను ఉండాలి, బలిష్ఠమైందిగా కూడా ఉండాలి.


బహుమతులు

ఇన్నోవేట్2ఎడ్యుకేట్ పోటీ మాధ్యమం ద్వారా సృజనాత్మకతను, నవకల్పనను ఉత్తేజదాయక బహుమానాలతో సత్కరించనున్నారు. విజేతలు నగదు బహుమతుల్ని అందుకోవడంతోపాటు మూలరూపం (ప్రోటోటైప్) కు రూపకల్పన ప్రక్రియలో మద్దతును పొందుతారు. వారు తమ డిజైన్లను ప్రధాన ఈవెంట్లలో ప్రదర్శించే అవకాశాన్ని చేజిక్కించుకొంటారు.  

మొదటి మూడు డిజైన్లకు నగదు బహుమతులు ఇస్తారు.


మూలరూపాన్ని తయారు చేయడానికి సహకారం: విజేతగా నిలిచే ప్రోటోటైప్ కు  మెరుగులు దిద్ది, తుదిరూపాన్నివ్వడంలో సహాయాన్ని అందిస్తారు.
ప్రతిభను ప్రదర్శించేందుకు అవకాశం:  బహుమతిని గెలిచిన డిజైనును ఇండియన్ డిజిటల్ గేమింగ్ సొసైటీ (ఐడీజీఎస్) కీలక కార్యక్రమాల్లో ప్రదర్శనకు అనుమతించడంతోపాటు ఆసక్తిని తెలియజేసే పెట్టుబడిదారులకు, తయారీదారు సంస్థలకు ఈ డిజైనును చూపుతారు.

  అదనపు సమాచారం కోసం:

·         https://wavesindia.org/challenges-2025

·         https://gamingsociety.in/innovate2Educate-competition/innovate2Educate-competition.php

Click here to see PDF:


***


(Release ID: 2104878) Visitor Counter : 26