ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో యూకే పూర్వ ప్రధాని శ్రీ రిషి సునాక్, ఆయన కుటుంబం భేటీ
Posted On:
18 FEB 2025 10:49PM by PIB Hyderabad
బ్రిటన్ పూర్వ ప్రధాని శ్రీ రిషి సునాక్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో న్యూ ఢిల్లీలో ఈ రోజు భేటీ అయ్యారు.
ప్రముఖులిద్దరూ అనేక అంశాలపై అరమరికలు లేకుండా మాట్లాడుకున్నారు.
శ్రీ సునాక్ భారత్‌కు ఒక గొప్ప మిత్రుడని, భారత్-యునైటెడ్ కింగ్‌డమ్ సంబంధాలను దృఢతరం చేసుకోవాలనే విషయంలో ఆయన ఉత్సాహాన్ని కనబరిచారని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఇలా పేర్కొన్నారు:
‘‘యూకే పూర్వ ప్రధాని శ్రీ రిషి సునాక్‌ను, ఆయన కుటుంబసభ్యులను కలుసుకోవడం సంతోషం కలిగించింది. మేం అనేక అంశాలపై చాలా చక్కగా మాట్లాడుకున్నాం.
శ్రీ సునాక్ భారతదేశానికి ఒక గొప్ప స్నేహితుడు. ఇండియా-యూకే సంబంధాలను మరింత బలపరచుకోవాలనే విషయంలో ఆయన ఎంతో ఉత్సాహాన్ని కనబరిచారు.
@RishiSunak @SmtSudhaMurty”
***
MJPS/ST
(Release ID: 2104876)
Visitor Counter : 13
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam